రామ జన్మభూమి కేసు విషయంలో సుప్రీంకోర్టు ధర్మం?

ఈ కేసు సుప్రీం కోర్టుకి వెళ్లక తప్పదు. జస్టిస్ డిలేయ్డ్ ఈజ్ జస్టిస్ డినేయ్డ్ అని ఓ తెగ ఆదుర్దాపడి హడావిడిగా కొంపలు మునిగినట్లు మిగతావన్నీ పక్కకు పడేసి రెండు మూడు ఏళ్ళలోనే సుప్రీం కోర్టు తీర్పు ఏమీ ఇవ్వఖ్ఖర్లా. ఈ కేసుని హైకోర్టు ఓ అరవై ఏళ్ళు నాంచింది కాబట్టీ సుప్రీంకోర్టు తన హోదాకు తగ్గకుండా తాపీగా ఓ వందేళ్ళయినా నానిస్తేనే దానికి గౌరవం వుంటుంది. అందాక ఈ విషయం మీద పెద్దగా ఎవరూ కొట్టుకోకుండా వుంటుంది. ఓ వందేళ్ళ తరువాత చూద్దాం రాముడెవరో, అల్లా ఎవరో!

ఇప్పుడంటే పై కోర్టు వుంది కదా అని అందరూ కాస్త ఓపిక పడుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పే శిరోధార్యం కాబట్టి ఓడిపోయిన మతస్థులకి అప్పుడు బాగానే వళ్ళుమండవచ్చు. అందుకే సుప్రీంకోర్టుకి ఈ కేసు విషయంలో తొందరవద్దు - తాపీగా పనిచెయ్యాలి.

ఈ కేసు విషయమై BBC లో చక్కటి వ్యాసం వచ్చింది చూడండి
http://www.bbc.co.uk/blogs/thereporters/soutikbiswas/2010/09/ayodhya_verdict_a_happy_compromise.html

4 comments:

  1. అన్నింటా మీకు హాస్యమే కదూ.

    ReplyDelete
  2. అవును .. అసలు కోర్ట్ అవసరం లేకుండా గ్రౌండ్ జీరో గా పరిగణిస్తే బెటర్ .. అదే ఊరు కదా.. ఇంకో ప్లేస్ లో కట్టుకుందాం గుడి ..

    ReplyDelete
  3. manushulapai nammakam leka court lanu aasrayistunnaaru. aa teerpu intaku minchi aasinchalem..

    ReplyDelete
  4. కెక్యూబ్ గారూ,

    ఆ స్థలంలో పూర్తిగా మసీదు కట్టమని తీర్పు వచ్చివుంటే మనది లౌకిక రాజ్యం అయ్యుండేది. అంతేకదా?

    మనుషులపై నమ్మకం పోయిందా మీకు? మరి అఫ్జల్ గురుని వదిలేయాలని రాసారే?

    మీ బ్లాగులో మీకు వచ్చిన జవాబులు చాల్లేదా?

    ReplyDelete