... అంతకు మించిన మార్గం వుంది కదా. ఏకంగా మగతనాన్ని నిషేధిస్తే సరి. దెబ్బకి అన్ని సమస్యలూ తీరతాయి. పల్లెటూర్లలో ఎద్దులకు వృషణాలు ఎందుకు నలగగొడతారో తెలుసు కదా - ఆవుల వెంట పడకుండా బుద్ధిగా పొలం పనులు చెయ్యడం కోసం. మగాళ్లకూ అంతే చేస్తే సరి. సింపుల్ సొల్యూషన్!
ప్రొటీన్ ప్రయోగ ఫలితాలు
ఇదివరకు జిమ్ములో కొద్ది బరువులు ఎత్తడానికే నిక్కి నీల్గేవాడిని. ఇప్పుడు బరువులు క్రమంగా పెంచుతున్నా కూడా అలసట లేదు, నొప్పిలేదు. అయితే నన్ను నేను ఛాలెంజ్ చేసుకునే దశకి ఇందువల్ల ఇంకా వెళ్ళలేకపోతున్నాలెండి. చెప్పా కదా, జాగ్రత్తగా, నెమ్మదిగా బరువులు పెంచేస్తున్నా అనీ. జిమ్ములో నో పెయిన్, నో గెయిన్ సూత్రం వర్తిస్తుంది. మనల్ని మనం ఏరోజుకారోజు సవాలు చేసుకుంటూ వెయిట్స్ పెంచేస్తేనే కండరాల టిస్యూ బ్రేక్ అయ్యి నొప్పులు వస్తాయి. ఆ తరువాత శరీరానికి తగినంత అహారమూ, నిద్రా, విశ్రాంతి, ప్రోటీన్ ఇస్తే ఆ కండరాల టిస్యూ రికవర్ అయిపోయి వాటి పరిమాణం పెరుగుతుంది.
ఓవర్-ట్రైనింగ్ సిండ్రోమ్ లక్షణాలు ఇంతవరకూ అయితే కనిపించలేదు - సంతోషం. ఇంతవరకూ ఎలాంటి అనారోగ్యం కలగలేదు పైగా ఆరోగ్యం మరింత మెరుగయ్యింది- మరీ సంతోషం. సో, ఇప్పటిదాకా వ్యాయామాన్ని మొదటి గేర్ లో జాగ్రత్తగా, భయంభయంగా, బిక్కుబిక్కు మనుకుంటూ చేస్తున్నవాడినల్లా ఇక రేపటి నుండి రెండో గేర్ లో బండి నడిపిస్తాను. ఇదివరకు జిమ్ము లో వెయిట్స్ చేసినప్పుడల్లా ప్రమాదాలు (ఓవర్ ట్రైనింగ్ సిండ్రోమ్) జరిగాయి కాబట్టి ఇప్పటిదాకా వళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తూ వస్తున్నాను. నా ప్రొటీన్ ప్రయోగం పనిచేస్తున్నట్లే వుంది. రోజుకి వంద గ్రాముల పీనట్ బటర్ ఫ్లేవర్ ప్రోటీన్ డ్రింక్ తీసుకుంటున్నా మరి. నేను వాడుతున్న బ్రాండ్ BSN SYNTHIA-6 ఎంత కమ్మని రుచీ!
మీలో ఎవరయినా వెయిట్స్ చేస్తున్నవాళ్ళుంటే నా ఈ పోస్టులకు స్పందిద్దురూ.
ఇంట్లో ఎవరూ లేరు - ఒక్కడినే వున్నా. ఇలాంటప్పుడు పబ్బులకు గట్రా వెళ్ళి అందాలను అవలోకిస్తూ కాలక్షేపం చెయ్యొచ్చుగా అని నాకు ఇండియా నుండి కొన్ని ఉత్సాహవంతమయిన వర్గాల ద్వారా ప్రోత్సాహాలు భలేగా అందుతుంటాయి కానీ... ప్చ్... కంపెనీ లేదండీ. నా ఇక్కడి మిత్రులంతా మహా పొదుపరులూ, మదుపరులూనూ. అంతా శ్రీరామచంద్రుళ్ళా ప్రవర్తిస్తారు. హొక్కడినే లింగులిటుక్కూ మనుకుంటూ ఏం వెళతాం పబ్బులకు గానీ, ప్రదర్శన శాలలకు గానీ! నేను కెనడాలో వున్నప్పుడు పరిస్థితి వేరుగా వుండేది. పబ్బులకు పోలేదు కానీ మిత్రులతో కలిసి మసాజులకీ, నగ్ననృత్యాలకి అప్పుడప్పుడయినా వెళుతుండేవాడిని. ఇండియా నుండి ఎవరయినా కొత్తగా వస్తే అవి పరిచయం చేసి కాస్తో కూస్తో పుణ్యం మూటగట్టుకునేవాడిని. జోకనుకోకండీ - నిజవే. మొదటిసారి అవి చూసాకా వాళ్ళు ఉబ్బితబ్బిబ్బయ్యి (?!) నన్నో పుణ్యపురుషుడిలా ప్రస్థుతించేవారు మరీ.
రాత్రి 12 కావస్తోంది. నిద్రొస్తోంది. ఇహ పడుకుంటానండి.
ఓషో మరియు చలం లకు అభిమాని.
Subscribe to:
Posts (Atom)