రెండోసారి - తప్పు చేద్దాం రండి

...అనగా తప్పు చేద్దాం రండి అనే పుస్తకం రెండో సారి చదువుతున్నానన్నమాట. అదేదో బూతు పుస్తకం కాదండోయ్ - యండమూరి వ్యక్తిత్వ వికాస పుస్తకం. తెలుగు పుస్తకం కాబట్టి అదీ రెండో సారి కాబట్టి ఎక్కడెక్కడ  నస వుందో తెలుసు కాబట్టి తొందరగానే సాగిపోతూవుంది. వారి వ్యక్తిత్వ పుస్తకాలు వేరే ఏమీ చదవలేదు. విజయానికి అయిదు మెట్లు ఎవరింట్లోనో కనపడితే కాస్సేపు తిరగేసాను. నాకు గుర్తున్నంత వరకు దీనితో పోలిస్తే అదే బావుంది. ఇందులో కొంత అతి, సుత్తి, నస వున్నాయనిపిస్తోంది. ఆయన గారి పుస్తకాల్లో ఎలాగూ ఆణిముత్యాలు వుంటాయనుకోండీ కానీ ఈ పుస్తకం సగం మాత్రమే నచ్చింది. మిగతా అంతా సోదే నా దృష్టిలో.

ఇది ఛేంజ్ మేనేజ్మెంట్ గురించి వ్రాసిన పుస్తకం. మార్పు అనేది మన వాళ్లలో చాలా తక్కువ. ఎల్లప్పుడూ బూజు పట్టిన భావాలను, పద్ధతులను పట్టుకొని వ్రేలాడుతూ వుంటారు. అలాంటి వారు ఇలాంటివి చదివి మార్పు చెందితే బాగానే వుంటుంది... కానీ మనం ఇలాంటి పుస్తకాలను కూడా నవలల్లాగా సంతోషంగా చదివి పడేస్తామే.  నా మనస్సుకి కూడా ఈ మధ్య కాస్తంత బూజు పట్టింది. అందుకే కాస్త ఇలాంటి పుస్తకాలను తిరగేస్తున్నాను. కొత్త ఉత్సాహం నింపుతున్నాను. కొత్త యుద్ధాలకు సన్నద్ధం అవుతున్నాను. 

విజయాలు సాధించేవారందరూ ఇలాంటి పుస్తకలు చదివే అవి సాధిస్తారని కాదు గానీ వారిలో స్వతస్సిద్ధంగా ఆ లక్షణాలు అలవడతాయి. అంతటి దృశ్యం లేని నాలాంటి వారు ఇలాంటివి చదివి, అమల్లో పెట్టి అయినా మార్పు చెందాలి మరి.  ఇలాంటి పుస్తకాలు చదవడం వల్ల నాలో గొప్ప మార్పులు రాకపోయినా, నేను గొప్ప విజయాలు సాధించకపోయినా కూడా చాలా చిన్న చిన్న మార్పులకి, చిన్న చిన్న విజయాలకి ఇలాంటి సెల్ఫ్ హెల్ప్ పుస్తకాలు ఎంతో దోహదం చేసాయి. 

ఒక్క ఉదాహరణ చెబుతాను. డేల్ కార్నెగీ పుస్తకం హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇంఫ్లుయెన్స్ పీపుల్ చదవక ముందు నేనో పెద్ద సోది గాడిని. ఎలా అంటే ఎలానయితే నా బ్లాగులో అస్తమానమూ నా గురించి వ్రాస్తుంటానో అలానే వాగేవాడిని. అది చదివాక అలా మన గురించి మనం అస్తమానం సుత్తి వెయ్యడం ఎంత పొరపాటో తెలిసివచ్చింది. నా నోరు చాలా వరకు పడిపోయింది. కర్ణ రంధ్రాలు విశాలం అయ్యాయి. అనగా ఎక్కువగా వినడం మొదలెట్టాను. అందుకే ఎవరయినా కలిసినప్పుడు ఎక్కువగా వింటూ వుంటాను. అవతలి వారిని తమ గురించి చెప్పడానికి ప్రోత్సహిస్తుంటాను. వారి వివరాలు, ఆసక్తులూ కనుక్కుంటాను. నా గురించి అడిగితే కానీ పెద్దగా చెప్పను.  

తప్పు చేద్దాం రండి మీరూ చదివినట్లయితే దాని మీద మీ అభిప్రాయాలని ఇక్కడ పంచుకోండి.

4 comments:

  1. Annai ekkado tagilindhi and I think nenu kooda pusthakam chadavali. Urgent ga amazon lo order chesanu.

    ReplyDelete
  2. OFCOURSE కానీ మీ గురించి మీరు డబ్బా వాయిన్చుకోకపోతే జనాలకి ఎలా తెలుస్తుంది చెప్పండి . మీకైతే పెద్ద గా భజన సంఘాలు కూడా లేవల్లె వుంది ..ఏమంటారు?

    ReplyDelete
  3. @ అజ్ఞాత
    మంచిది :) హౌ టు విన్...పుస్తకం చదవడానికి కూడా సరళంగా, సరదాగానూ వుంటుంది.

    @ అజ్ఞాత
    నా గురించి భజన చెయ్యడానికి ఏముంది చెప్పండి?

    ReplyDelete
  4. sarat bhai, admire your wit always !

    ReplyDelete