ఈమధ్య బూతు ఊప్స్ నీతి/సుత్తి టపాలు ఎక్కువయ్యాయి. అందరూ నీతులు చెప్పి తెగ మైలేజీ తెచ్చుకుంటున్నారు, మీరేమో మీ నిజాలన్నీ టపాల్లో టపటపా స్ఖలించి అందరిలో చులకనైపోతున్నారు. . మీ ఇమేజ్ పెరగాలంటే, కనీసం ఇమేజీ డామేజీని కవరప్ చేసుకోవాలన్నా సుమతీ శతకాల్లా కొన్ని నీతి గుళికలు బ్లాగ్లోకంలోకి విసిరేస్తే బ్లాగు పామరులు వాటిని వల్లె వేస్తూ వుంటారు. అలా బ్లాగు జానపదుల నోళ్ళలో నానడం వలన నువ్వొక మహాబ్లాగరిగా ఎప్పటికీ గుర్తుండిపోతారు అని నా PR టీం సెలవిచ్చింది.
అంటే నేను కొన్ని నీతి నియమాలు రూపొందిస్తే అవి వేమన పద్యాల్లా వెలిగిపోతాయన్న మాట అన్నాను సంబరంగా
భేషుగ్గా అంది మా టీం
మరి నాకు వేరేదొకటే వచ్చు కాని కొద్దిగా తప్ప పెద్దగా నీతి అంటే పడదే అన్నాను చిరాగ్గ ఫేసెట్టి.
మీరు మరీనూ సార్, మేమున్నది దేనికి? మీకు అవసరమయినవి అన్నీ సమకూర్చిపెట్టడానికే కదా అని ఓ పుస్తకం ముందుంచారు ముసుముసినవ్వులు నవ్వుతూ.
వారి ముసిముసినవ్వులు చూస్తూ ఏంటిదీ అన్నాను అనుమానంగా.
నీతి చంద్రిక సార్. బావుంటుంది. మొన్ననే తెప్పించాం మీ కోసం.
నేను దడుచుకున్నాను. వీళ్ళు నా పి ఆర్ టీమా లేక లేక ఏంటీ పార్టీ పి ఆర్ టీమా అని డవుట్ వచ్చింది. అయితే మీరు ఓ రవుండ్ వేసారన్నమాట మనస్సులో పండ్లు పటపటలాడిస్తూ బయటకి ప్రశాంతంగా అన్నాను.
అవును సార్. బావుంది కాబట్టే మీకు రికమెండ్ చేస్తున్నాం సార్ అన్నారు మళ్ళీ ముసిముసి నవ్వులు నవ్వుతూ.
వారి నవ్వులు చూసి నాకు మండుకొచ్చింది. అయితే ఈ నీతిచంద్రిక చదివి నీతులు బోధించాలన్నమాట అని కసిగా అన్నాను.
అవును సార్ అన్నారు మావాళ్ళు వినయంగా.
ఒక బూతు పుస్తకం ముందుపెట్టి నీతుల గురించి చెప్పడానికి సిగ్గులేదుటయ్యా. మర్యాదగా చెప్పండి మీరు మా బావ మార్తాండ డబుల్ ఏజెంట్లా? అని గద్దించాను.
వాళ్ళు ఖంగారు పడి పుస్తకం అటూఇటూ తిరగేసి ఇది బూతు పుస్తకం కాదు సార్ నిజంగానే నీతిచంద్రిక పుస్తకం అన్నారు.
అప్పుడు నా పొరపాటు తెలిసివచ్చి మనస్సులో నాలుక కొరుక్కున్నాను. ఇంకా నయ్యం ఇప్పుడు కూడా శీఘ్రమనస్ఖలించలేదు అనుకున్నాను. మా టీం దగ్గర పరువులు మళ్ళీ పోయేవి. నా యవ్వనంలో బూతుపుస్తకాలకు నీతిచంద్రికలు అని కోడ్ వర్డ్ పెట్టుకున్నాం. అదింకా మరవనందువల్ల వచ్చిన చిక్కు ఇదీ.
నేను మళ్ళీ చిరాకుగా ఫేసెట్టాను కానీ అలా నా హావభావాలు ఎందుకయ్యాయో మా వాళ్ళు తెలీక జుట్టులోకి వేళ్ళు పెట్టుకోబోయారు. అంత ఏక్షను వద్దు కానీ నేను పుస్తకాలు మరచిపోయి చాలా కాలం అయ్యింది కదమ్మా, ఇలా పుస్తకం తెచ్చిపెడితే నాకెలా ఎక్కుద్దీ అన్నాను.
వాళ్ళకేం తోచక బిక్కమొఖాలు వేసారు
వారిమీద జాలి పడి అంత ఫీలింగొద్దు కానీ తెలుగులో నీతి బ్లాగులేమన్నా వుంటే చెప్పండన్నాను. ఓస్ అంతేనా అని హుశారుగా కంప్యూటర్ మీద టకటకలాడించి ఓ చేంతాడంత లిస్టు ఇచ్చారు
హేంటీ ఇవన్నీ నీతి బ్లాగులే అన్నాను నమ్మశక్యం కాక.అంటే అవన్నీ నీతి బ్లాగులని ఆ బ్లాగర్లు చెప్పరు కానీ వాళ్లకు దురదపుట్టినప్పుడల్లా, రాయడానికి మరేం లేనప్పుడల్లా, లేదా టివిలో సినిమా చూస్తున్నప్పుడు ఏ మమైత్ ఖానో ఏదన్నా లేపో, కాస్త తొలగించో చూపించిందనుకోండి అప్పుడు సంస్కృతి భ్రష్టుపడుతున్నదనే ఆవేశం వచ్చో ఓ నీతి టపా వదులుతారు అని విశదీకరించారు.
వకే. మరిప్పుడు నేనివన్నీ వదివి జీర్ణించుకుంటే మరో రామస్వామినయిపోతానేమో అన్నాను అనుమానంగా.
అబ్బే, భలేవారు సార్ మీరు, కొంగ బురదలో వున్నా మట్టి అంటకుండా వున్నట్లు - మీకు తెలియని విద్యయా అది అన్నారు కిసుక్కున నవ్వుతూ
నిజమే కదూ అని మరి ఇవన్నీ చదవడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి వీటిల్లోని నీతులన్నీ నాకు కంపైల్ చేసి ఇవ్వండి అని ఆజ్ఞాపించాను. మళ్ళీ సిస్టంస్ మీద టకటకలాడించి మళ్ళీ చాంతాడంత లిస్టు తీసుకువచ్చారు. హిన్ని వున్నాయా నీతులు అని హాశ్చర్యంగా ముక్కులో వేలు పెట్టుకోబోయాను.
సార్ - ముక్కులో వేలు పెట్టుకోవద్దనేది కూడా ఒక నీతి అని ఖంగారుగా అన్నారు.
హర్రే, హవునా మనకింతవరకు తెలీదే అని సిగ్గుపడ్డాను.
ఇన్ని ఎందుకు వున్నాయంటే సార్. టపాలు వ్రాసాక వ్యాఖ్యాతలు ఊరుకోరు కదా. మగాడికి ముప్పయ్ ఏళ్ళు దాటాక అవి చితగ్గొట్టిస్తే 90 శాతం లైంగిక నేరాలు తగ్గుతాయి అనేటువంటి వ్యాఖ్యానీతులు కూడా వస్తాయి కదా. అవి కూడా కలిపి సేకరించాము సార్ అన్నారు వాళ్ళు.
మరి మిగతా 10 శాతమో అన్నాను
దానికి మీరే ఇవ్వాలి సలహా అన్నారు వాళ్ళు
భేశ్ అలాగే ఇద్దాం అని మొదటి నీతి వాక్యం చూసి దడుచుకున్నాను. అది క్రింది విధంగా వుంది.
బ్లాగర్లందరూ సోదర సోదరీమణులు.
ఏమయ్యా నీతి ఇలా వుంటే ఎలా? నా భార్య బ్లాగర్ కాదు కాబట్టి సరిపోయింది కానీ లేకుంటే ఎంత ఇమ్మోరల్ ఇదీ!
మేడం గారు బ్లాగర్ కాదు కాబట్టే అలా పెట్టగలిగాం సార్.
మరి మిగతా బ్లాగర్ దంపతుల మాటో?
అవన్నీ మనకు అనవసరం సార్. మనం నీతి సూత్రం వదిలెయ్యాలంతే - తరువాత దానిని ఎవరికి తగ్గటుగా వారు అన్వయించుకుంటారులెండి.
సోదర సోదరీమణులంటే స్వంత వారన్నట్టా లేక కజిన్సా అని అడిగాను అనుమానంగా.
వాళ్ళు బుర్రగోక్కుని ఎవరు ఎలా అన్వయించుకుంటే అలా సార్ అన్నారు వాళ్ళు వినయంగా
వాళ్ళనొకసారి ఎగాదిగా చూసి ఇహ రెండో సూత్రం సంగతి రేపు చూద్దామని ఆ లిస్టు పక్కకి పడేసాను.
శరత్ కెందుకో కోపమొచ్చిందోచ్ :-)
ReplyDeleteఏమైంది బాసు నీకు?
ReplyDelete@భా రా రే
ReplyDeleteమరీ అంత కోపమేం కాదుకానీ కొద్దిగా అసహనమంతే :)
@ గని
నాకేంకాలేదు కానీ ఈ టపా చదివాక మీరు ఓకేనా?
అంటే....మార్తాండ మీ బావా???!!!!.....
ReplyDelete'మనస్సులో నాలిక్కొరుక్కోవడం'?!!
".....లేపో, కాస్త తొలగించో!!!!"
"...అవి చితగ్గొట్టేస్తే...."
"యెవరు యెలా అన్వయించుకుంటే అలా....."
బాంది!
@ క్రిష్ణశ్రీ
ReplyDeleteహ హ. మార్తాండ మా బావ అన్నది బ్లాగు జగమెరిగిన సత్యం. ఇదివరకు ఓ నావెంట తెగపడేవాడు. ఇలాక్కాదని అలా వరుసతో వచ్చా.