ఎందుకొస్తార్రా వీళ్ళంతా!

దాదాపు పదేళ్ళ క్రితం జూనియర్ ఎన్టీఅర్ ఒక సినిమా షూటింగు కోసం కెనడాలోని టొరోంటోకి వచ్చాడు. అప్పట్లో మేము టొరొంటోలోనే వుంటుండేవారం. సినిమా పేరు గుర్తుకులేదు. అతని తొలి సినిమాల్లో ఒకటి అయ్యుంటుంది. మా స్నేహితునికి ఒకతనికి డైరెక్టరో, నిర్మాతో దూరపు బంధువు. అందువల్ల అతను ఆ సినిమా షూటింగు చూడటానికి వెళ్ళాడు. అతనితో పాటుగా ఇలా షూటింగ్ చూస్తున్న తెలుగువాళ్ళు మరో ఇద్దరో ముగ్గురో వున్నారనుకుంటా.

షూటింగ్ బ్రేకులో జూనియర్ విశ్రాంతి తీసుకుంటూ ఇలా షూటింగు చూడటానికి వచ్చిన తెలుగు వాళ్లని చూస్తూ తన సహాయకుడితో ఇలా అన్నాడంట "ఎందుకొస్తార్రా వీళ్లంతా". ఆ మాటతో మా వాడికి తలకొట్టేసినంత పని అయ్యిందంట. అప్పటిదాకా కాస్తొ కూస్తో జూనియర్ మీద అభిమానం వున్నా అతని తల పొగరు తెలిసాక అది ఎగిరిపోయింది. అప్పటినుండీ అతను ఇప్పటిలాగా శక్తి విహీనం అయినప్పుడల్లా సంతోషిస్తుంటాను.  బృందావనంలోలాగా విహరించినప్పుడల్లా చేదు టానిక్ తాగినట్లుగా  అతని సినిమాలు చూస్తుంటాను. కొంపదీసి వీడు ఎన్నడో ఒకనాడు మన ముఖ్యమత్రి అయిపోడు కదా అని ఖంగారూ పడుతుంటాను.

మొదట్లో తన సినిమాల తొలి విజయాల ఊపులో తల పొగరు వచ్చి వుంటుందిలే - ఆతరువాత అపజయాలతో దిగివుంటుందేమోలే అనుకున్నా కానీ ఇంకా దిగలేదని అర్ధమయ్యింది. మెహర్ రమేశ్ శక్తి సినిమా కథ వినిపిస్తే ఈ సినిమా నేను కాకపోతే ఇంకెవరు చేయగలరు అని ఆ సినిమా ఒప్పుకున్నాట్ట. అవును మరీ. 

20 comments:

 1. జూన్టిఆర్ అన్నది నిజమే కాదా. వాళ్ళు వాళ్ళ పని చేసుకోని డబ్బులు సంపాదించుకుంటారు. మనమేమో అమితమైన అభిమానంతో సొంగ కార్చుకుంటూ వెళ్ళీ పని,టైం దొబ్బించుకుంటాము.

  ReplyDelete
 2. జూలో బోనుల్లో ఉన్న జంతువులు కూడ బహుశా ఇదే అనుకుంటూ ఉంటాయి.
  అయినా ఈ సందర్భంలో నేను ఎంటీఆర్‌నే సమర్ధిస్తున్నా. అదలా ఉండగా ఒక నటుడి వ్యక్తిగత ప్రవర్తనకీ అతని సినిమా చూడ్డానికీ లంకె ఏంటి?

  ReplyDelete
 3. @ భారారే
  నిజమే. ఎంతయినా (నటన) చేసేవాడికి చూసేవాడంటే లోకువే కదా.

  @ కొత్తపాళీ
  నిజమే. దానికీ దీనికీ లింక్ కలపకూడదేమో కానీ విజయవంతుడయిన వ్యక్తికి వ్యక్తిత్వమూ కూడా బావుంటే ఇంకా బావుంటుంది. మదమూ, గర్వమూ రాంగోపాల్ వర్మ లాంటివారికి మాత్రం బాగా చెల్లుతాయి. ఎందూకంటే అతని శైలి అంతే. అలవాటు పడ్డాం. చిరంజీవి లాంటివారిని అందరూ ఎందుకు కుటుంబ సభ్యుల్లా భావిస్తారంటే అలాంటివారికి ఎన్ని విజయాలు వచ్చినా వినయంగానే, నమ్రతగానే వుంటారు కాబట్టి. (రాజకీయ చిరంజీవి గురించి కాదు నేను అనేది - నట చిరంజీవి గురించి).

  మన బ్లాగులు చాలా మంది చదువుతుంటారు. పనీ పాటా లేకుండా ఎందుకు చదువుతార్రా నా బ్లాగులు వీళ్ళంతా అని అనుకోగలమా? మనమూ ఎన్నో బ్లాగులు చదువుతాము. అలా ఏ బ్లాగరయినా పబ్లిగ్గా అన్నాడంటే అతనెంత మంచిగా వ్రాసినా కూడా అతని మదం తెలిసాక ఆ బ్లాగు చదవాలని నాకయితే ఉత్సాహంగా వుండదు. అభిమానులని అభిమానించాలి కానీ లోకువ చేస్తే నేనయితే హర్షించలేను.

  ReplyDelete
 4. @ కొత్తపాళీ
  నిజమే. బోనులోని జంతువులు ఖచ్చితంగా అలాగే అనుకుంటూవుంటానుకుంటా! నాకయితే జూకి వెళితే సంతోషం కలగకపోగా అందులోని జంతువుల దీనావస్థ చూసి జాలేస్తుంది. వాటికంటే సఫారీలు నయ్యం. వాటిల్లో మనలని జంతువులు చూస్తాయి!

  ReplyDelete
 5. శరత్ గారు, బ్లాగుల పోలిక సమంజసం కాదు. ఎన్టీఆర్ కామెంటింది జనాలు షూటింగ్ కి రావడం గురించి. షూటింగ్ సమయంలో ఇతరుల ఉనికి సినిమా యూనిట్‌కి చికాకుగానే ఉంటుంది. వినయం మంచిదే కాని సరుకున్న ప్రతిభావంతులకి ఆ మాత్రం గీర సహజమే అనిపిస్తుంది. కొన్ని సినిమాలు ఫ్లాపయినా, నటుడిగా ఎంటీఆర్ ప్రతిభావంతుడనే నేనిప్పటికీ అనుకుంటున్నా. చిరంజీవి వినయాన్ని గురించి కూడా నాకంత నమ్మకం లేదు. ఆయన స్వతహాగా మితభాషి కావడంతో ఆయన ఏమనుకుంటున్నదీ ఎలాగూ బయటపడదు.

  బ్లాగుల విషయంలో ఇంకో తేడా కూడా ఉంది. ఇది టూ-వే మీడియం. బ్లాగరుకీ పాఠకులకీ మధ్య ఒక సంభాషణ, ఒక చర్చ జరిగే అవకాశం ఉన్నది. అందువల్ల గీర మనుషుల బ్లాగులు చదవాలనిపించక పోవడం అర్ధమవుతున్నది. కానీ సినీతారకీ ప్రేక్షకుడికీ అలాంటి భేటీ అవకాశం లేదు. తను చెల్లించిన ముడుపుకి తగిన వినోదం సినిమా ఇస్తే
  ఆ తార ఎటువంటి వ్యక్తి అయినా ప్రేక్షకుడికి ఇబ్బంది ఉండాల్సిన అవసరం లేదు. Of course, your preferences are yours. Just sharing my views. Anyways, interesting discussion.

  ReplyDelete
 6. సింహాద్రి హిట్టు అయిన కొత్తలో " చిరంజీవా... ఆయన ఎవరు?" అని లైవ్ ప్రోగ్రాం లో అంటే వెంటనే నాగార్జున లైన్ లోకి వచ్చి చివాట్లు పెట్టాడు
  ఉడుకు రక్తం ....
  నేను మాత్రం "అబ్బాయి"కి అభిమాని
  "బాబాయి" కి కాదు

  ReplyDelete
 7. "...అవును మరీ..." This punch line is excellent.

  ReplyDelete
 8. @ శివ
  :))

  గ్రేటాంధ్రాలో ఓ సెటైర్ వచ్చింది చూడండి:
  http://telugu.greatandhra.com/cinema/1-02-2011/18g_02_sak.php

  ReplyDelete
 9. మొదట్లో ఉన్న బలుపు చాలావరకు దిగినట్లే ఉందిలెండి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నానుడి ఏమిటంటే...ఇక్కడ ప్రతిభ లేకపోయినా చెలాయించొచ్చుగానీ, బలుపు ఉంటే మాత్రం పనికిరాకుండా పోతారని. ఎందుకంటే ఇది క్రియేటివ్ ఫీల్డ్ కాబట్టి - ప్రతిఒక్కరికీ ఈగోలు బాగా ఉంటాయి.

  ప్రతిభ లేకపోయినా క్రమశిక్షణవలన దీర్ఘకాలం కొనసాగిన ఎందరో నటులను మనం ఇక్కడ చూడొచ్చు. అయితే బలుపు ఉండీ, నటులుగా దీర్ఘకాలం కొనసాగినవాళ్ళనుమాత్రం చూడలేము. మీరు కావాలంటే ఇండస్ట్రీలో తెలిసినవాళ్ళెవరయినా ఉండే అడిగి చూడండి.

  ReplyDelete
 10. చిరు విషయం లో వినయం నమ్రత అనేది నిజమే అని నా అనుభవాల ద్వారా చెప్పగలను, ఎన్ని వందలమంది వచ్చిన విసుగు విరామం లేకుండ అతను మనల్ని పలుకరించే తీరు ముచ్చటెసేది.. అది ఒక్కటె కాదు అతను మాట్లాడినప్పుడు కూద ఎక్కడా గర్వం గీర లాంటివి మచుకి కూడ కనబడవు

  ReplyDelete
 11. చిర౦జీవి వినమ్ర౦గా నటిస్తాడని తెలిసి జూనియర్ కూడ ఆ నటన చూపక మీ కోపానికి గురయ్యాడే :) అయినా మీరు అతని వయస్కులతో కదా పోల్చి వ్యక్తిత్వ౦ చెప్పాలి? నటి౦చడ౦ చేతనయిన వారి నిజ వ్యక్తిత్వమ్ అ౦త ఈజీ గా తెలిసేనా?

  కష్టపడి సినిమాల్లోకి వచ్చాడు కదా.మొదటి లో ఇలా షూటి౦గులకు వచ్చేవారి ని చూస్తే అతనికి నచ్చి వు౦డక పోవచ్చు. మీ స్నెహితునికి అవమాన౦ జరిగితే మీరు మనసుకు పెట్టుకొన్నారు సరే, ఎన్నాళ్ళు :)


  @మన బ్లాగులు చాలా మంది చదువుతుంటారు. పనీ పాటా లేకుండా ఎందుకు చదువుతార్రా నా బ్లాగులు వీళ్ళంతా అని అనుకోగలమా?

  ఉన్నమాట చెప్పగానే మా బ్లాగు ఎ౦దుకు చదువుతారు అని సిగ్గు పడకు౦డా (లేకు౦డా ) అడిగే బ్లాగర్లు మనకి కోకొల్లలు కదా :)

  ఖర్మ కాలి వాళ్ళతో జూనియర్ ని పోల్చారా? షూటి౦గ్ కి రావద్దన్నడు కాని, సినిమాకి రావద్దన్నాడా?

  ReplyDelete
 12. @ అజ్ఞాత, శర్మ
  మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను. కొన్ని మినహాయింపులు ఎలాగూ వుంటాయి.

  @ మౌళి
  మంచి సినిమాలు ఎవరు చేసినా చూడకతప్పుద్దా. నచ్చని వారు చక్కగా వ్రాసినా చదవమేమో కానీ నచ్చని వాడు చక్కగా నటించేస్తే చూడకుండా వుండగలమా.

  ReplyDelete
 13. మీ తాత భగవంతుడి 12వ అవతారం అయితే, మీ నాన్న ఒక పులితో ఒక ఎద్దు తో దున్న్తుంటే(సరిగ్గానే చదివారు ఒక పులి, ఒక ఎద్దు "సీతయ్య"లో) మీ బాబాయ్ తొడగొట్టి ట్రైన్ వెనక్కి పంపిస్తే ...

  మీరు కూడా అంతా బలుపుతో మాట్లాడుతారు. ;-)

  ReplyDelete
 14. బహుశా జూనియర్ డ్రాయరు బదులు లంగోటాలు కట్టుకుంటాడు కాబోలు.

  ReplyDelete
 15. [ఎవరో నా పేరు మీద కామెంట్లు ఏస్తున్నరు... ఇప్పుడే ప్రొఫైల్ తయార్ చేసిన... ఇక నుండి.. ఈ ఐడీ నుండే కామెంటుతా... ]

  నాకైతే జూనియర్ పై పెద్ద అభిప్రాయం ఏం లేదు.. కాక పోతే అప్పట్లో కష్టపడితే డాలర్ తో రూపాయ్ ని సమానం చేయలేమా అంటూ మాట్లాడాడు... ఎదో చిన్న పాసిటివ్ ఒపినియన్ ...

  చిరంజీవి ... అదేదొ ఫంక్షన్ లో మాకు మేము ఇచ్చుకోలేము కాబట్టి అంటూ జూనియర్ కి అవార్డ్ ఇచ్చిండు... జూనియర్ స్టేజీ ఎక్కి ఇది నాకొద్దు... చిరంజీవి గారికే తిరిగి ఇస్తున్నాను అంటూ పంచ్ ఇచ్చిండు.. కొంచెం ఆగి.. చిరుజీవి నుండి శిభన్ బాబు కి అంకితం చేరేలా చూడమన్నడు...

  వాల్లకీ వల్లకీ మద్యల ఏమేం ఉన్నాయో... అసలే సందర్భం లో ఎవరిని అంటే ఎవరికి తగిలిందో...

  కాబట్టి... బుడ్డోడి ని ప్రతిభ ని బట్టి చూద్దాం.. పెద్దాయన పేరు కి మిగిలిన ఒక్క వారసుడు..

  ReplyDelete
 16. http://www.idleburra.com/2011/03/srija-files-dowry-harassment-case-on.html

  ReplyDelete
 17. @ కాయ
  నాకూ అవి వ్రాసింది మీరు కాదేమో అన్న అనుమానం వచ్చింది కానీ వ్యక్తం చెయ్యలేదు.

  @ అజ్ఞాతా
  వార్నీ మన బ్లాగర్లు/ రీడర్లు వెబ్ పోర్టళ్ళ కామెంట్స్ కూడా వదలడం లేదన్నమాట!

  నాకు, నా బ్లాగుకీ ఎందుకబ్బా ఆ విషయాలు. అందుకే మీ కామెంట్స్, లింక్స్ ప్రచురించడం లేదు.

  ReplyDelete
 18. శరత్ గారూ,
  మీరు చెప్పిందే రైట్.
  కొత్తపాళీ గారూ
  ప్రతిభావంతులకు గీర అందగిస్తుందంటే ఓప్పుతాగానీ అది రమణగారు, బాపు, మహానటి సావిత్రి లాంటి ప్రతిభావంతులైతే ఓకే.
  జూనియర్ని తీసుకెళ్ళి ఆ గాటన కట్టలేము కదా.
  ఎందుకొస్తార్రా బాబూ వీళ్ళంతా... ఇదేమాట తన సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వెళ్ళే జనాన్ని చూసి అనమనండి చూద్దాం. : )

  ReplyDelete