మంచి వ్యసనాలు ఏర్పరచుకోకుంటే...

...చెడు వ్యసనాలు దరిచెరవచ్చు. చెడు వ్యసనాలు అంటే తాగుడు, జూదం అనే కాదు నా వుద్దేశ్యంలో. అతిగా టివి, సినిమాలు, వీడియోలు, ఇంటర్నెట్ చూడటం లాంటివి కూడా  సరికొత్త వ్యసనాలుగా నాకు అనిపిస్తాయి. బాగా పుస్తకాలు చదవడం కొంతవరకు నయమే. అందుకే వారానికి ఎన్ని తెలుగు సినిమాలు చూసామా అని కాకుండా వారానికి ఎంత వ్యాయామం చేసేనూ అన్నదాని మీదనో లేదా మరో మంచి విషయం మీదో నేను బాగా ఫోకస్ చేస్తాను. నాలో వస్తున్న పరిణతిని బట్టి నా ఫోకస్ మారుతూవుంటుంది. 

నేను నా వ్యాయామం గురించి, ఆహార నియంత్రణ గురించి, కొవ్వు శాతం గురించి వాటిని సాధించడంలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి పలు మార్లు వ్రాస్తుంటే కొందరికి చిత్రంగా అనిపించవచ్చు. అలాంటివారికి నేను వారానికి ఇన్ని సినిమాలు చూస్తున్నా అనో, ఇన్ని పుస్తకాలు చదివి పారేసాననో వ్రాసేస్తే అది సాధారణంగా అనిపించవచ్చు.  నేను పలు సమస్యల వల్ల అయా విషయాలలో గొప్ప విజయాలేమీ అందులో సాధించకపోవచ్చు. కానీ కిందామీదా పడుతూ బ్యాలన్సుడుగా అయినా వుంటున్నా. మనలో ప్రయత్నలోపం లేకుండా వుండాలి. అది ముఖ్యం. మనం ఎన్ని సినిమాలు చూసినా, ఎంత నెట్టు చూసినా, ఎన్ని పుస్తకాలు చదివినా అవి మన నిత్య జీవనానికి ఇసుమంతయినా ఉపయోగపడకపోతే, ఉపయోగించుకోలేకపోతే అదంతా వృధానే. అవి కాలక్షేపం కలిగిస్తుండవచ్చు కానీ దాంతో పాటు కాస్తయినా ప్రయోజనం కూడా వుండాలి.  మనకు ఇంఫోటెయిన్మెంట్ కావాలి.

నేను మంచి విషయాలను వ్యసనాలుగా చేసుకుంటాను. అప్పుడు అవి చెయ్యడానికి ఇక శ్రమ పడక్కరలేదు. వాటంతట అవే మనల్ని నడిపిస్తాయి. వ్యసనాలు అంటే అంతే కదా. అవి మన నియంత్రణలో వుండవు - వాటి అదుపులో మనం వుంటాము. అందుకే చక్కటి విషయాలకు ఓ సారి ఎడిక్ట్ అయిపోతే ఇహ ఎంచక్కా నడిచిపోతాయి. 

కొంతమందికి డబ్బు సంపాదన కూడా ఓ వ్యసనంగా వుంటుంది. పొదుపు చెయ్యడం కూడా వ్యసనంగా వుంటుంది. పొదుపు అనేది అతి అయినప్పుడు అది పిసినారితనం అవుతుంది. కొందరి డబ్బు జాగ్రత్త చూస్తున్నప్పుడు అది పోదుపా లేక పిసినారితనమా అనేది అర్ధం కాదు.  అంత కాకపోయినా కొంతయినా డబ్బు మీద వ్యామోహం, ఫోకస్ లేకపోవడం నాలో లోపంగా భావిస్తుంటాను. ఎంటో మరి నాకు ఏదో నడుస్తుంది కదా చాల్లే అన్నట్టు వుంటుంది కానీ మరీ పొదుపు చెయ్యాలనో, యమగా సంపాదించెయ్యాలనో  ఇంకా మనస్సుకి రావడం లేదు.  అదీ ఓ వ్యసనంగా చేసుకుంటే ఓ అని అయిపోతుంది కానీ ఎలాగండీ బాబూ? జీవితంలోని సమస్యలనన్నింటినీ పరిష్కరించుకుంటూ వస్తున్నాను - అనుకున్నవన్నీ దాదాపుగా సాధించుకుంటూ వస్తున్నాను  - ఒక్క గొప్ప సంపాదన తప్ప. ఇహ దాని సంగతీ చూడాలి మరి.

15 comments:

 1. ఇంటర్నెట్
  ప్రక్కన వాళ్ళని కెలకడం
  టైం వేస్ట్ చెయ్యడం
  ఇవి నా ప్రస్తుత వ్యసనాలు
  కాకపొతే ప్రస్తుతం ఇంటర్ నెట్ కి దూరం గా ఉంటున్నాను
  మీరు అనుకుంటున్నట్లు గానే నేను కూడా డబ్బు సంపాదించే వ్యసనానికి అలవాటు పడదాం అని అనుకుంటున్నాను
  అందుకే ఎక్కువ సమయం లైబ్రరీ లో గడిపేస్తున్నా

  ReplyDelete
 2. @ అప్పి
  వార్నీ...లైబ్రరీలో కూర్చొని కూడా సంపాదించొచ్చా! ఆ చిట్కా ఏదో నాకూ చెబుదురూ. కనీసం వేడినీళ్లకు చలినీళ్ళలాగా అయినా ఉపయోగపడకపోదు కదా.

  ReplyDelete
 3. " బ్లాగిల్లు" ఇప్పుడు నూతనంగా ముస్తాబైంది.. చూసి ఎలా ఉందో చెబుతారా? http://blogillu.com

  ReplyDelete
 4. Read "rich dad poor dad". that may be a good start.

  ReplyDelete
 5. Appi may be saving the money by saving the power at home :) :)

  ReplyDelete
 6. Annay naku konni chedu alavatlu vundevi(Vunnay)....ఈ మధ్యే realize అయిన చెడు అలవాట్ల వల్ల కలిగే పలితాలు.....so i am also trying to change my self.కొన్ని మంచి intreasting బుక్స్ suggest cheyyava

  ReplyDelete
 7. @ శ్రీనివాస్
  బ్లాగిల్లు చూసాను. మళ్లీ చూసి చెబుతాను.

  @ అజ్ఞాత @ 20 జూన్ 2012 12:40 సా
  ఆ పుస్తకం రెండేళ్ళ క్రితం అనుకుంటా చదివాను. డబ్బు విషయమై మరికొన్ని పుస్తకాలు కూడా చదివాను. వాటిని సంపాదన కొరకు ఇంకా ఉపయోగించుకోలేకపోయినా కూడా వాటివల్ల పొదుపు, పెట్టుబడులలో వున్నంతలో మంచి పురోగతి సాధించాను.

  ReplyDelete
 8. కాఫీ తాగడం వ్యసనమని రాయలేదు మీరు. హమ్మాయ్య ఒక బెంగ తీరింది.
  మీ పంధాలోనే మేము కూడా గత కొన్ని నెలలుగా వ్యాయామం,ఆరోగ్యం మీద ద్యాస పెట్టాము. చక్కగా అక్కర్లేని బొలేడన్ని పౌండ్స్ తగ్గించుకున్నము (ఇంటిలో అందరము!) మొదటి
  సంవత్సరం college లో గడిపిన మా పాప freshman 15 కి బలి అయింది.
  అంటే 15 pounds పెరుగుతారు అంటారు కదా? అంత కాకపోయినా ఒక 5 pounds add చేసింది ideal weight kannaa.మొత్తనికి అందరము ఒక project లా ఈ పని మీద ఉన్నాము. మంచి పోస్ట్!

  ReplyDelete
 9. @ అజ్ఞాత @ 20 జూన్ 2012 1:32 సా
  నేను ఇదివరలో ఉదయమే లేచి జిమ్ముకి వచ్చేసి అక్కడే స్నానం చేస్తుండేవాడిని. అలా సబ్బు, షాంపూ గట్రా పొదుపు చేసేస్తున్నా అని నా మిత్రులు (సరదాగా) ఏడ్చేసేవారు.

  @ అజ్ఞాత @ 20 జూన్ 2012 1:36 సా
  మీ ఆసక్తులు నా ఆసక్తులు సరిపడకపోవచ్చు. అందువల్ల మీకు ముందు ఏదీ ఇంటరెస్టో చెబితే ఆయా విషయాలపై నేను కాకపోయినా తోటి బ్లాగర్లు అయినా మంచి పుస్తకలు సూచిస్తారు. ఎందులో ఇంట్రెస్ట్ చూపిస్తే బావుంటుంది అనేదే మీ ధర్మసందేహమయితే చెప్పండి - మాకు తెలిసిన, చదివిన మంచి పుస్తకాలు సూచిస్తాము.

  ReplyDelete
 10. @ జలతారు వెన్నెల
  వెరీ గుడ్. మా ఆవిడ డైటింగ్ చేస్తుంది (అనుకుంటుంది) కానీ మరో వైపు బరువు పెరుగుతుంది. వారానికి నాలుగు రోజులు నాన్ వెజ్ లాగిస్తూ డైటింగ్ ఏంటా అని నేను సంభ్రమం చెందుతూవుంటాను. మా ఆవిడకి 31% - 32% ఫ్యాట్ వుంది. నువ్వు గనుక దానిని 25% కి తగ్గిస్తే ఇంకా చక్కగా అవుతావు అని అంటే ముందు నువ్వు (17% కి) తగ్గి చూపించు అంది. నో కామెంట్స్ అని జారుకున్నాను.

  మా చిన్నమ్మాయి బరువు తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నాం. దానిది కొన్ని కారణాల వల్ల స్లో మెటబాలిజం కాబట్టి ఛాలెంజింగుగా వుంది. ప్రస్తుతానికి కొన్ని వారాలుగా బరువు స్టేబుల్గా వుంది.

  ReplyDelete
 11. Good Post. Keep writing these kind of articles.

  ReplyDelete
 12. inspiring గా వుంది అండీ post. కొన్ని రోజులు వరకూ మంచి అలవాట్లు బానే పాటిస్తుంటాను తర్వాత మంచి అలవాట్లు అని తెలిసినా మానేస్తూ వుంటాను. అట్లా కాకుండా continue చేస్తూ వుండాలి అంటే ఎమి చెయ్యాలొ ????

  ReplyDelete
 13. @ అజ్ఞాత
  అలాగేనండీ. ఇదివరకులా చిలిపి టపాలు వ్రాసే వెసులుబాటు నాకు లేదిప్పుడు (ఇలా ఎంతకాలమో చెప్పలేను)- ఇహ చక్కని టపాలు వ్రాయక ఛస్తానా :))

  @ వినీల
  చెప్పా కదా - మంచి అలవాట్లని వ్యసనం చేసుకోవాలనీ. అవి వ్యసనం అయ్యాక మీరు ఆగమన్నా ఆ అలవాట్లు ఆగిపోవు. అవే మనల్ని నడిపిస్తాయి. ఇహ మంచివాటిని అలా ఎలా చేసుకోవాలని మీరు అడిగితే ఏం చెప్పాలబ్బా. కొన్ని చెప్పగలను. అది మీకు ఓ బర్నింగ్ డిజైర్ లా కావాలి. నలుగురికీ మీరు చెస్తున్నది చెప్పాలి. అప్పుడు ఇతరుల నుంచి వచ్చే ప్రశంసలు, విమర్శలు మిమ్మల్ని ప్రోత్సహిస్తాయి, ఉడికిస్తాయి. నేను ఆయా విషయాల మీద టపాలు వ్రాసేది అందుకే. ఆ విషయాల గురించి మనస్సు లగ్నం చేసి దాని గురించి పూర్తిగా తెలుసుకుంటూవుండండి, నెట్టులో పదేపడే పరిశోధిస్తూవుండండి. అలా ఆ విషయం మీ మనస్సులో సింక్ అవుతుంది. మీ మంచి అలవాట్లకి మీరు ఎడిక్ట్ కావడానికి ఇంకా మీరేం చెయ్యొచ్చో ఆలోచించండి. ఓ సారి ఎడిక్ట్ అయ్యాక ఇహ ఇబ్బంది వుండదు. మీరు సాధారణంగా ఆ అలవాట్లని వదులుకోలేరు.

  ReplyDelete
 14. నాకున్న ఒక మంచివ్యసనం, నా నవ్వు:-)
  ఎవ్వరు ఏమన్నా సీరియస్ గా తీసుకోను చూడండి
  ఇప్పుడు మీరు పిచ్చిది అనుకున్నా:-)
  ఎలా నవ్వేస్తున్నానో! మీకు ఉందండోయ్ ఈ వ్యసనం..

  ReplyDelete
 15. @ పద్మార్పిత
  మీది 'క్విడ్‌ప్రోకో' కామెంట్ అన్నమాట :)

  మంచి వ్యసనమే మీది :) నాకు అంతగా లేదు - వుంటే బావుండేది.

  ReplyDelete