మేమూ భద్రీనాథునికి బలయ్యాం

బద్రీనాథ్ పెద్దాళ్లకి $9 పిల్లలకి ఉచితం ఈమెయిల్ వచ్చింది. అదీ కాకుండా మొన్న మాకు ఓ ప్రత్యేకమయిన రోజు మరియు నిన్న నాన్నల రోజు అవడం మూలాన కొద్దిగా రిస్క్ తీసుకొని అయినా తమన్నా కోసమయినా అనేసి మా వాళ్ళని తీసుకొని నిన్న వెళ్ళాను. చెత్త సినిమా అని ముందే తెలియడం వల్ల ఆ సినిమా చూసి మా పెద్దమ్మాయి ఎలాగూ గులిగేస్తుందని, మళ్ళీ ఆ శిరోభారం కూడా ఎందుకని తనను తీసుకురాకుండా ఆ భారం ఇంటిదగ్గరే వదిలేసుకున్నాం. ఎంత చెత్త సినిమా అయినా సరే శక్తి కన్నా బెటరే అన్న భరోసా విని వుండటంతో శక్తిని సినిమా హాల్లో చూసి బ్రతికి బట్ట కట్టిన మాకు ఇదో లెక్కా అని సాహసం సేయరా ఢింబకా అని బయల్దేరాం. నా ఉద్దేశ్యంలో తెలుసు సినిమాలని రెండు యుగాలుగా అభివర్ణించవచ్చు. అవి శక్తికి ముందూ - శక్తికి తరువాతా!

బద్రీనాథుని గొప్పతనాలు మిగతావారందరూ వేనోళ్ళా పొగిడేవున్నారు కాబట్టి మళ్ళీ ఆ జోలికి పోవడం లేదు. అయినా సరే దురద ఆపుకోలేక కొన్ని విషయాలు ప్రస్థావిస్తానేం. నీకు సరదాకీ, సంస్కృతికి తేడా తెలియదు అని నాస్తికురాలయిన తమన్నాకి హీరోగారు ఓ సందర్భంలో క్లాసు పీకుతారు. బావుంది కానీ భక్తి పాటలో ఆ మెలికలు తిరిగిపోయే కుప్పిగంతుల స్టెప్పులేమిటో! ఆ సినిమా తీసినవారికి సరదాకూ, సంస్కృతికీ తేడా తెలియదల్లా వుందని నాస్తికుడిని అయినా నాకే అంత చిరాకు పుట్టిందంటే నిజమయిన భక్తులకు ఇహ ఎలా అనిపించిందో. విలన్ భార్యకి ఆ డబ్బింగ్ ఏమిటో. చిన్నపిలాడిని అడిగినా చెప్పేస్తాడు ఆ డబ్బింగ్, ఆ యాస డబ్బాల్లో గులకరాళ్ళు వేసి గిరాగిరా తిప్పినట్టుగా వుందని. ఒక సీనులో తప్ప తమన్నా ఎప్పటిలాగా బాగానే వుంది - నా పైసలు నాకు అలా గిట్టుబాటు అయ్యయిలెండి. అల్లు అర్జున్ తన పాత్రకి చక్కగా నప్పాడు.

ఇంటర్వెల్లో అడిగాను అమ్మలుని సినిమా ఎలా వుందని - బావుంది అంది. సినిమా అయిపోయాకా అడిగాను ఎలా వుందని. సేం రేటింగ్ - శక్తి రేటింగ్ అంది. దానికి శక్తి కూడా భలే నచ్చేసింది లెండి. అవును మరీ ఈ రెండూ పిల్లల సినిమాలాయే. తమన్నా తన ఫేవరేట్ హీరోయిన్. అందువల్ల కూడా ఈ సినిమా నచ్చివుంటుంది. మా ఆవిడని అడిగాను. ఏం అడుగుతావులే అంది. శక్తి కన్నా బోలెడు బెటరని ఇద్దరం అనుకున్నాం.  నేను భద్రీనాథ్ వెళితే అక్కడి జలపాతాలు వెనక్కి వెళతాయంటావా అని ఆసక్తిగా మా ఆవిడని అడిగేసాను. ఆమె ఏమందంటే ... నాకు గుర్తుకులేదు. కొన్ని కొన్ని అడగాలని అడిగేస్తా అంతే కానీ వారి సమాధానం వినాలని కాదు.

4 comments:

 1. అందరు చెప్పింది విని మేము ఉచితంగా మమ్మల్ని ఆ బద్రినాథునికి బలిచ్చుకున్నాం.

  ReplyDelete
 2. @ కన్నా
  :) ఫర్వాలేదులెండి. నన్ను మీరు బలి ఇచ్చింది తమ్మన్నాకే కదా.

  ReplyDelete
 3. చెప్పడం మరిచాను. భద్రీనాధ్ చూస్తుంటే ఓ ఆలోచన వచ్చింది. అందులో క్షేత్ర పాలికులు వుంటుంటారు కదా. రేడియో అక్కయ్య, రేడియో అన్నయ్య లాగా బ్లాగు అన్నయ్య, బ్లాగు అక్కయ్య, బ్లాగు పెద్దయ్య ఇంకొందరు పెద్దమనుషులు కలిసి 'బ్లాగు పాలికుల'ను తయారుచేస్తుంటారని ఓ సరదా టపా వ్రాద్దామనుకున్నా కానీ వ్రాయడం లేదులెండి. అక్కయ్య, అన్నయ్య, పెద్దయ్యలు ఎవరని అడక్కండి. నేనేదొ సరదాగా అలా వ్రాసాను. మీరెవర్నన్నా ఊహించుకుంటే ఊహించుకోండి.

  ReplyDelete
 4. memu online lo chusamu anthaga bagaledani talk vachindi kabatti. naku kuda navvu vachindi aa veshaniki n body language, matalaki asalu relation ledu. vesham emo bakthudi vesham, maata style matram mass style laga anipinchindi idavariki movies lo laga.

  ReplyDelete