ఇండియా నుండి ద్రౌపది వచ్చేసిందండోయ్!

అపార్ధం చేసుకోకండి. నాయకి ద్రౌపది కాదు - నవలా ద్రౌపది వచ్చింది. వెబ్సైటు నుండి ఆర్డర్ చేస్తే నిన్ననే ఇండియా నుండి వచ్చింది. చాలా కష్టపడి ఆ ప్యాకేజీ విప్పానని మా ఆవిడ చెప్పింది. ఏంటీ ఈ నవల, దీనినంత అర్జంటుగా ఇండియా నుండి తెప్పించుకునీ చదవడం అవసరమా అని అడిగింది. ఈ నవలను అర్జంటుగా చదవకపోతే కొంపలంటుకుపోతాయి అన్న లెవల్లో సీనిచ్చా. అలా అయితే ఈ నవల ముందు నేనే చదువుతా అని ముందేసుకుంది.

రెండు నిమిషాలు చదివిందో లేదో క్రిష్నుడికి ద్రౌపది సఖి అంటాడేమిటీ అని ధర్మసంధం లేవనెత్తింది. వార్నీ రెండు నిమిషాలు ఆ నవల చదివావో లేదో కథ అంతవరకూ వచ్చిందీ అని బోలెడు ఆశ్చర్యపోయా. అలా అని ఊరుకుందా - ఊరుకోలేదు - మళ్ళీ రెట్టించి అదే సందేహాన్ని అడిగింది. నా గొంతులో పచ్చివెలగకాయ పడింది. అంటే గొప్పోళ్ళ వ్రాతలు అంత వీజీగా మనకు అర్ధం కావు - నవల అసాంతమూ చదవాలి - అప్పుడు కానీ మనకు లైటు వెలగదేమో అని సెలవిచ్చాను. నిజంగానే నవల అప్పుడే శ్రీక్రిష్ణుడూ, ద్రౌపదిల సఖ్యత దాకా వచ్చిందీ అని మళ్ళీ బోల్డు హాశ్చర్యపోయా. మా ఆవిడ పేజీలు అటూ ఇటూ తిప్పి ఇంకా కథ చదవడం మొదలెట్టలా - ఇదేదో ఉపోద్ఘాతమో, మరేదో వున్నట్లుంది - అందులో వుంది అని అంది. హర్రే - ఎవరో గానీ నవలలోని సస్పెన్స్ ముందే విప్పదీసేసారా అని మళ్ళీ హాశ్చర్యపోయా!

ఎనీ వేస్, ద్రౌపది వచ్చింది - ఇక ఇరగదీసెయ్యాలంతే. రాత్రే పరిచయాలూ గట్రా చదివేసి వార్మప్ అయ్యా. గొప్ప నవల కదా - గొప్ప గొప్పోళ్ళే పరిచయాలు వ్రాసేరు.

కొసమెరుపు: ఎంత తగలేసి ( మా ఆవిడ భాషలో) ఇండియా నుండి ఈ నవల తెప్పించావూ అని మా ఆవిడ ఎందుకో ఇంకా అడగలా. అడిగివుంటే ఒక సీను అయిపోయి మనస్సుకు కాస్త ప్రశాంతంగా వుండేదేమో. ఆ మధురక్షణాలు ఇవాళ వస్తాయేమోనని కాస్త ఇదిగానే వుంది.

23 comments:

  1. మీరు పెట్టిన ఫోటో బాగోలేదు. నవల ఫ్రంటు పేజీ స్కాన్ చేసి పెట్టొచ్చు కదండి. ఆ నవల కోసం గీసిన ద్రౌపది బొమ్మ ఎంత అందంగా ఉంటుందో గమనించారా? ;)))

    ReplyDelete
  2. మీరు ఆ నవల చదివిన తర్వాత, అది రాసిన రచయితను బూతులు తిట్టాలనిపిస్తే మాత్రం,

    E-mail : YLP1953@YLP.COM, YLP1953@INDIA.COM
    Phone :(R)0891-2515555, 2553030 (O):270110, Mobile:98490-67343


    పైన మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్లు ఇచ్చాను కదా. ఇక మీ ఇష్టం. అతణ్ణి పొగుడుతారో, బూతులు తిడతారో.

    ReplyDelete
  3. @ నాగప్రసాద్
    అప్పుడప్పుడు అందం కంటే కూడానూ భావానికే ప్రాధాన్యత ఇవ్వాల్సివస్తుంది :)
    ఈ టపాలో ఎక్కువగా క్రిష్ణ + ద్రౌపదిల 'సఖ్యత' గురించే వ్రాసాను కాబట్టి అలాంటి ఫోటో పెట్టాను. మీరు ద్రౌపదిని ఒక్కరినే చూస్తున్నారు - నేను ఇద్దరినీ చూస్తున్నాను ;)

    యార్లగడ్డ కాంటాక్ట్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు కానీ అభిప్రాయాలు వారికి చెప్పేంత ఓపిక నాకు వుంటుందనుకోను. ఏవో ఒకటీ రెండూ విషయాలు తప్ప నాకు ఎక్కువగా నవల నచ్చే అవకాశాలే వున్నాయి. నవల చదివాక నాకు ఏం నచ్చిందో, ఏం జీర్ణం కాలేదో తెలియజేస్తాను.

    @ కోలా
    నా మీద ఎంత నమ్మకమో మీకు :)

    ReplyDelete
  4. బుతులు కాదు బండ బుతులు తీట్టండి ఆడిని........

    ReplyDelete
  5. శరత్ గారు ద్రౌపది ని స్కాన్ చేసి పెట్టండి నేను చదువుతా

    ReplyDelete
  6. అయితే నేను నవల చవక్కర్లేదన్నమాట...
    మీ బ్లాగ్ ఫాలో అయితే చాలన్నమాట!:)

    ReplyDelete
  7. @ పవన్
    ఈ విషయంలో మన అభిప్రాయాలు కలవకపోవచ్చు. మన్నించండి.

    @ శ్రీనివాస్
    అది తప్పు కదండీ. పుస్తకాలు కొని చదవాలి. సినిమాలు మాత్రం మేమిక్కడ ఒక డాలర్ పెట్టి పైరేటెడ్ కాపీస్ చూస్తాం కానీ అది వేరే విషయం.

    @ ప్రేరణ
    ఇప్పటివరకూ 10 పేజీలు చదివానండీ. ద్రౌపది సౌందర్య వర్ణన, అంతరంగ చిత్రణ ఇప్పటివరకయితే అద్భుతంగా వుంది. మొదటిపేరాలోనే ఇలా వుంది ఆమె గురించి "వెలుగురేఖలు ఆమెను కౌగిలించుకొని వెచ్చదనాన్ని అనుభవించేందుకు ఆతురత పడుతున్నాయి"

    నానుండి రన్నింగ్ రీడింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారాండీ :)

    ReplyDelete
  8. మహాభారతం మొత్తంలో కృష్ణుడి unconditional support ఇద్దరికే ఉంటుంది. ఒకరు అర్జునుడు. మరొకరు ద్రౌపది. అలాగే వీరిద్దరిదీ కృష్ణుడిపట్ల అవిభాజ్యమైన,అనన్యమైన ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమని కేవలం సెక్స్ మాత్రమే అనుకునే దౌర్భాగ్యం ఈ ఛాంధసవాదుల పుణ్యమాఅని దాపురించింది. వాళ్ళుమాత్రం ఏంచేస్తారు...వాళ్ళకు తెలిసిందే ఇలాంటి ఆలోచనలు మరి! ఇదే ధోరణిలో ఆలోచించి అర్జునుడు-కృష్ణుడు "గే" అన్నా పెద్దగా ఆశ్చర్యం లేదు. వీళ్ళఖర్మ...మీ ఆనందం.

    ReplyDelete
  9. మహేష్ గారు,
    చాందసవాదులు అంటే అన్న చేల్లిల బందాన్ని ప్రేమ గా చేపుతున్న వారా ..లేక పవిత్ర గ్రంధాలని కుడా బ్రష్టుపట్టించి మనల్ని మనమే లోకువచేసుకుంటున్న వారా ఏవరు???

    ReplyDelete
  10. Mahesh, bagundi, kotta idea krishnarjunklu gays', NTV vaadiki cheppi sharat blog mooyincheddam, krishnarujunulu gays ani blog lo undi ani oka charcha petti, hyderabad alla kallolam cheddam

    ReplyDelete
  11. ద్రౌపది నవల ఇండియా నుంచి తేప్పించుకోని మరి చదివారా శరత్ గారు ...గుర్ర్.ర్ర్.ర్ర్.ర్ర్.ర్ర్

    ReplyDelete
  12. @ కత్తి
    మేమింకా నవల చదవలేదు కదండీ. చదవక ముందు మాలో ఏర్పడ్డ అపోహలు వ్రాసాను. రచయిత ఏం వ్రాసేరు, ఎంతవరకు వ్రాసేరు, ఎలా సమర్ధించుకుంటూ వ్రాసేరు అనేది చదివితే కానీ అర్ధం కాదు. చదివాక మళ్ళీ చెబుతాం. అవునూ మీరు ఇప్పటికయినా నవల చదివేరా?

    ఇంకేం, శ్రీక్రిష్ణుడు కూడా నాలాగా బై సెక్సువల్ అన్నమాటే! నేనూ ఆ కోణం లో నవల వ్రాస్తాను - అవార్డ్ తెచ్చుకుంటాను.

    నేను ఎక్కువగా ఈ నవల గురించి వెటకారంగా వ్రాస్తున్నానని అనిపించవచ్చు కానీ అది ఒక బుల్లి ఎత్తుగడ ;)

    @ అజ్ఞాత
    బాబ్బాబూ, ఆ పని చేయి బాబూ, మీకు పుణ్యం వుంటుంది. అస్సలే నా బ్లాగు గురించి దినపత్రికలలో ఎవ్వరూ వ్రాయక టి ఆర్ పి రేటింగులు తక్కువగా వున్నాయి. ప్లీజ్, ఈ బ్లాగు గురించీ, ఈ వ్యవహారం గురించీ ఎవరయినా టివి ఛానళ్ళకు ఉప్పందించండయ్యా బాబులూ. నాకు మాంఛి మైలేజీ వస్తుంది. అంతకూ మూసేసుకోవాల్సొస్తే ఈ తొక్కలో బ్లాగు మూసుకొని మరో బ్లాగు తెరచుకుంటా కానీ యార్లగడ్డకి వచ్చినంత ఫేమ్ నాకు రావాలి సుమా.

    @ పవన్
    ఆ నవల ఎలాగోలా చదవకపోతే నన్ను ప్రజలు మేధావి అనుకోరు కదండీ!

    ReplyDelete
  13. @మహేష్ ఆ ప్రేమని కేవలం సెక్స్ మాత్రమే అనుకునే దౌర్భాగ్యం ఈ ఛాంధసవాదుల పుణ్యమాఅని దాపురించింది
    ------
    ఈ దౌర్భాగ్యం ఎవరికీ ఎక్కువ గా ఉందో బ్లాగులు చదివే అందరికి తెలుసు నువ్వు ఊరికే భుజాలు తడుముకోకు .
    అర్జునుడు-కృష్ణుడు "గే" అన్నా పెద్దగా ఆశ్చర్యం లేదు.
    ---
    ఇది నీ నికృష్టమైన ఆలోచనలు కు పరాకాష్ట .
    నిన్ను నువ్వు పెద్ద మేధావి లాగా ఊహించుకోకు , నిన్న గాక మొన్న ఈ నవల మీద నువ్వు రాసిన పోస్టు మళ్ళి ఒకసారి చదువుకో నీ బుద్ది ఎమన్నా తెలుస్తుందేమో నీ రాతలు చదవటం మాది ఖర్మ.

    ReplyDelete
  14. మీరు చదువుతుంటే మీ ఆవిడ ఊ కొడుతుందా?
    మీ ఆవిడ చదువుతుంటే మీరు ఊ కొడుతున్నారా?

    ReplyDelete
  15. వివాదాలు పక్కనపెడితే నవల చాలా సాధారణ స్థాయిలో ఉంది. సాహిత్య అకాడెమీ అవార్డ్ ఇప్పుడు ఈ స్థాయి నవలలకు ఇస్తున్నారా అని ఆశ్చర్యం వేసింది. నవల్లో చాలా అస్పష్టత ఉంది. ద్రౌపది మనోగతాన్ని విస్తృతంగా ఏమీ ఆవిష్కరించలేదు రచయిత.

    శరత్,తెప్పించుకున్న వారు సైలెంట్ గా చదవక బ్లాగులో రాశారుగా! ఇదిగో ఇలాగే అందరూ తలా ఒక అభిప్రాయం చెప్తారు.మీకు ఫ్రెష్ గా చదివిన ఫీలింగ్ ఉండదు చూడండి.

    ReplyDelete
  16. @పవన్: మానవీయ భావాలకు అర్థం తెలియనివాళ్ళకు "ప్రేమ" అంటే బూతే అనుకుంటాను.

    కృష్ణభక్తిలో సఖాసఖుల సాంప్రదాయానికి చాలా విశిష్టత ఉంది. మరీ ముఖ్యంగా కృష్ణ(ద్రౌపది)-కృష్ణుడి ప్రేమకు మహాభారతంలో చాలా కీలక ప్రాముఖ్యత ఉంది. కథపరంగా కృష్ణుడు ధర్మసంస్థాపనకు అవతరిస్తే,ద్రౌపది ఆ ప్రక్రియలో ముఖ్యమైన భాగమవ్వడానికి ‘యాజ్ఞసేని’గా జన్మించింది.They are bound by destiny. They are bonded by unconditional love. ఇందులో మీకు కనిపిస్తున్న బూతేమిటో దీనిద్వారా ప్రవిత్రగ్రంధాలకు పట్టినభ్రష్టేమిటో నాకైతే అర్థంకాలేదు. కాకపోతే మీలాంటి ఛాంధసవాదుల మనసులకు పట్టిన మకిలిమాత్రం సుస్పష్టంగా తెలుస్తోంది.

    ReplyDelete
  17. @ పానీపూరి
    అంత లేదండీ మామధ్య. ఎవరూ ఎవరికీ ఊ కొట్టడం లేదు. ఎవరికి వాళ్ళమే కొట్టుకుంటున్నాము.

    @ సుజాత
    ఇప్పటికి 4,5 భాగాలు చదివాను. ఈ ఇతిహాసాలు ఎవరు వ్రాసినా ఆసక్తికరంగానే వుంటాయనుకుంటా. గొప్పగా వుందో, సాధారణంగా వుందో అర్ధం కావడం లేదు కానీ ఆగకుండా మాత్రం చదవాలనిపిస్తోంది.

    ఇక ఈ నవల గురించిన వివాదాల పుణ్యమా అని ఫ్రెష్ ఫీలింగు ఎప్పుడో పోయింది కదండీ. ఇప్పుడిక అందరూ ఏమనుకుంటున్నారో చూస్తూ మనకెలా అనిపిస్తోందో బేరీజు వేసుకోవడంలో మజా అనిపిస్తోంది. నాకు నా అభిప్రాయం కంటే కూడా మా ఆవిడ అబిప్రాయంపై ఆసక్తిగా వుంది ఎందుకంటే తను మేధావీ కాదు - మేతావీ కాదు - సాధారణ గృహిణి. అలాంటివారి స్పందన ఎలా వుంటుందో చూడాలి. తను ఇంకా మొదలెట్టలేదు - పరిచయాలు మాత్రం చదివేసినట్లుంది.

    ReplyDelete
  18. మొత్తానికి మీరూ పడిపోయారు. ఈ పుస్తకంలో బూతు ఉందా లేదా అని కనుక్కోవటానికి దీన్ని చదివితే అంతకంటే దరిద్రం మరోటి లేదు. దానికి బదులు కాస్తో, కూస్తో కష్టపడి మహాభారతం వచనాన్నే చదివొచ్చు. ఆ తర్వాత ద్రౌపది గురించి మనకే సాధ్యమైనంత అర్థమవుతుంది. ఇంకా అర్థమవకపోతే, ఓ సైకియాట్రిష్టో, ఓషో లాంటి వెయిటేజీ ఉన్నతను ఏదైనా రాస్తే అది చదివితే అర్థమవుద్ది. (ఓషో నిజంగానే ద్రౌపది గురించి,Sreekrishna the man and his philosophy లో కాస్త రాశారు).

    ఏదేమైనా, ఈ రచయిత టేలెంటు చూస్తే ముచ్చటేస్తుంది.

    ReplyDelete
  19. శరత్ గారు వ్యాఖ్యల ఆధారంగా నాకు వచ్చిన చిన్న సందేహమిది.. ద్రౌపది పుస్తకం చదివి.... నచ్చితే మేధావుల లెక్కా? నచ్చకపొతే మేధావుల లెక్కా?

    ReplyDelete
  20. ప్చ్... నేనింకా కొనలేదు... చదవలేదు... :(

    ReplyDelete
  21. శరత్: నేను నవల చదివాను. సుజాత గారు చెప్పినట్లు చాలా సాధారణంగా ఉంది. దీనికన్నా ‘యాజ్ఞసేని’ వందరెట్లు బాగుంటుంది. ‘పర్వ’ వెయ్యిరెట్లు బాగుంటుంది.

    ReplyDelete
  22. @ రవి
    చూద్దాం. యార్లగడ్డ గారు కూడా ఎలా పడగొట్టారో.

    @ రమణి
    నచ్చడం నచ్చకపోవడం అటుంచి చదివి వ్యాఖ్యానిస్తే మేధావి, చదవకుండానే వ్యాఖ్యానిస్తే మేతావి అని నా అభిప్రాయం. మరి నాలాంటి చదువుతూ వ్యాఖ్యానిస్తున్నవారిని ఏమంటారో మీరే చెప్పాలి.

    @ చైతన్య
    గొప్ప నవల కాకపోయినా యార్లగడ్డ ఏ కోణంలో ద్రౌపది గురించి చెప్పేరు, ఎంత ధైర్యంగా చెప్పారు అన్నది తెలుసుకోవడం కోసమయినా చదివేయొచ్చు. ఇప్పటికి నేను సగం చదివాను.

    @ కత్తి
    ద్రౌపదికి వున్న యాజ్ఞసేని అన్న పేరు బావుంది. ఆ నవలా నాకూ చదవాలనిపిస్తోంది.

    ReplyDelete