చీప్ అండ్ బెస్ట్ ఆశ్రమాలు సూచించండి

APలో కానీ ఇండియాలో కానీ చక్కని ప్రశాంతమయిన వాతావరణంలో వుండే ఆశ్రమం ఎక్కడుంది? స్వామి సత్యానందాశ్రమం లాంటి బాగా డబ్బులు గుంజే అశ్రమాలు నాకు చెప్పకండి బాబో. ఇదంతా ఎందుకు అని అడక్కండి. అది నా ప్లాన్ C లెండి.  ఏదో నా లెవలుకి తగ్గట్టుగా చవక అయిన ఆశ్రమాలు మీకు తెలిస్తే చెప్పండి. 

21 comments:

 1. If you are sincere aspirant no ashram charges any money. For example Ramakrishna math, Sivananda AShram in Rishikesh. But if you want a weekend getaway or have temporary insanity, do not even think about these. They wont admit people on a whim and also over 30 RKmath does not admit (to my knowledge) unless you have a special recommendation from another senior swamiji

  ReplyDelete
 2. @ DG
  మీ క్విక్ రెస్పాన్స్ కి ధన్యవాదాలు. మరి నాది పర్మినెంట్ ఇన్సానిటీ :)) అంత పెద్ద మఠాలు నేను భరించలేనులెండి. వెళ్ళాలనుకునేదే ఒత్తిడి తగ్గించుకోవడానికి. నియమ నిబంధనలతో పెనం మీది నుండి పొయ్యిలో పడటానికి కాదు. అలాంటి విశిష్టమయిన మఠాల్లో వుండే ప్రయోజనాలూ వుంటయ్ కానీ అవి నాకు మాత్రం సరిపడవు లెండి.

  నాకో మంచి లింకు దొరికింది. అది చదువుతున్నా.
  http://www.indiamike.com/india/yoga-spirituality-and-religion-in-india-f54/ashram-in-rishikesh-t54554/

  ReplyDelete
 3. గురువుగారు, నేను మిసిసిప్పీ లో ఒక ఇస్కాన్ గుడికి పోయిన.. అడవిలో పండ్ల చెట్లూ, తోట మధ్యలో చిన్న గుడి, తెల్లాయన పూజారి, అందరూ ఉండటానికి ఒక బిల్డింగూ... ఆ రోజు మాత్రం మళ్ళీ-పల్లె అనిపించింది.

  ReplyDelete
 4. నిత్యానంద ఆశ్రమం చాలా చీప్ అండ్ బెస్టు సర్. ఒత్తిడి ఇట్టే మటుమాయం అవుతుందట

  ReplyDelete
 5. గురువు గారు..మీరు జిడ్డు కృష్ణమూర్తి ని చదవాలని కోరుతున్నా.. చదవమంటే.. పుస్తకాలు కాదు.. ఆర్టికల్స్.. ఆయన మన ప్రశ్న కి మనతోనే సమాధానం చెప్పిస్తాడు.. లెట్స్ ఫైండ్ అవుట్ అంటడు.. మీరు మీ ప్రొఫైల్లో జిడ్డు కి అభిమానిని అని కూడా రాస్తారని నా నమ్మకం..

  ReplyDelete
 6. అన్యా !
  మనోడు నిత్యానంద మీలాంటివాల్లు ముమ్దుకొచ్చి నిర్వహించుకుంటే ఉచితంగాఆ శ్రమాలిచ్చెస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చేత్తన్నాడు .ఓ టెండర్ పడెయ్యరాదూ............

  ReplyDelete
 7. what about osho ashram ?

  ReplyDelete
 8. @నియమ నిబంధనలతో పెనం మీది నుండి పొయ్యిలో పడటానికి కాదు.....హాహాహ్హా...ఈవిడ సరిపోదా....నియమ నిబందనలకి...ఆశ్ర మాలకే వెళ్ళాలా??

  ReplyDelete
 9. @ కాయ
  మీరు చెప్పిన గుడి ఫోటోలు చూసాను. చాలా బావున్నాయి. సాధారణంగా ఇక్కడి గుళ్లలో, ఆశ్రమాలలో వుండాలంటే డబ్బులు బాగానే అవుతాయి. మరి అక్కడి పరిస్థితి ఏంటి?

  జిడ్డు క్రిష్ణమూర్తి మా నాన్నగారి అభిమాన తత్వవేత్త. నన్నగారి స్టడీ రూములో వారి చిత్రం పెద్దది ఒకటి ఎదురుగా వుండేది. నేనూ వారి రచనలు చాలా సార్లు ప్రయత్నించాను కానీ కొరుకుడు పడక వదిలేసాను.

  @ అజ్ఞాత @ 2 మే 2013 11:44 AM
  ఒక ఒత్తిడి పోయినా ఇంకో ఒత్తిడి వుంటుంది కదా!

  ReplyDelete
 10. @ అజ్ఞాత
  అలాంటి ఆశ్రమం నేను పెడితే నా ఇమేజ్ ఏం గావాలా? అలా కాదు కాని ఒకరిని అనుకరించడం ఎందుకుగానీ మనమే మన బ్రాండ్ నేం తోనే ముందు ముందు పెట్టేద్దామేం. అందుకే ట్రైనింగ్ కోసం చూస్తున్నా :))

  @ అజ్ఞాత
  ఓషో ఆశ్రమాలు బాగా డబ్బులున్నవారికండీ బాబూ.

  @ kvsv
  ఈవిడ??

  ReplyDelete
 11. అంటే... మనం ఒక వీకెండు ఒక మధ్యాహ్నం పోయి ఉచిత మధ్యహ్న భోజన పథకం కింద తిని ఒక పది రూపాయలు సమర్పించి వచ్చాను.. అప్పట్లో ఓషో నరనరానా జీర్ణించుకుని ఇదో పిచ్చి అని ..చుట్టూ అంత అందం ఉన్నా..లైట్ తీస్కున్నా.. విషయం తెలుసుకోలే.. తెలుసుకుంటా..చెప్తా..

  ReplyDelete
 12. మీ "చీప్ అండ్ బెస్ట్ ఆశ్రమాలు సూచించండి" పోస్ట్‌పై అజ్ఞాత క్రొత్త వ్యాఖ్యను ఉంచారు:

  [Edit] ? Looks like life came around full circle!!

  ReplyDelete
 13. సర్లెండి. ఈ దురద నాకు ఎప్పటినుండో వున్నదే. కాకపోతే దానికి కాలం, ఖర్మం కలిసి రాలేదు. పెళ్లికి ముందే పుట్టపర్తికి వెళతానంటే బస్సుస్టాండు నుండి మా ఫ్రెండ్ లాక్కొచ్చాడు. ఆ తరువాత ఆశ్రమ జీవనంలోకి వెళ్దామనుకుంటే ఓ అమ్మాయి ప్రేమలో దింపింది. ఆ తరువాత అంటే పెళ్ళయ్యింది. ఆ తరువాత పిల్లలయ్యారు. వీటన్నింటితో నేనయిపోయాను.

  ReplyDelete
 14. అబ్బాయి శరత్తు,

  పెండ్లాము, బిడ్డలను 'ఇండియా' కి తోలేసిన , మీ ఇల్లే 'సేపు' బెష్టు' ఆశ్రమము గా మారి పోవును !!

  గృహమే అందాల బృందావనం!! పెండ్లామూ, బిడ్డలూ ఊరెళ్ళిన అదే బెష్టు ఆశ్రమము !!


  జిలేబి

  ReplyDelete
 15. ఈవిడ అంటే....ఇంట్లో పెళ్ళాం గారు...
  వీళ్ల రిస్ట్ర్క్షన్స్ చాలూ...అని నా అర్ధం...
  బయట కూడా మళ్ళీ నియమ నిబంధనలా అనీ!!

  ReplyDelete
 16. @ జిలేబీ
  వాళ్లని ఇక్కడే ఉంచేసి నేనొక్కడినే ఇండియాకి ట్రిప్ కి వచ్చేసేననుకోండీ స్వామి కార్యమూ, స్వకార్యమూ రెండూ తీరుతాయి కదా. అప్పుడు ఇండియా అంతా ఆశ్రమమే నాకూ.

  @ kvsv
  ఓక్కెక్కే

  ReplyDelete
 17. If you look into http://www.arshavidya.org/, they have many summer/weekend programs. It's a very nice place and its located in Saylorsburg, PA which is close to Philadelphia.

  ReplyDelete
 18. blog lo sandadi pothundandi. pl velloddu

  ReplyDelete
 19. @ అజ్ఞాత 3 మే 2013 3:17 PM
  అది మాకు 12 గంటల దూరం లెండి.

  @ అజ్ఞాత 5 మే 2013 7:18 PM
  నేను ఇప్పుడే మూటా, ముల్లె సర్దుకొని వెళ్ళిపోవడం లేదు లెండి. అది జస్ట్ బ్యాకప్ ప్లాన్ అంతే.

  అయినా బ్లాగుల్లో నేను గాని, మరి ఎవరైనా గానీ సందడి చేయ్యడం లేదు లెండి. బ్లాగులన్నీ 'వృద్ధ నారీ పతివ్రతలు' అయిపోయినట్లున్నాయి. హడావిడి అంతా G ప్లస్సులోకి పారిపోయినట్లుంది.

  ReplyDelete
 20. Try Pyramid Valley at Bangalore. It's cheap and best. And also Kadthal pyramid.

  ReplyDelete
 21. @ అజ్ఞాత
  ఇప్పుడు ఆశ్రమాల మీద ఆసక్తి తగ్గిందండీ. ఇంట్లోనే దేవతారాధన చేస్తున్నాను :) మళ్ళీ ఆశ్రమాల మీద ఆసక్తి వచ్చినప్పుడు చూస్తాను. ధన్యవాదాలు.

  ReplyDelete