ఇండియాలో ఈ ఇద్దరు బ్లాగర్లు కలిసినా మాట్లాడకూడదనుకున్నాను!

తెలుగు బాటకి వెళ్ళాను. నా బ్లాక్ లిస్టులోని బ్లాగర్లలో ఒకరు కనిపించారు కానీ తన పనుల్లో తాను వున్నాడు. కనీసం నా వైపైనా చూస్తాడా అనుకున్నాను కానీ లే, చూడలే. నన్ను చూసేవుంటాడు కానీ అలా చూడనట్లు నటిస్తున్నాడనుకుంటా. నేనూ అతగాడి మీది నుండి చూపులు మళ్ళించాను. కానీ పనులతో అటూఇటూ తిరుగుతూ నాకు కనపడుతూనే వున్నాడు. నేనేం చేసేదీ. నేను ఇక్కడికి వచ్చింది తెలియకుండా వుంటుందా? నేను ఇక్కడ అందరితో హడావిడిగా మాట్లాడుతూ వుంటే నేను వచ్చింది అర్ధం కాదా? సరే నాతో మాట్లాడనక్కరలేదు - కనీసం నా వైపు చూడటానికి కూడా విముఖత్వమేనా? నేను ఇతగాడిని నా బ్లాక్ లిస్టులో వేసి సరి అయిన పనే చేసాను అని సంతోషించాను.

ఇతని సంగతి సరే ఇంతకీ మన లిస్టులో వున్న రెండవ బ్లాగరెక్కడా అని అప్పటినుండీ కళ్ళతో వెతుకుతూ వున్నా కానీ కనపడలేదు. వచ్చాడా, లేదా? వచ్చినా గుర్తుపట్టలేకపోతున్నానా? ఆ శాల్తీని ఎక్కడున్నా గుర్తుపట్టకుండా వుండటం అసాధ్యం! అంచేతా ఇంకా రాలేదన్నమాట. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు మిస్సు కాడే? ఎందుకు ఇంకా రాలేదబ్బా? నడక సమయనికి వస్తాడేమోలే అనుకున్నను.


తరువాత బ్యానర్లను అన్నింటినీ కలిపి ఒక వలయంలా నిలబడ్డాము. మొదటి బ్లాగరు కూడా బ్యానర్లు పట్టుకొని నాకు ఎదురుగా కొంత దూరంలో వున్నారు. పోనీ ఎదురుగ్గానే వున్నాగా - ఇప్పుడన్నా నా వైపు చూస్తాడా అంటే చూడడే. ఎంత మదం ఇతనికి! హుం! నేను శరత్ అని తెలవక పోతే క్యాజువలుగా అయినా నా వైపు చూడాలి కదా?

ఇతనితో నాకు పడకపోవడానికి కొద్దిగా చరిత్ర వుంది. అది తెలుసుకోవాలంటే కూడలిలో నా ధర్నా దగ్గరికి వెళ్ళాలి. అప్పట్లో నన్ను కూడలి నుండి వెలివెయ్యడంలో వీరి పాత్ర కూడా చాలా వుందని అనుమానం. వీవెన్ మీద ఇతని ప్రభావం ఎక్కువగా వుందని నా అనుమానం. అప్పట్లో వీరి నెట్ పత్రికను విమర్శిస్తూ వ్రాసినందుకో లేక గేలు అంటే విముఖత్వంతోనో అన్ను తెలుగు బ్లాగులోకానికి దూరం చెయ్యాలని కుట్ర పన్నారు అని నా అనుమానం. ఇతగాడంటే నాకు కంపరం. అప్పట్లో అధ్యక్షుల వారు అని వారు ఆ పదవి దిగిపోయేంతవరకు కూడా అవహేళన చేస్తుండేవాడిని. అయితే అవన్నీ తను పట్టించుకున్నాడో లేదో తెలియదు. అవును మరి నన్ను బ్లాగులోకంలోనుండి బయటకి వెళ్ళగొట్టేంత హోమోఫోబియా వున్నవారిని నేను గౌరవించాల్సిన అవసరం నాకేం వుంది? వీరెవరో ఇప్పుడు మీకు అర్ధం అయి వుండవచ్చు! కొంతకాలం తరువాత ఇంకా భేదాభిప్రాయాలు ఎందుకులే అని, తనతో మామూలుగానే వుందామని తన బ్లాగులో కొంత కాలం నేను కామెంట్లు వేస్తూ వచ్చాను కానీ నన్ను తను పట్టించుకున్న పాపాన తను పోలేదు. దాంతో ఇక ఆ బ్లాగుని లైట్ తీసుకున్నాను.

అలా బ్యానర్లు ఒక సర్కిల్లా పట్టుకొని అందరం నిలబడ్డి గుండ్రంగా తిరుగుతూ ఇక చాల్లే అని ఆగిపోయాము. అప్పుడు తన పక్కనున్న ఒక బ్లాగరు (వీరెవరో గుర్తుకులేదు) శరత్ వచ్చాడు చూసారా అనో ఏమో వారికి నన్ను చూపించడం గమనించాను. తను అలాగా అని ఆసక్తిగా నా వైపు చూస్తుండటం గమనించి ముఖం తిప్పేసుకునేనంతలోపుగానే...తను నాకేసి చూస్తూ పలకరింపుగా నవ్వాడు. తిప్పబోయిన నా తలని అలాగే ఓరగా వుంచి అది నిజం నవ్వా లేక తప్పనిసరి నవ్వా అన్నది గమనించాను. నిజం నవ్వే. నేనూ తల వారికెదురుగా తిప్పి నవ్వేసాను. మేమిద్దరమూ బ్యానర్లు పట్టుకొని దూరంగా వున్నాము కాబట్టి మాట్లాడుకోలేకపోయాము. తరువాత మాట్లాడదాం అన్నట్లుగా తలలు పంకించాము. వారెవరో మీకు ఇంకా అర్ధం కాకపోతే వారు చదువరి అని గమనించగలరు.

కొంతసేపయిన తరువాత మా ఇద్దరికీ కాస్సేపు మాట్లాడుకోవడానికి సమయం దొరికింది. మాతో పాటు నాగ మరియు మా అల్లుడు రవి వున్నారు. చదువరి గారు చక్కగా, ఆప్యాయంగా మాట్లాడుతూ కుశల ప్రశ్నలు వేసారు. వారి కంఠస్వరం చాలా బావుంది. మృదువుగా, సరళంగా అనిపించింది. వారి టోన్ బావుండటం వల్ల వారి మాటలు వింటూ వుంటే వినసొంపుగా అనిపించింది. అలా ఇద్దరం కాస్సేపు చక్కగా కబుర్లు పెట్టుకున్నాం. ఫోటోలో కంటే బక్కగా కనపడుతున్నారు అని ఆరా తీసారు. నేను ఇప్పుడే బావున్నానని మావాళ్ళంతా అంటున్నారని నవ్వుతూ చెప్పాను. మా చుట్టూ అక్కడ ఇంకొందరు కూడా వున్నట్లున్నారు కానీ ఎవరెవరు వున్నారో గుర్తుకులేదు.

ఆ రెండో బ్లాగర్ రాలేదా అని చదువరి గారిని ఆరా తీసాను. "అతను వస్తే ఇక్కడెందుకు వుంటాడు? వెళ్ళి ఆ టివి కెమెరాల ముందు (కనపడేలా) వుంటాడు కానీ!" అని ఎవరో జోకితే సన్నగా నవ్వుకున్నాం. చదువరి గారు "అవునూ తను ఎందుకు రాలేదబ్బా" అని సెల్ ఫోను తీసి ఫోను చేసారు కానీ కాల్ వెళ్ళలేదు.  "బీహారో, ఏదో రాష్ట్రానికి తరచుగా వెళుతుంటారుగా, అక్కడికి వెళ్ళినట్లున్నారు, అందుకే కాల్ పోవడంలేదు" అని వారు అన్నారు.    

ఆ తరువాత మళ్ళీ చదువరిగారితో మాట్లాడే అవకాశం రాలేదు. నడకలో కొంతసేపు వారు మా పక్కనే నడిచారు కానీ మేమంతా స్లోగన్స్ ఇవ్వాల్సివున్న కారణంగా మాట్లాడలేకపోయాను. చదువరి గారు నాతో మాట్లాడతారనే అనుకోలేదు. అలాంటిది ఆప్యాయంగా, ఆదరణతో మాట్లాడేసరికి నాకు చాలా సంతోషం వేసింది. నా బ్లాకు లిస్టులోంచి చదువరి గారి పేరు కొట్టివేసాను. నా బ్లాకు లిస్టు నిరంతర స్రవంతి లాంటిది. కొన్ని పేర్లు ఎక్కుతూ వుంటాయి, కొన్ని పేర్లు పోతూ వుంటాయి. సగటు మనిషిని నేను. నాకూ రాగద్వేషాలుంటాయి మరి!

15 comments:

 1. మళ్ళి ఏవరికి స్పాట్ పేట్టారు శరత్ గారు .. మీరు ఏవరో ఒక్కరిని కెలకందే .. ఉరుకోరే ... మీడియాలో ఉండాలిస్సిన వారు ....:)))))))

  ReplyDelete
 2. >>కనీసం నా వైపైనా చూస్తాడా అనుకున్నాను కానీ లే, చూడలే. నన్ను చూసేవుంటాడు కానీ అలా చూడనట్లు నటిస్తున్నాడనుకుంటా.


  మళ్ళీ ఎవర్నో గెలకటం మొదలెట్టారు... ఎవరు వారు ఏమా కథ :-)

  ReplyDelete
 3. @ పవన్, భా రా రే
  హ హ. వెంటనే మిగతా భాగం వ్రాద్దామనుకున్నా కానీ ఇండియాలోని ఒక వసపిట్టకు ఫోనులో దొరికిపోయి ఆలస్యం అయ్యింది.

  ReplyDelete
 4. 1) వాళ్ళు నీతో మాట్లాడలేదు అని చెప్పు.

  2) అయినా వళ్ళిద్దరెవరో చెప్పకుండా రాస్తే కిక్ ఏముంటుంది? మళ్ళీ తిట్లు తినాల్సి వస్తుందేమో అని భయ పడి వాళ్ళ నేంస్ ఇక్కడ రాయలేదా? దేనికైనా గట్స్ ఉండాలి బాబు.

  3) అంటే ఇక నుంచి మాలిక వారు ఎక్కడ ఎదురైనా ఆడంగి లాగా మాట్లాడవా?

  ReplyDelete
 5. తప్పు ఎవరిదైనా పాత గొడవలను మర్చిపోవాలి కాని, ఇలా తవ్వు కుంటే ఏమొస్తుంది సార్?.

  'క్షమించగలగడం' is the toughest thing. BUT మీరు ఆ పని ఈజీగా చేయగలరు అనుకున్నాను.

  Quick Question:
  మిమ్మల్ని హేళన చేసే కామెంట్స్ కూడా ఎప్రూవ్ చేయగల్గుతున్నారు. ఇంకా కామెంట్స్ మోడరేషన్ దేనికి ?

  ReplyDelete
 6. @ a2zDreams
  కాస్తో కూస్తో పద్ధతిగా వుండే వేళాకోళాలు ఓకే. మరీ బూతులతో నిండిన వేళాకోళాలు ఎప్పుడన్నా ఒకసారి వస్తుంటాయి. వాటికోసం ఆ మోడరేషనూ. మరో కారణం కూడా వుంది. కొంతమంది గుంపుగా మన టపా టాపిక్కును డైవర్ట్ చేసి లేదా టపాను హైజాకు చేసి మనని సామూహికంగా వేళాకోళానికి గురిచేసే పరిస్థితులు వస్తుంటాయి. అలాంటి కుట్రలను నిలువరించడానికీ ఉపయోగపడుతుంది.

  ReplyDelete
 7. @ a2zDreams

  సందర్భం వచ్చింది - అది సుఖాంతం అయ్యింది కాబట్టే అప్పటి విషయాలను ప్రస్థావించాను. పాత విషయాలను మరచిపోవడం అన్నది ఎదుటివారిని బట్టి కూడా వుంటుంది. అదే వీవెన్ తో సామరస్యం ఏర్పడి చాలాకాలం అయ్యింది.

  ReplyDelete
 8. శరత్ గారు, మీరు ఎంత బాగా రాస్తారు అండి. మంచిగా ఇలా హాయి గా కొంచెం హాస్యం కొంచెం వ్యంగం కలిపి రాయొచ్చు కదా. ఎందుకు ఆ బూతు, గీతు లన్ని!

  ReplyDelete
 9. ఫొన్లెండి, మీకు బ్లాగర్ల మీద ఉన్న అపోహలు ఒక్కొక్కటీ తొలిగిపోతే అంతే చాలు! మరి ఆ రెండో బ్లాగర్ని కూడా ప్రత్యక్షంగా కలిస్తే పోయేదిగా!

  ఆయన ఊళ్ళోనే ఉన్నారు ఆరోజు! కుదరక రాలేదట:-))

  ReplyDelete
 10. ఏంటి? నన్ను మర్చిపోయావా భాసు.

  సిరియస్ క్వశ్చన్.
  క్రిందటి టపాలలోని కామెంట్స్‌ను ఎందుకు మిం"గే"శావు.

  నీ పాత మిత్రుడు.

  ReplyDelete
 11. I appreciate your ability to re-evaluate people who you did not like once for whatever reason and change your opinion. Rare!

  ReplyDelete
 12. మీ బ్లాగోతెరిచిన పుస్తకం,చదువుకున్న వాళ్ళకి చదువుకున్నంత,అర్ధం చేసుకున్న వాళ్ళకి అర్ధమయినంత.కీప్ ఇట్ అప్.

  ReplyDelete
 13. @ సాహితి
  :)

  చక్కగా వ్రాసేవాళ్ళు ఈ బ్లాగోస్ఫియరులో చాలామందేవున్నారు. కానీ బూతుకి వున్న స్టిగ్మా తొలగించదలుచుకున్నవారు నేను ఒక్కడినే వున్నాను. ఇంకెవరయినా వస్తే నేను ఆపేద్దామనుకున్నాను కానీ ఇంకా రారే!

  ఎనీ వే, చాలా కారణాల వల్ల ఈమధ్యనే ప్రయోగాత్మకంగా మా ఆవిడకి 'మానసికంగా' టొటల్ పవర్ ఎక్స్‌ఛేంజ్ (TPE)చేసి నాలోని మార్పులను గమనిస్తూవస్తున్నాను. అందుకే మీకు సమాధానం ఇవ్వడం కూడా ఆలస్యం చేసాను. ఆ TPE కనుక విజయవంతం అయితే ఎలాగూ బూతు వ్రాతలు మా ఆవిడకి ఇష్టం వుండవు కనుక మానివేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే ఆ దిశగా కొన్ని మార్పులు చేసాను. చూద్దాం... ఏమవుతుందో.

  ReplyDelete
 14. @ సుజాత
  తను కూడా నడకకు వస్తే కలిసే పరిస్థితి వచ్చేదేమో. ప్రత్యేకంగా వెళ్ళి కలవడమే! ఇప్పటికే కాన్‌స్పిరసీ వాదులు ఏవో కుట్రలంటూ సందేహపడుతున్నారు!

  @ చిలకపేట కేడీ
  అంటే మీరూ తెలుగు నడకకి వచ్చారా ఏంటి? ఒకేసారి చాలామంది బ్లాగర్లను కలిసాను కాబట్టి అందరినీ గుర్తుంచుకోలేకపోయాను.

  ఇక మీ క్వెషన్ గురించి - నా శ్రేయోభిలాషులు కొంత సంయమనం పాటించమని సలహా ఇచ్చారు - అందుకే కామెంట్లు దాచేసాను.

  మీరు నా పాతమిత్రుడు అంటే ఎవరబ్బా...?

  ReplyDelete
 15. @ సత్యసాయి
  మీ ప్రశంస నన్ను సంతోషపరచింది :)

  @ శ్రీనివాస్ పప్పు
  నిజానికి సగం తెరచిన పుస్తకమే. మా ఆవిడకే కనుక అభ్యంతరం లేకుండా వుండివుంటే ఇంకా ఎన్నో వ్రాసేవాడిని. గుర్రానికి కళ్ళెమేసినట్లు వుంది నా పరిస్థితి! అయినా సరే ఒక విషయం మీద వ్రాయాలా వద్దా ఆలోచిస్తున్నాను. దానిమీద నా స్వప్న బ్లాగులో ప్రస్థావిస్తాను. ఎక్కువమంది యెస్ అంటే ఆ సిరీస్ వ్రాస్తాను.

  ReplyDelete