అతనెళ్ళిపోతాడేమో!

ఛస్తా అంటుంటాడు. అందరం కట్టకట్టుకొని ఛస్తాం అని ఏడుస్తాడు. అప్పుళోళ్ళు ఇంటిమీదికి వచ్చి యమ సతాయిస్తున్నారంటాడు. నేను మాత్రం ఏం చేయగలను? అప్పటికీ కిందా మీదా పడి, అష్టకష్టాలు పడి అతనితో బర్రెల వ్యాపారం అన్నా చేస్తే అతనికీ, ఆ కుటుంబానికీ ఆసరాగా కూడా వుంటుందని కొంత డబ్బు ఏర్పాటు చేస్తే హాయిగా వాటిని హారతి కర్పూరం లాగా వాడేసేడు. (నా బర్రెల బ్యుజినెస్సు యవ్వారం పోస్ట్ మీకు గుర్తుండే వుంటుంది) కొంతలో కొంత నయ్యం ఏంటంటే అతనికి డబ్బులు ఇచ్చి తగలబేట్టిన వైనం మా ఆవిడ త్వరగానే మర్చిపొయిందుస్మీ. మొదట చెప్పినప్పుడు కాస్త నన్ను దులిపింది కానీ ఆ తరువాత మరచేపోయింది. నా బ్లాగు చదివేంత కలాపోసన తనకు లేదు కాబట్టి ఇప్పుడు ఇది వ్రాసి కూడా ఇంట్లో బ్రతికిపోగల్ను లెండి. కంగారేమీ లేదు!  

దగ్గరి స్నేహితుడే. దగ్గరితనం అంటే ఏంటో తొలి పరిచయం చేసింది అతగాడే. అయినా సరే, నేనున్న పరిస్థితుల్లో పెద్దగా ఏం చేయలేకున్నాను.  ఇండియా నుండి మిస్డ్ కాల్స్ ఇస్తున్నాడు, మెయిల్స్ వ్రాస్తున్నాడు. ఏమని మాట్లాడను, ఏమని వ్రాయను? మిన్నకుంటున్నాను. ఏం చెయ్యను మరి - నా పరిస్థితికి మించి సహాయం చేసాను - నిలబెట్టుకోలేకపోయాడు.  నా సమస్యలు నాకూ వున్నాయి - బోలెడన్ని! ఇంకేం చెయ్యలేను. 

భేషుగ్గా ధైర్యం చెప్పొచ్చు అతనికి. అంతా విని 'డబ్బులో శరశ్చంద్రా!' అంటాడు.

వాళ్ళ పెద్దమ్మాయితోనూ మాట్లాడా  - వాళ్ళ సమస్యలు విన్నా. నేను డబ్బులు ఇచ్చింది చెప్పాడా అని అడిగాను. 'చెప్పాడు - అంతా బూడిద చేసేకా' అందా అమ్మాయి. అతనికి అన్ని వ్యసనాలు వున్నాయని దూరంగా వున్న నాకు తెలియదు.

ఎప్పుడు ఏ వార్త వినాల్సివస్తుందో అని కాస్త కంగారు వుంది. అన్నట్లే అతనెళ్ళిపోతాడేమో అన్న ఆందోళనా వుంది. ఏమీ చెయ్యలేని నిస్సహాయతా నాకు వుంది. 

2 comments:

  1. చేసింది చాలు...ఇక్కడి జనాలు దొరికినంత పిండేయడానికి అలవాటు పడ్డారు...వీధికి పది మంది తయారయ్యరు ఇలాంటి వాళ్ళు..మీరు నష్టపోవడం తప్ప...అతగాణ్ణి నిలబెట్టలేరు...మరొ పార్టీని పట్టుకుంటాడు...మీరేమీ టెన్షన్ పడకండి...

    ReplyDelete
  2. ఇలాంటోళ్ళకి అప్పులిచ్చేటోళ్ళని అనాలి.. ఏం చూసి ఇస్తారు అప్పులు.. కొద్దిగా మంచిగా నటిస్తూ పొగడగానే పాంటులోకి చేతులు పోతాయా.. అయినా వీళ్ళ తిక్క తిరగటానికే అలాంటి వాళ్ళకి అప్పులు ఇస్తుంటారు.. బుద్ది తొందరగానే వస్తుంది లెండి.

    ReplyDelete