The Hidden Gifts of the Introverted Child

మా ఒక కిడ్ ని గత మూడేళ్ళుగా ఎందుకు అంతర్ముఖం  (ఎడమచేతివాటం వారి లా )  తో వుంటున్నావని కోప్పడుతూ అందరిలాగా ఎందుకు బహిర్ముఖం  (కుడిచేతివాటం వారిలా ) తో ఉండకూడదూ అని ప్రశ్నించి, తన ఎడమచేతివాటం తో విసిగిపోయి, నిర్లిప్తతతో తనమానాన తనను వదిలేసిన గొప్ప పేరెంటును నేను. ఎడమచేతివాటం, కుడిచేతివాటం ఎలాంటివో అంతర్ముఖం, బహిర్ముఖం అలాంటివి. ఎడంచేతివాటం వారినయితే ఎలా కుడిచేతివాటం వారి మాదిరిగా మారమని కోరమో అలాగే అంతర్ముఖులని బహిర్ముఖులుగా మారాల్సిందిగా ఒత్తిడి చేయాల్సినపనిలేదనేది ఈ పుస్తకమ్లోని అభిప్రాయం.

ఇన్నాళ్ళకి..ఇన్నాళ్ళకి (అయినా) అంతర్ముఖం పొరపాటు ఏమీ కాదని అర్ధం చేసుకొన్న/చేసుకొంటున్న వ్యక్తిని నేను! బహిర్ముఖులు కుడిచేతి వాటం లాంటి వారు అయితే అంతర్ముఖులు ఎడమచేతివాటం లాంటి వారే అని, అందులో అపరాధం ఏమీలేదని మా కిడ్ క్యూస్ ఇస్తున్నా కూడా పట్టించుకోకుండా అందరిలాగా ఎందుకు అందరితో కలిసిమెలసి వుండవు అంటూ నిందించాము.  ఒంటరిగా వుండే స్వేఛ్ఛకోసం తను ప్రాకులాడుతుంటే తనలోకి తాను కుచించుకుపోవడం ఏమిటా అని ఆందోళన పడ్దాను నేను. ఇంట్లో స్వేఛ్చ లేదని తన కజిన్స్ తో మొరెట్టుకుంటే నేనేమిటీ (తగిన) స్వేఛ్ఛ నివ్వకపోవడం ఏమిటి అని విస్మయం చెందేను.   తను ఆశిస్తున్నది ఒంటరిగా, ప్రశాంతంగా, తనలోకంలో తాను వుండే స్వేఛ్ఛ అని గుర్తెరగని అజ్ఞానిని నేను.

ఒక తీరిక సమయాన ఒక వీకెండ్ అంతా మా కిడ్ బెహేవియర్ గురించి అంతర్జాలంలో రెసెర్చ్ చేసి కనుక్కున్నది/నేర్చుకున్నది ఏమిటంటే తన అంతర్ముఖత్వం లో పొరపాటు ఏమీ లేదని. అది అర్ధమయ్యాక ఇన్నాళ్ళుగా/ఇన్నేళ్ళుగా తనని అపార్ధం చేసుకున్నందుకు క్షమాపణలు అడిగి ఇకముందు నా పూర్తి సహకారం వుంటుందని హామీ ఇచ్చాను. ఇంట్లో ఇతరులనీ కొంత ఎడ్యుకేట్ చేసాను.  మరింత తెలుసుకోవడం కోసం ఈ బుక్ చదువుతున్నాను. 
The Hidden Gifts of the Introverted Child: Helping Your Child Thrive in an Extroverted World

మీకూ ఇంట్రావర్ట్స్ తటస్థపడితే అర్ధం చేసుకోండి. మీ సన్నిహితులెవరయినా అంతర్ముఖులయితే ఇలాంటి పుస్తకాలు చదివి తెలుసుకొని మద్దతుగా నిలవండి. 

2 comments:

 1. శరత్ గారూ మీరేనా ఇలా చేసింది? నమ్మబుద్ధికావడం లేదు. అయినా ఎడమ చేతి వాటం వల్ల ఇబ్బంది ఏమిటి? ఎలాంటి నష్టాలు ఉన్నాయి? ఒక చిన్న విషయాన్ని పెద్దదైగా చేసి ఆ పాప / బాబును కచ్చితంగా చాలా ఇబ్బంది పెట్టారు.

  అంతర్ముఖుల గురించి నా అనుభవంలోని విషయాలు మీతో పంచుకుంటాను. ఉపాధ్యాయుడిగా పిల్లలతో నిరంతరం కలసి ఉంటాము కాబట్టి.

  అంతర్ముఖులు మూడు రకాలు. 1. ఇంఫీరియారిటీ కాంప్లెక్సు వల్ల 2) పరిస్థితుల ప్రభావం వల్ల: స్కూల్ లేదా బయట జీవితంలో పిల్లలు తీవ్ర సంఘర్షణ ఎదుర్కున్నపుడు పూర్తిగా ముడుచుకుపోతారు. తోటి పిల్లలు ఏడ్పించడం, వెలివేయడం లాంటి సందర్భాలు. ( ఈ కేసులు ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయని వార్తలు) 3) సహజంగానే అంతర్ముఖులుగా వుండటం.

  మన చదువులు సిద్ధాంతాలు చైతన్యం ఇవన్నీ పిల్లల పెంపకం విషయంలో ఢమాల్ అంటాయి. ఎక్కడో ఒక చోట తప్పు చేస్తూనే వుంటాము. మన పెద్దరికం, ఈగో , మనకే స్పష్టతలేని కొన్ని సమంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఇవన్నీ పిల్లలకు మానసిక పరీక్షలు. ఐతే తప్పులు లేకుండా పిల్లల్ని పెంచేవాళ్ళు నూటికి ఒకరు ఉంటే గొప్ప. తప్పు చేశారే అనుకో మీ మాదిరి ఎంత మంది లెంపలు వేసుకుంటారు?

  ReplyDelete
 2. @ జీవని
  మీ అనుభవపూర్వకమయిన పరిశీలనలను నాతో/మాతో మీరు పంచుకున్నందుకు సంతోషం.

  ఎడమ,కుడి చేతి వాటంల విషయంలో మీరు నన్ను అపార్ధం చేసుకున్నారు. అంతర్/బహిర్ ముఖాలకు సింబాలిక్ గా అలా ప్రస్థావించాను. అక్కడ స్పష్టత కోసం వ్యాక్యాలని సవరిస్తాను.

  1. మీరు చెప్పిన మొదటి కారణం కూడా కొంత వుంది. కౌన్సిలింగ్ చేసి, ఇతర చర్యలు చేపట్టి అది తగ్గించాము. టీనేజిలో చాలా నెగటివ్ ఆలోచనలు పెట్టుకొని కాంప్లెక్స్ కి గురవుతుంటారు.
  2. రెండవ కారణం (టీనేజ్ డిప్రెషన్) అయివుండొచ్చన్న అనుమానంతో డాక్టర్ తో పరీక్ష చేయించాను.
  3. ఇది మాంద్యం కాదని సహజమయిన అంతర్ముఖం అని డాక్టర్ నిర్ధారించారు. మా కిడ్ అభిప్రాయం కూడా అదే.

  ReplyDelete