కాస్కేడింగ్ ఎఫెక్ట్స్

లంచ్ బాక్సు లోకి చపాతీలు కానీ, అన్నం కానీ పెట్టలేదు అని నిన్న ఉదయం చెప్పింది మా ఆవిడ. చపాతీలు బూజు పట్టాయిట - అన్నం లేదుట. హుం. ఈ రోజు వృధా అనుకున్నాను నిన్న.

- పదకొండున్నరకి జిమ్ము చేయాలంటే పదింటికి అల్పాహారం తినాలి - రోజూ చపాతీ తినేవాడిని. కుదరలేదు. అల్పాహారం క్యాన్సిల్.

- రోజూ పదకొండున్నరకి జిమ్ముకెళ్ళే వాడినల్లా నిన్న ఆ సమయానికి బాగా ఆకలయి మా ఆఫీసు క్యాఫిటేరియాకి వెళ్ళాను. కేవలం 6$ లకే ఎన్నో రకాల అహార పదార్ధాలు ఎన్నో తినవచ్చు. ఎంచక్కా ఫుల్లుగా లాగించా. భుక్తాయాసం - జిం క్యాన్సిల్.

- రోజూ సాయంత్రం ఆఫీసునుండి ఇంటికి వెళ్ళే ముందు మరో చపాతీ స్నాక్ గా తినేవాడిని. అది కుదరలేదు కదా. ఇంటికి నకనకలాడుకుంటూ వెళ్ళి ఫుల్లుగా ఫుడ్డు లాగించాను. భుక్తాయాసం. అలసట. ప్రజాసేవ (నా వెబ్ సైట్ల నిర్వహణ) క్యాన్సిల్!

- ఈ రోజు డైటింగ్ సరిగ్గా చేయలేదనే విచారమోనేమో తలనొప్పి. ఇంకేముంది - తరువాత నిద్ర. ఎంచక్కా ముసుగుదన్ని పడుకున్నాను. మా పాప డ్యాన్స్ క్లాస్ క్యాన్సిల్.

పునాది సరిగ్గాలేకపోతే ఇల్లు ఎలా బావుంటుంది? ఇదీ అంతే. ప్రతి రోజుకీ కూడా పునాది గట్టిగా వుండాలి అనిపించింది. గత మూడు రోజులుగా జిమ్ములో కరిగించిన క్యాలరీల కన్నా ఎక్కువే తిన్నా మా ఆఫీసు క్యాఫిటేరియాలో అగుడుబడినట్లు ఒక్క సారికే - 6$ కి న్యాయం చేయాలని! అందుకని నా జీవితంలో ఒక రోజే క్యాన్సిల్ అయ్యింది.

3 comments:

  1. చూశారా. రేపటినుండీ ఏమేం చెయ్యకూడదో తెలిసిపోయింది మొదటిరోజే. ఇంకేంటి సగం పని జరిగినట్లే.

    ReplyDelete
  2. బాగా చెప్పారు :)

    ReplyDelete
  3. @భవాని
    పాజిటివ్ ఆటిట్యూడ్ తో రోజుని ప్రారంభించకపోతే ఎలాంటి ఎలాంటి కాస్కేడింగ్ ఎఫెక్ట్స్ వుంటాయో ఒక వ్యక్తిత్వపు వికాసపు క్లాసులో సోదాహరణంగా వివరించారు. ఆటిట్యూడే కాదు, ఫుడ్డు కూడా పాజిటివ్ గా వుండాలని తెలిసివచ్చింది. ఈ రోజు సవరించుకున్నాను.

    @తెరెసా
    :)

    ReplyDelete