మరీ మూడుముక్కలేనా?

రామ జన్మభూమి తీర్పు చూసాక అసంతృప్తి కలిగింది. కొద్దిగానయినా లౌకికతత్వం లేదే అందులో. హెచ్చు సంఖ్యలో వున్న హిందువులు రెండు ముక్కలూ, మైనారిటీ ముస్లిములూ ఒక ముక్కా పంచుకుంటే న్యాయం జరిగినట్టేనా? మరి మిగతా వారి సంగతేంటి? కిరస్తానీయుల మాటేమిటి? వారికో ముక్క పడేస్తే బావుండేది  కదా. ఇలా ఇలా హిందువులూ, ముస్లిములూ భాయీ, భాయీ అని పక్కపక్కనే గుడులూ, మసీదులూ కట్టుకుంటూపోతే అది లౌకికతత్వం ఎలా అవుతుందేమిటీ? వాటితో పాటూ చర్చిలూ, బుద్ధ, జైన మందిరాలూ కడితేనే కదా సర్వమత సౌభ్రాతృత్వం వెల్లివిరిసేదీ? ఆయా మతాల సంగతి ఆ మతాల వాళ్ళు చూసుకుంటారు కానీ ఆ సంగతులు నాస్తికుడివి నీకెందుకయ్యా అంటున్నారా? వచ్చేస్తున్నా, అక్కడికే వచ్చేస్తున్నా కదా.

ఆ అయోధ్య భూమిని కోర్టు ఏ మతానికీ ఇవ్వకుండా ఎంచక్కా ఏ స్కూలుకో, హాస్పిటలుకో లేక గ్రంధాలయానికో, క్రికెట్టు కోర్టుకో ఇచ్చేస్తుందేమోనని ఒక లౌకిక భావాలున్న వ్యక్తిగా దింపుడుగళ్ళం ఆశ పడ్డాను లెండి. అది జరగలేదు సరే. మూడు ముక్కలు చేసి ఇచ్చారు. కొంతలో కొంత అది బాగానే వుంది. కానీ... మైనారిటీల్లో మైనారిటీలయిన పౌరహక్కులవారికీ, హేతు(టు)వాదులకూ, దళితవాదులకూ మరియు నాబోటి నాస్తిక మతాల వారి సంగతేంటి? మాకొద్దా భూమి? మా మనోభావాలు మనోభావాలు కావా ఏంటీ? ఇంకొన్ని ముక్కలు చేసి మాకూ కొన్ని ముక్కలు పడేస్తే మేమూ నోరుమూసుకొని ఇలా భౌ భౌమనకుండా పండగచేసుకునేవారం కదా. ఇప్పుడు చెప్పండి ఆ తీర్పులో ఎంత లౌకికతత్వం వుందో? మా భూమి మాకిస్తే మా అమరవీరులకు ఓ స్థూపమో, ఓ వేదికో, ఓ అంబేడ్కర్ విగ్రహమో, నాస్తిక సువార్త సభలకు ఓ ప్రాంగణమో నిర్మించుకునేవారం కదా. అటు ముస్లిముల, ఇటు హిందువుల మధ్య చేరి ఏ గొడవలూ రాకుండా చూసుకునేవారం కదా. మరి కోర్టు విశాలమయిన, ఉన్నతమయిన తీర్పు ఇచ్చింది అంటే మమ్మల్నెలా నమ్మమంటారూ?   

సరే ఈ వాదులందరినీ పక్కకుపెడదాం. మరి తెలంగాణా సంగతేంటి? మా తెలంగాణాకి 42% కాపోయినా ఓ 4% ముక్క అయినా ఇచ్చారా? మరీ మోకాలుకీ, బోడిగుండుకీ ముడేస్తున్నావు, తెలంగాణా వారికి అక్కడ స్థలం ఎందుకు చెప్పు అంటున్నారు మీరు. అవునా. అంటే అయోధ్య రాముడిని చూడటానికి ఆంద్రవాళ్ళు మాత్రమే వెళతారా? తెలంగాణా వాళ్ళు వెళ్ళరా? అక్కడ తెలంగానా వాళ్లు ఎవరూ తరతరాలుగా నివసించడం లేదా? వాళ్ళంతా ఎవరు - మావాళ్ళే. మరి మాజాగ మాకు కావాలా వద్దా? ఏదో గింత ముక్క పడేస్తే అందులో అక్కడికి వచ్చే తెలంగాణా యాత్రికుల కోసం లాడ్జి కట్టిస్తాము.  అందులో మూడు గదులు పార్టీ ఆఫీసుకు, తలో రెండు గదులు కేసీఅరుకి, విజయశాంతికీ, తలో ఒక గది కేటీఆరుకీ, కవితమ్మకీ, హరీశ్రావుకీ కెటాయించి మిగిలిన గదులేమన్నా వుంటే యాత్రికులకు కెటాయిస్తాము కదా. 

మరి ఎస్సీ, ఎస్టీ వర్గాల సంగతేంటి? వారికి చట్టబద్దంగా అన్నింటిలోనూ రిజర్వేషను వున్నప్పుడు ఇందులో మాత్రం ఎందుకు మినహాయింపూ?   మీ ప్రశ్న నాకు అర్ధమయ్యింది. హిందువులూ, ముస్లిములూ అందులోకక్షిదారులు కాబట్టి ముక్కలిచ్చారని. వాళ్ళు ఆ భూమి ఎవరిదో చెప్పండి మహాప్రభో అని కోర్టుని వేడుకున్నారు అంతే కానీ ఇలా ముక్కలు చేసివ్వమని ఏనాడయినా, ఎక్కడయినా కోరారా? సరే కోర్టు ఏదో ఒక అడుగు ముందుకువేసి ఎవరి మనస్సూ నొప్పించకుండా అలాంటి తీర్పు ఇచ్చింది. బాగానే వుంది కానీ ఇంకో రెండడుగులు ముందుకు వేసి పైన లిస్టు ఇచ్చిన వారందరికీ తలా ఓ ముక్క ఇచ్చేస్తే కోర్టు సొమ్మేం పోయేదో. అందుకే ఆ తీర్పుని నేను ఖండిస్తున్నాను. అ తీర్పులో లైకికతత్వం అన్నది మేడిపండు వంటిదేననని ఈ సందర్భంగా మీ అందరికీ వినయంగా విన్నవించుకుంటున్నాను.  

7 comments:

 1. >> మధ్య చేరి ఏ గొడవలూ రాకుండా
  >> చూసుకునేవారం కదా.

  అంతేనా, లేక మధ్యలో కూకొని అందరికి పుల్లలెట్టి విజిలేసుకుంటానికా? ;)

  మనకీ సీరియస్ టాపిక్కులెందుగ్గాని, భాషా సేవ కంటిన్యు సెయ్యండి - బుకాకే కి తెలుగులో ఒక పదం సృష్టించండి ;)

  ReplyDelete
 2. @ విట్‌రియల్
  అవునండోయ్ - చాలా పదాలకి ఇంకా అర్ధమే తెలియదు నాకు ఇంకా తెలుగీకరణ ఏం చేస్తాం. e-తెలుగు వారి సహకారం తీసుకునేదా? మరీ అన్నివున్నాయేంటండీ బాబూ. లిస్ట్ చూస్తేనే నాకు కళ్ళు తిరిగిపడిపోతానా అనిపిస్తుంటుంది. కొందరికయితే చేంతాడంత లిస్టు వుంటుంది. చదవడానికే నాకు కళ్ళు తిరుగుతుంటాయి ఇహ అవన్నీ ఎలా అవలంభిస్తారో ఏంటో!

  ఈ మంగళవారం ఆ తలుపులు తట్టబోతున్నాను. నెమ్మదిగా అన్నీ తెలుస్తాయిలెండి.

  ReplyDelete
 3. may be you are thinking as genius .
  is there any relation between telanga and Ayodya ( even if it is joke) andhra boarder nundi vochavu kada aaa thelivitetalu vochinatlunnayi

  ReplyDelete
 4. @ అజ్ఞాత
  తెలంగాణాకీ అయోధ్యకీ సంబంధం లేకపోవడం ఏమిటీ! మోకాలుకీ, బోడిగుండుకీ వున్నంత సంబంధం అని ముందే చెప్పాగా. మళ్ళీ డవుట్లు వస్తే ఎలా?

  ReplyDelete
 5. ఇండియన్ బొమ్మ సూపర్ అన్నాయ్

  ReplyDelete
 6. మీలాంటి, నాలాంటి 'సెక్యులరిస్ట్'లు ఇలాగే అలోచిస్తారుగానీ, మన రాజ్యాంగం 'సర్వమత.....' అంటూంది. అందుకైనా 'అన్ని ' ముక్కలు చేస్తే నేనూ సంతోషించేవాడినే!

  ReplyDelete
 7. ఏదో గింత ముక్క పడేస్తే అందులో అక్కడికి వచ్చే తెలంగాణా యాత్రికుల కోసం లాడ్జి కట్టిస్తాము. అందులో మూడు గదులు పార్టీ ఆఫీసుకు, తలో రెండు గదులు కేసీఅరుకి, విజయశాంతికీ, తలో ఒక గది కేటీఆరుకీ, కవితమ్మకీ, హరీశ్రావుకీ కెటాయించి
  భలే భలే తమ్ముడు భలే మా బాగా కొట్టావ్ టెంకి జెల్ల ..... ఈ లాగే కంటిను ఐపో నీ కు నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి

  ReplyDelete