మా మేనల్లుడికి కొద్దిరోజుల క్రితమే కుమార్తె పుట్టింది. వాళ్ళకు రెండక్షరాల పేర్లు కావాలిట. నేను కొన్ని సూచించాను కానీ మరిన్నిటి కోసం మిమ్మల్ని అడుగుతున్నాను. ర తో వచ్చే పేర్లు అయితే ప్రాధాన్యత.
నేను సూచించిన పేర్లలో ముఖ్యమయినది రిథ. రిధం Rhythm కి షార్ట్ అది. ఆ పేరు తల్లికి బాగా నచ్చింది. అయినా సరే ఇంకా మరిన్ని పేర్ల కోసం వారు చూస్తున్నారు. నేను సూచించిన మరి కొన్ని పేర్లు రాగ, ధార, శబ్ద, ఆజ్ఞ, తీర్ధ, హృద్య, శ్రీ (ఒక్క అక్షరం పేరు), సిరి, నిధి, ప్రఖ్య. వారికి రాగ, ధార కూడా బాగా నచ్చాయి.

28 comments:
Reeti, rOma, roobi, raksha, rashmi
Deepa, Laya, Nithya
సీత
Yuktha
తను ..అని ..నిజ..సుజ..మహి..సహి..స్వర ..వర..
ఈ మధ్య అన్నీ షార్టు కట్లే కదా కిందవి చూడండి ఇతిహాస స్త్రీల పేర్లకి షార్టు కట్లు (విన్న వాళ్ళ తల బొప్పి కట్టు)
గమనిక: షా.క. అనగా షార్టు కట్టు)
సూయ(అనసూయ కి షా.క)
ధారి(గాంధారి కి షా.క.)
తర(ఉత్తర కి షా.క.)
ససా(సతీ సావిత్రి కి షా.క.)
రుమి(రుక్మిణి కి షా.క.)
సుభ(సుభద్ర కి షా.క.)
వల(వర లక్ష్మి కి షా.క.)
ఇంకా సింపుల్ అంటారా అల,వల,బల,కల,విల,గల...ఆలోచించాలే కానీ బోలెడు
(సరదాగా రాసాను ఏమీ అనుకోకండే....మీరు స్పోర్టివ్ అనిపించి ఇలా మీ బ్లాగు లో కామెంటాను. నచ్చకపోతే తీసెయ్యండి)
ముగ్ధ,మేఘ,ధన్య,ప్రఙ్న,వర్ష,మాయ,వేద,ఇషా,గ్రీష్మ,లిపి,లాస్య,మాన్వి,తన్వి,హిత,కృతి,ముక్త,పూర్వి,స్మృతి,యుక్తి
:)
Neha, Nithya, Reecha, Sreeja
రాష్మీ, రాగ, రేను
Raji.. no options.. this is too good..
1. రి౦దు (Rindu)
*మహారాష్ట్రలో రి౦దాదేవి అనే అమ్మవారి పేరు.
**మలేషియన్ భాష, మలయ్ లో "రి౦దు" అ౦టే జ్ఞాపక౦, ఊసులు అని అర్థ౦.
2. రస
* ఇక ఈ పేరు అర్థ౦ తెలిసి౦దే, కానీ స్కూల్లో ఫ్రె౦డ్స్ రస౦, రస౦ అని ఏడిపి౦చే ప్రమాద౦ ఉ౦ది !
1. రి౦దు
* మహారాష్ట్రలో కొలువై ఉన్న రి౦దాదేవి అనే అమ్మవారి పేరు.
** మలేషియన్ భాష బహాసా మలయ్ (Bahasa Malay)లో రి౦దు (Rindu) అ౦టే జ్ఞాపక౦, గుర్తుకు రావడ౦, ధ్యాస అని అర్థ౦.
2. రస
* ఈ పేరుకు అర్థ౦ తెలిసి౦దే. కానీ,స్కూల్లో ఫ్రె౦డ్స్ రస౦ రస౦ అని ఏడిపి౦చే ప్రమాద౦ ఉ౦ది.
మరీ అలా రెండక్షరాలు, ర తో ఐతే మంచిది అని మాత్రమే చెప్తే ఎలా? కొంచెం స్పెసిఫిక్ గా చెప్పాలి అంటే, మంచి అర్ధం ఉండాలా/అవసరం లేదా? పోష్ గా ఉండాలా/అవసరం లేదా? , అచ్చతెలుగు పేర్లా, ఇండియన్ పేర్లా లేక ఇంగ్లీషు పేర్లైనా ఓకే నా ఇలా.... ఇంతకూ "రూత్" ఎలా ఉందంటారు ??? :)
పేర్లు సూచించిన వారందరికీ ధన్యవాదాలు. పేర్లు కొత్తగా వుండాలి, అర్ధం ఎంత బావుంటే అంత మంచిది. తెలుగు లేదా ఇండియన్ పేర్లు కావాలి. ఇంగ్లీషు పేర్లు వద్దండోయ్ :)
ఇప్పటివరకు మీరు అందరూ సూచిన పేర్లలో కొన్ని పాత పేర్లు తీసివేసి మా వాళ్లకి పంపించాను.
చివరికి వారు ఏ పేరు పెట్టారు అన్నది పేరు నిశ్చయం అయిన తరువాత తెలియజేస్తాను. చూద్దాం మీలో ఎవరయినా గెలుస్తారో లేక నేను గెలుస్తానో లేక ఇంకెవరయినా గెలుస్తారో.
bhoomi, hima,veda, mahi, priya, rani, roja,susi, seema, sradda
RAMYA...
@ మిర్చిబజ్జీ
తల్లి పేరే ఆ పాపకి పెట్టడం బావుండదేమో :)
Raksha
Rashmi
Reshma
Raaga
Yuktha and Yajushi kuda baaguntayi
సాద్య..... I daughter name...
ritha vaddu. It is too close to sanskrit word which means "untruth" or "false"
ఆ సంస్కృతం పదం ఏంటండీ?
వివశ", షార్ట్ గా "వివా"
ఈమధ్య సూచించబడిన పేర్లు మా మేనల్లుడికి ఇప్పుడే పంపించాను.
ఇతరులు సూచించిన పేర్లలోనుండి రెండు పేర్లు, బ్లాగర్లు సూచించిన పేర్లలోనుండి రెండు పేర్లు, నేను సూచించిన వాటిలోనుండి రెండు పేర్లు షార్ట్ లిస్ట్ చేసేరుట. ఈమధ్య మీరు సూచించిన పేర్లు కూడా ఏవయినా షార్ట్ లిస్టుకి వెళతాయేమో చూద్దాం.
Muvva, Ala, Swari
మీకు సాధారణంగా మంచి పేర్లే తడతాయి కదా. మరీ 'రిథ' ఏంటి? దానికేమన్నా అర్ధం ఉందా?
కొత్తదనం అనుకుంటూ అర్ధం పర్ధం లేని పేర్లు పెట్టటం ఫ్యాషన్ ఐపోయిందీ మధ్య. నాకు తెలిసినోళ్ల పిల్లల పేర్లు కొన్ని: వృషిత్, హర్షిత్ (ఈ పేరు ఫర్లేదు కానీ అబ్బాయి అమెరికాలో పెరిగే వాడు. అతని క్లాస్‌మేట్స్ ఎలా ఏడిపిస్తారో ఊహించుకోండి ఓ సారి), ఇయన, నిహిల్, నిహిత, రోచన్ (ఇంకానయం .. ముందు విక్టరీ సింబల్ తగిలించలేదు), వృషణ్ (కెవ్వ్.....), రిద్ధి .... వగైరా.
@ ఆబ్రకదబ్ర
మా మాజీ టర్కిష్ కోలీగ్ పిల్లల పేర్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతూవుండేవాడు. వెనకా ముందూ అన్నీ చూసుకోవాలిట. లేకపోతే తోటి పిల్లలు ఏడిపిస్తారుట. ఆ ఇబ్బందే వాళ్ళమ్మాయికీ వచ్చిందంట. వాళ్ళ అమ్మాయి పేరు అడగ్గా అడగ్గా చెప్పేడు. Suna. వెనక్కి తిప్పి చదువుకోండి.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి