ఒక దీర్ఘకాల సమస్య తీరిపోయిందోచ్!

లాక్టోజ్ ఇంటోలరెన్సుతో ( Lactose Intolerance) నా యుక్తవయస్సు నుండీ అవస్థ పడుతున్నాను. అసలు విషయం అదని తెలియక ఇండియాలో వున్నప్పుడు ఎంతోమంది దద్దమ్మ డాక్టర్లకు నా సమస్య మొరపెట్టుకున్నాను. అదన్నారు, ఇదన్నారు కానీ ఒక్కడన్నా అది అయివుండొచ్చునేమో అని సూచనప్రాయంగా కూడా అనుమానం వెలిబుచ్చలేదు ఆ మా గొప్ప వైద్యులు. కెనడాకి వచ్చాక లాక్టోజ్ ఫ్రీ మిల్క్ చూసి అదేంటొ ఎయిడ్స్ ఫ్రీ మిల్క్ తరహాలో అనుకొని మనకెందుకులే అది అని పట్టించుకోలేదు. అలా గ్రోసరీకి వెళ్ళినప్పుడల్లా ఆ పాలు చూసి, చూసి ఆసక్తి పుట్టి నెట్టులో వెతికాను. అప్పుడర్ధమయ్యింది - నా లక్షణాలు అవేననీ, మన భారతీయులకే ఈ సమస్య ఎక్కువ వుంటుందనీనూ.  ఆ పాలు తెచ్చుకొని పరీక్షించా - నా సమస్యకి తాత్కాలిక పద్ధతుల్లో పరిష్కారం లభించింది. కానీ ఆ పాలకి ధర ఎక్కువ. ఇంట్లో పెరుగు అందరికీ ఆ పాలతొ చెయ్యాలన్నా, లేక ఏ ఇతర పాల పదార్ధాలు తిన్నా ఇన్నేళ్ళుగా ఇబ్బందిగానే వుండేది. ఎంత నెట్టులో పరిష్కారం కోసం వెతికినా పాలు పక్కన పెట్టమనే కానీ ఓ పరిష్కారం దొరకలేదు. ఇక లాభం లేదని ఈమధ్య లా ఆఫ్ ఎట్రాక్షన్ ప్రయోగించా.
   
అద్భుతః! ఒక దేశీ హెయి కటింగ్ సెలూన్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక దేశీ హోమియో డాక్టర్ కార్డ్ కనపడింది. పట్టుకొని వచ్చి ఫోన్ చేసి కలుసుకొని నా సమస్యలన్నీ మొరపెట్టుకున్నా. ఒక్క పాలే కాకుండా ఇంకా ఏవేవో ఫుడ్ ఇంటోలరెన్సులు కూడా వున్నయ్ నాకు. లాక్టోజ్ ఇంటోలరెన్సుతో సహా వాటిల్లో చాలా వాటికి పరిష్కారం లభించింది. హాయిగా పాలు పెరుగుతో పాటు నాకు ఇష్టం అయిన అహారం అంతా ఎంచక్కా తినగలుగుతున్నాను కానీ గోంగూర మాత్రం ఇంకా పడట్లేదు. అది తిన్న రోజు దగ్గు, జలుబు వగైరాలతో ఆ రాత్రి నాకు నిద్ర పట్టదు. ఇది కూడా తీరితే బావుండును - ఎందుకంటే నాకు గోంగూర పచ్చడి అంటే బాగా ఇష్టం మరీ. 

మీలో ఎవరికయినా లాక్టోజ్ ఇంటోలరెన్సు కానీ, ఫుడ్ ఇంటోలరెన్సులు కానీ, ఆస్మా లాంటివి కానీ వుంటే హోమియో మందులు వాడి చూడండి - మీకూ నయమై పోవొచ్చును.   

నిజమో లేక నా భ్రమో కానీ ఇలా ఒక్కొక్క సమస్యా LOAతో తీరిపోతూవుంటే, అన్నీ ఒక దాని తరువాత ఒకటి కలిసివస్తుంటే జీవితం భ్రహ్మాండంగా సాగిపోదూ? ఇంకో ముఖ్యమయిన సమస్య తీరడానికి రెండు నుండి మూడేళ్ళ సమయం వుంది. నా బ్లాగు మొదట్నుండీ చదువుతూవున్న వాళ్ళు అదేంటో అర్ధం చేసుకోవొచ్చు ;) బయటకి ఎందుకులెండి చెప్పుకోవడం - మీరే చూస్తారుగా మున్ముందూ :))  

2 comments:

 1. Great going bro..Congratulations ..
  Since you are well versed in human medicine, just sharing few thoughts..

  Is it possible that you might have recovered because of Placebo affect ?

  Though modern science debunks homeopathy, i have been seeing and listening so many successful stories because of homeopathy..
  Recently US,UK,Australia had banned it and canada may follow the same.


  Here are some miracle stories by one of the homeopathy practitioner

  http://www.teluguyogi.net/search/label/%E0%B0%B9%E0%B1%8B%E0%B0%AE%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%AA%E0%B0%A4%E0%B0%BF


  By the way,
  Where do you get Gongura in canada ? is it in Brampton subjimundi ? we are staying nearby and i have never seen gongura anywhere ?

  ReplyDelete
 2. @ అజ్ఞాత
  నేను ఇండియాలో వున్నప్పుడు తరచుగా పలు సమస్యల కోసం వాడేవాడిని. మీరు ఇచ్చిన లింక్ లోని పోస్టులలో వున్నట్లుగానే కొన్ని కొన్ని సమస్యలు ఠక్కున నయమవుతుండేవి. ఈ దేశాలకి వచ్చాక వైద్య భీమాలో ఆ వైద్యం కవర్ కాదు కాదు కాబట్టి దూరం అయ్యాను.

  హోమియో ప్లేసిబో ఎఫెక్ట్ కానేకాదు. ఎందుకంటే ఒక తాజా ఉదాహరణ చెబుతాను. కొద్ది నెలలనుండి ఇక్కడ హోమియో వాడుతున్నాను కదా. పలు ఫుడ్ ఇంటోలరెన్సులకు చక్కగా పనిచేసాయి కానీ లాక్టోజ్ ఇంటోలరెన్సుకి మాత్రం ఆ మాత్రలు పనిచెయ్యట్లేదు. దాని మీద శ్రద్ధ పెట్టాల్సిందిగా నార్త్ ఇండియా లో బాగా ప్రాక్టీసు చేసి ఇక్కడికి ఒకరి తండ్రిగా వచ్చి స్థిరపడ్డ డాక్టర్ ని అడిగాను. మాత్రలు మార్చి ఇచ్చాడు. లాక్టోజ్ సమస్య సంగతి పక్కన పెట్టండి - మళ్ళీ ఫుడ్ ఇంటోలరెన్సులు ముందుకు వచ్చాయి. ఒక రెండు వారాలు ఓపిగ్గా వాడి చూసా అయినా ఫలితం లేదు. ఫోనులో మాట్లాడి ఫిర్యాదు చేసాను. ఒక రెండు రోజుల తరువాత రండి మళ్ళీ మందులు సిద్ధం చేసి వుంచుతా అన్నారు. రెండు రోజుల తరువాత వెళ్ళి కొత్త మందులు తెచ్చుకున్నాను. రెండు వారాలకి (నేను మూడు వారాలు లాగిస్తుంటా లెండి) $20 ఆయన ఫీజు (మందుల ఖర్చు అందులోనే). ఠక్కున దాదాపుగా అన్ని ఇంటోలరెన్సులూ (ఒక్క గోంగూర, ఇంకేమన్నా తప్ప) నయమైపోయాయి. మీరన్నట్లే ప్లేసిబో ఎఫెక్ట్ అయితే ముందు ఇచ్చిన మెడిసిన్ కూడా పన్జెయ్యాలి కదా?

  నాకు కెనడాలో గోంగూర ఎక్కడయినా దొరుకుతుందా నాకు తెలియదు. మా ఆవిడని ఇప్పుడే అడిగా. మేము వుంటున్న ప్రదేశంలో దొరకదని చెప్పింది. మీరు వుంటున్న ప్రాంతానికి మా ప్రాంతం చాలా... దూరం లెండి. కొన్ని నెలల క్రితం ఇండియా వెళ్ళి తిరిగి వస్తూ మా ఆవిడ చక్కని గోంగూర పచ్చడి తెచ్చింది. అది వాడలేకపోతున్నానే అన్నది నా బాధ.

  అయితే హోమియోతో వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఆ మందులు రోజుకి పలు సార్లు వాడాలి; వాడటానికి కనీసం అరగంటా ముందూ వెనకా ఏమీ తినొద్దు, తాగొద్దు; వేరే మందులు కానీ, విటమిన్లు వగైరాలు కూడా అరగంట ముందు వెనుకా వాడొద్దు లాంటి సుత్తి నియమాలు వున్నయ్. ఆ మందులు వాడాలంటే చాలా ఓపిక కావాలి కానీ నాకు నచ్చిన అహారం తినడం కోసం ఆ త్యాగాలు అవసరం మరి.

  అయితే హోమియో ఎల్లకాలం వాడాల్సిన అవసరం లేదనీ, సమస్య నయమయ్యాక ఇక వాడక్కర లెదనీ ఆ వైద్యుడే చెప్పాడు. అంతకుముందు ఎల్లకాలం వాడాలేమో అనుకునేవాడిని - ఫుడ్ ఇంటోలరెన్సుల్లాంటి దీర్ఘ కాల సమస్యల కోసం. నిజమా అనుకొని నెట్టులో చూసా. వారు చెప్పింది నిజమే కానీ మూడువారాలకు ఒకసారి ఒక ఇరవై నిమిషాలు వెచ్చిస్తే వచ్చే $20 అంత వీజీగా తొందరగా ఆ డాక్టర్ వదులుకుంటాడా అనేది సందేహాస్పదమే - ఆ విషయం నాకు ఏదో ఫ్లోలో చెప్పేసేనని నాలుక కరచుకొని వుంటాడు. రెండు మూడు నెలల్లో ఇక చాలు అనకపోతే ఇక నేనే ఒత్తిడి చేసి చూస్తా. ఈ విషయం చెప్పకుండా ఇండియాలో హోమియో డాక్టర్లు దీర్ఘకాల సమస్యలకి సుదీర్ఘంగా ముందులు ఇస్తూ పోతూనే వుంటారు కదూ. అయినా వాళ్ళు కూడా బ్రతకాలి కదండీ :))

  ReplyDelete