నేనిప్పుడు బాధపడాలా, సంతోషించాలా?
ఫరవాలేదులెండి. డబ్బులు సమర్పించుకుంటే లోనికి రానిస్తామంటున్నారు ఆఫీసర్లు. అంటే లంచం అనుకునేరు. కాదు, ఫైను అట. ఎంతనుకున్నారు $545 మాత్రమే. వా :(( అసలే ఇండియాకు అందరమూ వెళ్ళొచ్చి అసలే దివాళా తీసి వున్నాం. మూలిగేనక్కమీద ఈ తాటిపండు ఒకటా! హే ఆస్థిక భగవాన్, హేమిటీ నాకీ సినిమా కష్టాలు!?
ఏంటో అన్ని రూల్స్. మోకాలుకీ బోడిగుండుకీ లంకె వేస్తారు. కెనడా నుండి వస్తే ఒక రూలట, ఇండియా నుండి వస్తే ఒక రూలట. వాళ్ళతో ఏమని వాదించగలం? నాతో ఆఫీసరు ఫోనులో మాట్లాడాడు లెండి. శుబ్బరంగా మా ఆవిడని వెనక్కి పంపించమని చెబుదామనుకున్నా కానీ మళ్ళీ ఆ ఆనందం పట్టలేక నేను ఈ బ్లాగులో కక్కుకొని విషయం తెలిసి మీరందరూ తలంటుతారనే భయంతో వోక్కే, ఫైను కట్టేస్తామన్నాము. ఎంత వాదించినా రెండే ఆప్షన్లు అంటాడు ఆ ఆఫీసరు. ఒకటి ఫైను కట్టి లోపలికి రావడం, రెండు మా ఆవిడని ఇండియా తిరిగి పంపించడం. కెనడానుండి శుబ్బరంగా రానిచ్చారు కదా మహాశయా అంటే సింపుల్గా డజంట్ మాటర్ అంటాడు. TN డిపెండెంట్ వీసా, టూరిస్టు వీసాకు మధ్య సమస్యలెండి. మా ఆవిడ కూడా కెనడియన్ సిటిజెన్షిప్పు తీసుకుంటే ఈ సమస్యలు వచ్చివుండేవి కావు. కెనడానుండి యు ఎస్ కి అసలు వీసానే అక్కరలేదు. అయితే ఇంకా కెనడా సిటిజెన్షిప్పు ఎందుకు తీసుకోలేదని నన్ను మాత్రం అడక్కండి.
గమనిక: మా ఆవిడ మీద నా సరదా వ్రాతలన్నీ చూసి మా ఆవిడేదో గంప గయ్యాళి అనుకునేరు. అలాంటిదేమీ లేదు కానీ సగటు భర్త కష్టాలే నావి కూడా.
ఇప్పుడే వచ్చేస్తోంది, స్వేచ్చని లాకర్‌లో పెట్టెస్తోంది అన్నారు...! డబ్బులు పోతే పోయ్యాయి... ఇంటికి వచ్చేసారు కదా... సీసనల్ బ్యాచిలర్‌షిప్ నుంచి మీకు అల్విదా.
ReplyDelete@ నరేశ్
ReplyDeleteవిమానాశ్రయంలో ల్యాండ్ కాగానే ఇంటికి వచ్చేసినట్టు కాదు కదా. ఇమ్మిగ్రేషనూ అవన్నీ క్లియర్ అవుతేనే ఇంటికి పంపిస్తారు - అవకపోతే ఇండియా పంపిచ్చేస్తారు. టాక్సీ తీసుకొని ఇంటికి రమ్మన్నాను. ఇంకా దారిలోనే వున్నట్లున్నారు.
హమ్మయ్య, క్షేమంగా ఇంటికి వచ్చేసారు. నువ్వు చాలా బిగ్ ట్రబుల్లో వున్నావనీ, ఇండియా వెళ్ళిపోవాల్సిందేననీ ముందు బాగా మా ఆవిడని వణికించారుట.
ReplyDeleteNot surprising. Immigration guys at the O'hare airport have always been crazy!
ReplyDeleteAyyo paapam fine vesesaara?
ReplyDeleteఈ ఫైను ఎక్సెట్రా గొడవలేమిటి?ఏమయ్యింది అసలు?
ReplyDelete@ మలక్
ReplyDeleteయెప్
@ జాబిల్లి
పోనీలెండి. ఇండియాకి వెనక్కి పంపించి వుంటే ఇంకా సమస్య అయివుండేది.
@ రిషి
నేను కెనడియన్ సిటిజెనును కాబట్టి TN స్టేటస్ మీద యు ఎస్ లో పనిచేస్తున్నా. మా ఆవిడ ఇంకా భారత వీర నారీమణినే కాబట్టి తనకు ఓ పదేళ్ళ టూరిస్టు వీసా వుంది. కెనడాలో తనకి పర్మినెంట్ రెసిడెంట్ స్టేటస్ వుంది. కెనడా నుండి ఎప్పుడు వచ్చినా తన టూరిస్టు వీసా మీద TD (TN Dependent) స్టేటస్ ఇచ్చి నిక్షేపంగా పంపించేవారు. ఈసారి ఇండియా నుండి వచ్చింది కాబట్టి అలా టూరిస్టు వీసా మీద రావడానికి వీల్లేదని, TD వీసా తీసుకొని రావాలంటాడు ఆ ఆఫీసరు. తన సూపర్‌వైజరుతో మాట్లాడితే ఈ సారికి మినహాయింపు ఇచ్చి ఫైన్ కట్టించుకొని లోపలికి రానివ్వమన్నాడంట. మా అమ్మలు కెనడియన్ కాబట్టి తనకేం సమస్య అవలేదు.
ఏందండీ టైం కావస్తోంది ఇంకా టపా పడకపోతే ఎలా
ReplyDelete@ అజ్ఞాత
ReplyDeleteఅంతేనంటారా! హ హ. ఇవాళ కొద్దిగా పనుల్లో వున్నాను లెండి. ఒక సమయం అంటూ నిర్దేశించుకోకుండా మనకు వీలయినప్పుడు, మనకు మనస్సు వున్నప్పుడే బ్లాగులు వ్రాయడం సబబు అని నా అభిప్రాయం.
>>మనకు మనస్సు వున్నప్పుడే బ్లాగులు వ్రాయడం సబబు అని నా అభిప్రాయం.
ReplyDeletewe disappointed :(
fans hurted
హమ్మయ్య, క్షేమంగా ఇంటికి వచ్చేసారు. నువ్వు చాలా బిగ్ ట్రబుల్లో వున్నావనీ, ఇండియా వెళ్ళిపోవాల్సిందేననీ ముందు బాగా మా ఆవిడని వణికించారుట.
ReplyDelete.....తమరు తెగ ఆనందపడి వుంటారు ??లోలోపల...బుకాయించొద్దు...