విగ్రహాలకి కూడా రిజర్వేషన్లు వర్తింపచెయ్యాలి!

భారత ప్రజానీకానికి రిజర్వేషన్లు మొదట ప్రతిపాదించింది అబేద్కరో లేక మరెవ్వరో నాకు గుర్తుకులేదు కానీ వారు ఒక ఘోరమయిన పొరపాటు చేసారు. ప్రజలతో పాటు విగ్రహాలకీ రిజర్వేషన్లు వర్తింపజెయ్యాలనే ప్రాధమిక పరిజ్ఞానం వారికి లేక ఆ విషయలో పొరపాటు చేసారు. వారు చరిత్రకి సమాధానం అనగా సారీ చెప్పాలి. రిజర్వేషన్లు లేనందువల్లనే కదా నిన్న హైదరబాదులో అంత ఘోరం జరిగిందీ? రాష్ట్ర రాజధానిలో మూడు ప్రాంతాల వారి విగ్రహాలను ఆయా ప్రాంతాల దామాషా ప్రకారం పెట్టివుంటే కనీసం ఒక ప్రాంతం వారి శాతం విగ్రహాలయినా అనగా 42% విగ్రహాలయినా కనీసం ఈసారి మిగిలివుండేవి కదా!

ఇప్పుడు పాత విగ్రహాల స్థానే కొత్త విగ్రహాలు పెడతామని ముఖ్యమత్రి గారు సెలవిచ్చారుట. ఎవరి విగ్రహాలు పెడతారు? భవిశ్యత్ చరిత్ర చేత ప్రశ్నించబడకుండా తగిన జాగ్రత్తలు ఇప్పుడే తీసుకోవాలి. స్త్రీల విగ్రహాలని తగిన శాతంలో పెట్టకపోతే ముందు ముందు స్త్రీ వాదులు పురుష విగ్రహాలతో ఓ ఆట ఆడుకునే ప్రమాదం వుంది. అందుకే ఆకాశంలో వారు సగం కాబట్టి విగ్రహాల్లో కూడా వారు సగం వుండాలి. ఏ రాణి రుద్రమదేవి విగ్రహం ఒక్కటో పెడితే సరిపోదు. కవయిత్రి మొల్లలాంటి విగ్రహాలూ పెట్టెయ్యాలి. మొత్తం వంద విగ్రహాలు పెడితే శాతాల్లో వాటిని కొలవడానికి తేలికగా   వుంటుంది.   అలా అందులో కనీసం 50 విగ్రహాలు స్త్రీలవి పెట్టాలి.
     
అలాగే బిసీలూ, దళితులూ వారి వారి శాతాల్లొ విగ్రహాలకి సమన్యాయం జరగాలి. ఉపకులాలకి ఎంత శాతం అన్న వాదనలు వున్నాయి కదా. వివాదాస్పద శాతాల మేరకు ఖాళీ గద్దెలు కట్టి వుంచాలి. మిగతా విగ్రహాలు భర్తీ చెయ్యాలి. ఈలోగా విగ్రహాల శాతాల పంపకం మీద కోర్టుల్లో కేసులూ పడవచ్చు. మంచిదే. వారి తీర్పులు విగ్రహాల శ్రేయస్సు కోసం ఉపయొగపడుతాయి. ప్రభుత్వం ఆ శాతాలని తేల్చడానికి కమిటీలు కూడా వెయ్యొచ్చు. మైనారిటీ కమీషనులాగా, బిసి కమీషనులాగా విగ్రహ కమీషను కూడా ముందే వేసి పెట్టుకుంటే మంచిది.  

ఆ కమీషను పరిధిలోకి రాష్ట్రం మొత్తమ్మీద వున్న విగ్రహాలను తీసుకురావాలి. ఏ విగ్రహం పెట్టినా అనుమతులూ గట్రా వుండాలి. విగ్రహాలకు సాధారణ భద్రత సరిపోదు కాబట్టి, ఏ విగ్రహానికి ఏమయినా అది శాంతి భద్రతల సమస్య కాబట్టి వాటికి ప్రత్యేక రక్షణదళం వుండాలి. వాటికి జెడ్ ప్లస్ భద్రత కల్పించాలి. పోనీ అన్నింటికి కాకపోయినా ప్రముఖుల విగ్రహాలకు ఆ స్థాయిలో భద్రత వుండాలి. అనుక్షణం వారు విగ్రహాలని కంటికి రెప్పలా కాపాడాలి. విగ్రహాల పొలిటికల్ పవరుని బట్టి తదితర విగ్రాహాలకి జెడ్ ప్లస్ కాకపోయినా సముచిత స్థాయిలో తగిన మరియు ప్రత్యేకమయిన భద్రత కల్పించాలి. విగ్రహాలను ఎవరయినా అవమానించకుండా వాటికి రిజర్వేషన్లతో పాటుగా మానవ హక్కులూ వర్తింపజెయ్యాలి. అప్పుడు ఎక్కడ ఏ విగ్రహాన్ని ఎవడు పీకినా మానవహక్కుల సంఘం వారు జోక్యం చేసుకోవడానికి అవకాశం వుంటుంది. ఎలాగూ వారికి పెద్దగా పనేమీలేక పోచుకోలు తీర్పులు ఇస్తున్నారు కదా. విగ్రహాల బాధ్యత కూడా పెడితే పండగ చేసుకుంటారు.

అందుచేత ప్రభుత్వం కొత్త విగ్రహాలు కట్టించేలోపే, పెట్టించేలోపే వివిధ వర్గాలూ తమ తమ శాతం విగ్రహాల కొసం ఆందోళనలూ, రాస్తారోకోలూ, బలిదానాలూ చెయ్యాలి. మంచి తరుణం మించిన రాదు. ఇప్పుడు మీ కులం, మతం, వర్గం, ప్రాతం, లింగం విగ్రహాలు పెట్టుకోలేకపోతే మళ్ళీ ఇంతచక్కని అవకాశం తొందర్లో రాదు. మళ్ళీ వళ్ళు మండి ఎప్పుడన్నా విగ్రహాలు కూలగొడితే తప్ప ఇలాంటి సువర్ణావకాశం ఇప్పట్లో రాదు కాబట్టి అందరూ త్వరపడండి. ఆందోళనలు చేపట్టండి.

అలాగే పనిలో పనిగా మా ఎల్జీబిటీ విగ్రహాలు పెట్టాలి. మేము ఎక్కువమందిమి లేము కాబట్టి ఒక్క శాతంతో సరిపుచ్చుకుంటాము. విగ్రహానికి తగిన వ్యక్తి ఎవరున్నారు చెప్మా! నేను తప్ప ఎవరూ నాకు గుర్తుకురావడం లేదు. అందుకే లైంగిక హక్కుల వారి శాతం మీద నా విగ్రహాన్ని ట్యాంకుబండు మీద పెట్టాలని డిమాండు చేస్తున్నాను అధ్యక్షా. నా విగ్రహాన్ని పెట్టకపోతే నిరసనగా ఈ సారి ఇండియా వచ్చినప్పుడు ట్యాంక్బండు మీద తిష్ట వేసి ఆత్మబలిదానం అయినా ఇచ్చుకుంటాను. అప్పుడు అక్కడ నా సమాధి అయినా కట్టేసెయ్యండి మరి. జై ఎల్జీబీటీ, జై జై ఎల్జీబీటీ. లైంగిక హక్కుల నాయకుడు శరత్ వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. లైంగిక హక్కులూ జిందాబాద్, జిందాబాద్.

అరవండెహె. 

9 comments:

 1. :-), hilarious..

  ReplyDelete
 2. @ ఆంధ్రుడు
  :)

  అన్నట్లు ఇంకో విషయం మరిచేపోయాను. దేవుళ్లకీ, దేవతలకీ కూడా రిజర్వేషన్ల విషయం కూడా ఆలోచించాలి. తెలంగాణా దేవుళ్ళు తక్కువయిపోయారనో లేక ఎక్కవమంది దేవుళ్ళే వున్నారు కానీ దేవతలు తక్కువయ్యారనో ఆకాశం బాబా ఈమధ్యనే వాపోయేడు.

  ReplyDelete
 3. @స్త్రీల విగ్రహాలని తగిన శాతంలో పెట్టకపోతే ముందు ముందు స్త్రీ వాదులు పురుష విగ్రహాలతో ఓ ఆట ఆడుకునే ప్రమాదం వుంది

  అమ్మా నవ్వలేక చచ్చాను .అసలు మహిళ ల విగ్రహాలు టా౦క్ బ౦డ్ పై న పెట్టే ఆలోచన కి మిమ్మల్ని ఈ పాటికి బ్లాగుల్లో టప టపా, టపాలతో ఉతికి ఆరెయ్యాలి.చూద్దా౦

  ఎ౦దుకైనా మ౦చిది తీసెయ్య౦డి.

  ReplyDelete
 4. కళ్ళల్లో నీళ్ళు వచ్చేలా ఈ మధ్యకాల౦ లో ఎప్పుడూ నవ్విన గుర్తు లేదు. ఒక లైను రిఫర్ చేద్దామ౦టే ఈ చివరి పారా అ౦తా పెట్టెయ్యాల్సి౦దే .మీ హిడెన్ అజె౦డా ఇదా అనుకు౦టే, చాలదన్నట్లు వివర౦గా చెప్పారే. చివరి పేరాకి మాత్ర౦ కేక. అక్కడ అన్ని విగ్రహాల మధ్యలో మీది దిష్టి బొమ్మ నయినా చేస్తారు, టయ౦ బాగు౦టే జనాల విశాల తత్వ౦ పెరిగి మీరే లా౦డ్ మార్క్ అయినా అవ్వొచ్చు :P

  ---------------------


  @అలాగే పనిలో పనిగా మా ఎల్జీబిటీ విగ్రహాలు పెట్టాలి. మేము ఎక్కువమందిమి లేము కాబట్టి ఒక్క శాతంతో సరిపుచ్చుకుంటాము. విగ్రహానికి తగిన వ్యక్తి ఎవరున్నారు చెప్మా! నేను తప్ప ఎవరూ నాకు గుర్తుకురావడం లేదు. అందుకే లైంగిక హక్కుల వారి శాతం మీద నా విగ్రహాన్ని ట్యాంకుబండు మీద పెట్టాలని డిమాండు చేస్తున్నాను అధ్యక్షా. నా విగ్రహాన్ని పెట్టకపోతే నిరసనగా ఈ సారి ఇండియా వచ్చినప్పుడు ట్యాంక్బండు మీద తిష్ట వేసి ఆత్మబలిదానం అయినా ఇచ్చుకుంటాను. అప్పుడు అక్కడ నా సమాధి అయినా కట్టేసెయ్యండి మరి. జై ఎల్జీబీటీ, జై జై ఎల్జీబీటీ. లైంగిక హక్కుల నాయకుడు శరత్ వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. లైంగిక హక్కులూ జిందాబాద్, జిందాబాద్.

  ReplyDelete
 5. @ మౌళి
  అదేంటండీ. ఆడ విగ్రహాలు పెట్టమంటే మహిళలు సంతోషించాలి గానీ నన్ను ఎందుకు తిడతారూ?

  నా విగ్రహం పెడితే మటుకు నన్ను ఎవరూ ఏమీ పీకకుండా నా విగ్రహం చుట్టూ ఇనుప గ్రిల్ వెయ్యాలి. నన్ను ఆడాళ్ళూ, మగాళ్ళూ తాకొచ్చు కానీ ఒఖ్ఖటి పీకకుండా వుండే సౌకర్యం వుండాలి. నా మీద అనగా నా విగ్రహం మీద ఎవరూ దౌర్జన్యాలకు దిగకుండా పటిష్టమయిన పోలీసు కాపలా వుండాలి. అసలే జిలగాళ్లకి నామీద మంటనాయే. అలా ఎవడయినా నా విగ్రహాన్ని ...ఏమయినా చేసినా రికార్డ్ చేసేందుకు అస్థమానం పని చేసే సిసిటివిలూ నా విగ్రహం చుట్టూరా పెట్టాలి. ప్రభుత్వం నా విగ్రహం పెడతానని ఒహటే బ్రతిమలాడుతుంది కదా - అప్పుడు ఎకరువు పెడతా నా నిబంధనలు అన్నీనూ.

  ReplyDelete
 6. "ఏ రాణి రుద్రమదేవి విగ్రహం ఒక్కటో పెడితే సరిపోదు. కవయిత్రి మొల్లలాంటి విగ్రహాలూ పెట్టెయ్యాలి."
  వాల్లిద్దరివీ ఇప్పటికే ఉన్నాయి. ఇంకా పేర్లు ఆలోచించండి. (విజయశాంతి, కవిత, ముమైత్ ఖాన్, కాంగ్రెస్ నుంచి గీతారెడ్డి లా అన్నమాట )

  అలాగే విగ్రహ నమోదు సంస్థ ఉండాలి. కొత్త విన్నపాలు పరిశీలించి నిర్ణయం తీసుకోడానికి

  విగ్రహాలకి MP/MLA తో సమానంగా జీత భత్యాలు ఉండాలి (ఏడాది ఇరవై సార్లు మొదటి తరగతి విమాన ప్రయాణం తో సహా )

  మీ విగ్రహానికి నెట్ కనెక్షన్ కూడా పెడితే బ్లాగులు అప్ డేట్ చేసుకోవచ్చు మీరు

  జై ఎల్జీబీటీ, జై జై ఎల్జీబీటీ. లైంగిక హక్కుల నాయకుడు శరత్ వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. లైంగిక హక్కులూ జిందాబాద్, జిందాబాద్. (అరిచేశాం)

  ReplyDelete
 7. I have a correction. LGBTs should be included you said. So I say why not put two statues on pedestal together - One famale and one male in the nude poses kissing or doing sex directly (like what Italy has). BTW old statues all of them had a trace of NTR they say. So now we can have "either male or female" statue to have your trace. That way LBGT, male, female and all reservations come into force. Congratulate me for the brilliant idea. Will you?

  BTW I have not read (do not remember to have read) on your blogs about people called cross dressers - like males who want to wear female underwear and vice versa. Do you support them too? If you do we can accommodate those changes on statues as well.

  ReplyDelete
 8. @ అజ్ఞాత @ 11 మార్చి 2011 12:32 సా

  అలా అరిచేసారూ బావుంది :)

  ఇంకానయ్యం మీరు విగ్రహాలకి భోజన భత్యాలూ ఇవ్వమనలేదు.

  కొత్త విగ్రహాల గురించి అసంబ్లీలో చర్చ వచ్చినప్పుడు చూడండి. నా అంచనా ప్రకారం చర్చ బహు రంజుగా వుండితీరుతుంది. మాకు ఇన్ని విగ్రహాలు కావాలంటే మాకు ఇన్ని విగ్రహాలు కావాలని అసెంబ్లీలో కొట్టుకుఛస్తుండవచ్చు.

  ReplyDelete
 9. అక్కడ పార్టీల వారీ వాటాలు, విగ్రహ వాటాల పొత్తులు కూడా కొత్తగా పుడతాయి.

  ReplyDelete