ఆ మధ్య ఆట ప్రొగ్రాములో గీతిక మరియు ఇతర చిన్నపిల్లల డ్యాన్సుల గురించి ఏవో వివాదాలు వచ్చాయి కదా. ఇండియాలో మా బంధువుల అమ్మాయి పెళ్ళి రెసెప్షనుకి వెళ్ళాను. అది చాలా గ్రాండ్ గా జరిగింది. ఒక వైపు రిసెప్షను జరుగుతుండగా మరో వైపు సాంస్కృతిక కార్యకరమాలు ఏర్పాటు చేసారు. మాటివి, ఇతర టివి ఆర్టిస్టులూ, ఏంకర్లూ, మిమిక్రీ ఆర్టిస్టులూ గట్రా వచ్చారు. వారితో పాటే గీతిక కూడా వచ్చింది. జానపద గీతాలకి నృత్యం చేసింది. రిసెప్షనుకి వచ్చిన ఆహూతులు మిగతా అన్ని కార్యక్రమాలకంటే గీతిక డ్యాన్సులనే ఎక్కువగా చూసారు. నేను కూడా 'నలుగురితో నారాయణా, పది మందితో గోవిందా' అన్న సామెతల ప్రకారం ఆ పాప డ్యాన్సులను చూసి ఆనందించాను కానీ...ఆ గీతిక డ్యాన్సులు ఏమయినా చైల్డ్ లేబరు క్రిందికి వస్తాయేమోనని నా మనస్సు గొణుగుతూనేవుంది. ఆ పాప మాత్రం ఆనందంగా, హుశారుగా గంతులు వేసింది మరి.
నిజమేనండీ.. ఆ అమ్మాయి ని పెళ్ళిళ్ళల్లో డాన్స్ చేయించి డబ్బు చేసుకుంటే... బాల కార్మికుల చట్టం కిందే రావాలి.
ReplyDeleteఆట యూనిట్ ని
ReplyDeleteబాలికా విధు అమ్మాయిని కూడా జైల్లో వెయ్యాలి :)
బుర్రలో తర్కిస్తూ వుంటామ్ కానీ ప్రోగ్రామ్ ని ఆస్వాదించలేమ్..డాన్స్ చూస్తూ బాల కార్మికుల చట్టాల గురించి ఆలోచించడం ఏమిటండీ మహాప్రబో!
ReplyDelete