మా కథ మీకు చెప్పాలా వద్దా?

రంగ్ దే బసంతి సినిమాలో అనుకుంటా ఒక పార్కులో మెట్ల మీద కూర్చొని నాటకం కోసం చర్చిస్తుంటారు. నిన్న నాకు అలాగే అనిపించింది. మా ఫిల్మ్ టీం మెంబర్లం కొంతమందిమి కలిసి మా సిటీలో వున్న గొప్ప పార్క్ లోని ఆమ్ఫిథియేటర్ మెట్ల మీద కూర్చొని కథా చర్చలు చేసేం. ఒక అయిదు నిమిషాల నిడివి గల లఘు చిత్రం కోసం కథ చర్చించాము. నేను ప్రతిపాదించిన వైవిధ్యమయిన కథాంశానికి అందరం కలిసి మెరుగులు దిద్దాం. రేపటి నుండి మా కుటుంబంతో కలిసి వెకేషనుకి వెళుతున్నాం. అందువల్ల దానికి ముందే ఒక కిక్ స్టార్ట్ మీటింగ్ పెడితే అందరూ ఈలోగా దాని గురించి ఆలోచిస్తుంటారు కదా అని సమావేశ పరిచాను. అనుకున్నవాళ్ళు అంతా రాలేకపోయారు కానీ సగం మంది అయినా వచ్చేసారు. సినీ శాఖల్లో ఒక్కొక్కరి బలాలు, బలహీనతలు చర్చించుకున్నాం.

మా టీమ్ మెంబర్లలో ఆయా విషయాలలో ఆసక్తి వుండటం గొప్ప విషయం అయితే ఎవరికీ కూడా థియరిటికల్ నాలెజ్ లేకపోవడం ప్రధానలోపం. అందుకే కేవలం సినిమాలు చూసి సంపాదించిన జ్ఞానమే కాకుండా ఆయా శాఖలపై పలు పుస్తకాలూ, వీడియోలూ చదివీ, చూసీ పలు విషయాల మీద అవగాహన పెంచుకోమని సూచించాను. ఉదహరణకు నటనపై ఆసక్తి, అనుభవం వున్నవారికి నటనలో పలు రకాల పద్ధతులు ఇంప్రొవైజేషన్, మెథడ్ ఏక్టింగ్ వగైరాలు తెలుసుకోమని చెప్పాను. మా వాళ్ళు అంతా కథని మెరుగుదిద్దడం కోసం విలువైన సూచనలు ఇచ్చారు. ఇంకా కథని ఫైన్ ట్యూన్ చేస్తూ వెళతాం. మాలో ఒకరికి స్క్రీన్ ప్లే అంటే ఇష్టం కావడం సంతోషంగా వుంది. అతగాడికి స్టోరీ బోర్డులు వేయడం కూడా వచ్చు. యే! అయితే మ్యూజిక్ మీద బాగా పట్టున్న వాళ్ళు మాకు లభించాల్సి వుంది.

అయితే మా కథ మీతో చర్చించాలా వద్దా అనేది తేల్చుకోలేకపోతున్నా. మీతో చర్చిస్తే మీరూ విలువైన సూచనలు చెప్పవచ్చు. ఆ కథని మేము ఎలా తీస్తామా అనే ఆసక్తి మీలో కలగవచ్చు. అయితే కథ చెబితే మా ఫిల్మ్ మీద కాస్తో కూస్తో మీకు ఉండే ఆసక్తి కాస్తా తగ్గవచ్చు. సరే ప్రస్తుతానికి అయితే స్టొరీ లైన్ కాస్త చెప్పేస్తాను. ఒకవ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి ధైర్యం లేక తనని హత్య చేయడానికి ఒక (షార్ప్) షూటర్ ని నియమించుకుంటాడు. అలాంటప్పుడు అది హత్య అవుతుందా లేక ఆత్మహత్య అవుతుందా? ఆ షూటర్ ఒకవైపు తనని చంపేస్తానని, చంపేస్తున్నానని చెబుతూనే అతగాడి మనసు మార్చేస్తాడు. ఇది ఒక సప్సెన్స్ ఫిల్మ్ లాగా తీర్చిదిద్దుతాము. కథ మొత్తం మీ ముందు వుంచినప్పుడు తెలుస్తుంది. అయిదు నిమిషాలలోనే సెంటిమెంట్, సప్సెన్స్, డ్రామా, ఏక్షన్, క్రైం, కామెడీ అన్నీ వుంటాయి.

ఇది ఇలా వుండగా తదుపరి ఫిల్మ్ కోసం కూడా ఆలోచనలు సాగుతున్నాయి. హరర్ కామెడీ. మాలో ఒక నటికి హరర్ సినిమాలు అంటే ఇష్టం వుండటం దీనికి ఒక అస్సెట్. దీనికి కథ ఇంకా సిద్ధం కాలేదు - ఆలోచిస్తున్నా - నా సినిమా అంటే వైవిధ్యమయిన కథాంశం వుండాలి మరి. అందరిలాంటి సినిమాలు నేనూ తీస్తే నా గొప్పదనం ఏం ఉంటుంది సార్? అటుపై కొత్త కాన్సెప్ట్ తో రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్. ముద్దులకు అభ్యంతరం లేని నటీనటులు కావాలి దానికి - ఎందుకంటే ముద్దులే ముఖ్యం అందులో. ఆ కాన్సెప్ట్ అలాంటిది మరీ!  

12 comments:

 1. See here
  http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break58

  ReplyDelete
 2. http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break58

  ReplyDelete
 3. Movie concept kothaga vundi, try cheyacchu

  ReplyDelete
 4. suicide concept , engaging another person,later change in the attitude of the main character by engaged character very interesting,
  Understood LOA is very effectively working.
  By the way I know music directors (father and son) who worked for films, worked for short films , staying at hyderabad ,if u are interested I can give their numbers.
  You may watch the movies , short films already done by them.
  Srinivasa Rao,

  ReplyDelete
 5. suicide concept is very interesting, change in the attitude of main character by engaged character point is appreciable (Human values anavachha),
  I too observed LOA is working very fast in ur case.
  By the way I can give the numbers of young music directors( already done music for short films,songs). If u are interested you may please watch those short films/songs.
  Srinivasa Rao V

  ReplyDelete
 6. ఆ రొమాంటిక్ సినిమా కి హీరో మీరే ఉండాలి, మీ కన్నా రొమాంటిక్ స్టోరీస్ ఇంకెవరికి ఉన్నాయి .
  ఆ విజయవాడ సహజీవనం ని కూడా సినిమా చేసేయొచ్చూ గా ? లాంచింగ్ గా బాగుంటుంది , కాస్త డబ్బులు వస్తాయి , ఆ తరువాత ఇష్టమైనవి తీసుకోవచ్చూ . మన కత్త్తి చెప్పినట్టు ముందే స్టోరీ చెప్పేసారు , జాగ్రత్త్త పెసరట్టు స్మెల్ ఇంకా పోలేదు .

  ReplyDelete
 7. ఆ రొమాంటిక్ సినిమా కి హీరో మీరే ఉండాలి, మీ కన్నా రొమాంటిక్ స్టోరీస్ ఇంకెవరికి ఉన్నాయి .
  ఆ విజయవాడ సహజీవనం ని కూడా సినిమా చేసేయొచ్చూ గా ? లాంచింగ్ గా బాగుంటుంది , కాస్త డబ్బులు వస్తాయి , ఆ తరువాత ఇష్టమైనవి తీసుకోవచ్చూ . మన కత్త్తి చెప్పినట్టు ముందే స్టోరీ చెప్పేసారు , జాగ్రత్త్త పెసరట్టు స్మెల్ ఇంకా పోలేదు .

  ReplyDelete


 8. Hi Bro.. your team can opensource music..
  http://www.webdistortion.com/2009/02/21/11-awesome-open-source-music-sites-for-digital-creatives/


  http://www.epidemicsound.com/?_us=adwords&_usx=brand&gclid=EAIaIQobChMIzJbn4P3H1QIVBoZpCh0_5gBQEAAYAiAAEgJ-KfD_BwE


  ReplyDelete
 9. టీ వీ సిరియళ్ళలో చూపించే గయ్యాళి అత్త పాత్ర ఉంటే చెప్పండి. గయ్యాళి అత్త పాత్రకి సుకుమారమైన కోడలు వస్తుంది. అన్ని బాధలూ మౌనంగా భరిస్తుంది. మీ సీరియల్ చూసేవాళ్ళకి కడుపు తరుక్కుపోయే సీన్లు మీరు వ్రాయవచ్చు.

  ReplyDelete
 10. ఫ్రెండ్స్. వెకేషన్ కి వెళ్ళి ఇప్పుడే వచ్చాం. నెమ్మదిగా మీ వ్యాఖ్యలకి స్పందిస్తాను.

  ReplyDelete
 11. @ అజ్ఞాత
  ఆ వార్త చదివాకనే నాకు ఈ ఆలోచన వచ్చింది. కాకపోతే ఆత్మహత్య కోసం ఒక వ్యక్తిని నియమించుకోవడం మీద ఇంగ్లీషు సినిమా ఎప్పుడొ 1950 లల్లోనే వచ్చింది. అది కాపీ చేసి మనవాళ్ళు అల్లరి నరేశ్ పార్టీ సినిమాలో పెట్టారనుకుంటా. కెనడాలో ఎక్కడో అది కొన్నేళ్ళ క్రితం అలాంటి సంఘటణ నిజంగా జరిగి ఫెయిల్ అయ్యింది. నియమించుకున్న వ్యక్తి చేసిన ప్రయత్నాన్ని హత్యా ప్రయత్నం అనుకోవాలో లేదో తెలియక పోలీసులు తికమకపడ్డార్ట.

  @ గుప్తా
  ధన్యవాదాలు. కాన్సెప్ట్ బావున్నా లేకపోయినా ప్రాక్టీసు కోసమయితే ఈ ఆదివారం షూట్ చేస్తున్నాం. ఎలా వస్తుందో చూడాలి. ఒక రచయితగా నేను తప్ప అన్ని శాఖల వాళ్లకీ ఇది కొత్తే. దర్శకత్వం నేనే వెలగబెడుతున్నా.

  @ శ్రీ
  కథ బాగానే అనిపిస్తోంది కానీ ఫిల్మ్ గా ఎలా వస్తుందో చూడాలి. మీరు అన్న విధంగా అన్నీ అనుకూలంగా కుదురుతున్నాయి. మ్యూజిక్ డైరక్టర్లతో ఇప్పుడే పని పడకపోవొచ్చు. అవసరం అయినప్పుడు మీ దగ్గర తీసుకుంటాను.

  మీ వివరాలు అందాయి. వాట్సాప్ మెసేజ్‌లు చూసుకోండి.

  ReplyDelete
 12. @ అజ్ఞాత
  కదా. రొమాంటిక్ స్టోరీస్ నాకు బోలెడన్ని వున్నాయి కానీ నాదంత రోమాంటిక్ లుక్కు కాదు. అలా వుండి వుంటే మరో కాసనోవా అయివుండేవాడినేమో. అంచేతా హీరో గా వేరే వాళ్లని పెట్టుకొని నా కథలు నడిపించేద్దామేం. విజయవాడ సహజీవనం అంటే గుర్తుకు వచ్చింది. ఆ అమ్మాయి చేతి పర్సు విషయంలో నేను చేసిన ఘనకార్యం గుర్తుకు వుందా? ఆ సంఘటణను ఒక సరదా సస్పెన్స్ షార్ట్ ఫిల్ముగా తీసెయ్యొచ్చు. తీస్తా, ముందు ముందు తీస్తా :))

  కత్తి అంటే కత్తి మహేశేనా? బిగ్ బాసు నుండి బయటకు పంపించినట్టున్నారు కదా. అసలు ముందు తనని తీసుకోవాలనే గొప్ప ఆలోచన ఎవరిదో?! పెసరెట్టు స్మెల్ కథా కమీషూ సరిగా గుర్తుకురావడం లేదు.

  @ అజ్ఞాత
  మీరు ఇచ్చిన మ్యూజిక్ లింక్స్ ఇంకా చూడలేదండీ. చూస్తాను. థేంక్స్.

  @ నీహారిక
  వామ్మో. ఆ దరిద్రపుగొట్టు ఏడుపు సీరియళ్ళు చూడటం కానీ, తియ్యడం గానీ నా వల్ల కాదండీ బాబూ.

  ReplyDelete