హైదరాబాద్ బ్లాగర్ల జ్ఞాపకాలు - మేం ముగ్గురం మేధావులమే?! - 1


ఆ రోజే ఏపి మీడియా రాం గారి జర్నలిజం స్కూల్ ప్రారంభోత్సవం. వారు నన్ను కాంటాక్ట్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నా కూడా నాకు ఏమాత్రం తీరికలేక వారితో ఫోనులో మాట్లాడేసరికి ఆ రోజు అయ్యింది. జెపి ప్రారంభోపన్యాసం ఇస్తున్నారంట కానీ నేను వెళ్ళేసరికి సమయాతీతమవుతుందని చెప్పేసి సాయంత్రం 4 గంటలకు వారి స్కూలుకు వచ్చి కలుస్తాను అని చెప్పాను. జెపీ గారి ఉపన్యాసం మిస్ అవడం రెండవసారి నాకు. గత ఏడాది వారు షికాగోలో ఉపన్యాసం ఇచ్చినపుడు కూడా మిస్ అయ్యాను. ప్చ్.


మా డ్రైవరుని రాం గారితో మాట్లాడిపించాను - అడ్రసు కోసం. వారేదో చెప్పారు - ఇతనేదో విన్నాడు. అడ్రసు అనేది మనకు సంబంధించని విషయం అని అర్ధనిమిలిత నేత్రాలతో కారులో వెనుక సీటులో విశ్రాంతి తీసుకుంటూపోయాను. ఏదో చౌరస్తా దగ్గరకు వచ్చాక వున్న సినిమా హాలు పక్కన ఆగి ఫోన్ చెయ్యమన్నట్టున్నారు. అక్కడికి వచ్చాక మా డ్రైవర్ ఫోన్ చేసాడు. మళ్ళీ వారేదో చెప్పాడు - మా వాడేదో విన్నాడు. 30 నిమిషాలు ఇద్దరూ ప్రయత్నించినా మా గమ్యం మాత్రం దొరకలేదు. రాం గారు చెప్పేది మావాడికి అర్ధం కావడం లేదు - మా వాడికి ఎందుకు అర్ధం కావడం లేదో రాం గారికి అర్ధం కావడం లేదు. అక్కడక్కడే కారులో పలు రవుండ్లు వేసాము. రాం గారు ఎదో కాలేజీ పక్కన అన్నారుట. ఆ కాలేజీ మాకు ససేమిరా దొరకలేదు. ఎవరిని అడిగినా చెప్పలేకపోయారు. నాకు, డ్రైవరుకీ విసుగు రాసాగింది. అవతల రాం గారికి కూడా విసుగు వస్తూవున్నదేమో. ఇహ సీనులోకి నేను ఎంటర్ కాక తప్పేట్లు లేదని నిశ్చయించుకున్నాను.


మనం హైదరాబాద్ వదిలేసి చాలా ఏళ్ళు అవుతోంది కాబట్టి వారేమన్నా చెప్పినా నాకు అర్ధం అవుతుందా అన్నది అనుమానమే. ఇదివరలో ఆ నగరంలో వున్నప్పుడు కూడా పెద్దగా పట్టించుకోక ఎక్కువగా తెలిసేది కాదులెండి. నేను కనుక్కున్నాను ఫోనులో. వారు చెప్పినదానిని బట్టి ఒక గల్లీలోకి వెళ్ళాలి. ఠాట్ అది తప్పు అంటాడు మా డ్రైవర్ సాబ్. ఇద్దరం చర్చించుకొని అక్కడక్కడే మళ్ళీ కొన్ని రవుండ్లు వేసాము. ఫలితం లేదు. ఇలాక్కాదని ఆ గల్లీలోకే వెళ్ళమని ఠీవిగా అదేశించాను (లేకపోతే వినేట్టులేడు మా కిరాయి డ్రైవర్). మొత్తం మీద లోపటికి వెళ్ళాము. చివరిదాకా రమ్మంటారు ఫోనులో రాం గారు. వచ్చాం. మాకు ఏం కనపడుతున్నాయో చెప్పాం. వారు ఇంకేదో కనపడాలని చెప్పారు. వారు చెప్పిన దిక్కుకే చూస్తున్నా మాకు అలాంటివి ఏమీ కనపాడటం లేదు. అలా ముగ్గురం ఓ అయిదు నిమిషాలు ఫోనుల్లో కొట్టుకున్నాక అప్పుడు పక్కనే కనపడింది HMTV వారి వ్యాన్లు, అఫీసూనూ.

డ్రైవరూ, నేనూ ముఖాలు చూసుకున్నాం. చాలా తేలిక అడ్రసు అది. అది పట్టుకోవడం అంత కాంప్లెక్స్ ఎందుకు అయ్యిందో మాకు అర్ధం కాలేదు. చాలా తేలిక అడ్రసు పట్టుకోవడం కూడా వీరి వల్ల కాలేదని బహుశా రాం గారూ అదే అనుకొని వుంటారు. మొత్తమ్మీద విషయం ఏమిటంటే రాం గారు ఒకలా చెబితే మా డ్రైవర్ సాబ్ ఒకలా అర్ధం చేసుకొని నాకు మరోలా వినిపించాడు. ఆ తరువాత రాం గారు చెప్పింది నాకు ఒకలా అర్ధమయితే నేను మా వాడికి చెప్పేసరికి వాడికి మరోలా అర్ధమయ్యివుంటుంది. మొత్తమ్మ్మీద వున్న ముగ్గురూ మేధావులు అయితే ఇలాగే వుంటుంది పరిస్థ్తితి :))


మొత్తమ్మీద ఒక ముప్పావు గంట పాటు అక్కడక్కడే తిరిగాక ఇహ ఓపికలు నశించి, నీరసించి పోయాక అప్పుడు దొరికింది వారి జర్నలిజం స్కూల్. అదేదో కాలేజీ కోసం వెతక్కుండా HMTV బ్యుల్డింగ్ అని కనుక్కున్నా ఎవరయినా తేలిగ్గా చెప్పేవారేమో. అక్కడికి వెళ్ళేదాకా వారి స్కూల్ ఆ భవంతిలో అని నాకు అర్ధం కాలేదు. వారు ఆ విషయం చెబుతూనే వున్నట్టున్నారు కానీ మేము ఆ దిశలో ఆలోచించలేకపోయాము. వారి స్కూలుకి వెళ్ళాక ఇరానీ చాయ్ కాకపోయినా చక్కటి టీ, బిస్కట్టులు ఆఫర్ చేసి నా అలసట దూరం చేసారు వారు.

(ఇంకా వుంది)

4 comments:

  1. పాపం మధ్యలో రాము గారి పాత్ర ఏం ఉంది ? మీ ఇద్దరికి అర్థం కాక,... రాము గారిని కూడా మేధావి అంటే ఎలా ? ..

    ReplyDelete
  2. @ కాయ
    "అదేదో కాలేజీ కోసం వెతక్కుండా HMTV building అని కనుక్కున్నా ఎవరయినా తేలిగ్గా చెప్పేవారేమో?"
    ఇప్పుడు అర్ధం అయ్యిందా రామూ కూడ ఎందుకు మేధావో? అదేదో కాలేజీ పేరు చెప్పే బదులు ఫలానా గల్లీలో పైకి:) చూసుకుంటూ రండి బిల్డింగ్ కనిపిస్తుంది అని చెప్తే సరిపోయేది కదా?

    ReplyDelete
  3. Sharatji,
    So you suffered a lot to come to the office. I had clearly told you that it is in HM-TV office. Some good looking girls/boys on the road might have diverted your attention!
    Ramu

    ReplyDelete
  4. @ కాయ
    రాం గారి పాత్ర లేకేం - చాలా వుంది. రాం రాం!
    @ ఆర్ ఎస్ రెడ్డి
    అలా పైకే చూస్తూ నేను పైకెళ్ళి పోవాలనే!
    @ రాం
    క్లియర్ గానే చెప్పామని మీరనుకున్నారు గానీ మేమిద్దరం అనుకోలేదు సుమండీ :)

    ReplyDelete