కొత్త ఏడాది సందర్భంగా గత ఏడాది జ్ఞాపకాలు నెమరువేసుకుంటున్నప్పుడు గుర్తుకువచ్చే ముఖ్యాంశాల్లో తెలుగుకై నడక ఒకటి. అందులో చాలామంది బ్లాగర్లను కలుసుకోవడం, ఆత్మీయంగా మాట్లాడటం అనేవి నాకు బాగా గుర్తుంచుకొదగ్గ విషయాలు. అందులో ఎవరెవరిని కలిసిందీ ఇదివరలోనే చెప్పినప్పటికీ చక్రవర్తి దంపతుల గురించి చెప్పడం ఇంకా మిగిలేవుంది. తెలుగు నడకకు వారు వచ్చినప్పుడు పలకరిస్తే ఓ గంట క్రితమే US నుండి దిగినట్లుగా చెప్పారు. హమ్మాయ్య అమెరికాను రక్షించారు అనుకున్నాను. అక్కడ వున్నన్ని రోజులు వారు అమెరికాను ఏకడమే సరిపాయే. ఈ భవదీయ మానవుడు ఎప్పుడు అక్కడినుండి వెళ్ళిపోతాడా అని చూస్తూవస్తున్నాను అప్పుడు. అందుకే వారు తెలుగు నేల మీద కనపడగానే నాకే అంత రిలీఫ్ ఫీలింగ్ వచ్చిందంటే ఇహ అమెరికా గడ్డ ఎంత రిలీఫ్ ఫీల్ అయివుంటుందో ఊహించండి :)
ఆ తెలుగు బాటలో బాగా శ్రమపడ్డవారిలో భవదీయులు బ్లాగు చక్రవర్తి మరియు వారి శ్రీమతి స్వాతి గారు కూడా వున్నారు. అప్పుడే అమెరికానుండి దిగినా కూడా ఊరికే ఉబుసుపోక కబుర్లు చెప్పకుండా చక్రవర్తి ఉత్సాహంగా ఈ నడక పనుల్లో పాల్గొన్నారు. మా నడకలో అలసట చెందకుండా చల్లటి మంచినీళ్ళ పొట్లాలు దారి పొడుగునా అందించారు. కూల్‌డ్రింక్స్ అందిస్తారేమో అని ఆశించాను కానీ ఈతెలుగు వారు లో బడ్జెటులో వున్నారని తెలిసింది. వుండదూ మరి నాలాంటి వారు కూడా అక్కడ ఉంచిన హుండీలో పైసా కూడా వెయ్యకపోతేనూ. కొన్ని డబ్బులయినా వేద్దామనుకుంటూనే కన్వీనియంటుగా మరచిపోయానులెండి. అందుకే తెలుగు దారిలో చల్లటి శీతల పానీయాలు పొందే/డిమాండ్ చేసే హక్కు నాకు లేదు కాబట్టి దాని గురించి నోరు ఎత్తట్లేదు సుమా. అయినా తెలుగు నడక అన్నది తెలుగు కోసం కానీ శీతల పానీయాల కోసం కాదు గదండీ. అందుకే అది మరచిపోదామేం.
ఈ దంపతులు ఎన్ని నీళ్ళిచ్చినా కూడా నడక చివర్లో చిరు ముసురులో సుజాత గారి ఆధ్వర్యంలో అందించబడిన వేడివేడి టీనే హాయిహాయిగా అందరికీ గుర్తుకువుంటుందనుకుంటాను. అవును లెండి ఈ నడకకి నీళ్ళెత్తిన కూలీలు ఎక్కడ గుర్తుంటారు జనాలకి. ఆ టీ కూడా రెండు సార్లు మరీ రిఫిల్ చేయించుకొని తాగాను - సిగ్గులేకుండా - ఇలా ఎందుకంటున్నానంటే హుండీలో పైసా వెయ్యలేదు కదా అందుకని. ఇలా నేను మాటి మాటికి ఇలా సిగ్గుపడుతుండటం చూసి ఈతెలుగు వారు విరాళం ఇప్పుడయినా ఫర్వాలేదు అనరు కదా కొంపదీసీ.
ఆ నడకలో ఈ యువ దంపతులిద్దరూ చురుకుగా, ఉత్సాహంగా కష్టపడుతుంటే, పాల్గొంటుంటే చూడటానికి ముచ్చటగా అనిపించింది. తమ ప్రొఫయిల్లో అన్నీ పిచ్చిపిచ్చి ఫోటోలు పెడతారు చక్రవర్తి కానీ మనిషి మంచి స్ఫురద్రూపి, అందగాడూనూ. (మగాళ్లని మగాళ్ళు మెచ్చుకోవడం ఏంటని వీవెన్ మీద నేను వ్రాసిన టపాలో ఎవరో కూసారు గాని అలాంటివి నేను పట్టించుకోను). మిగతా రకాలు మనకు తెలియకపోయినా ఆ రకంగా మాత్రం స్వాతి గారు అదృష్టవంతురాలే. వారిద్దరిలో భవదీయులే బావుంటారు. అలాగే చక్రవర్తి గారు ఏంటేంటో పొంతన లేకుండా వారి బ్లాగుల్లో వ్రాసినట్లు అనిపిస్తుంది కానీ మనిషి మాత్రం చాలా చక్కటి మనిషి అనిపించారు. ఇలా కొంతమందిని చూస్తుంటే ఆత్మ, బ్లాగాత్మ వేరువేరుగా వుంటుందేమో అనిపిస్తుంది. అంటే బ్లాగుల్లో ఒక రకంగానూ, బయట ఒకరకంగానూ అన్నమాట. నేనూ అంతే. నన్ను బయట చూసేవారు ఎవ్వరూ నేను అలాంటి బ్లాగులు వ్రాస్తానని నాకు అంత చొరవ, తెగింపు వుంటుందని ఛస్తే అనుకోరు. పెళ్ళాం చాటు మొగుడు/మొగాడు అనుకుంటారు.
స్వాతి గారిని చక్రవర్తి నాకు పరిచయం చేసారు. వీరితో బ్లాగులు వ్రాయడం మానిపించండి బాబో అని వారి శ్రీమతితో నేను మొరపెట్టుకున్నాను. ఇంకోటి మొరపెట్టుకుందామనుకున్నాను కానీ సమయం లేకపోయింది. అందుకే ఇప్పుడు మొరపెట్టుకుంటున్నాను. చక్రవర్తి గారిని మరో సారి US కు పంపించకండి బాబోయ్, మీకు బోలెడంత పుణ్యం వుంటుంది . విన్నారా, మా మొర ఆలకించారా స్వాతి గారూ :))
తెలుగు నడక చివరలో నాతో వారిద్దరూ మాట్లాడుతూ వారింటికి తప్పకుండా రమ్మనమని కోరారు. నాకేమో ఆ రోజు గానీ, మరో రోజు గానీ అస్సలు తీరికలేదు. ఎలా అయినా సరే రావాల్సిందేనని డిమాండ్ చేసారు. వారి ఇంటికి రావడానికి నాకు సమయం, దారి ఎలా చిక్కవచ్చో కూడా స్కెచ్చేసారు. కూకటిపల్లిలోని మా అక్కయ్య వాళ్ళ ఇంటినుండి ఎల్బి నగర్ వెళుతూ దారిలో వారు వుండే బేగంపేట్ (అదే కదా?) కు రావచ్చు అన్నారు. ఇహ తప్పుద్దా. వారి అభిమానానికి తలవంచి సకుంటుంబంగా వారి ఇంటికి విచ్చేస్తానని చెప్పాను. వారికి తెలియపరచినట్లే ఆ రోజు వారి ఇంటికి వెళ్ళడానికి బాగా ప్రయతించాను కానీ అస్సలు కుదర్లేదు. ఆ రోజు మా చిన్న అక్కయ్య వాళ్ళతో కలిసి వారి ఫాం హవుజుకు వెళ్ళి వచ్చి భోజనాలు చేసి ఎల్ బి నగరుకు బయల్దేరేలోగా రాత్రి 11:30 అయ్యింది. ఆ సమయంలో ఇహ వారింటికి ఏం వెళతాం. అందుకే అలా వారింటికి వెళ్ళడానికి మాకు కుదరలేదు. ఈసారి ఇండియా వెళ్ళినప్పుడు తప్పకుండా వారి ఇంటికి వెళ్ళి కలుస్తాను.
@ స్వాతి
ReplyDelete:)
మీ దంపతులు US వచ్చినప్పుడు చెప్పండి. మా ఇంటికి కూడా విచ్చేయండి.
సరే, అవకాశం ఎందుకు వదులుకోవాలి..?
ReplyDeleteశరత్ గారూ ఈ తెలుగుకు మీలాంటి వారి ఆర్థిక సహకారం ఎంతైనా అవసరం! ఒక వెయ్యి డాలర్లు పంపిస్తే ఈ సారి ప్రోగ్రాముకు మీ పేరు చెప్పి రెండు మూడు మంచి ప్రోగ్రాములు చేస్తాం! అసలు చక్రవర్తి ఈ పోస్టు చూసి ఉండరు. లేకపోతే మిమ్మల్ని కనీసం 500 డాలర్లకు బుక్ చేస్తారు. చాలా మంచి కోశాధికారి!
మీరు ఏవో వంకలు పెట్టి ఆరోజు మా అందరితో బ్రంచ్ కు కూడా రాకుండా ఎగ్గొట్టారు.
@ సుజాత
ReplyDeleteహమ్మా, బ్రంచుకి పిలిచి నన్ను బుక్ చేద్దామనే! ఏంటీ చక్రవర్తి ఈ తెలుగు కోశాధికారా! చెప్పరేం మరీ. అయితే దూరంగా వుండాల్సిందే!