ఇది నిజంగా పనిచేస్తుందా లేక బోగసా అన్న ఆలోచనను తటపటాయింపులేకుండా చేసుకోగలిగాను.
అతను సన్నగా నవ్వి "మీకు ఆ సందేహం అక్కరలేదు. అంతగా అనుమానముంటే కొనకండి"
ఇలాంటి ఎలెక్ట్రానిక్ పరికరం లేక చాలా ఇబ్బందవుతోంది.ఇలాంటి పరికరాలనీ నిషేధించాలని కొన్ని సంఘాలు ఇప్పటికే గొడవపెడుతున్నాయి. కొనిపెట్టేసుకుంటే నిషేధం వచ్చినా రహస్యంగానయినా వాడుకోవచ్చు - కనీసం ఇలాంటివి పనిలో వున్నాయని కనిపెట్టే సాంకేతికత వచ్చేదాకా. ధర ఎక్కువగా వుందని కొద్దిగా తటపటాయించినా మొత్తానికి ఆ పరికరం కొనేసెయ్యాలనే నిర్ణయానికి వచ్చాను.
అతను మందహాసం చేస్తూ "మంచి నిర్ణయం తీసుకున్నారు" అన్నాడు. "ఈ పరికరాన్ని ఎవరికీ కనపడకుండా చూడండి. ఇది మీరు ఉపయోగిస్తున్నారని ఇతరులకు తెలిస్తే బావుండదు కదా. ఇక మీ మనస్సులోని చెడు, చిలిపి ఆలోచనల గురించి బెంగే అక్కరలేదు" అంటూ ఆ పరికరం నాకు ఇచ్చాడు. ఆ పరికరం ఎలా పనిచేస్తుందో అంతకుముందే వివరించాడు.
"ఇది ఏ రాష్ట్రం లోనూ చట్టవిరుద్ధం కాదు కదా?" అడిగాను.
"కేరళలో ఇది చట్ట విరుద్ధం. దేశ వ్యాప్తంగానూ, ఇతర రాష్ట్రాలలోనూ ఇంకా చట్టమేం రాలేదు. వస్తే మాత్రం ఏమవుతుంది? మరింత రహస్యంగా వాడితే సరిపోతుంది"
"మంచిది" అని చెప్పి బయటకి నడవబోయాను.
"ఈ పరికరాలు నేను అమ్ముతున్నట్లుగా అందరికీ చెప్పకండి. మానస హక్కుల సంఘాలతో గొడవ. మీకు తెలియనిదేమివుంది!"
"అలాగే" బయటకి నడవబోయాను.
"అలా అని చెప్పి మీ నమ్మకస్తులకి కూదా చెప్పకుండా వుండేరు. చెప్పండి. నాకు బ్యుజినెస్స్ కూడా కావాలి కదా"
తల ఊపి బయటకి నడిచాను. బయట వాతావరణం ఆహ్లాదంగా వుంది - నా మనస్సు అయితే ఇంకానూ - ఏనాళ్ళనుండో పోగొట్టుకున్న స్వేఛ్ఛ దొరికినట్లయ్యింది. ఇక స్వేఛ్ఛగా వుండొచ్చు. స్వేఛ్ఛగా ఆలోచించవచ్చు. అంతలోకే ఈ పరికరం మీద సందేహం వచ్చి నీరు కారిపోయాను. ఇది బోగస్ పరికరం కాదు కదా. అయ్యుండదులే, ఇతగాడు నమ్మకస్తుడే అని శశాంక్ కూడా చెప్పాడు కదా. ఇలాంటి పరికరాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో వుంటాయని తెలుసుగానీ అవి ఇండియాలో అప్పుడే దొరుకుతున్నాయని శశాంక్ చెప్పబట్టే తెలిసింది.
ఈ పరికరం ఎప్పుడెప్పుడు ఉపయోగించాలా అని మనస్సు ఉవిళ్ళూరుతోంది. సూపర్ ట్రెయినులో వాడి చూసేదా? స్టేషనుకి వచ్చి సమయం చూసుకున్నాను. '06-07-2047 AD. 9:40 PM'. రైలు వచ్చాక ఎక్కాను. రాత్రి కదా ఎక్కువమంది లేరు. కొంతమంది అమ్మాయిలు వున్నారు. ఒక అమ్మాయి ఎదురుగ్గా కూర్చున్నాను. ఎప్పటిలాగానే ఎవరూ తలేత్తి చూడటం లేదు. ఎవరివైపేనా చూస్తే చాలు ఇబ్బందులు. థాట్ రీడింగ్ పరికరాలు వచ్చాక ఎవరు ఎలాంటి ఆలోచనలు చేసినా తెలిసిపోతుంది. యు ఎస్ ని భారత్ మించిపోయింది కానీ లిటిగేషన్లలో కూడా మించిపోయింది. ఎవరిలో వక్ర ఆలోచనలు పసిగట్టినా కేసులేస్తున్నారు. ఎందుకొచ్చిన గొడవలే అనుకొని మనుషుల మధ్య ఇంటరాక్షన్సే తగ్గిపోయాయి.
ఇదివరకు లాగా ఒకరినొకరు చూసుకోవడం, పలకరించుకోవడం దాదాపుగా మృగ్యం అయిపోయాయి. ఎవరినీ చూసినా మనసు ఏదో రకంగా స్పందించడం సహజం కదా. మంచి ఆలోచన అయితే ఫర్వాలేదు - చెడు ఆలోచన అయితే ఎదుటివారి దగ్గర వున్న థాట్ రీడింగ్ పరికరం ఆ ఆలోచన రికార్డ్ చేసి మరీ హెచ్చరిస్తుంది. ఆటొమేటిక్కుగా పోలీసులకి సమాచారం అంది పోలీసులు వచ్చి ఏదో ఒక హక్కుల ఉల్లంఘన క్రింద కేసుపెడతారు.
ఇప్పటికే నాలుగుసార్లు కేసులో ఇరుక్కుని జరిమానా చెల్లించి బయట పడ్డాను. ఇంకోసారి ఇలాంటి నేరం చేస్తే జైలు ఖాయం అని జడ్జి హెచ్చరించాడు. ఒకసారి ఒక లావుపాటి అమ్మాయిని చూసి 'గౌడు బర్రెలా వుంది ' అనుకున్నాను. కేసు ఆ అమ్మాయిని అలా అనుకున్నందుకు కాదు - జంతుజాలాన్ని అవమానించినందుకు పడింది. ఆమె బ్లూ క్రాస్ కార్యకర్త అట. మరో సారి విమానంలో ఒకడి ప్రవర్తన చూసి ' వీడికి అగ్రవర్ణ దురహంకారం చాలా వున్నట్లుందే ' అని పొరపాటున అనుకున్నా. విమానం లోంచి దింపేసి మరీ కేసు పెట్టారు. మరోసారి పార్క్ లేన్ లో నడుస్తుంటే ఒక చక్కటి అమ్మాయి కేవలం డ్రాయర్ మాత్రమే వేసుకొని స్కేటింగ్ చేస్తోంది. (అ)సహజంగానే అనుకోకుండా ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోయాయి - పోలీసులు మాత్రం నా దగ్గరికే వచ్చారు. ఆమె లెస్బియన్ అట. మగవారితో ఊహలు ఊహామాత్రం కూడా భరించలేదట. మరో సారి పురుష సంఘాల వారు ఏదో నిరసన ప్రదర్శన చేస్తూవుంటే అనుకోకుండా నవ్వువచ్చింది, ఆ తరువాత ఆ నవ్వుకి భారీగానే మూల్యం చెల్లించాల్సి వచ్చింది - ఎందుకంటే ఒక్కరు కాదు కదా నామీద కేసు పెట్టింది - జాయింటుగా చాలామంది పెట్టేరు మరి.
ఎదురుగా కూర్చున్న అమ్మాయి చాలా బావుంది. ఒక వేడి, వేడి ఫాంటసీ వేసుకుంటే పోలా. ఈ పరికరం పనిచేస్తుందని పనిచేసినా అన్నివేళలా నమ్మకంగా పనిచేస్తుందని రూఢీ ఏమిటి? రిస్క్ తీసుకుందామనుకున్నాను. రైలు కుదుపులలో జోగుతూ హాయిగా కలల్లోకి వెళ్ళిపోయాను. కాస్సేపటికి పోలీసుల బూట్ల చప్పుడుకు ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను. మత్తు ఎగిరిపోయింది. పోలీసులు వస్తున్నారు! ఈ సారి పట్టుబడితే ఓ మూడేళ్ళయినా జైలు శిక్ష ఖాయం. ఈ పరికరం వాడుతూ పట్టుబడుతున్నాను కాబట్టి ఇంకో రెండేళ్ళు అదనంగా వేసినా వేస్తారేమో లేదా అది చట్ట విరుద్ధం ఇంకా కాదు కాబట్టి పటించుకోరేమో. జడ్జిని ఆలోచన బట్టి వుంటుంది అది. ఈ పరికరం అమ్మిన అతడిని సూచించిన శశాంక్ మీద విపరీతమయిన కోపం వచ్చింది. నాలో ఉక్రోషం, నిస్సహాయత, విరక్తి తన్నుకుంటూ వచ్చేస్తున్నాయి. ఇవన్నీ ఎక్కువయితే రాజద్రోహం కేసుకూడా పడవచ్చు - నా ఆలోచనలని యోగా టెక్నిక్ ఉపయోగించి కష్టకష్టంగా తమాయించుకొని కేసుకోసం మానసికంగా సిద్ధపడ్డాను.
ఆశ్చర్యం. పోలీసులు నన్ను దాటి ముందుకు వెళ్ళారు. అక్కడ వున్న ఒక యువతిని అరెస్టు చెసారు. ఇతరులెవరూ ఆ విషయం పటించుకోవడం లేదు - ఎందుకయినా ఆలోచనలకి మంచిదని. నా దగ్గరున్న పరికరం పనిచేస్తున్నదన్న నమ్మకంతో నేను క్రీగంట ఆ దృశ్యం పరిశీలిస్తూ వచ్చాను. పోలీసులు ముభావంగా, ఎటువంటి ఆలోచనలు లేకుండా, రాకుండా తమ పనిచేసుకువెళుతున్నారు. వారి ఉద్యోగ శిక్షణలో ఆలోచనలు నియంత్రించుకోవడంపై కఠిననమయిన శిక్షణ వుంటుందని తెలుసు - లేదా నేను ఉపయోగిస్తున్నటువంటి పరికరం వారు కూడా ఉపయొగిస్తుండవచ్చు. పొలీసులు కదా - దేశ రక్షణ దృష్ట్యా వాళ్లకు చాలా మినహాయింపులుంటాయి.
మనస్సులో దురదగా వుంది. 'పోలీసులు డవున్ డవున్, ప్రభుత్వం డవున్ డవున్, వికాస్ గాంధీ డవున్ డవున్' అని అనుకుంటూ మానసిక తీట అంతా తీర్చుకున్నాను. అయినా - ఆందోళన. పోలీసుల దృష్టి నా ఆలోచనల మీద పడుతుందేమోనని, వాళ్ళ దగ్గరున్న థాట్ రీడింగ్ పరికరాలు నా ఆలోచనలని పసికడతాయేమోనని. అలాంటిదేం జరగకుండానే పోలీసులు వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను వాడుతున్న ఏంటీ థాట్ రీడింగ్ పరికరం మీద నాకు బాగా విశ్వాసం ఏర్పడింది. శశాంక్ పట్ల చాలా సంతోషం అనిపించింది. ఒకరోజు వాడిని గదికి పిలిచి పిచ్చిపిచ్చిగా అన్నింటి గురించీ ఆలోచిస్తూ పండగ చేసుకోవాలి.
నా స్టేషన్ వచ్చింది. రైలు దిగాను. అర్ధరాత్రి కావస్తోంది. నాకు చాలా ఉద్వేగంగా, సంబరంగా వుంది. నాకు అంటే నా ఆలోచనలకి స్వాతంత్ర్యం వచ్చేసింది. ఈ అర్ధరాత్రే పట్టపగలులా, వెలుగులా అనిపిస్తోంది. అర్ధరాత్రి స్వతంత్ర్యం నాకు ఇప్పుడు వచ్చింది.
జై హింద్!
(ఆబ్రకదబ్ర సూచన మీద కథను పొడిగించడం జరిగింది)
రెండు రోజుల తరువాత వారాంతంలో శశాంక్ ని ఇంటికి పిలిచాను. విషయం చెప్పి ధన్యవాదాలు చెప్పాను. సంతోషించేడు. "ఇక నేను కూడా స్వేఛ్ఛగా ఆలోచించుకోవచ్చు" అన్నాను. మందహాసం చేసాడు. గ్లాసుల్లోకి నీరా వంచాను. ఇద్దరం ఛీర్స్ కొట్టి తాగడం మొదలుపెట్టాము. అతను హుశారుగా తన ట్రాన్స్వెస్ట్ అనుభవాలు చెబుతున్నాడు.
ఈరోజు నేను ఆనందంగా వుండటంతో మందు ఎక్కువ పుచ్చుకున్నాను. నేను ఎక్కువగా పైకి మాట్లాడే వ్యక్తిని కాకపోవడం వల్ల బయటకి వాగకున్నా నా ఆలోచనలు కళ్లెం వదిలేసిన గుర్రంలా పరుగెడుతున్నాయనే విషయం నాకు అర్ధం అవుతోంది. ఆ పరికరం వుంది కాబట్టి కంగారేమీ లేదు.
హఠాత్తుగా మాటలు ఆపి తన ప్యాంటు ప్యాకెట్టులోంచి యు-ఫింగర్ లాంటి పరికరం తీసి చూసుకున్నాడు. గ్లాసులొకి నీరా మరికొంచెం వంపుకొని నిదానంగా నాతో అన్నాడు "నువ్విప్పుడు నా ట్రాన్స్వెస్ట్ అలవాట్ల గురించి ఛండాలంగా అనుకుంటున్నావు కదూ"
నాకు మత్తు దిగిపోయింది. కంగారుగా నా ఏంటీ థాట్ రీడింగ్ పరికరం పనిచేస్తున్నదా లేదా చూసుకున్నాను. చక్కగా పని చేస్తున్నది!
అతను మళ్ళీ మందహాసం చేసాడు "ఏంటీ - ఏంటీ థాట్ రీడర్ లు కూడా వచ్చాయి. "
ఆబ్రకదబ్ర యొక్క ప్రత్యామ్నాయ ముగింపు :
నా స్టేషన్ వచ్చింది. రైలు దిగాను. అర్ధరాత్రి కావస్తోంది. నాకు చాలా ఉద్వేగంగా, సంబరంగా వుంది. నాకు అంటే నా ఆలోచనలకి స్వాతంత్ర్యం వచ్చేసింది. ఈ అర్ధరాత్రే పట్టపగలులా, వెలుగులా అనిపిస్తోంది. అర్ధరాత్రి స్వతంత్ర్యం నాకు ఇప్పుడు వచ్చింది. ఆనందంగా 'జై హింద్' అనుకోబోతుండగా ..
వెనకనుండి నా భుజమ్మీద పడిమ్మీద పడిందో కరకు హస్తం. నేను వెనక్కి తిరగబోయేలోపు నా రెండు చేతులూ వెనక్కి విరిచి పట్టుకున్నారెవరో. మరు క్షణంలో బేడీలు పడ్డాయి. అనుకోని ఈ సంఘటననుండి తేరుకునేలోగా వినిపించిందతని గొంతు 'మిస్టర్, యూ ఆర్ అండర్ అరెస్ట్ - చట్టవ్యతిరేకంగా యాంటీ థాట్ రీడింగ్ పరికరం కలిగి ఉన్నందుకు'.
నా కళ్లు బైర్లు కమ్మాయి. 'ఎలా తెలిసింది!?!', నేను షాక్ నుండి తేరుకునేలోపే సమాధానం లభించిందా ప్రశ్నకి.
'పోలీసుల్ని చూసి బోగీలో అందరూ భయపడ్డా నువ్వొక్కడివే ఏ భావాలూ బయటపడకుండా ఉండిపోవటం గమనించినప్పుడే అనుమానమొచ్చింది - నువ్వేదో పరికరం వాడుతున్నావని. బ్యాకప్ కోసం మెసేజ్ పంపటంతో, ఈ స్టేషన్ వచ్చేదాకా నిన్నరెస్టు చెయ్యకుండా ఆగాల్సొచ్చింది', వెనకనుండి నా ముందుకొస్తూ చెప్పాడు ఇందాక బోగీలో యువతిని అరెస్టు చేసిన పోలీసు అధికారి. అంతలో నన్ను చుట్టుముట్టింది స్టేషన్లో మఫ్టీలో ఉన్న నలుగురు బ్యాకప్ పోలుసుల బృందం.
Dear Readers, You may suggest an alternate ending too.
అధివాస్తవిక అనేకన్నా, దీన్ని సైన్స్ ఫిక్షన్ కథ అనొచ్చు. మంచి ప్రయత్నం. తెలుగు కథల్లో ఇలాంటి ప్రయోగాలే కావాలి.
ReplyDeleteకథ విషయం బాగుంది కానీ క్లైమాక్స్ తేలిపోయినట్లనిపించింది. అంత సింపుల్‌గా ముగించేబదులు ఏదైనా చిన్న ట్విస్ట్ పెట్టి ఉండాల్సింది.
Goo done dude
ReplyDeleteనాకు గుర్తుకువున్నంతవరకు నా బ్లాగులో మీ వ్యాఖ్య చూడటం మొదటిసారి. నేనంటే ఫోబియానేమో అనుకున్నా :)
ReplyDeleteనిజానికి నాకు సర్రియలిస్టిక్ టెక్నిక్ గురించి అంతగా తెలియదు - అంటే సరిగ్గా ఎటువంటి విధానాన్ని అలా అంటారూ అనే విషయంలో స్పష్టత లేదు నాకు. ఇది అదేనా కాదా - మీరన్నట్లే సైటిఫిక్ ఫిక్షన్ అందామా అనుకొని సర్రియలిస్టిక్ అని పెడితేనన్నా మీలాంటి వారన్నా నాకు చెబుతారు కదా అనుకుని టైటిల్ అలా పెట్టేసా. దీనిని సర్రియల్ కథ అని కూడా అనుకోవచ్చునా లేదా?
అధివాస్తవికత మీద మీకు తెలిసిన కథలు, నవలలు తెలుగులో వుంటే సూచించండి. ఇంగ్లిష్ వాటి గురించి ఇప్పుడే గూగిలింగో బింగ్లింగో చేస్తాను.
చివరి మలుపు గురించి:
ఒకసారి ఈమాట పత్రిక ప్రధాన సంపాదకులు గారి పోస్ట్ చదివాను. ఓ హెన్రీని అనుకరిస్తూ అమెచ్యూర్ రచయితలు చివరి మలుపులు పెడుతున్నారని హేళన చేసారు. అప్పటినుండీ అలాంటి ట్విస్టులంటే నైరాశ్యం ఏర్పడింది కానీ వదిలించుకుంటాలెండి.
@ మలక్
థేంక్స్ బడ్డీ.
@ ఆబ్రకదబ్ర
ReplyDeleteకాస్త రిసెర్చ్ చేసాను - కొంత క్లారిటీ వచ్చింది. కథ టైటిల్ మార్చేసాను. ఎంత తిక్కతిక్కగా వ్రాస్తే అంత సర్రియల్ అవుతుందనుకుంటా :) - వ్రాయాలి అటువంటిదొకటి.
నాకే ఫోబియా లేదు :-) మీరు చురుగ్గా బ్లాగింగ్ చెయ్యటం మొదలైన సమయంలోనే నేను చురుగ్గా వ్యాఖ్యానించటం తగ్గిపోయింది. అంతే.
ReplyDeleteతెలుగు కథల్లో అధివాస్తవికత .. నాకు తెలిసి అటువంటివి లేవు - ఐతే, నాకు తెలుగు కథల మీద మరీ అంత 'అజమాయిషీ' లేదు కాబట్టి ఆ మాట మరీ గట్టిగా నొక్కకుండా వక్కాణిస్తున్నాను. ఆంగ్లంలోనైతే లెక్కలేనన్నున్నాయి. ఉదాహరణకి: E.M.Forster రాసిన The Other side of the Hedge చదవండి. మరీ గొప్ప కథ కాదు - కానీ, ఒక ఐడియా వస్తుంది.
ఓ.హెన్రీ ట్విస్టుల్లో అధికం ఆకట్టుకునేలా ఉండవు కానీ ట్విస్ట్ ఎండింగ్ అనేది సరిగా వాడితే అద్భుతమైన ఫలితమిస్తుంది. నా వరకూ - చివర్లో ఏం రాబోతుందో మొదట్లోనో, మధ్యలోనో తెలిసిపోయే వస్తువుని కథకన్నా వ్యాసంలా రాయటం మంచిదనుకుంటాను. Dorothy Parker కథ The Standard of Living ముగింపు చూడండి. మనం ఊహించని ముగింపు - అతి సహజం అనిపించేలా.
పొడిగింపు చదివాను. ఫరవాలేదు. ఇలా చేస్తే ఎలా ఉంటుందో చూడండి:
ReplyDelete-------
నా స్టేషన్ వచ్చింది. రైలు దిగాను. అర్ధరాత్రి కావస్తోంది. నాకు చాలా ఉద్వేగంగా, సంబరంగా వుంది. నాకు అంటే నా ఆలోచనలకి స్వాతంత్ర్యం వచ్చేసింది. ఈ అర్ధరాత్రే పట్టపగలులా, వెలుగులా అనిపిస్తోంది. అర్ధరాత్రి స్వతంత్ర్యం నాకు ఇప్పుడు వచ్చింది. ఆనందంగా 'జై హింద్' అనుకోబోతుండగా ..
వెనకనుండి నా భుజమ్మీద పడిమ్మీద పడిందో కరకు హస్తం. నేను వెనక్కి తిరగబోయేలోపు నా రెండు చేతులూ వెనక్కి విరిచి పట్టుకున్నారెవరో. మరు క్షణంలో బేడీలు పడ్డాయి. అనుకోని ఈ సంఘటననుండి తేరుకునేలోగా వినిపించిందతని గొంతు 'మిస్టర్, యూ ఆర్ అండర్ అరెస్ట్ - చట్టవ్యతిరేకంగా యాంటీ థాట్ రీడింగ్ పరికరం కలిగి ఉన్నందుకు'.
నా కళ్లు బైర్లు కమ్మాయి. 'ఎలా తెలిసింది!?!', నేను షాక్ నుండి తేరుకునేలోపే సమాధానం లభించిందా ప్రశ్నకి.
'పోలీసుల్ని చూసి బోగీలో అందరూ భయపడ్డా నువ్వొక్కడివే ఏ భావాలూ బయటపడకుండా ఉండిపోవటం గమనించినప్పుడే అనుమానమొచ్చింది - నువ్వేదో పరికరం వాడుతున్నావని. బ్యాకప్ కోసం మెసేజ్ పంపటంతో, ఈ స్టేషన్ వచ్చేదాకా నిన్నరెస్టు చెయ్యకుండా ఆగాల్సొచ్చింది', వెనకనుండి నా ముందుకొస్తూ చెప్పాడు ఇందాక బోగీలో యువతిని అరెస్టు చేసిన పోలీసు అధికారి. అంతలో నన్ను చుట్టుముట్టింది స్టేషన్లో మఫ్టీలో ఉన్న నలుగురు బ్యాకప్ పోలుసుల బృందం.
(The End)
శరత్ గారూ ఇది ఏదో సంఘటనని చెపుతున్నట్టుగా వుంది తప్పించి కధలా అనిపించలేదెందుకో.ఇందులో లోపమేమిటో,ఎక్కువ తక్కువలేమిటో నాకు తెలీదు.చదివిన తరువాత నాకిలా అనిపించింది అంతే.సైన్స్ ఫిక్షన్ రాసేవారికి చాలా స్వేచ్చవుంటుంది.అది మీరు సద్వినియోగపరచుకోండి.
ReplyDelete@ రాధిక
ReplyDeleteఈ కథ ఫస్ట్ పర్సన్ లో వ్రాసినందువల్ల అలా అనిపించియుండవచ్చు. బ్లాగులు ఎలాగూ అలాగే వ్రాస్తాము కనుక కథలూ అలా వ్రాస్తే తేడా వుండదు. అందుకే తదుపరి కథను థర్డ్ పర్సన్లో వ్రాసాను. మీ సూచనలను దృష్టిలో వుంచుకుంటాను. ధన్యవాదములు.