డెట్రాయిట్ సాహితీ సమావేశాలకు మేము వెళుతున్నాం. మీరు వస్తున్నారా?

సెప్టెంబర్ 26, 27 తేదీలలో జరిగే కొకు, శ్రీశ్రీ, గోపీచంద్ శతజయంతి ఉత్సవాలు - ఉత్తర అమెరికా తెలుగు సాహితీ సదస్సులు కు సకుటుంబ సపరివారసమేతంగా వెళ్ళాలని నిశ్చయించాము. మా ఇంట్లో కొందరు సాహితీ సమావేశాలంటే రాము అని మొరాయించే అవకాశాలున్నా 'ఫాలో ద ఫుడ్' సూత్రం గుర్తుచేసి రుచికరమయిన భోజనాలు గ్యారంటీ అని నిర్వాహకులు హామీ ఇచ్చారని కుట్రచేసి అయినా లేదా సినిమా హీరో కూడా వస్తున్నారని చెప్పి అయినా ఎలాగయినా సాహితీ గుబాళింపులు కొద్దిగానయినా అంటించాలనేది నా వ్యూహం. సాహితీ అభిరుచి వున్న మా మామగారు కూడా మాతో వస్తున్నారు.

ఈ సభలకు కొకు, శ్రీ శ్రీ, గోపీచంద్ ల వారసులూ వస్తున్నారు. ముఖ్య అతిథుల లిస్టులో గోపీచంద్ గారబ్బాయి సాయిచంద్ పేరు చూసి కొద్దిగా ఆశ్చర్యం కలిగింది. ఒక సినిమా హీరో/నటుడు గా మాత్రమే వారు నాకు తెలుసు కానీ సాహితీ పరంగా వారు నాకు తెలియదు (గోపీచంద్ గారబ్బాయి అని తెలుసు). విజయవాడ నాస్తిక కేంద్రం లో వుంటున్న/వెళుతున్న రోజుల్లో వారు అక్కడ తరచుగా కనిపించేవారు, కలుస్తుండేవారం.

గత ఏడాది డెట్రాయిట్ సాహితీ సమావేశాలని లైవ్ బ్లాగింగ్ చేసానన్న విషయం మీకు గుర్తుండేవుంటుంది. ఇప్పుడు కూడా చేయాలనుకుంటున్నాను. ఇంకా వీలయితే, నిర్వాహకుల అనుమతి వుంటే లైవ్ వీడియో బ్లాగింగ్ (వ్లాగింగ్) కూడా చేయాలనుకుంటున్నాను. లైవ్ బ్లాగింగ్ కాబట్టి తరచుగా టపాలు వుంటాయి - మీ అభ్యంతరం వుండదనే భావిస్తున్నాను.

ఇక నాకు ముఖాముఖి తెలిసిన యు ఎస్ బ్లాగ్మిత్రులు ఎవరెవరు వస్తున్నారో కనుక్కుందాం:
నాగరాజా వారు: మీరు వస్తున్నట్లయితే మా ఇంటికి వచ్చి కొద్ది సేపయినా గడిపి అందరం కలిసి వెళ్ళవచ్చు.
మలక్‌పేట్: మీరు వస్తున్నారా? పనిలో పనిగా కె బ్లా స శిఖరాగ్ర సమావేశం కూడా జరుపుకోవచ్చు!
రవి వైజాసత్య: గత ఏడాది లాగా మీరు వస్తున్నారా?
కాలాస్త్రి శ్రీ: మీది డెట్రాయిటే కాబట్టి మీరు ఎలాగూ వుంటారు. మరోసారి కలవబోతున్నారు. సంతోషం.
కొత్తపాళీ: మీరు నిర్వాహకుల్లో ఒకరనుకుంటాను. లైవ్ వ్లాగింగ్ కి ఓక్కేనా కాదా కనుక్కొని చెప్పండి.

ఇంకా ఎవరెవరు వస్తున్నారో తెలియజేస్తే బావుంటుంది. ఎంచక్కా మనమందరం కలుసుకోవచ్చు.

ఆ సదస్సుల పూర్తి వివరాలకు ఈ లంకె చూడండి:
http://www.detroittelugu.org/DTLC/Centenaries_Details.asp

3 comments:

  1. September 26 looks like a possibility. Will try my best!

    ReplyDelete
  2. నేను తప్పక ఉంటాను. ఈ నెల చివరిలో దీని మీద ఒక మీటింగ్ ఉంది, అపుడు లైవ్ బ్లాగింగ్ నిర్వాహకులకి గుర్తు చేస్తాను. నా ఉద్దేశంలో ఎటువంటి అడ్డం ఉండకపోవచ్చు. ఆ వీకెండ్ అమెరికాలో బ్లాగర్లు కూడా కలిస్తే బాగుంటుందేమో?

    ReplyDelete
  3. మీ రాక సంతోషం. సభలో తప్పక కలుస్తాను గానీ నేను నిర్వాహకుల్లో లేనీ సారి. అక్కడ వెబ్ పేజిలో పేర్లున్న వారినే సంప్రదించండి.

    ReplyDelete