పలు రకాల బ్లాగర్ల పాత్రలు - చిన్న పాత్రధారులు, జూనియర్ ఆర్టిస్టులూ, అభిమానులు

(తెలుగులో బ్లాగింగు పుస్తకం కోసం)


చిన్న పాత్ర ధారులు: వీరి గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ వుండదు కాబట్టి చిన్నగానే చెప్పుకుందాం. వీరు అప్పుడప్పుడు తళుక్కున మెరిసిపోతుంటారు. వీరు కష్టపడి కొన్ని పోస్టులు వ్రాసి మళ్ళీ పత్తా లేకుండా పొతుంటారు. మళ్ళీ మూడ్ వచ్చినప్పుడు వచ్చి మళ్ళీ ఒకటో రెండో టపాలు జనాల మీదికి విదిలించి వెళుతుంటారు. ఇంకొందరయితే అత్యాశకు పోతారేమో కానీ డజన్ల కొద్దీ బ్లాగులు అయితే తెరుస్తారు కానీ వ్రాసేది మాత్రం వాటిల్లో ఒకటో, రెండో పోస్టులు వుంటాయి. వీరు తరచుగా వ్రాస్తూపోరు కాబట్టి వీరు తెలుగు బ్లాగావరణంపై చూపే ప్రభావం పెద్దగా వుండదు.

జూనియర్ మరియు ఎక్ష్ట్రా ఆర్టిస్టులు: వీళ్ళు హీరో వెనకాలో లేక విలన్ల వెనకాలో కష్టకష్టంగా కనపడుతుంటారు. లేకపొటే అక్కడక్కడా పాసింగులోనో, గుంపులో గోవిందయ్యలుగానో కనపడుతుంటారు. వీళ్లకి ఒక ఐడెంటిటీ వుండదు.  వారికి ఆవేశం వచ్చినప్పుడు బ్లాగు మొదలుపెట్టి ఒకటి రెండు పోస్టులు వ్రాసి మూసుకుంటారు. కొంతమంది అలా ఓ టపా వ్రాసి ఇలా మాయమయిపోతుంటారు. వీళ్ళు వ్రాసేది కూడా ఒకటీ లేదా రెండూ పేరాలుంటాయంతే.  వాళ్ళకి ఆ మాత్రం వ్రాయడమే ఎక్కువెక్కువ అనుకుంటారల్లేవుంది. వీళ్లంతా కూడా ఇంకా తరచుగా వ్రాస్తుంటే బావుంటుంది. వీళ్ళకి రెండు మూడు టపాలు వ్రాయగానే బ్లాగు వైరాగ్యం టపటపా మీదపడిపోతుందేమో తెలియదు కానీ ఇలా వచ్చి అలా అదృశ్యం అయిపొతుంటారు. మీరు మరీ  అలా అంతర్ధానం అయిపోకుండా చూసుకోండి. వీలయినంతవరకు వ్రాస్తూనే వుండండి. 

అభిమానులు: సినిమాలన్నాక ఫ్యాన్స్ గురించి చెప్పుకోకుండా వదిలేస్తే బావుండదు కదా. మిగతా బ్లాగర్లు కానీ లేదా బ్లాగులు వ్రాయకుండా కేవలం బ్లాగులు చదివేవారు కానీ బ్లాగాభిమానులుగా వుండొచ్చు. మీరు ఎకాఎకి బ్లాగు మొదలెట్టెయ్యకుండా బ్లాగు అగ్రిగేటర్లలో పలు బ్లాగులు చూస్తూ మీకు నచ్చిన కొన్నింటిని అభిమానిస్తూ వాటి పోస్టులకు కామెంట్ల ద్వారా స్పందిస్తూ కొంతకాలం గడపండి. అందువల్ల బ్లాగావరణంపై మీకు ఓ ఐడియా వస్తుంది.

మీరు బ్లాగు మొదలెట్టాక మీకూ బ్లాగాభిమానులు తయారవచ్చు. అబిమానించేవారుండటం ఎవరికయినా సరే ఆనందాన్ని ఇస్తుంది కదా. సంతోషం. అయితే ఇక్కడో ఇబ్బంది వుంది. ఈ అబిమానజనం వల్ల మీకో ఇమేజ్ వుందని అర్ధమవుతుంది. ఆ ఇమేజ్ ఏంటనేది కూడా అర్ధమవుతుంది. ఆ తరువాత ఆ ఇమేజ్ నుండి దూరం అవడం మీకు కష్టం అవుతుంది. అలా అలా మీ ఇమేజ్ చట్రంలో మీరే కూరుకుపోయే అగత్యం ఏర్పడుతుంది. మీ ఇమేజికి భిన్నంగా వ్రాస్తే మా అభిమానులు ఒప్పుకోకపోవచ్చు. అంచేత ఇమేజ్ చట్రంలో కొరుకుపోకుండా జాగ్రత్ర వహించండి. అయితే కామెంట్లు వ్రాసే వారందరూ మీ అభిమానులని అనుకోకండి. ఎగస్పార్టీ అభిమనులూ మీ బ్లాగులో వ్యాఖ్యలు వ్రాస్తారు. ఎలా వ్రాస్తారనేది మీరు ఊహించుకోవచ్చు. అప్పుడు మీకు బ్లాగు వైరాగ్యం కలిగితే తప్పు మీది కాదు.

అభిమానులకోసం వ్రాస్తూ వెళుతున్నారనుకోండి - మీరు వ్రాయదలుచుకున్నది మీరు వ్రాయలేరు. మీ అభిమానుల మనోభావాలు ఇబ్బంది పడిపోతాయని వర్రీ అవుతారు. ఎప్పుడయితే మన భావాల గురించి కాకుండా ఇతరుల భావాలను దృష్టిలో పెట్టుకొని వ్రాయడం మొదలవుతుందో అప్పటి నుండి మీ బ్లాగు కల్తీ అవడం మొదలయినట్లేనని గ్రహించండి. అందుచేత అభిమానుల హద్దుల్లో మీరు వుండకుండా మీ హద్దుల్లో మీరు వుండండి. అలాగే మీకు నచ్చే బ్లాగులకి మీరూ చక్కని అభిమానులయిపొండి.

ప్రతి ఒక్క బ్లాగరు పైన నేను చెప్పిన వర్గీకరణల్లోకి వస్తారని అనుకోలేము. కొందరు రెండు మూడు రకాల పాత్రలు పోషించగలరు. కొందరు అపరిచిత బ్లాగర్లు వుంటారు. ఒక పాత్రకి తెలియకకుండా మరి కొన్ని పాత్రలని అవలీలగా పొషించగలరు. మరికొందరు కాలక్రమేణా పాత్రలు మారుస్తుంటారు. మరికొందరు బహిరంగంగా మర్యాదా పురుషోత్తం రాం లాగా వుండవచ్చు కానీ అజ్ఞాతంగా మీమీద ఎన్నయినా ఛండాలమయిన వ్యాఖ్యలు చేయవచ్చు.

సరే, బ్లాగు సినిమాలోని పాత్రలు కొన్ని చూసారు కదా. మరి మీ పాత్ర ఏంటో, దాని స్వభావం ఏంటో నిర్ణయించుకోండిక. మీరు విలన్ పాత్రలు పోషించదలుకుంటే అక్కడే ఆగిపొండి. ఇక్కడ చాలామందిమి వున్నాం. మళ్ళీ మీరు అవసరం లేదు.

14 comments:

 1. ఏంటి గురువు గారు.. అభిమానులని అలా తీసి పారేసారు.. గుడ్డిగా ఫాలో అయ్యేవాళ్ళు అభిమానుల లెక్క లోకి ఎట్లా వస్తారు.. నేనైతే... నచ్చితే ఎత్తుకోవటం, లేకపోతే ఎత్తి పడేయటం కూడా చేస్తున్నా కదా..
  అయినా..అవున్లెండి... అభిమానులకి కొంచెం చనువు ఇస్తే చిరంజీవులనూ, బాలకృష్ణ లనూ తయారు చేస్తారు..(పొగడట్లేదు.....మతి స్థిమితం లేకుండా చేస్తారు అంటున్నా)...

  ReplyDelete
 2. శరత్ అన్నయ్యా
  మేం ఇల్లు మారాం , నా కంప్యూటర్ మా నాన్నగారికి ఇచ్చేసా, ఇప్పుడు నాకు కంప్యూటర్ లేదు
  సంకలిని లో వచ్చే అన్ని బ్లాగులు ఆఫీసు లో నుంచీ చదువుతున్నా,
  ఈ వారం/నెల లో లాప్ టాప్ కొనుక్కుంటా
  అప్పుడు కుమ్మేస్తా
  - అప్పు భాయి(భుజాలు తడుముకుంటూ)

  ReplyDelete
 3. మీరు చెప్పే విషయాలు చాలా వరకూ నిజమే అయినా.. బ్లాగ్ మొదలు పెట్టేవారు ఇవన్నీ చదివి మొదలు పెడితే ఏదో యుద్ధ భూమి లోనో, లేక వరల్డ్ కప్ ఓపెనింగ్ సేరెమనీ లో వాళ్ల పర్ఫార్మన్స్ కి వెళ్తున్నట్టు అనిపిస్తుందేమో?

  ఒక బ్లాగ్ మొదలు పెట్టటానికి కావలసినవి (నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

  ౧. సాంకేతిక అవసరాలు
  ౨. ఏం చెప్పదలచుకున్నారో ఒక నిర్దుష్ట మైన అభిప్రాయం కలిగి ఉండటం.
  ౩. సంకలునులు వాటినెలా ఉపయోగించుకోవాలో తెలిసి ఉండటం.
  ౪. మీరన్నట్టు అంతా పూదోట కాదు, కొన్ని బేధాభిప్రాయాలు వచ్చినప్పుడో లేక సర్వదా ఆమోదనీయమైన సంగతులు కాకుండా రాసినప్పుడు సామూహికం గా కానీ లేక అజ్ఞాతల రూపం లో వ్యాఖ్యల తో దాడులు జరిగే అవకాశం ఉంది కాబట్టి మానసిక స్థైర్యం కలిగి ఉండటం.

  మిగిలిన విషయాలు మీరు రాస్తున్నవి నాకైతే good read. I am enjoying this series, having spent an year+ in blogs. కానీ బ్లాగ్ మొదలు పెట్టేముందు చూసుంటే.. 'అమ్మో ఎందుకు లె ..' అని వదిలేసి ఉండేదాన్నేమో..

  ReplyDelete
 4. అలాగే.. మీ కామెంటర్ సిరీస్ కూడా దీంట్లో జత చేయండి. :)

  ReplyDelete
 5. " ఇవన్నీ చదివి మొదలు పెడితే ఏదో యుద్ధ భూమి లోనో, లేక వరల్డ్ కప్ ఓపెనింగ్ సేరెమనీ లో వాళ్ల పర్ఫార్మన్స్ కి వెళ్తున్నట్టు అనిపిస్తుందేమో?"

  :-D

  ReplyDelete
 6. @ కాయ
  క్లుప్తంగా వ్రాసినప్పుడు చాలా విషయాలని ప్రస్థావించలేము. అందుకే అభిమానుల గురించి సవివరంగా వ్రాయలేకపోయాను.
  @ అప్పి
  :)
  @ క్రిష్ణప్రియ
  బ్లాగర్ల పాత్రలు అనే సిరీస్ మాత్రమే పూర్తయ్యిందండీ - పుస్తకం కాదు. ఇంకా ఎంతో వ్రాయాల్సివుంది. ఈ సిరీస్ పుస్తకంలో వెనకెక్కడో వుటుంది. ఈ సిరీస్ ఒక్కటే చదివితే మీరు అన్న అభిప్రాయానికే వచ్చేస్తారు కానీ అలా వుండబోదు. పుస్తకం ఒక క్రమపద్ధతిలో వ్రాయడం లేదు. తోచినట్లుగా వ్రాస్తున్నాను. ప్రచురించేటప్పుడు క్రమపద్ధతిలో పేరుస్తాను. పైగా నేను మీముందు పెడుతున్నది డ్రాఫ్ట్ మాత్రమే కాబట్టి మీలాంటి వారి సూచనలను అనుసరించి చాలా రిఫైన్ చేస్తాను. ఒహవేళ నేను అతిగా వెళ్ళినా పుస్తకంలో మీ వ్యాఖ్యల్లాంటి ముఖ్యమయిన వ్యాఖ్యలు కూడా పొందుపరుస్తాను కాబట్టి బ్యాలన్స్ అయిపోతుంది. మీ అభిప్రాయాలు వివరంగా తెలిపినందుకు సంతోషంగా వుంది.

  నా కామెంటల్ టపాల సిరీస్ తో బాటుగా "అక్కడే ఆగిన ఆడ లేడీ బ్లాగర్లు" సిరీస్ కూడా పొందుపరుస్తాను. నా ఆలోచనకు తగ్గట్టే మీ సూచన వుండటంతో ఆశ్చర్యం అనిపించింది.

  ReplyDelete
 7. ఆడ బ్లాగర్ల సిరీస్ as it is ప్రచురిస్తే .. I am not sure. ఎడిట్ చేస్తే గుడ్ రీడ్ ఆవ వచ్చు కానీ కొన్ని పదజాలాలు, అలాగే కొన్ని అసంప్షన్లు చదువరులకి ఇబ్బంది కరం గా, హర్టింగ్ గా ఉన్నాయి.

  ఎక్కడ ఆగిపోయారో చెప్పండి..తప్పులేదు. కానీ ... :)

  (ఇది కూడా నాకు నిజం గా అనిపించింది కాబట్టి, మీరు అభిప్రాయాలు చెప్పమన్నారని చెప్తున్నాను.)

  ఆడ అవనీ, మగ అవనీ.. ఎవరికైనా ఒక పబ్లిక్ ఫోరం లో ఎంతవరకూ తమ గురించి మాట్లాడ దలచుకున్నారో నిర్ణయించుకునే హక్కు ఉంటుంది కదా? ఎన్నో కారణాల వల్ల ఆడవారికి సహజం గా జంకు/భయం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది కదండీ?

  మీరైనా.. ఈ మధ్య రూట్ మార్చి కొన్ని విషయాలు రాయటం మానేశారు కదా?

  మీ ఉద్దేశ్యం మంచిదయ్యున్దవచ్చేమో కానీ ఈ సిరీస్ లో మీరు ఈ జంకు ని, వ్యక్తిగత విషయాలు పంచుకోక పోవటాన్ని ఎద్దేవా చేసినట్టు అనిపించింది.

  నేను కొత్తగా ఇక్కడ చెప్పింది ఏదీ లేదు. చాలా మంది ప్రతిస్పందనలు మీరు ముందే చూసారు కదా. అప్పుడు చెప్పలేదు. Anyways..

  ReplyDelete
 8. ఇమేజ్ కి వ్యాఖ్యాతలు కూడా అతీతులు కాదు. ఎప్పుడూ అవే బోరి౦గ్ వ్యాఖ్యలు చూస్తూ ఉ౦టాము.ఉత్తమ వ్యాఖ్యాతల కేటగిరి లో ము౦దు వీరి పేర్లు తప్పకు౦డా ఉ౦టాయి. వీళ్ళని బ్రహ్మానందం ,సునీల్ తో పోల్చవచ్చు.వీళ్ళు లేని చిత్రం (టపా ) ఉ౦డదు. చక్కగా అలరిస్తూ బ్లాగుల్లో ఆల్ హాప్పీస్ అన్న భావనను పె౦చుతూ ఉ౦టారు . అపరిచిత బ్లాగరుల గురి౦చి ఇ౦కొ౦త వివర౦గ వ్రాస్తే మ౦చిది. చిర౦జీవి ,బాలకృష్ణలు ఉ౦టే నే కదా స౦దడి.ఇమేజ్ చట్రం సినిమాలంత బ్లాగుల్లో లేదు. అ౦టే అభిమానులు వల్ల చెడిపోయి చెత్త వ్రాస్తున్నవారు ఉ౦డరు. బేసిగ్గా వాళ్ళేం రాయలనుకోన్నారో అవే వ్రాస్తారు.

  పైన కృష్ణప్రియ గారి అభిప్రాయం తో విభేదిస్తున్నాను. ఇలా౦టి వ్యాసాలు కొత్తవారిని పెద్దగా భయ పెట్టవు. అజ్ఞాత లగురి౦చి ప్రత్యేకమైన వ్యాసం ఇస్తున్నారా ?

  ReplyDelete
 9. Annay.....Motham book loni information leak avuthundemo....ila chesthe ika book everu kontaru annay...

  ReplyDelete
 10. Telugu Blogger la leader Sarath gaariki JAI... OK naa... idegaa meekkaavalasindi...

  ReplyDelete
 11. అక్కడే ఆగిపోయారు అని మీరన్నారు. ఆడబ్లాగర్లు వ్రాస్తున్న టపాలపై మీ వ్యాఖ్య లు పర్వాలేదు. కాని వ్రాయని వాటిగురి౦చి ఎ౦దుకు. అప్పటికి రాసిన ఒక్కరిని పీక్కు తిన్నది చూసా౦ :)

  ReplyDelete
 12. @ క్రిష్ణప్రియ
  బ్లాగులకి పుస్తకాలకి కొంత తేడా వుంటుంది కాబట్టి ఆ టపాల సిరీస్ ను కాస్త పాలిష్ చేసి వేస్తాను.

  @ మౌళి
  :)

  అజ్ఞాతల గురించి ప్రత్యేకంగా ఒక వ్యాసం వ్రాసే ఉద్దేశ్యం లేదు కానీ వ్యాఖ్యాతల గురించి వ్యాసాలు వుంటాయి. అందులో అజ్ఞాత వ్యాఖ్యతల్లో మంచి వారు, చెడ్డవారు గురించి క్లుప్తంగా వ్రాస్తాను.

  @ అజ్ఞాత
  అలా లీక్ కావడానికి నా పుస్తకాన్ని ఓ పడీపడీ చదవానుకునేవారు వుండరు లెండి. ఒకరిద్దరు అలా చదివేసినా మంచిదేలెండి.

  ReplyDelete
 13. @ అజ్ఞాత
  కాదు. ఇంకా చాలా కావాలి. భద్రీనాథ్ కి రక్షకునిగా అల్లు అర్జున్ ఎలా వుంటాడో అలా తెలుగు బ్లాగు పీఠానికి రక్షకుడిగా వుండాలని వుంది :))

  @ మౌళి
  ధైర్యంగా వ్రాస్తున్నప్పుడు ఇబ్బందులూ వుంటాయి. ఎదుర్కోగల సత్తా కూడా వుండాలి. ఆ సమస్యలను నిభాయించుకొనే వ్యక్తిత్వం వుండాలి కానీ వాళ్ల స్థాయికి దిగి వీధి కొట్లాటల్లో చిక్కుబడిపోకూడదు. అలాంటప్పుడు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

  ReplyDelete
 14. @ కానీ వాళ్ల స్థాయికి దిగి వీధి కొట్లాటల్లో చిక్కుబడిపోకూడదు. అలాంటప్పుడు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

  వాళ్ళ స్థాయి ఏ౦టో ము౦దే తెలిస్తే ఆలొచి౦చకు౦డ ఎవ్వరు ఉ౦డరు.అ౦త సులువు గా అర్ధ౦ అయితే ఇక మీ పుస్తక౦ ఎ౦దుకు :)

  ReplyDelete