మీ అందరికీ (నా బ్లాగు నుండి) పది రోజులు సెలవులిస్తున్నా!

పండగ చేసుకోండి ఈలోగా. ఓ పది రోజులన్నా వీడి పీడ విరగడవుతుందని సంతోషిస్తున్నారు కదూ..చించండి. ఆ ఆనందంతో నాకు హేప్పీ జర్నీ చెబుదామనుకుంటున్నారు కదూ. నాకు తెలుసు. అయినా వద్దులెండి. అంత శ్రమ మీకెందుగ్గానీ ఏదయినా ప్రత్యేక సందేశం వుంటే మాత్రం తెలియజేయండి. ఈ పది రోజులూ నెట్టూ, బ్లాగులూ, మీరూ లేకుండా ఎలా బ్రతకాలో ఏమిటొ! ఎప్పుడయినా నెట్టు దొరికితే క్లుప్తంగా పలకరిస్తూనే వుంటాను లెండి.

హైదరాబాద్ బ్లాగర్స్, మనం అక్కడ కలుద్దాం.

ప్రస్తుతం విమానాశ్రయంలో వుండి వుండి విమానం కోసం ఎదురుచూస్తున్నాను.

మళ్ళీ కలిసేదాకా సెలవ్!

3 comments:

 1. ఎప్పుడూ బ్లాగులేనా? -భారతదేశంలో ఆనందంగా గడిపి అమెరికా రండి. ఈ పది రోజులు బ్లాగుకు దూరంగా ఉండి, బ్లాగులవలన జీవితంలో ఏమికోల్పోతున్నామో తెలుసుకోండి. అక్కడ మంచి తెలుగు పత్రికలు, పుస్తకాలు, సంగీత కార్యక్రమాలు ఉంటాయి కదా. మధ్య ప్రదేశ్ లోని ఖజురహో దేవాలయాలను దర్శించండి. అవి ఈ రోజుకూ చెక్కు చెదరక తమ శిల్ప సౌందర్యాన్ని కలిగిఉన్నాయి. మీరు నాస్తికులయినా అక్కడి శిల్పకళను ఆనందిస్తారు. దేవాలయాలలో బూతుబొమ్మలెందుకుంచారో తెలుసుకోండి. ఈ సెలవులలో ఖాళీ దొరికితే బ్లాగులు చదవండి కాని వ్యాఖ్యలు రాసి సమయాన్ని వృధా చేయక బంధు మిత్రులందరినీ ఒక చుట్టు చుట్టి రండి. ఈ సెలవులో బ్లాగు వ్రాసే ప్రయత్నం చేయనే వద్దు. భారతదేశాన్ని, మీ ఊరుని కొత్తకోణం లో చూడండి. ఇక్కడకు వచ్చాక వ్రాయటానికి చాలినన్ని అంశాలు దొరకగలవు.

  ReplyDelete
 2. హాపీ జర్నీAugust 19, 2010 at 4:14 PM

  అన్నాయ్ ,

  క్షేమంగా వెళ్లి రండి ...

  ReplyDelete
 3. Sarath gaaru, ee 10 days maaku bore kodutundi

  ReplyDelete