గమనిక: ఈ రోజు కబుర్లన్నీ ఎప్పటికప్పుడు కామెంట్స్ ద్వారా అందిస్తుంటాను.
శుక్రవారం సాయంత్రం నా ఆటబొమ్మ 'రోకు' (http://www.roku.com/ ) కొరియర్లో వచ్చింది. ఇంకేం వారాంతం అంతా ఆ ఆటతోనే సరిపోయింది. అసలే కోతి ఆ పైన కల్లు తాగితే అన్న చందాన రోకూను కెలుక్కుంటూ కాలక్షేపం చేసేసాను. సరి అయిన సమయనికి రోకును తెప్పించుకున్నాను. చంద్రబాబు, జగనుల దీక్షలూ, తెలంగాణాపై రిపోర్టు, ఆ పై అవిశాస తీర్మానం ఇలాంటి రియాలిటీ షోలు చూసే భాగ్యం మాకు రోకు వల్ల నిక్షేపంగా కలుగుతోంది.
ఇప్పటివరకూ సిస్టంలో yupptv.com చూసేవారం కానీ మా ఆవిడేదో సీరియళ్ళూ గట్రా చూసేది కానీ నాకు అలా సిస్టంలో వార్తా ఛానళ్ళు చూడబుద్ధి అయ్యేది కాదు. ఈ క్రిస్మస్ సందర్భంగా ఏదో ఒక ప్లేయర్ కొనాలని ఆలోచించి మా ఆవిడకి కానుకగా కొనిస్తా అన్నాను. నిజానికి అది నాకే కావాలి కానీ మా ఆవిడకని చెబితే అనవసర ఖర్చులని గులగకుండా వుంటుంది కదా. క్రిస్మస్ సందర్భంగా పాడయిఫొయిన తన యొక్క సిస్టం అడాప్టర్ స్థానే కొత్త అడాప్టర్ బహుమతిగా తెప్పిస్తా అన్నాను. అంతొద్దు, ఎక్కువయ్యింది, ఓ పెన్ను కొనివ్వు చాలు సంతోషిస్తా అంది. అదేమయినా వెటకారమా లేక నేను నిజంగానే ఓ పెన్ను కొని బహుమతిగా ఇవ్వాలంటారా? ఇంత చిన్న బహుమతులా ఓ డైమడ్ నెక్లసో కొనివ్వాలి కానీ అనకండి నాకు అంత దృశ్యం లేదు ప్రస్థుతానికి. తనకూ అంత పెద్ద బహుమతులు పొందేంత దృశ్యం ఇంకా లేదు. ఏదో ఇలా అల్పసంతోషం నాది. ఈ సారికిలా కానిద్దామేం.
రోకు xds ప్లేయర్ అమెజాన్ వారి ద్వార కంటే $60 కే వస్తుంది. అమెజాన్ వాడి On Demand స్టోరులో ఓ అయిదు డాలర్ల సినిమా కొంటే మనకు $20 రిబేటు వస్తుంది కాబట్టి $60 కే అది కొనుక్కోవచ్చు. ఇహ రోకులొ ఎన్నో అప్ప్లికేషన్లు వున్నాయి, వస్తున్నాయి. తెలుగు ఛానళ్ళు మరియు సినిమాల అప్ప్లికేషన్లే ఓ అయిదో ఆరో వున్నాయి కానీ నాకు http://www.yupptv.com/ నే అందులో నచ్చింది. దాని చందారులుగా చేరకుండానే ఎంచక్కా TV9, ETV2 తప్ప దాదాపుగా ఇతర వార్తా ఛానళ్ళు అన్నీ చూడొచ్చు. మా ఆవిడ మల్లీ yupptv కి చందా చేసి ఏడుపుగొట్టూ సీరియళ్ళు టివిలో ఎక్కడ పెడుతుందో అనుకున్నా కానీ కాలక్షేపం ఛానళ్ళు ఏమీ వద్దంది. హమ్మయ్య. బ్రతికిపోయాను.
మా బంధువు ఒకతను బ్లూరే ప్లేయర్ కొన్నాడు కానీ అందులో తెలుగు అప్ప్లికేషను ఒక్కటీ లేక ఇప్పుడు విచారిస్తున్నాడు. అన్నట్లు రోకు ఛానల్ స్టోరులో యూట్యూబ్ కనపడదు, అది ప్రత్యేకంగా ప్రైవేటు ఛానలుగా జతచెయ్యాలి. అలాంటి ప్రైవేటువి ఇంకా 15 దాకా వున్నట్టున్నాయి. అందులో ఓ అడల్ట్ ఛానల్ కూడా వుంది కానీ నాకింకా అది వాడి చూసే అవకాశం రాలేదు. నాకు అయితే రోకు బాగా నచ్చింది. అందులో yupptv ద్వారా తెలుగు వార్తా ఛానళ్ళు చాలావరకు ఉచితంగా చూడగలగడమే కాకుండా నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, నాసా తదితర ఛానళ్ళు కూడా ఎంచక్కా చూడగలుగుతున్నాను. బ్లూరే ప్లేయర్ కొనాలను వారు పునరాలోచించగలరు. బ్లూరే ప్లేయరులో ప్రస్థుతానికయితే తెలుగు ఆప్స్ లేవు.

రివ్యు రాయండి ...
ReplyDeleteవ్రాస్తున్నాను. రోకు వరకు టపాలోనే ఇంక ఇస్తాను. మిగతా కబుర్లు కామెంట్స్ లో ఇస్తాను కాబట్టి టపా కూడా మళ్ళీ చూస్తుండండి.
ReplyDeleteగురువు గారు... మీ బ్లాగు కంటే కింది బ్లాగు లో మంచి టపాలు వస్తున్నాయి.. మీరూ ఓ లుక్ వేయండి...
ReplyDeletehttp://storiesofsexworkers.blogspot.com/
మీ రోకు లో తెలుగు చానల్స్ ఎలా చూస్తారు ..
@ కాయ
ReplyDeleteరోకులో తెలుగు ఆప్స్ ఎలా చూడొచ్చో టపాలో కొంత వివరించాను. చూడండి.
శరత్ గారూ,
ReplyDeleteమీరు ఒకచోట anxiety neurosis తగ్గించుకున్నానని అన్నారు. నేనూ ఆ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నాను. మీరు దానినుంచి ఎలా బయటపడ్డారో తెలుపుతూ దయచేసి ఒక పోస్టు రాయగలరు.
@ అజ్ఞాత
ReplyDeleteజెనెరల్ ఏంగ్జయిటీని ఎలా పరిష్కరించుకున్ననో వివరంగా తెలీయజేస్తాను కానీ ప్రస్తుతానికయితే చేప ఆయిల్ వాడి చూడండి. అది మొదలెట్టిన దగ్గరి నుండీ నా మందులు క్రమంగా తగ్గించేసి ప్రస్థుతానికయితే ఏమీ మందులు వాడటం లేదు. మీరు చేపమందు కాప్సూల్స్ ఎన్నయినా వాడండి కానీ రోజుకి టోటల్ 3 గ్రాముల ఒమెగా-3 ఫాటీ ఏసిడ్స్ తగ్గకుండా చూసుకోవాలి. నేను 4.5 గ్రాములు వాడుతున్నా - నా ట్రైగ్లిసరాయిడ్స్ తగ్గించడం కోసం. మానసిక సమస్యల కోసం అయితే 5-6 గ్రాములు వాడితే ఇంకా ఫలితం వుంటుందని చెబుతారు కానీ కొన్ని చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ వల్ల అంత ఎక్కువగా నేను వాడదలుచుకోలేదు.
pen adigaara.. nijamganaaa! pedha vetakarame.. may be meelage thanu kooda eyanaki expensvie gifts iche sceen ledu anukoni pen agigaremo !
ReplyDeleteI guess you got Roku XD not XDS for $60, please confirm.
ReplyDeleteAlso I have ordered Roku XDS from amazon, still to receive. I have already bought Seagate Theater+ for $35 which is a similar gadget but no Apps like yupptv etc.
Good post on this topic, I bought it after reading your post