ఇండియాలో ఓ చక్కటి ఆశ్రమాన్ని సూచిద్దురూ

అంటే నేను నా భోగలాలసనలన్నీ గిరవాటేసి సన్నాసుల్లో కలుస్తున్నానని సంబర పడకండి. అదేమీలేదు కాదు కానీ అది అదే ఇది ఇదే. మళ్లీ ఇండియాకి వచ్చినప్పుడు కొద్దిరోజులు నా శైలిలో ఆనందించినా కొద్దిరోజులు ప్రశాంతంగా, ప్రకృతికి దగ్గరగా జీవించాలని వుంది. ఈ కోరిక చాన్నాళ్ళ నుండి వుంది కానీ ఎప్పుడూ కుదరలేదు. అందుకే ఈ సారి పక్కాగా ప్రణాళిక వెయ్యాలి. మళ్ళీ భారత్ ఎప్పుడు వస్తానో తెలియదు కానీ సమాచారం అయితే సేకరించిపెట్టుకోవాలనుకుంటున్నాను. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను.

ఇండియాలో మఠాలకూ, ఆశ్రమాలకూ కొదవేమీలేదని తెలుసు. నాకు కావాల్సింది కాస్త మంచి ఆశ్రమం. దొంగ బాబాలు, స్వాముల మఠాలు కాదు. నిజాయితీగా, నిష్కల్మషంగా బోధించే లేదా చర్చించే గురువు గారు కావాలి. వారికి ఎంత మంచి వ్యక్తిత్వం వుంటే అంత మంచిది. వారు ప్రసిద్ధులే అయివుండాలని ఏమీ లేదు. వారి ఆశ్రమమ ప్రకృతికి దగ్గర్లో, పర్వత సానువుల్లో, నాగరికతకు దూరంలో, ప్రశాంతంగా ఎంత వుంటే అంత మంచిది. వారి ఆశ్రమంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసినా సరే ఇతరుల అభిప్రాయాలకు అభ్యంతరం లేని విధంగా వుంటే బావుంటుంది. నేనేమీ వాదనలు పెట్టుకోను కానీ నా మానాన నేను వుండగలిగేలా వుంటే సౌకర్యంగా వుంటుంది. 

నాకు ఆధ్యాత్మిక చర్చలంటే బోధనలంటే అయిష్టం కానీ తాత్విక చింతనలంటె ఇష్టమే. అందువల్ల నేను కొద్ది రోజులు గడపబోయే ఆశ్రమంలో లేదా తాత్విక/ఆధ్యాత్మిక సంస్థలో ఆధ్యాత్మికం తక్కువా, తాత్వికం, వ్యక్తిత్వం ఎక్కువా వుంటే బావుంటుంది. నా గొంతెమ్మ కోరికలు అన్నీ తీరడం కష్టం కాబట్టి  కొన్ని విషయాలు బావున్నప్పుడు మరి కొన్ని విషయాల్లో రాజీ పడటానికి నేను సిద్ధం.

ఇప్పుడు చెప్పండి. నాకు తగ్గ గురువు గారు కానీ, ఆశ్రమం కానీ, సంస్థ కానీ ఇండియాలో ఎక్కడున్నాయి? వారి యొక్క లేదా వాటి యొక్క వివరాలు ఏంటీ? అన్నట్లు యు ఎస్, కెనడాల్లో కూడా ఇలాంటివి ఏమయినా వుంటే కూడా సూచించండి.

7 comments:

 1. కోయంబత్తూర్‍ దగ్గరున్న సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆశ్రమం.
  http://www.indiayogi.com/content/ashrams/sadhguru-jaggi-vasudev-isha-yoga-ashram.aspx

  http://www.ishafoundation.org/

  ReplyDelete
 2. You may consider attending Krishnamurti Foundation India's annual gatherings: In early winter every year, the Foundation holds a gathering at any one of its centres. The gathering is open to all, and its programme includes lectures, discussions and video screenings. Announcements about the gathering are made through the KFI Bulletin, the Vasanta Vihar Newsletter and the Mailing List.
  Chennai centre (Head quarters) has got a guest house located amidst nature.So are other centres of India located in peaceful surroundings.
  More info about Indian centres at
  http://www.j-krishnamurti.org/kfiPage.html
  http://www.j-krishnamurti.org/KRetreat.html
  http://www.kfionline.org/studycentres/index.asp
  In USA
  http://www.peppertreeretreat.com/

  ReplyDelete
 3. @ విజయమోహన్
  ధన్యవాదాలు. మీరు సూచించిన ఇషా ఆశ్రమాన్ని పరిశీలించాను. నీలగిరి పర్వత సానువుల్లో రమణీయంగా వుంది. అయితే అక్కడ వుండటానికి ఎంత ఖర్చు అవుతుందో వివరాలు నాకు కనపడలేదు. ఫొన్ కానీ, ఈమెయిల్ కానీ చేసి తెలుసుకోవాలేమో. యు ఎస్ శాఖలో గడపడానికి ఎంతవుతుందో వివరాలు వున్నాయి. ఈ ఆశ్రమాన్ని దృష్టిలో ఉంచుకుంటాను.

  ReplyDelete
 4. @ సి బి రావ్
  జిడ్డు కృష్ణమూర్తి గారి మీద నాకు ఎంతో గౌరవం వుంది. నా చిన్నప్పుడు మా నాన్న గారి స్టడీ రూములో వారి పెద్ద చిత్రపటం వేలాడదీసివుండేది. రుషివాలీ వెళ్ళిరావాలని ఎప్పటినుండొ వుంది. అయితే వారి బోధనలు మాత్రం తలకు ఎక్కేవి కావు. ఇప్పుడేమన్నా ఎక్కుతాయేమో చూడాలి. మీరు ఇచ్చిన లింక్స్ పరిశీలించాను. మద్రాసుకు దగ్గర్లోని బ్రాంచ్ నాకు సౌకర్యంగానూ, సుందరంగానూ వుండొచ్చు. నేను ఆశ్రమాల గురించి ఆలోచిస్తున్నప్పుడు జిడ్డు గారే ప్రధానంగా నా మదిలో మెదిలారు. ధన్యవాదాలు.

  ReplyDelete
 5. శ్రీకాంత్May 18, 2011 at 6:59 PM

  ఓషో ఆశ్రమం పూణేలో ఉందని విన్న. వాళ్ళ సిద్ధాంతాలు మరియు తత్వ/ఆధాత్మిక చింతన మీకు సరిపోతాయేమో!

  ReplyDelete
 6. >> నాకు తగ్గ గురువు గారు కానీ, ఆశ్రమం కానీ, సంస్థ కానీ ఇండియాలో ఎక్కడున్నాయి? వారి యొక్క లేదా వాటి యొక్క వివరాలు ఏంటీ?

  ఆమధ్య నిత్యానంద అని ఒకాయన వెలుగులోకి వచ్చారు. ట్రై చెయ్యండి :)))))

  ReplyDelete
 7. @ శ్రీకాంత్
  పూణేలో పీజీ చేస్తున్నప్పుడు ఒకసారి ఓషో ఆశ్రమం చూసివచ్చాం. అయితే మాకు చూపించాల్సింది చూపించక పైపైన చెట్లు, పుట్టలు మాత్రం చూపించి పంపించేసారు :( ఓషో మార్గంలో ధ్యానం ఎక్కువా, అసలు విషయం తక్కువా అని అర్ధమయ్యి దూరంగా వున్నా.

  @ వీకెండ్
  స్వామి శరతానంద ఆశ్రమం పెట్టేందుకేనండీ ఈ ప్రాక్టీసూ :)) నిత్యాందాశ్రమంలో నేను చేరితే కుళ్ళుకోగల్డు.

  ReplyDelete