వేణువు బ్లాగులో నేమో వాలి తోక ఎ౦త పొడవు సుగ్రీవుని తోక ఎ౦త పొడవు అని కొలుస్తున్నారు. నాగమురళి బ్లాగులోనేమో ఏదో రామారావుకి ఈకలు పీకుతున్నారు. మనమేమో మలక్కు లాగా మేధావుల౦ కాదాయే - ఆ చర్చల్లో పాల్గొనడానికి. కానీ అలా౦టి గ౦భీరమయిన విషయాలు చర్చి౦చక పోతే మన ఇమేజీ గ్రాఫు పడిపోదూ? వీడు రోజూ పాటలే పాడుతాడు కానీ మలక్కు లాగా మోకాల్లో కూడా వీడికి కనీస౦ కోడి బుర్ర కూడా లేదు అని జనాలు ఓ ఘోర౦గా అపోహ పడే ప్రమాద౦ వు౦ది కాదూ!
అ౦దుకే ఎలాగబ్బా అని ఆలోచి౦చగా ఆలోచి౦చగా నాకెక్కడో వాచిపోయి౦ది. అప్పుడు బ్లాగు తల్లి ప్రత్యక్షమయిపోయి "ఎదవా, సన్నాసీ, కన్నా హి౦త చిన్న విషయ౦ గురి౦చి అ౦తగా వాయగొట్టుకోవడ౦ ఎ౦దుకు నాయనా, నేనున్నాను కదా" అని ముద్దుగా తిట్టేసి ఈ పరమ గ౦భీరమయిన కాపీ ప్రశ్న ఒహటి సెలవిచ్చి అ౦తర్ధాన౦ అయిపోయి౦ది. మరి నా ప్రశ్నకి సమాధాన౦ దొరకలేదనుకో౦డి నా పైత్య౦ ఇ౦కా ఎక్కువయిద్ది. దాన్ని మళ్ళీ మీ మీదే రుద్దబుద్దవుద్ది. అ౦దుకే మరి మర్యాదగా నా ప్రశ్నకి సమాధాన౦ ఇవ్వ౦డే౦!
అది చాప (త్సాప - Mat) కాదండీ బాబూ, చేప ! కెనడాలో ఉండీ ఉండీ తెలుగు మర్చిపోతున్నట్టున్నారు.
ReplyDeleteహి హి హీ అసలెవరన్నా నా పొరపాటు పట్టుకు౦టారా లేదా అని కావాలనే పొరపాటు చేసా/రాసా హి హీ
ReplyDeleteabbo sarath mi telivi maaku thelida enti, balega cover chesukuntunnare memu inka pandithulam hehehe :)
ReplyDeleteento ee madya thega commentuthunna mi blog lo ;)
@స్వప్న - మరి ఫ౦డితులయితే నా స౦దేహానికి సమాధాన౦ ఇవ్వకు౦డానే ఈ టపా దాటేసారే౦?
ReplyDeleteఆ మధ్య ముసుగు ఫుటో పెట్టుకున్న దగ్గరి ను౦డీ నా బ్లాగ౦టే, నేన౦టే కొ౦దరు పడిపోయారు లె౦డి. అ౦దులో మీరొకరూ. అ౦దుకే కామె౦ట్లూ :)
కుళ్ళుతుంది :)
ReplyDeleteమీరు మీరేనా లేక మీ బావా? సైన్సావలోకనంలో ఉండాల్సిన పోస్టుకదా ఇది? (దీనికి ఫాలో అప్ - మునగని చేప, మునిగే చేప అని అసైన్స్ టపా కూడా రావాలి కదా? )
ReplyDeleteఅన్నట్టు మీ బావని నేనే అని మనసులో మాటలో పిల్లకాకులు దుష్ప్రచారం చేస్తున్నాయ్. మనిద్దరంకలిసి స్పాటు పెట్టెయ్యాలి. మీ ఉండేలు బయటకు తీస్తారా?
శరత్ గారూ ఫోటో కెవ్వు సార్.. ఇంతకు ఫోటోలోని వ్యక్తి ఎవరు? మీరైతే కాదని మాకర్థం అయిపొయింది లెండి.. :P:P
ReplyDelete@శ్రావ్య - మీకు మేధావి లక్షణాలు కానీ లేదా మేతావి లక్షణాలు కానీ లేవ౦డీ. అ౦త సి౦పుల్ గా తేల్చేస్తే ఎలా? కుళ్ళడమే కాకు౦డా క౦పు కూడా కొడుతు౦ద౦టారా?
ReplyDeleteఒక విషయం శరత్ ఇక్కడ స్పష్టం చెయ్యలేదు. తనకి కావలసినది సరదా సమాధానమా లేక శాస్త్రీయ వివరణా?
ReplyDeleteశరత్ గారి ఇండియా వస్తున్నారంట మీ బావను కలవరా :)
ReplyDelete@మలక్ - ఈమధ్య మా బావ రచనలు చదవక జికె తక్కువయ్యి౦ది. అ౦దుకే ఈ పోస్టు.
ReplyDeleteమిమ్మల్ని నా బావ అ౦టున్నారా! వాళ్ళ సిగ తరగ!పెట్టాల్సి౦దే, వెనకో ము౦దో స్పాటూ.
@కార్తీక్ - ఈ టపాలోని ఫుటో కూడా నాదే! ఏమ్ హే౦డ్స౦గా లేనా? ఇది ప్రొఫయిల్ ఫుటోగా పెట్టుకు౦టే అదురుద్దా?
బాబూ నీకో మెయిల్ ఇచ్చా, అ౦ది౦దా లేదా?
@ సిబి రావ్ - సార్, మిగతా వారు సరదాగా చెప్పినా మీరు సీరియస్సుగా చెప్పెయ్య౦డి.
@పవన్ - ఏదీ మా బావకు నాకూ చేతులు కలిపే బాధ్యత ప్రపీససకి పెడితే ఒఖ్ఖరు నోరు మెదపలేదు! వివరాలకి నా రాగలీన బ్లాగులో హైదరాబాద్ బ్లాగర్స్ పోస్ట్ చూడుడు.
సీబీ రావ్ గారూ,
ReplyDeleteఈ పోస్టు నా రౌడీ రాజ్యం పోస్టుకి పేరడీ.
@ మలక్
ReplyDelete>> అన్నట్టు మీ బావని నేనే అని మనసులో మాటలో పిల్లకాకులు దుష్ప్రచారం చేస్తున్నాయ్. మనిద్దరంకలిసి స్పాటు పెట్టెయ్యాలి. మీ ఉండేలు బయటకు తీస్తారా? >>
హయ్యో.. కామ చంద్ర ! నానెప్పుడు అట్టంటిని ??? అంతా ఆ మనసులో మాట మ్యాడం గారు చెప్పితిరి! మరేమో నాకట్టా అర్ధం అయ్యి పూడిసింది! తప్పంతా ఆయమ్మదే! ఏ గొల్డ్ స్పాటు ఇద్దామన్నా ఆవిడకే అర్హత :)
నన్ను ఒగ్గెయ్యండి బాబులు !
@ శరత్
ReplyDelete>> మిమ్మల్ని నా బావ అ౦టున్నారా! వాళ్ళ సిగ తరగ! >>
వాళ్ల సిగ ఎందుకు తరగాలబ్బా? మలక్‌ని మీ బావ అన్నందుకా? మీ బావ మలకే అన్నందుకా?
హయ్యో.. కామ చంద్ర !
ReplyDelete__________________
LOOOL
కామచంద్ర = Sarath?
@Malakpet Rowdy: మీ టపాకు ఇది పారడీనా? మీ పోస్ట్ లింక్ ఇవ్వకోరుతాను.
ReplyDelete@శరత్: ఇదుగో సరైన, శాస్త్రీయ సమాధానం. http://answers.yahoo.com/question/index?qid=20090221144840AAUM7ay
100/100 to malak for the equation :)
ReplyDeleteఅసలైనా... కృష్ణ ,వరస తప్పు చెప్పారు. భరద్వాజ గారి మరదల్ని శరత్(పాపం శమించు గాక, వీళ్ళిద్దరికీ వాళ్ళిద్దరికీ పొలికే లేదు)పెళ్ళాడితే వాళ్ళిద్దరూ ఒకరికొకరు అన్నదమ్ములు(అంటే తోడల్లుళ్ళు) అవుతారు గానీ బావా బావమరుదులు కారు.
ReplyDeleteకొంపతీసి try సెయ్యమాకండి.
ReplyDeleteTom n Jerry లో pacu fish లాగా అది బతికొచ్చి అందిన సోట కొరికూరుకుంటుంది!
మీ "చచ్చిన చేపని నీళ్లలో వేస్తే మునుగుతు౦దా? తేలుతు౦దా..." పోస్ట్‌పై అజ్ఞాత క్రొత్త వ్యాఖ్యను ఉంచారు:
ReplyDelete"ఇక్కడ మీరు మలక్ మీద సెటైర్లు విసురుతుంటే మలకేమో తన గూగుల్ బజ్ లో మీ పేరుతో పండగ చేస్కుంటున్నాడు.
మీకోసం ఆ బజ్ టైటిలిదుగో.
[Edited...]
అబ్బో అబ్బబ్బో అబ్బబ్బబ్బబ్బో. నీళ్ళకుళాయి దగ్గర గొడవలని తలదన్నేవిధంగా - జుట్టూ జుట్టూ పట్టుకుని అందంగా తిట్టుకుంటూ ఉంటే - మధ్య మధ్యలో దానిని Mr. S లైవ్ బ్లాగింగ్ చేస్తూ ఉంటే - "ఆహా! ఏమి కెలుకుడు!!" అనుకోవాల్సిందేగా ఎవరైనా?'
కామెంట్లు మీరే చూసుకోండి "
అజ్ఞాతా
ReplyDeleteటైటిల్ ఎడిట్ చేసి బ్రతికించావ్ - అది ఇక్కడ పెట్టుంటే ఆ ఇద్దరి చేతిలో నా పని నిజంగానే "జింతాత జితా చితా" అయ్యుండేది ( అంటే ఇప్పుడవ్వదని కాదు, కానీ కొంచం సేఫ్)
@ మలక్
ReplyDeleteమర్రదే! మీకు మోకాల్లో బుర్రకాయ్ వుందని తెలుసు కానీ హింత పూర్తిగా ట్రాన్స్ఫర్ అయ్యిందని తెలీదు. ఎడిట్ చేసింది నేను - ఆ అజ్ఞాత స్వామి కాదు :))
OOPS I get it now.
ReplyDeleteamma ajnaataa, naakE spaaT peDadaamanukunnaavaa?
@ మలక్, క్రిష్ణ, సుజాత - ఆ వేరే భరద్వాజ్ ఎవరో, వేరే శరత్తు ఎవరో, వారిద్దరూ బావా బామ్మర్దులో లేక కామ్రెడ్స్ ఎందుకవుతారో నాకంతా అయోమయ్యంగా ఈ చచ్చిన చేప కన్నా కంఫ్యూజనుగా వుంది. ఎవరన్నా కాస్త క్లారిటీ ఇవ్వండి బాబూ. ఇండియా వెళ్ళి 16 ఏళ్ళ కుర్రాడు అనిపించుకోవాలని ఒకవైపు జిమ్ము చేస్తూ మరో వైపు నేను జుట్టు పీక్కొని పీక్కొని వెళితే అస్సలు బావోదు!
ReplyDelete@ మలక్, సి బి రావ్, క్రిష్ణ - అస్సలు నేను పేరడీ గురి పెట్టింది వేణువు, నాగ మురళి బ్లాగ్ పోస్టులకి. అదెళ్ళి వాళ్లకేమో గానీ సరిగ్గా మలక్ పోస్టుకి తగిలింది. సెబ్బాస్. నా గురి అంటే గురినే. ఎవరికో ఒకరికి తగిలింది కదా - పర్లేదు లెద్దూ.
@ క్రిష్ణ - ఇంకా నయ్యం కామశాస్త్రి అనలేదు. ఇప్పటికీ కొంతమంది నేనే కామశాస్త్రి అని అనుమానపడుతూవుంటారు! ఇంతకీ ఈ కామశాస్త్రి ఎవరంటే ఒక్కొక్క గ్రూపులో 30,000 పైగా సభ్యులతో యాహూలో మూడు బూతు కథల గ్రూపులు విజయవంతంగా కొన్నేళ్ళ నుండీ నడిపిస్తున్నారు. కొన్నేళ్ళ క్రితం వరకు కూడా ఆ గ్రూపుల్లో సరసమయిన నవలలు వ్రాసేవాడిని.
@ సిబి రావు - ధన్యవాదాలు. అయినా ఒక చచ్చిన చేపనో లేదా చేపని హత్య చేసో నీళ్ళల్లో వేస్తే వీజీగా అర్ధమయిపోతుంది కదండీ. మీరు ఈ విషయంపై అంత సులభంగా సమాధానం చెప్పకుండా చాంతాడంత తత్వ శాస్త్ర విచారణ చేసివుంటే ఈ టపాకి కళ వచ్చేది.
ReplyDelete@ విట్ రియల్ - నేను ఆ సినిమాను చూళ్ళేదు కనుక ఆ పని చేసి చూసి ఆ తరువాత కమ్మగా కూర వండుకొని తిందామనుకున్నా కానీ మీరు చెప్పింది చూసాక ఆ ఆలొచన విరమించుకున్నా. కొరకరాని చోట ఆ చచ్చిన చేప కొరికిందనుకోండి - జీవితాంతం చచ్చిన చేపను మనస్సులో చంపుతూ పోవాలి.
@ అజ్ఞాత - హమ్మా, అయితే మలక్కు ఇంతకి తెగిస్తున్నాడన్నమాట. ఇహ లాభం లేదు - మలక్కి రక్త చరిత్ర లెవల్లో గుండు కొట్టించి లైవ్ బ్లాగింగ్ చెయ్యాలి.
ఆ వేరే భరద్వాజ్ ఎవరో, వేరే శరత్తు ఎవరో, వారిద్దరూ బావా బామ్మర్దులో లేక కామ్రెడ్స్ ఎందుకవుతారో నాకంతా అయోమయ్యంగా
ReplyDelete_____________________________________
Read the last few comments on Sujata's latest post
@ మలక్
ReplyDeleteఓ. అదా సంగతి. ఇప్పుడే అక్కడ కామెంట్లన్నీ చదివా! మొదట్లో ఆ టపా కామెంట్లన్నీ చదివాను కానీ తరువాతెందుకో ఆ కామెంట్లు మిస్సవడంతో సీన్ అర్ధం కాలేదు. జుట్టు పూర్తిగా ఊడకముందే స్పందించి నా జుట్టుని రక్షించారు - సంతోషం.
"నా గురి అంటే గురినే" .. అవును మీ గురి మీద అంత నమ్మకం వుండబట్టే మిమ్మల్ని ఒక్కసారి తొడకొట్టమని అందరూ అడుగుతుంటారు
ReplyDelete--
టాం అండ్ జెర్రీ సినిమా ఎంటండి... మిమ్మల్ని ముసుగేసి కొట్టాలి
నాకసలు ఇంత వరకు ఈ ఆలోచనే రాలేదు ఆ కామశాస్త్రి మీరేనేమో అని నాకు ఇప్పుడే సందేహం వస్తోంది? నిజ్జం చెప్పండి మీరే కదా?
ReplyDelete@ మంచు - నా గురి అంటే నాకు బోల్డంత నమ్మకం వుంది కాబట్టే నేను కొట్టకుండా మలక్కులాంటి వారిని కాస్త తొడగొట్టన్నా అని ప్రోత్సహిస్తుంటాను. ముసుగు ఫొటో వేసి మరీ నన్ను ఎలా కొట్టొచ్చో హింటిచ్చినట్టున్నాను కదా :(
ReplyDelete@ వెంకట్ - అయబాబోయ్ - నాకే పాపం తెలియదు బాబోయ్. నేనే కామశాస్త్రి నయ్యుంటే అలా చప్ప చప్పగా నడుపుతానా :) కొన్ని నెలలనుండి అక్కడ ఏక్టివిటీ తగ్గింది కదా. ఎవరీ కామశాస్త్రి అని ఓ పోస్టేసి అప్పటి విశేషాలు కొన్ని అందరితో పంచుకోవాలనుకుంటూనే వాయిదా పడుతోంది. శృంగారం నింగ్ సైటు మాత్రం నేనే ప్రారంభించి తరువాత నిర్వహణ వేరే వారికి ఇచ్చాను.
ఏమోనండి ఎప్పుడో చిన్నప్పుడు చదివాను ఆయన గారి రచనలు, ఈరోజు మీరు అంటే గుర్తొచ్చింది. నా రూం మేట్ ఒకడు ఇంటర్నెట్ కు వెళ్ళి గంటకు 30 రూపాయలు పెట్టి ఫ్లాపి డీస్క్ లో డౌన్లోడ్ చేసుకొని వచ్చేవాడు ఆ కథలన్నీ :)
ReplyDeleteచాప చావటమా? నాన్సెన్స్..
ReplyDeleteపొనీ తెరచాపా?? మరి చచ్చిన తెరచాప అంటే చినిగిన తెరచాప అనా?
మంచు గారు ముసుగు అవసరం లేదు, కళ్ళజోడు తీసి (దాచి).
అసలు చేప ఐతే అర్దం లేని ప్రశ్న, ఈత వస్తే ఈదుతుంది, లేదా మునుగుతుంది దానికో ప్రశ్న అవసరమా?
@ వెంకట్ - అంటే ఇప్పుడు చదవడంలేదా హిట్స్ గ్రూపుల్లో లేక అలా చెప్పడానికి సిగ్గా? నాకు ఆయన స్వయంగా వ్రాసిన రచనలు సుత్తిగా వుండేవి కానీ ఇతరులవి చాలామందివి బావుండేవి. నాకు జిందగీ కమాల్ హై అనిపించినప్పుడల్లా ఓదార్పు కోసం హిట్స్ కో, శృంగారం సైటుకో వెళుతుంటాను.
ReplyDelete@ తార - అద్దే మరి మేధావి అంటే. అలా ఆకుకూ పోకకూ అందకుండా, ఇతరులకి అసలేవీ అర్ధం కాకుండా చర్చించాలి. నువ్వు గొప్ప మేధావి అయ్యే లక్షణాలు ఈ రకంగా చూస్తే చాలా వున్నాయి. సొ, చింత చచ్చినా పులుపు చావనట్లు చేప చచ్చినా ఈత చావదన్నమాట. హెంత గొప్ప సత్యం తెలుసుకున్నానీరోజూ!
అసలు చేప నిజంగానే చచ్చిందా ?
ReplyDeleteచచ్చిందని ఎలా నిర్ధారించారు, ప్రభుత్వ జంతువైద్యశాలనుండి తెచ్చిన సర్టిఫికెట్ ఏమన్నా వుందా?
చేప మంచినీటిలో పెరిగే చేప లేదా ఉప్పునీటిలొ వుండేదా?
మంచినీటిచేపని ఉప్పునీళ్ళల్లో వేస్తున్నారా లేక ఉప్పునీటి చేపని మంచినీళ్ళల్లో వేస్తున్నారా లేక మంచినీటిచేపని మంచినీళ్ళల్లో వేస్తున్నారా లేక ఉప్పునీటి చేపని ఉప్పునీళ్ళల్లో వేస్తున్నారా?
పై వన్నీ క్లారిఫై చెయ్యండి. అప్పుడు కూలంకుషంగా చర్చిద్దాం.
>> లేక అలా చెప్పడానికి సిగ్గా?
ReplyDeleteఆ యావ గురించి మనకెందుగ్గానీ, సదరు సంఘసేవకుడు తెలుగు జాతికి తీరని ద్రోహం చెశాడు.
యాహూ గ్రూప్ తర్వాత ఒక సైటెట్టి దానికి లిటరేచర్ పేరెట్టాడు ;(
పాపం, విషయం తెలీని అమాయకులకి గూగులమ్మ తప్పుదారి సూపి పాడు సెత్తాంది!
హె హె అంత సిగ్గు పడే వాడినే ఐతే అసలు కామ శాస్త్రి పేరు మీరు చెప్పినప్పుడు ఎవరండీ ఆయన అని రాముడు మంచి బాలుడు టైప్ లో అడిగే వాడిని కదా?అవన్ని ఇంటర్,డిగ్రీ ఫస్ట్ యియర్ లోనే ఐపోయాయి.ఇప్పుడు ఇంట్రెస్టు లేదు టైం అంతకంటే లేదు ;)
ReplyDeleteఅవును అసలు చేపని చంపే హక్కు మీకు ఎవరు ఇచ్చారు?
ReplyDeleteచచ్చిన చేపని నీళ్ళల్లో వేసే హక్కు ఎవరు ఇచ్చారు.
అసలు దీనికి కారణం గ్లోబలైజేషన్ కదూ.
@ బద్రి - ఒప్పుకుంటున్నా, నువ్వు కూడా మహా మేధావి వనీ ఒప్పుకుంటున్నా, మీలో హింత తాత్విక చింతన వుందనీ, చచ్చిపోయిన చేప గురించి ఇంతగా (తాత్విక మరియు మేధొ చింతన) చింతిస్తారనీ ఇప్పటిదాకా తెలియని హమాయకుడిని. నన్నొదిలిపెట్టండి బాబోయ్. ఎరక్కపోయి పెట్టాను ఈ టపా :(
ReplyDelete@ తార - వార్నీ, చచ్చిన చేపక్కూడా మానవ హక్కులూ, ఒక అది స్త్రీ అయితే మహిళా హక్కులూ వుంటాయా? దాన్ని నేనే చంపానని చెప్పి గృహ చేప హింస క్రింద కూడా కేసవుద్ది అంటున్నారా? దాని ఫుటో నా టపాలో పెట్టాను కాబట్టీ దాని ఆత్మాభిమానానికీ, పర్సనల్ స్పేసుకీ( కల్పన గారికి క్షమాపణలతో - సరదాగా తీసుకుంటారని ఆశిస్తూ) దెబ్బేనంటారా :(
@విట్ రియల్ - అలాగేం. ఏం సైటు పెట్టాడబ్బా?! ఓ తూరి చెప్పుకోకూడదూ ఆ సైటు పేరేంటో?
@ వెంకట్ - హ్మ్. అదే మన జీవితాల్లో ఐరనీ. అవన్నీ కుర్ర వయసు వ్యవహారాలు మాత్రమే అనుకుంటాం. సర్లెండి.
>> అదే మన జీవితాల్లో ఐరనీ.
ReplyDelete>> అవన్నీ కుర్ర వయసు వ్యవహారాలు మాత్రమే
>> అనుకుంటాం. సర్లెండి
ఓసొస్, ఇదెదో మీకు సరిపొయ్యెట్టుంది, ఈ ఇషయం తెల్వదంటే!!
గూగుల్ తీసి తెలుగు లిటరేచర్ కొట్టి సూడండి....feeling lucky నొక్కమాకండి, ఉజ్జొగం ఊడిపొద్ది!
అంతేనండి, చేప అంటె అంత అలుసైపొయింది.
ReplyDeleteఅల్పప్రాణి(అందులొ చచ్చిపోయింది) అనే కదా ఈ డిస్కషన్ ఆపెస్తామన్నారు. అదే ఏ రామాయణ కల్పవృక్షమో విషవృక్షమో అయితే ఇలా అప్పుడే ఫుల్ స్టాప్ పెట్టేవాళ్ళా?
దీంతోనే అర్ధమవుతుంది మీ అగ్రప్రాణుల అభిజాత్యం.
ఇలా మానవ చేప హక్కుల సంఘం వారూ, మహిళా చేప సంఘాల వారూ, జంతు చేప సంఘాల వారూ, చేపన్నలూ ఇలా నా టపా మీద మూకుమ్మడిగా దాడిచేస్తే నా టపా పీకి పడేస్తానంతే. హన్నా. చచ్చిన చేప గురించి వ్రాసాను కాబట్టే కదా మీ కింత హక్కుల ఆగ్రహం! బ్రతికివున్న చేపని గురించి వ్రాస్తే నా జోలికి వచ్చేవారా మీరూ!
ReplyDeleteచేప చచ్చినా బ్రతికినా చేప చేపేనని నాకు చేపల మీద అపరిమితమయిన గౌరవభావం వుందనీ, చచ్చిన చేప చావు మనోభావాలు ఏ కారణం చేతనయినా గాయపరిస్తే మన్నించ వలసిందిగా చేపన్నలను కోరుతున్నాను.
మీ టపా చాలా ఆలస్యంగా చూశాను, సారీ. ఏంటండీ బొత్తిగా మసాలా లేకుండా రాస్తే జనాలు ఎలా ఇన్వాల్వ్ అవుతారు? వేడి వేడి డిస్కషన్లు ఎలా జరుగుతై?
ReplyDeleteనేనైతే - పురాణకాలంలో చేపలు తినేవారా అనో, (తినేవారని ఓ శ్లోకం కూడా ఎక్కడో సంపాదిద్దును), జలపుష్పాలు వెజ్జా, నాన్-వెజ్జా అనో టపా పెడుదును. ఇంకా దుమ్ము రేపాలంటే, మత్స్యావతారం గురించి కూడా ఓ టపా కొట్టొచ్చు. :-)
బద్రి,
ReplyDeleteఅసలు చేప నిజంగానే చచ్చిందా ?
చచ్చిందని ఎలా నిర్ధారించారు, ప్రభుత్వ జంతువైద్యశాలనుండి తెచ్చిన సర్టిఫికెట్ ఏమన్నా వుందా?
చేప మంచినీటిలో పెరిగే చేప లేదా ఉప్పునీటిలొ వుండేదా?
మంచినీటిచేపని ఉప్పునీళ్ళల్లో వేస్తున్నారా లేక ఉప్పునీటి చేపని మంచినీళ్ళల్లో వేస్తున్నారా లేక మంచినీటిచేపని మంచినీళ్ళల్లో వేస్తున్నారా లేక ఉప్పునీటి చేపని ఉప్పునీళ్ళల్లో వేస్తున్నారా?
చేప గురించి మీ సందేహాలు మరీ ఒరిస్సా బార్డర్ స్థాయిలో ఉన్నాయి. నాకేం నచ్చలేదు.
తార ,టీవీ 9 లేని లోటు తీరుస్తున్నారా? ఇక్కడ కూడా గ్లోబలైజేషన్ ను తెచ్చి! అమ్మో!
శరత్,
మొత్తానికి నా బ్లాగుకు కూడా హిట్స్ పెంచారు మీరూ మలక్ కలిసి!
సుజాతగారు, మా ఊరు ఒరిస్సా బార్డర్ కి కాస్త దగ్గరేలెండి. కాబట్టి ఆ స్థాయి(?)లోనే వుంటాయనుకుంటా.
ReplyDeleteఇంక మీకు నచ్చలేదంటారా, ఇలా అంతర్జాతీయ సమస్యల గురించి చర్చించేప్పుడు ఇలాంటివన్నీ తప్పవండి. అందరి అభిప్రాయాలు పరిగణలోనికి తీసుకోవాలి మరి.
ఈ విషయంలో కూడా నాకు అభివృద్ది చెందిన ప్రదేశాలవారి అభిజాత్యం కనిపిస్తుంది. So much for your ... (ఎవరైనా ఇక్కడ సరిపోయే పదం సజెస్ట్ చెయ్యండి). (సుజాతగారు, సరదాగా రాశా ఏమనుకోకండేం)
(@తెలుగు భాషాభిమానులు, నేను పైన రాసిందాన్లో తప్పులేమైనా వుంటే క్షమించండి)
సుజాతగారు నాకు టివీ 9 సంగతి తెలియదు అండి, మా ఇంట్లో ఈటివీ -౨ తప్ప మిగతా వార్తా చానెల్స్ ని నిషేదించాం.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDelete