కొన్ని నెలల క్రిందట మా మేనల్లుడికి పుట్టిన పాపకు పేర్లు సూచించమని కోరాను. గుర్తుండే వుంటుంది. చాలామంది చాలా చక్కటి పేర్లు సూచించారు. అయితే నేను సూచించిన పేరే అన్నిట్లో కన్నా బాగా నచ్చడంతో రిథ పేరు ఆ పాపకి నిర్ణయించారు. పేర్లు సూచించిన వారికి అందరికీ ధన్యవాదాలు.
అయితే ఇప్పుడే ఆ పేరుకి తగ్గ ఇంగ్లీషు స్పెల్లింగ్ గురించి వాడూ నేనూ ఫోనులో కొట్లాడుకున్నాం. తనేమో Ridha స్పెల్లింగ్ పెడితే పేరులో గాఢత వస్తుంది అంటాడు. అలాయితే రిఢ అవుతుంది కదా అంటాన్నేను. నేనేమో Ritha అంటాను. అలా అయితే రిత అయిద్ది కదా అంటాడు వాడు. రిత కి స్పెల్లింగ్ Rita కదా అంటే అది రీటా అవుద్ది కదా అంటాడు. కాస్త ఇంగ్లీషు స్పెల్లింగుల గురించి తెలిసినవారెవరన్నా రిథ పేరుకి సరి అయిన స్పెల్లింగ్ సూచించగలరు. పాప ఇండియాలో వుంది కాబట్టి పేరు రిజిస్ట్రేషనుకి అంత తొందరేమీ లేదు. Rhythm పదం నుండి రిథ పేరు సంగ్రహించాము కాబట్టి Rhytha వుంటే బావుంటుందంటారా? అప్పుడు చదివిన వారు రైతా అనుకుంటారేమో.
If the name to be correctly pronounced by all.. it should spelled as "RITHA"...so that people call her "రిథ". That is what my openion is.
ReplyDeleteఅప్పుడు రైతా అవ్వుద్ది :)
ReplyDeleteఇంతకుముందు ఒక కామెంట్ పొరపాటున పబ్లిష్ చేసాను కాబట్టి తీసివేసాను.
ReplyDeleteబాబూ అజ్ఞాతా, మీ కామెంట్లతో నన్ను చంపమాక. నాకు అనవసరమయిన విషయాల్లో, టపాకి సంబంధించని విషయాల్లో నన్ను, నా బ్లాగుని ఇన్వాల్వ్ చెయ్యకండి. ప్లీజ్.
I think ridha is correct
ReplyDelete@ అజ్ఞాత
ReplyDeleteమీ అభిప్రాయం చెప్పినందుకు థేంక్స్.
@ మౌళి
:)
థ తో ఎ౦డ్ అయ్యే తెలుగు పేరు నాకు తెలిసి ఇప్పటివరకు లేదు కదా. కాబట్టి ridha (రాధ, మేధ లాగా ) నే బావు౦టు౦ది అనుకు౦టున్నాను లేదా పేరు మార్చుకోవాలి
ReplyDelete@రవి
ReplyDeleteహ్మ్. ఢ, ధ పలుకుతోంది కదండీ.
@ మౌళి
ఇప్పటివరకు అలాంటి పేరు లేదు కాబట్టే పేరు ప్రత్యేకంగా వుండాలనే ఆ పేరు సూచించాను. అందువల్ల స్పెల్లింగ్ గురించి పేరు మార్చము లెండి. ఏదో ఒక స్పెల్లింగ్ పెట్టి నడిపించేస్తాము.
నిజంగా థ తో అంతం అయ్యే పేర్లు తెలుగులో లేవంటే ఆశ్చర్యంగా, ఆనందంగా వుంది. ఎవరికయినా ఏదయినా అలాంటి పేరు వేరే ఏదయినా తెలిస్తే చెప్పండి చూద్దాం.
@నిజంగా థ తో అంతం అయ్యే పేర్లు తెలుగులో లేవంటే ఆశ్చర్యంగా, ఆనందంగా వుంది.
ReplyDelete:) మీరు పెట్టినా అది పెట్టుడు పేరు అవుతు౦ది. రిథ అని ఎవ్వరూ పిలువరు/పిలువలేరు. ఇక ఆన౦ద౦ ఎక్కడిను౦డి వస్తు౦ది.
ఇప్పటివరకి లేకపోవడానికి కారణ౦ అర్ధ౦ లేకపోవడ౦ ఏమో. రిధ - ridha is okay
Rhytha is cool and may be mostly prounounced correctly.
ReplyDelete@ మౌళి
ReplyDeleteకొత్తది ఏదయినా మొదట్లో కాస్త ఇబ్బందిగానే వుంటుంది. అనతికాలంలోనే అందరూ అలవాటు పడతారు. కొత్త ఒరవడి, కొత్తదనం మనం ప్రవేశ పెట్టకపోతే మిగతా అందరికీ మనకీ తేడా ఏముంటుంది? మిగతావారికన్నా కాస్త ప్రత్యేకంగా వుండాలనుకున్నప్పుడు కాస్త కష్టపడి అయినా కొత్తదనం తీసుకురావాలి. గుంపులో గొవిందా లాగా, పదిమందిలో ఒకరి లాగా వుంటే చాలు అనుకున్నప్పుడు ఏ హైరానా వుండదు.
@ అజ్ఞాత
ReplyDeleteనా అభిప్రాయం కూడా అటే Rhytha వైపే మారుతున్నది. అది ఇంగ్లీషు స్పెల్లింగు కాబట్టి ఇంగ్లీషు తెలిసిన వారయితే సరిగ్గానే పలుకుతారు. ఇంగ్లీషు ప్రొనౌన్సియేషన్ సరిగ్గా తెలియని వారు తప్పు పలికినా దోషం వారిదవుతుంది తప్ప ఆ పేరుది కాదు కదా. మా అల్లుడికి అదే సూచిస్తాను - ఆ తరువాత వారి ఇష్టం.
అలా అయితే ritha కూడా బావు౦ది. rhy?
ReplyDeleteఇదే సమస్య ఈ మధ్య వచ్చి౦ది. తెలుగులో హృతిక, ఇ౦గ్లీష్ లో Hritika అని పెట్టాము :)
Ridha (రిధ) అంటే రాధ ని మర్చిపోయినట్టే ...
ReplyDeleteరిత కి spelling Rita అని ఎలా చెప్పారు ... మీ పేరు మీకు గుర్తు రాలెదా ? ... మీ పేరు sarat/sarath ?
అయినా తెలుగులో హాయిగా రిథ అని వ్రాసుకోవచ్చు కదా..
simply Ritha is right..
@ మౌళి
ReplyDeleteRitha అంటే రిథ లా సాధారణంగా పలుకుతుంది కానీ Rhytha అంటే కాస్త 'ర్రి'థ లా కాస్త ప్రత్యేకంగా, వినసొంపుగా వుంటుంది. ఆ పదానికి అందాన్నిచ్చేది ఆ తేడా కూడానూ. మీరు Rhythm, River పదాల ఉచ్చారణ డిక్షనరీలో చూస్తే తేడా తెలుస్తుంది.
@ కాయ
ReplyDelete:) అవును కదా. ఇంతకీ నా పేరేంటీ?
నిజమే. Ritha అయితే తేలిగ్గా వుంటుంది. Rhytha అయితే సరిగ్గా వుంటుంది. చూద్దాం మా మేనల్లుడు & కో దేనికి వోటేస్తారో.
It depends on where the baby lives if in US/India. If US Write the differnt spellings you think of and let your american read and decide the spelling based on their pronounciation.
ReplyDeleteIf for Indians then I guess Ridha makes more sense.
@ అజ్ఞాత
ReplyDeleteమా మేనల్లుడు వాళ్ళు కొన్నేళ్ళు ఇక్కడ నివసించి మళ్ళీ ఇండియా వెళ్ళారు. వాళ్ళ బాబు ఇక్కడే పుట్టాడు కాబట్టి ఇప్పుడు ఇండియాలో వుంటున్నా కూడా యు ఎస్ పౌరుడే. రిథ ఇండియాలో పుట్టింది, ఇండియాలో వుంటోంది. మళ్ళీ వారు మున్ముందు ఎప్పుడయినా ఇక్కడ పని చెయ్యడానికి రావచ్చు. గ్రీన్ కార్డ్ లేదు. ఎందుకయినా మంచిది స్పెల్లింగ్ అంతర్జాతీయ ప్రమాణాల్లో వుంటే మంచిది కదా :)
రిధిమ rhythima is nice name
ReplyDeleteరాధ మేధ ల లో వాడే spelling (dha)వాడుకొవచ్చు కదా?
ReplyDeleteఇంతకీ ఆ పేరుకి అర్ధం ఏమిటో చెప్పేరు కాదు.
రిథ ని హరిత శబ్ద౦ లా పలకాలి మీ అభిప్రాయ౦ ప్రకార౦, రాధ లా కాకు౦డా. అవునా?
ReplyDeleteఅలా అయితే Ritha సరియైనది.
నా పేరు ruth. తెలుగులో రూత్ అని రాస్తాను కాని ఇంగ్లిష్లో దాని రూథ్ అని పలుకుతారు. అందుకంటే వాళ్ళకు త లేదు. ఓన్లీ ట లేదా థ అంతే. మీరు ఈ పేరు ఇంగ్లీష్లోని ఒక పదాన్ని ముక్క చేసినందు వల్ల వచ్చింది చిక్కంతా. చక్కగా ఏ తెలుగు పేరో, ఈంగ్లీష్ పేరో పెట్టుకుంటె సరి. మీరు ridha అని పెడితే వాళ్ళు రిఢ అంతారు, లేక ritha అని పెడితే మనవాళ్ళు రిత అంటారు.
ReplyDeleteసరే గాని ఈ కామెంటు టైప్ చెయ్యటానికి చాలా టైం పట్టీంది ఈ వేరీషన్స్ అన్నీ రాసేసరికి :)
ఇంకో విషయం, మామూలుగా ఇంగ్లీష్ లో th తో ఎండ్ అయితేనే థ వాడతారు పదం మధ్యలో th వస్తే ద/ధ అని పలుకుతారు (there/rythm లో లాగ) కాబట్టి మీకు ఎలాగైనా చిక్కు తప్పేట్టు లేదు.
ReplyDelete@ అజ్ఞాత
ReplyDeleteరిథిమ కూడా బావుందండోయ్
@ కల్యాణి
రిధ అన్నపేరుని ఇంగ్లీషు పదం రిధం నుండి తీసుకున్నాం.
The pattern of musical movement through time.
@ రూథ్
రిధం పలుకుడు రిధం గా కాక రిథం లా ఇప్పటిదాకా భావించినందువల్ల నాలో కంఫ్యూజన్ ఏర్పడింది. మీ వివరణతో స్పష్టత వచ్చింది. స్పెల్లింగుని బట్టి ఇంగ్లీషు వారు ఎలా పలుకుతారన్నది వదిలేస్తే Ridha నే సులభమయిన వాటిల్లో సరి అయిన స్పెల్లింగ్ అని అర్ధం అయ్యింది. ఇంగ్లీషు ప్రకారం కరెక్ట్ స్పెల్లింగ్ పెట్టాలంటే మాత్రం Rhytha అవుతుంది.
This comment has been removed by the author.
ReplyDeletei think ritha
ReplyDeletemy husband name ends with that letter
srinath ,some people writes sreenadh,srinadh.
But he prefers srinath.
@ కల్యాణి
ReplyDeleteనాక్కూడా Rhytha నే నచ్చిందండీ
@ అజ్ఞాత
శ్రీనాధ్ అనడం కరెక్టా లేకా శ్రీనాథ్ కరెక్టా అంటే నా ఉద్దేశ్యంలో శ్రీనాధే కరెక్ట్. శ్రీనాధుడు అంటాం కానీ శ్రీనాథుడు అని అనం కదా. అయితే మీవారికి శ్రీనాథ్ నచ్చుతుందని చెప్పారు కానీ ఎందుకో చెప్పలేదు.
...శ్రీనాధే కరెక్ట్. శ్రీనాధుడు అంటాం కానీ శ్రీనాథుడు అని అనం కదా.....
ReplyDeleteనా ఇంగ సొల్లె.. నీ అంగ సొల్లె..
అలాగా అయితే...
http://en.wikipedia.org/wiki/Srinatha
...అందరూ నా వల్ల రాధ ని జపిస్తున్నారు... శీఘ్రమేవ....
@ kaaya
ReplyDelete:)
te.wikiquote.org/wiki/శ్రీనాధుడు
ఒక్కోళ్ళూ ఒక్కో రకంగా వ్రాస్తున్నారు. పాండిత్యంలో పిల్లకాయలం మనమేం చెబుతాం.
ఒక చిన్న ఆట ఆడుదాం గురువు గారు..
ReplyDelete.."నాథా" అని ఒక సౌందర్యవతి పిలవటాన్ని ఊహించు కోండి.. వినసొంపుగాఉందా... నాకైతే అలా అనిపించింది ...(కదా)... ఇక..
"నాధా" అని అదే ఆమె పిలవటం ఊహించుకోండి.. పెళ్ళి చూపుల్లో పాట పాడమని అడిగితే.. పెళ్ళి కూతురు "నాధా" అని మగ గొంతుకతో పిలిచి నట్లు లేదు ?.. అందుకని.. ఆడువారు పిలిచే ఈ పదాన్ని శ్రావ్యం గా వినసొంపుగా ఉంది కాబట్టి... నాథా అనే అనుకుందాం..ఏమంటారు..
మచ్చుకు.కాశీనాథుని నాగేశ్వర రావు.. ఆయనెవరో నాకు తెలియదు...
@ కాయ
ReplyDeleteమీరు ఇలా వచ్చారా. ఇంకేమంటాం, సరే అంటాం.
జనరల్ గా అయితే... నేను అంత రాస్తే .. మర్యాద కైనా కనీసం రెండు మూడు వాక్యాలు వ్రాయాలి.. మరీ ఇంత చిన్నబుచ్చుకుంటారా..
ReplyDelete@ కాయ
ReplyDeleteఇవాళ ఫోకస్ అంతా పుస్తకం పని మీద వుంది. అందుకే టపాలు కూడా ఈ రోజు వ్రాయలేదూ. అందుకే వ్యాఖ్యలకి కూడా ముక్తసరిగా స్పందిస్తున్నా.
మా మేనల్లుడు (పాప తండ్రి) స్పందన వచ్చే వ్యాఖ్యలో చూడండి. ఆ వ్యాఖ్య పెట్టమని నాకు ఈమెయిల్ ఇచ్చాడు కాబట్టి వ్యాఖ్య నా పేరు మీద వుంటుంది.
ReplyDeleteఒక టపాకు సరిపడినంతగా మా మేనల్లుడు నవీన్ వ్యాఖ్య వుంది కాబట్టి ఒక పోస్టుగా వేసాను.
ReplyDeletehttp://sarath-kaalam.blogspot.com/2011/06/blog-post_29.html