ఇదో దిక్కుమాలిన పోస్ట్ - Don’t read :))

చాలా వరకు అనుకున్నట్టుగా జరుగుతున్నాయి కానీ ...డబ్బు విషయాల్లో మాత్రం ఇంకా కలిసిరావడం లేదు ఎందుకనో. నేను Law of Attraction నమ్ముతూ వుంటాను అని మీకు తెలిసిందే. నిజంగా జరుగుతుంటాయో లేక Selective Thinking వల్ల అలా అనిపిస్తుందో కానీ ఎన్నో ఎన్నెన్నో బహు చిత్రంగా కలిసివస్తున్నాయి. కానీ... ఒక్క సంపాదన విషయంలో మాత్రం కలిసిరాకపోగా - డబ్బు వెనక వెయ్యకపోగా...ముందు వెయ్యడం జరుగుతోంది. ఎందుకని చెప్మా?! సెలెక్టివ్ థింకింగ్ వల్ల అయినా కానీ అందులో కలిసి వస్తున్నట్లు కనీసం భ్రమ అయినా కలగాలి కదా. అదీ లేదు, పైగా ఎన్నో ఎన్నెన్నో ఖర్చులు, అవసరాలు మాత్రం అన్ని విధాలుగా బహు బాహ్గా కలిసివస్తున్నాయి. వా...! :(

నా మొఖం. నేను ఇలా ఆలోచిస్తూ వుంటే, ఇంట్లో వాళ్ళూ ఇంతకంటే దరిద్రంగా ఆలోచిస్తూ వుంటే ఇలాగే వుంటుంది లెండి. లెక్క ప్రకారం ఇలాంటి వ్రాతలు వ్రాయకూడదు కానీ ఎప్పటినుండో ఇది కూడా మీతో పంచుకోవాలనే దిక్కుమాలిన ఆలోచన వుంటోంది. ఆ పనేదో చేస్తేనన్నా పీడా వదుల్తుందేమోననీ ఇదీ వ్రాయడం!

All is well. Don't worry. అప్పుడప్పుడూ నా బ్లాగుని ఇలా నా మనోస్ఖలనం కోసం ఉపయోగించుకుంటూంటా అని మీకు తెలుసును కదా :)) సర్లెండి - ప్రతి కుక్కకీ ఓ సమయం వస్తుంది కదా. మనం చెయ్యాల్సిందెల్లా ఆ సమయాన్ని ఫీల్ అవుతూ ఆ సమయం కోసం వేచివుండటమే. మనం అనుకున్నది 'ఎలా?' అవిష్కారం అవుతుందీ అన్నది మన సమస్య కాదు - అది విశ్వ సమస్య! ఆ సమయం ఆసన్నమయినప్పుడు అలా అలా అలవోకగా, అద్భుతంగా అవిష్కారం అవుతాయి అన్నీనూ. కంగారేమీ లేదు మిత్రమా.

8 comments:

 1. మనోస్ఖలనం great does it mean mental orgasm?

  ReplyDelete
 2. మనం అనుకున్నది 'ఎలా?' అవిష్కారం అవుతుందీ అన్నది మన సమస్య కాదు - అది విశ్వ సమస్య!

  Supet Quote !

  ReplyDelete


 3. ఆవిష్కరించు నదెటుల
  నో విశ్వము తాను మన మనోరథము జిలే
  బీ విశ్వసమస్యౌ! లీ
  లావతి కాదు మనది విని లబ్ధిని పొందన్ !

  జిలేబి

  ReplyDelete
 4. Wishes Won't Bring Riches :) .. just kidding.. recently saw this book in library

  ReplyDelete
  Replies
  1. @ అజ్ఞాత

   హహ. సర్లెండి. మరెన్నో సిద్ధిస్తున్నాయి మరి. ఇవాల్టికివాళ ఒక గొప్ప విషయం చిత్రంగా సిద్ధించింది - దాని ప్రభావం నా జీవితకాలం వుంటుండొచ్చు - కాకపోతే బయటకి చెప్పుకోలేను అది ;)

   Delete
 5. @ కాళీదాసు
  అదే. ఏదో పదప్రయోగం చేసా లెండి. :))

  @ నీహారిక
  కదా.

  @ జిలేబీ
  నాకు పద్యాలు అంతగా ఎక్కవు. అంతగా అర్ధం కాలా కానీ మంచి మాటే చెప్పినట్లున్నారు. ధన్యవాదాలు.

  ReplyDelete
 6. గుర్రూజి... లక్ష్మికోసం మీరు వెళ్తున్న దారి తప్పేమో ?.. లక్ష్మికి రూపం నోట్లు కావు కదా.. భూములు, బంగళాలు, కార్లు, ప్రోడక్టులూ.. మీరు అటువైపు నుండి కోరుకొండి..తథాస్తు అంటది లోకం.. మన తెలంగాణ వాళ్ళు కల్మషం లేనోళ్ళు..వాళ్ళకి ఇట్ల కోరుకుంటె అట్ల అయిపోతయ్.. అయినా మీ అక్యూర కారు భాగ్యం ఎలా జరిగిందో చెప్పలేదు.. ఇంకో చిత్రం అన్నరు హేమిటి..

  ReplyDelete
 7. This website was... how do I say it? Relevant!! Finally I have found something which
  helped me. Kudos!

  ReplyDelete