మీ రక్తాన్ని బట్టి మీ మనస్తత్వం

రక్తం గ్రూపులని బట్టి కూడా మనస్తత్వం వుంటుందంటారు జపనీయులు. ఈ విషయం శాస్త్రీయంగా ధృవపడలేదు కానీ గణాంకాల ప్రకారం సరి అవుతున్నట్లు తెలుస్తోంది. నా పరిశీలనలో కూడా చాలా వరకు అలానే అనిపిస్తోంది. ఈ అవగాహన జపాను, దక్షిణ కొరియాలలో బాగా వుంది. పెళ్ళి సంబంధాలలోనూ, ఉద్యోగులను తీసుకునేటప్పుడూ కూడా దీనిని కొంతమంది ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఈ విషయం మీద నేను రాసిన 'ఎవరు' నవల 'చతుర' మాస పత్రికలో ప్రచురితం అయ్యింది. ఆసక్తి వుంటే చదవండి:
http://www.geocities.com/sarath.films/Evaru.pdf

రక్తాన్ని బట్టి మనస్తత్వం ఎలా వుంటుందో తెలుసుకొని ఆ పరంగా మనకు తెలిసిన వారి మనస్తత్వాన్ని పరిశీలిస్తుండటం సరదాగా వుంటుంది.

గ్రూపుల ప్రకారం క్లుప్తంగా:
'O' - నాయకత్వ లక్షణాలు, చొరవ, చురుకుదనం, ఉత్సాహం, ధైర్యం, సమర్ధత. రాజు (King) తరహా మనస్తత్వం.
'A' - సాత్వికులు, చెబితే వినేవారు. నాయకత్వ లక్షణాలు అంతగా వుండవు. సున్నిత మనస్తత్వం వుంటుంది. ఎక్కువ ఒత్తిడికి తట్టుకోలేరు. అపేక్ష, అనురాగం. నిజాయితీ. కష్టపడి పనిచేస్తారు. రైతు (Farmer) తరహా మనస్తత్వం.
'B' - దాదాపుగా 'O' లాంటి మంచి లక్షణాలతో పాటు రుణాత్మక భావాలు వుంటాయి. స్వార్ధపరులు. నేరస్తులు ఎక్కువగా ఈ గ్రూపులోనే వుంటారు. సైనికుడి (Soldier) తరహా మనస్తత్వం.
'AB' - ద్వంద ప్రవృత్తి వీరిది. 'A' మరియు 'O' లక్షణాలు వుంటాయి కాబట్టి ఎప్పుడు ఎలా వుంటారో తెలుసుకోవడం కష్టం. దౌత్యం బాగా నెరపగలరు. కళాకారులు. మంత్రి (Minister) తరహా మనస్తత్వం.

మరిన్ని వివరాల కోసం 'blood type personality' అని గూగుల్ చేస్తే చాలా సమాచారం లభిస్తుంది.ఒక లంకె క్రింద ఇస్తున్నాను.
http://www.bellaonline.com/articles/art22988.asp

మీ మనస్తత్వానికీ రక్తం టైప్ కు కలుస్తున్నదా? నా మనస్తత్వాన్ని బట్టి నా రక్తం టైపు ఏదో ఊహించండి చూద్దాం.

3 comments:

 1. శరత్ గారు,
  negative, positive ఫాక్టర్ల ప్రభావం ఏమీ ఉండదా? మీరు ఇచ్చిన లింకులో కూడా లేదు.

  అలా అయినా నాకు తెలిసిన గ్రూపుల వాళ్ళని match చేద్దామంటే అన్నీ వ్యతిరేకంగా వస్తున్నాయి రిజల్ట్స్.

  ఇక, మీ బ్లడ్ గ్రూపు ఇక్కడ లేదు.:)) బాంబే బ్లడ్ కాదు కదా మీది?:))

  ReplyDelete
 2. @ మధురవాణి
  మరి మీ గ్రూప్ ఏంటో చెప్పండి!

  @ సుజాత
  నెగెటివ్, పాజిటివ్ ప్రభావం ఏమీ వుండదనే నాకు గుర్తు.

  వ్యతిరేకంగా్ వస్తున్నాయా! అయితే వదిలేయండిక :)

  నాకు బాంబే బ్లడ్ గ్రూప్ అంత దృశ్యం లేదు లెండి :)

  ReplyDelete