ఈమధ్య బ్లాగుల్లో అవతార్ గురించి నెగటివ్ ట్రెండ్ మొదలయ్యింది. అవతారుకి అదేదే బెస్ట్ సినిమా, కథ అవార్డులు రావడంతోనే అదంటే అసహ్యం మొదలయ్యింది కొందరికి! అవతార్ ఒక్కసారి చూసామంటేనే అదోలా చూస్తున్నారు జనాలు. ఇక రెండోసారి నేను చూసానంటే నన్ను ఇంకా ఎలా చూస్తారో, ఎలా అంచనా వేస్తారో ఈ జనాలు :(
రౌడీ ఈసినిమా చూసి అడవులు పట్టిపోయారుట - తన తోకని దేనికి తగిలించాలా అని వెతుకుతూ అలా అలా అంతర్ధానం అయ్యారుట. మళ్ళీ వారిని ఈ జనజీవన స్రవంతిలో కలపడానికి చర్యలు తీసుకుంటున్నట్లు అభిజ్ఞవర్గాల ద్వారా విశ్వసనీయమయిన భోగట్టా. ఇంకో బ్లాగరూ 'ఇదేం అవతారం మహా ప్రభో' అని వ్రాసారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను రెండో సారి సినిమా చూసానంటే కామెంట్స్ అనే రాళ్ళ ద్వారా జనాలు నన్ను కొడుతారేమోనని భయంగానే వుంది :(
తొందరపడకండి, నా మీద రాళ్లలాంటి కామెంట్స్ విసరకండి. నేను ఎందుకు ఆ సినిమా రెండో సారి చూసానో, ఎందుకు అలా చూడాల్సివచ్చిందో ఈ దీనుడి దీనగాధని అర్ధం చేసుకోండి. అబ్బో, నీ సంగతి మాకు తెలియదా నవి హీరోయిన్ను చూడటానికి వెళ్ళావంటారు కదూ. హి హీ, కొంత నిజమే, కాదన్ను.
ఇంతకుముందు ఐమాక్స్ లో చూసా కదా ఇప్పుడు రియల్ 3D లో చూస్తే ఎలా వుంటుందా అని చూడటానికి కూడా వెళ్ళాను కానీ అదే ప్రధాన కారణం కాదు. సినిమాను మరోసారి అనుభవించడానికి వెళ్ళాను కానీ అదీ ప్రధాన కారణం కాదు. మరెందుకు? ఇందుకు. ప్రతిరోజూ మధ్యాహ్నం ఆఫీసులో వున్నా, ఇంట్లో వున్నా ఓ ఇరవై నిమిషాలు కునుకు తీస్తాను. ఆఫీసులో అయితే గది తలుపు వేసుకొని కునుకు తీయడమో లేక కళ్ళు తెరచి వుంచే కంప్యూటర్ కేసి చూస్తూ పవర్ న్యాప్ తీయడమో చేస్తుంటాను.
మొదటిసారి అవతార్ సినిమాకు మ్యాట్నీ షోకి వెళ్ళాము. కొద్దిసేపయ్యాక నిద్ర విపరీతంగా ముందుకువచ్చింది. హాయిగా ఓ ఇరవై నిమిషాలు కునుకు లాగించాను. ఆ సినిమా జోరులో వుండి మా ఆవిడ గానీ, పిల్లలు కానీ నా నిద్రని గమనించలేదులెండి. అలా గప్‌చుప్ గా లాగించాను కానీ ఆ ఇరవై నిమిషాలూ ఆ చిత్రరాజాన్ని మిస్సయ్యాను కదా అన్న అపరాధభావన నన్ను దహించివేస్తూ వచ్చింది. ఇక తాళలేక మా పిల్లలని వెంటేసుకొని గత వారం మళ్ళీ సినిమాకి వెళ్ళాను. మళ్ళీ మ్యాట్నీకే వెళ్ళాం అనుకోండి కానీ ఈ సారి జాగ్రత్తగా వ్యూహ రచన చేసాను. ఇంతకుముందు నిద్రపోయినప్పటి సన్నివేశాలు జరిగిపోయేదాకా ఆగి అప్పుడు ఎంచక్కా కునుకులోకి వెళ్ళాను. అలా మొత్తం మీద సినిమా మొత్తం కవర్ చేసేనన్నమాట. సెబ్బాశ్!
ఇంటికి వచ్చాక ఆనందం ఆపుకోలేక మా ఆవిడకి అసలు రహస్యం - అనగా ఈ సినిమా ఎందుకు రెండో సారి చూడాల్సివచ్చిందీ చెప్పాను. నా వైపు అదోలా చూసింది. మీరెలా చూస్తున్నారు ఇప్పుడు నా వైపు?
అవతార్ సినిమా గురించి మా చిన్న పాప కామెంట్: మోదటి పది నిమిషాలే 3D. తరువాత అంతా రిప్ఆఫ్ (లాగే వుంది)! (IMax or Real 3D)
నేను ఇంకా చూడలేదు :(
ReplyDelete@Rajesh
ReplyDeleteఇంకా ఇతరుల నుండి నెగటివ్ స్ట్రోక్స్ పడకముందే చూసెయ్యండి. జీవితంలో ఒక పని అయిపోయినట్టు వుంటుంది.
భలే!నేను కూడా మొన్న సోమవారం రెండోసారి చూసాను.నాకు నిద్ర గొడవలు లేవు కానీ,మొదటిసారి విజయవాడ లో తెలుగు అవతార్ చూసాను.డెట్రాయిట్ కొచ్చాక ఐమాక్స్-3డి లో మాళ్ళీ చూసాక ఒళ్ళు పులకరించింది.
ReplyDelete@శ్రీ
ReplyDeleteవిజయవాడలో మొదటి సారి ఎందులో చూసారు? 2D/3D ?
హిహి ... నేను ఒకరి రివ్యూ చూసి సినిమా చూడను ... చెప్పాగా తెలివైన వాడిని అని :D
ReplyDeleteనేను కూడా 3D లో చూసా... నాకైతే టెక్నికల్ గా బాగానే నచ్చింది.
ReplyDeleteఇంకోసారి ఇంట్లో వాళ్ళందరితో మళ్లీ 3D లోనే చూడాలని అనుకుంటున్నాను.
In Vijaywada, only 2D is available.
ReplyDeleteఅబ్బ అచ్చంగా ఇలాగే జరిగిందండీ నాకూనూ
ReplyDeleteనేను మొదటిసారి 2D లో చూసా, రెండోసారి 3Dడ్ లో చూస్తున్నప్పుడు కొంచం నిద్ర వచ్చేసింది. నేనూ మ్యట్నీకే వెళ్ళాను. అయినా నాకు అవతార్ నచ్చిందిలెండి. ఇప్పుడు జనాలు అవతార్ మీద తిరగబడడం ఏమిటొ నాకేమీ పాలుపోవట్లేదు. నాకు బాగ నచ్చిన సినిమా వీళ్ళకి ఎందుకు నచ్చట్లేదో ఏమో, అయోమయంగా ఉంది :(
@ చైతన్య
ReplyDeleteIMAX లో 3D లో చూపెడుతున్నారా హైద్రాబాదులో?
@ వీరుభొట్ల
నా చిన్నప్పుడెప్పుడో చిన్నారి చేతన మా సూర్యాపేటలో 3D లో చూసా. ఇంకా విజయాడలో 3D లో చూపిచకపోవడమా. హ్మ్.
@ సౌమ్య
అవునండి. ఇలా అవతార్ నచ్చని వాళ్ళని ఏం చేద్దాం చెప్పండి? కొందరికి నిజంగా నచ్చదు - కొదరికి స్టైల్ - కొందరికి సరదా. ఏం చేస్తాం.
ఒక పని చేద్దాం, వీళ్లందరికీ మార్తాం'డర్' తీసి చూపిద్దాం. అప్పుడు చచ్చినట్లు వేయివిధాలా అవతార్ నచ్చుతుంది.
2డీ నే! నవరంగ్ సినిమా హాల్లో చూసా.
ReplyDelete