అన్నా - పదేపదే దీక్షలు చెయ్యకన్నా

అసలే మన రాజకీయ నాయకులు ప్రతి దానికీ దొంగ దీక్షలు చేసి అవంటేనే అభాసు పాలు చేసారు. అలాంటి స్థితిలో మీరు నిజాయితీగా చేసే దీక్షల వల్ల మీ దీక్షలంటే భారత దేశ ప్రజల్లో మంచి గౌరవం, ఆదరణ లభించాయి. అలా అని పిల్లికీ, పిడుగుకీ ఒకే మంత్రంలా మీరు కూడా పదేపదే దీక్షాస్త్రం సంధిస్తుంటే దాని శక్తి పలుచయిపోతూవుంది.  అలాంటి బ్రహ్మాస్త్రాలు అరుదుగా ఉపయోగిస్తేనే  యుక్తి, శక్తి ఇతరులకి ఆసక్తి వుంటుంది. లేకపోతే జనాలూ పలుచనయిపోతారూ, మీరూ పలుచనయిపోతారు మరి.

3 comments:

 1. ఇండియాలోఅ ఎన్ని దీక్షలు చేసినా ఏం ప్రయొజనం ఉండదు.. అసలు మన రాజ్యాంగమే తప్పుడు పునాదుల్లో ఉంది..
  ఇండియా లో కాపిటలిజం గ్రామ స్థాయిలో ఉంటే బాగుంటుంది.. అంటే ఏ ఊరి పన్నులు ఆ ఊరికే ఉపయోగించడం.. ఏ ప్రాంతం పన్నులు ఆ ప్రాంతానికే..

  అప్పుడు దేశం విస్తరించినా, కుంచించుకు పోయినా,లాభపడ్డా, నష్టపోయినా ..ఎలాంటి ఫలం అయినా దేశం మొత్తం.. సమానంగా విస్తరిస్తుంది..

  అప్పుడు ఎవడో వచ్చి సొమ్ము తింటున్నాడు అనే భావాలు కూడా పోతాయి.. తెలంగాణా వాడినైనా.. అంధ్రుడినని చెప్పుకోవడానికి సంకోచించను ..

  ReplyDelete
 2. @ సింహం
  అంటే అప్పుడు ఒక్కో గ్రామం తెలంగాణా లాగా విడిపోవాలంటారు. ప్రపంచమే ఓ గ్లోబల్ విలేజ్ కావాలనుకుంటున్న తరుణంలో అది కుచించుకుపోవడం కాదూ. అప్పుడు ఒక గ్రామాన్ని మాత్రం ఎందుకు యూనిట్ గా తీసుకోవాలి? ఒక కుటుంబాన్ని యూనిట్టుగా తీసుకుంటే పోలా? ఎవడింటికి వాడే రాజు. అలా దేశం అంతా మైక్రో రాజ్యాలతో వర్ధిల్లవచ్చు.

  ReplyDelete
 3. నాకైతే అది ఒకే ప్రపంచం లాగా కనిపిస్తుంది.. ప్రతి కుటుంబానికీ, ప్రతి మనిషికీ ఒక గుర్తింపు ఉంటుంది అప్పుడు.. జిల్లా, రాష్త్రం,దేశం అలాగె ఉంటాయి.. ఇప్పటిలా పైసల్ అంతా హైదరాబాద్ ల పోసి మిగతా రాష్ట్రాన్ని నిర్జన ప్రదేశం గా ఉంచలేరు... తొక్కలే. హైదరాబాద్ ఐతే ఎంది.. ఢిల్లీ ఐతే ఏంది.. నేను, నాకుటుంబం, నా ఊరు, నా.... నేను చెప్పేది అర్థం ఐందా ?

  ReplyDelete