నాకు నచ్చిన ఓ టూకీగా టపా - 1

http://tukiga.blogspot.com/2011/07/blog-post_27.html

పై టపా చదివి నిన్న అక్కడ కామెంట్ వెద్దామని చాలా కష్టపడ్డా కానీ ఎందువల్లో నా సిస్టంలో కామెంట్లు వెయ్యాలంటే చాలా సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. నా బ్లాగులో అయితే ఓకే. ఇంకో బ్రవుజర్ డవున్లోడ్ చేసుకోవాలేమో కానీ అది తరువాత చూద్దాం. మొన్న భారారే బ్లాగులో కూడా కామెంటు వెయ్యాలని చాలా కష్టపడి లాభం లేక వదిలేసాను. అందువల్ల అయితేనేమీ, ఇంకాస్త విపులంగా చర్చిద్దామని అయితేనేమీ ఆ టపా గురించి ప్రత్యేకంగా ఓ టపా వేస్తున్నాను.

ఆ పోస్టులోని ఆలోచనలే నాలోనూ ఈమధ్య పరిభ్రమిస్తున్నాయి కాబట్టీ అందులోని విషయంతో ఐడెంటిఫై చేసుకోగలిగాను. అవును, మనం అనుకున్నవన్నీ సాధించలేము. అలా సాధించుకుంటూపోతే ఇంకేమన్నా వుందా సూపర్‌మ్యానులం అయిపోమూ. అందుకేనేమో ఏ అతి కొద్దిమందికో తప్ప అనుకున్నవన్నీ జరుగవు. అలా జరగకపొవడానికి ఎన్నో కారణాలు వుంటాయి కానీ మనం విల్ పవర్ గురించి మాత్రం ఇప్పుడు మాట్లాడుకుందాం. మనం ఏవయినా సాధించాలంటే ముఖ్యంగా మనలో ఆత్మబలం వుండాలి. అదొక్కటే కూడా సరిపోదనుకొండి దానితో పాటు అదనంగా ఇంకా చాలా వుండాలి కూడానూ కానీ మనం ఇప్పుడు ముఖ్యంగా దానిపైనే ఫోకస్ చేద్దాం. అప్పుడప్పుడు ఇలాంటివేమీ లేకుండానే ఎంచక్కా అవకాశాలు కలిసివచ్చి అనుకున్నవన్నీ జరిగిపోతుంటాయి. జీవితం అనే పేకాటలో కొందరికి కార్డులు అలా కలిసివస్తుంటాయి. పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లెక్కల సూత్రాల ప్రకారం అన్నీ కలిసివచ్చే కొందరి గురించి కాకుండా సాధారణమయిన వారి గురించి ఆలోచిద్దాం. 

ఆ టపాలో జలసూత్రం చంద్రశేఖర్ గారు చక్కని సందేహం వ్యక్తపరిచారు. వారి సందేహాన్ని ఎవరయినా పట్టించుకున్నవారు వున్నారా అని ఎవరయినా కామెంట్లు వెస్తారేమో అని చూసాను కానీ ఎవరూ అంత ఉత్సాహం చూపలేదు. ఎన్నోసార్లు ఇలాంటి మంచి టపాలు అలా మరుగునపడిపోతుంటాయి.

ఇంకా వుంది. అది మరో భాగంలో. ఈలోగా ఈ క్రింది వ్యాసం కూడా చదివెయ్యండి:

4 comments:

 1. కరెక్ట్. కొన్ని నిజాలు చదవడానికి చాలా బాగుంటాయి ..

  ReplyDelete
 2. ఈ టపాను డ్రాఫ్టుగా సేవ్ చేసినందువల్ల పబ్లిక్ కు అందుబాటులో లేకుండా అయ్యింది. మళ్ళీ పబ్లిష్ చేసాను.

  @ఎటుజెడ్
  :)

  ReplyDelete
 3. ఎవరూ లేరనకండి. నేనున్నాను.

  తప్పో, ఒప్పో, టూకీగా కు విపులంగా నాకు తోచింది వ్రాశాను.

  నాగస్వరం.

  ReplyDelete
 4. @ నాగస్వరం
  ఎంత వివరంగా మీరు చెప్పారండీ అక్కడ! సంతోషం. అయితే వారి టపాలోని అసలు పాయింటు మిస్సయ్యారు అనుకుంటున్నా. పట్టుదల, ఆత్మబలం గురించి వారికి తెలుసు - అందుకోసం శ్రమిస్తున్నారు కానీ అవి ఎందుకు వుండటం లేదు అనేది వారి ప్రశ్న అనుకుంటున్నాను. నా అభిప్రాయం ఈ టపా రెండవ భాగంలో వుంటుంది.

  ReplyDelete