నేను ఎవరో చెప్పండి చూద్దాం!

ఆ రోజు సంజన వాళ్ళ ఊరికి బయల్దేరుతున్నాం. సంజన నేను హైదరాబాదులొ దారిలో ఒక రెస్టారెంటు దగ్గర ఆగి దోశా, ఇడ్లీ తింటూ కబుర్లు చెప్పుకుంటున్నాం. అప్పుడు వచ్చింది ఫోను. "నేను హైదరాబాద్ బ్లాగర్నండీ. మీ నంబర్ AP మీడియా రాము గారు ఇచ్చారు. నేనెవరో గుర్తు పట్టండి చూద్దాం!" అని ఒక మహిళ గలగలా ఉత్సాహంగా మాట్లాడారు. నేను నవ్వి నాకు గుర్తుకువచ్చిన హైదరాబాద్ లేడీ బ్లాగర్ పేరొకటి చెప్పాను. ఊహు కాదన్నారు. అయితే పేరు మాత్రం గుర్తుకు రావడం లేదు కానీ (తీరికలేని పనులు, నిద్రలేమి లాంటి కొన్ని కారణాల వల్ల నా బుర్రలో కొన్ని ఫ్యూజులు ఎగిరిపోయివున్నాయిలెండి. అందుకే ఆ బ్లాగర్ పేరు గుర్తుకు రాలేదు)  మా ఇంటి వైపే వుండే బ్లాగర్ కావచ్చు అన్నాను. ఊహు కాదు అని చెప్పి వారు వుండే ఏరియా చెప్పారు. అప్పుడు వెలిగింది నాకు. సుజాత, తెలుగు సుజాత అని చెప్పాను. అవునండీ అని గలగలా మాట్లాడారు.

తెలుగుకై నడకకి రావాల్సిందిగా ఆహ్వానించారు. కేవలం రామూ గారికే కాకుండా అక్కడికి వచ్చి మా అందరికీ కూడా మీ దర్శనభాగ్యం కలిగించమని సరదాగా అన్నారు. ఆ కార్యక్రమం గురించి నాకు ఇప్పటికే తెలుసనీ, వీవెన్ ఈమెయిల్ ఇచ్చారనీ, తప్పక వస్తాననీ చెప్పాను. కలర్స్ స్వాతి కూడా వస్తున్నారని చెప్పారు. అయితే నేను తప్పక వస్తానని చెప్పాను. తెలుసు, తెలుసు మీరు తప్పక వస్తారు అని సరదాగా వారు అన్నారు.  కొద్ది సేపు మాట్లాడాక సంజనను వారికి పరిచయం చేసాను. కొద్దిసేపు వారిద్దరూ మాట్లాడుకున్నారు. 

తెలుగు బాటలో: నేను వెళ్ళగానే ముందుకు వచ్చి పలకరించి తీసుకొనివెళ్ళి అక్కడున్న బ్లాగర్లకి పరిచయం చేసారు. నన్ను తాడేపల్లి గారి చేతుల్లో క్షేమంగా పెట్టివెళ్ళారు! వారి అమ్మాయి ఫోటొ వారి ప్రొఫయిల్ ఫోటొలో చూసి సుజాత గారు ఇంకాస్త ఎత్తుగా, ఇంకొంచెం బక్కగా వుంటారనుకున్నాను. అంటే వారు లావున్నారని కాదు.

అక్కడానూ, నడకలోనూ వారు చాలాసేపు వున్నా ఆ కార్యక్రమాలలో తీరిక లేకుండా వున్నారు కాబట్టి మళ్ళీ వివరంగా మాట్లాడటానికి కుదరలేదు. తెలుగు బాటలో కొద్దిసేపు నా పక్కనే నడిచారు కానీ అప్పుడు స్లోగన్సు ఇస్తూ కర్తవ్య నిర్వహణలో వున్నాను కాబట్టి మాట్లాడలేకపోయాను. నడక అయిపోయిన తరువాత ఎవరో (వారు ఎవరో గుర్తులేదండీ) వారితో "శరత్ గారు కూడా నడక మొత్తం బ్యానర్ పట్టుకొని నడిచారు" అని వారితో ప్రశంసా పూర్వకంగా చెప్పారు. అది విని వారు అవునవును, నేనూ చూసాకదా అనో ఏదో అన్నారు. వారు అన్నది విని నా పక్కన నాగ కానీ, మా అల్లుడు రవి కానీ లేరని నిర్ధారించుకొని "అవునండీ, తెలుగు నడక అసాంతమూ బ్యానర్ పట్టుకుని నడిచాను కాబట్టి మరి నా ఫుటో చాలా ప్రముఖంగా రావాలి" అని కోరాను. "అలాగేనండీ తప్పకుండా, మీ ఫోటొ వెయ్యకపోతే ఎలాగా" అని నవ్వుతూ అన్నారు.
 
నడక అయిపోయాక పివి జ్ఞానస్థలి వద్ద నెమ్మదిగా వర్షం పడుతుంటే వెచ్చని టీ తాగుతూ అందరం కలిసి సరదాగా కబుర్లు చెప్పుకోవడం చక్కటి అనుభూతిగా మిగిలింది. ఆ కార్యక్రమం చివరన వెళుతూ వెళుతూ అందరం అక్కడే వున్న ఏదో రెస్టారెంటుకి వెళుతున్నామని చెప్పి అక్కడికి రమ్మన్నారు. మా కారు వచ్చాక వస్తామని చెప్పాను. మా కారు రావడం ఆలస్యమయ్యింది. మేము మా అక్కయ్య వాళ్ళ ఫార్మ్ హవుజుకి వెళ్ళాల్సిన సమయం దగ్గర పడటంతో వారికి ఫోను చేసి రెస్టారెంటుకి రాలేనని చెప్పాను.
 
ఇంతకూ ఆ బాటకి కలర్స్ స్వాతి రాలేదు :( నేను ఆ బాటకి తప్పకుండా రావాలని నాకు అలా ఎర చూపారో ఏమో తెలియదు! మరి కలర్స్ స్వాతి వస్తున్నదని తెలియకపోతే నేను ఆ బాటకి నిజ్జంగా వెళ్ళేవాడినే అంటారా?  

7 comments:

  1. కలర్స్ స్వాతి కి నీకు ఏమిటి లింకు.. తను మగ కూడా కాదు ..--__

    ReplyDelete
  2. @ కాయ
    నేను సింప్లిసిటీ కోసం గే అంటుంటాను అప్పుడప్పుడూ కానీ నిజానికి నేను బై-సెక్సువల్. అందులో మళ్ళీ ఎక్కువగా హెట్రోనే, హోమో శాతం తక్కువే!

    ReplyDelete
  3. aata geetika vs colors swati
    mee favorite evaru

    ReplyDelete
  4. హిహిహిహి...., "నేను సింప్లిసిటీ కోసం..."
    LOL...

    ReplyDelete
  5. @ అజ్ఞాత
    వారిద్దరి గురించి నేను వ్రాసినంత మాత్రాన వారిద్దరికీ పోలికేంటండీ బాబూ! నేనేమీ రెగ్యులరుగా ఆట ప్రొగ్రాములేమీ చూడను. ఏదో ఒకటి, రెండు సార్లు చూసినట్లున్నాను. స్వాతికి కూడా వీరాభిమానినేమీ కాదు. స్వాతి చిలిపిదనం, అల్లరి, ఎక్స్‌ప్రెషన్స్ కాస్త నచ్చుతాయంతే.

    @ అజ్ఞాత
    హంతగా నవ్వొచ్చే విషయం హందులో హేముందబ్బా!

    ReplyDelete
  6. మిమ్మల్ని కలిసిన వాళ్ళ ఒడ్డూ పొడుగులతో సహా వర్ణించకుండా వదలరే?హయ్యబాబోయ్,మాంచి జిం బాడీ తో తప్ప మిమ్మల్ని కలవకూడదు :) మరోలా అనుకోకండి,సరదాకి అన్నానంతే. ఇంతకముందు చదువరు గారి గురించి రాసినాంత వివరంగా ఈ టపా లేదు. కలర్స్ స్వాతి రాలేదనే దిగులు పంచుకోవడానికన్నట్లుంది ఈ టపా :)

    ReplyDelete
  7. @ రిషి
    మనతో విభేదాలు వున్నవారి గురించి అయితేనే ఎక్కువ తెలుస్తుంది, ఎక్కువ వ్రాయగలుగుతాం కదా :) మిత్రుల గురించి ఎక్కువగా వ్రాయడానికేం వుంటుంది?

    కలర్స్ అంటే ఒక విషయం గుర్తుకువచ్చింది. చాలా ఏళ్ళ క్రితం - మా ఇద్దరు బంధువుల అమ్మాయిలు ఒకరి ఇంటికి వెళదామంటే నేను ససేమిరా రానన్నాను. వాళ్ళింట్లో దీప్తి అనే అమ్మాయి వుంటుంది, బావుంటుంది అని ఊరించారు. సరే అని ఓ ఎగేసుకుంటూ వాళ్ళతో వెళ్ళాను. ఎంతకూ వాళ్ళింట్లో దీప్తి కనపడదే!

    ReplyDelete