FLR - కోచింగ్ మరియు అవగాహనా సదస్సు(లు)

Female Led Relationship మీద ఎవరయినా కావాలనుకుంటే కోచింగ్ ఇవ్వగలను. ఫోన్ లేదా చాట్ లేదా వీడియో చాట్  ద్వారా గంట లేదా రెండు గంటల సెషన్స్ చొప్పున ఇవ్వగలను. ఆసక్తి వున్నవారు నా ఈమెయిల్ ఐడి sarathn at hotmail dot com కి వ్రాసి సంప్రదించగలరు. ఎవరయినా దీనికి స్పందిస్తారని నమ్మకాలేమీ లేవు కానీ ఇలా ప్రకటించనయితే ప్రకటిస్తున్నాను. కోచింగ్ ఇచ్చినందుకు గాను మీకు తోచినంత విరాళం నాకు ఇవ్వవలసి వుంటుంది.   

మరొక విషయం ఏమిటంటే కొద్ది నెలల్లో ఇండియా ట్రిప్ కి రావాలనుకుంటున్నాను. వచ్చినప్పుడు అక్కడ ఈ విషయం మీద అవగాహనా సదస్సు(లు) నిర్వహించాలన్న ఉద్దేశ్యం వుంది. అలాంటి సదస్సు నిర్వహిస్తే రావడానికి మీలో ఎవరికయినా ఆసక్తి వుంటుందా? ఏ నగరంలో/నగరాల్లో/పట్టణాల్లో పెడితే బావుంటుంది? నా DOM కనుక అంగీకరిస్తే సదస్సుకి వారిని కూడా తీసుకువస్తాను.

ఇంకా US లో కానీ మరే దేశంలో కానీ ఇలాంటి అవగాహనా సదస్సు కావాలంటే నా వీలుని బట్టి ఆలోచించగలను. ముందు మీకు ఆసక్తి వున్నట్లు అయితే కనుక తెలియజేయండి.   

4 comments:

  1. FLR లో మీరింకా పిల్లికూనలాంటి వాళ్ళు, ఇపుడిపుడే అడుగుపెట్టి అపుడే క్లాసులా ? మీ అనుభవం సరిపోదు. మీరింకా ఎదగాలి.

    ReplyDelete
  2. @ నీహారిక
    సర్లెండి. ఇరవై ఏళ్ళుగా నేను దీని గురించి కిందా మీదా పడుతూనేవున్నాను. అయినా ఏ చెట్టూ లేని దగ్గర ఆముదం చెట్టే గొప్ప కదా.

    ReplyDelete
  3. seems both men and women are not excited with your FLR concept Posts .. on another note,,

    https://en.wikipedia.org/wiki/Wild_Wild_Country

    Now available in netflix ..

    ReplyDelete
  4. @ అజ్ఞాత

    నేను పెట్టిన ఒక సర్వే ప్రకారం పోస్టులు చదివిన వారిలో అయిదు శాతం మంది ఆసక్తి చూపించారు.

    నెట్‌ఫ్లిక్స్ లో ఓషో మీద సిరీస్ గురించి నాకు తెలుసును. కొన్ని భాగాలు చూసాను, ఇంకా చూడాలి.

    ReplyDelete