FLR - రండి, ఒక మధురమయిన ప్రయాణం మొదలెడదాం!

Female Led Relationship మీద ఇచ్చిన సర్వేకి ఆ పోస్ట్ చదివిన వారిలో దాదాపుగా 15% స్పందిస్తే 10% మంది అనుకూలంగా స్పందించారు. అందులో కొద్ది మంది స్త్రీలు కూడా వున్నారు. సో, ఇక మొదలెడదాం. ప్రస్తుతానికి అయితే దీనిమీద విస్తృతంగా వ్రాసే వుద్దేశ్యం వుంది. ఎందుకంటే దీని మీద ఒక ఫుల్ ఆన్లైన్ కోర్స్ తయారుచెయ్యాలనుకుంటున్నా. మన తెలుగు వారిలో ఇది మెయిన్ స్ట్రీం సబ్జెక్ట్  కావాలి. ఆచరించే వారు దాపరికం లేకుండా గర్వంగా ఈ జీవిత విధానాన్ని అనుసరిస్తున్నా అని ప్రకటించుకోగలగాలి. ఈ విషయం మీద ఆసక్తి కనపరుస్తున్న వారు అందరూ దీనిని ఒక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్ళడానికి తోడ్పడండి. ఈ మంచి విషయాన్ని నలుగురికీ పంచుదాం. లోకంలో ఇందువలన ప్రేమా, ప్రశాంతతా, విజయాలు పెరిగితే అందరికీ సంతోషమే కదా.

దీనిమీద నేను వ్రాస్తున్న పోస్టులను ఎవరికి అవసరం అవుతుందనుకుంటే వారికి అందించండి. ఈ జీవిత విధానం ఎవరి జీవితాల్లో సంతోషం నింపవచ్చో గమనిస్తూ వారికి వివరించండి, ప్రోత్సహించండి.

ఇది కేవలం జంటలకేనా?
కాదు, చాలా మంది పాటించొచ్చు. స్నేహితురాలు, సహచరురాలితో కూడా ఈ విధానం పాటించవచ్చు. ఈ విధానం పాటించడం ద్వారా మీకు నచ్చిన స్నేహితురాలిని, సహచరురాలిని మరో ఉన్నతమయిన లెవల్ కి తీసుకెళ్ళండి. మీకు ఆడవాళ్ళలో ఎవరు నచ్చితే వారితో మొదలెట్టెయ్యొచ్చు. అవతలి వారు అర్ధం చేసుకోగలరంటే వివరించి ముందుకు వెళ్ళొచ్చు లేదంటే stealth (నర్మగర్భంగా, వారికి తెలియకుండా ఏక పక్షంగా) గా మొదలెట్టి తరువాత్తరువాత వారికి తెలియజెప్పవచ్చు.

ఇది వారికీ మీకూ ఒక విన్ - విన్ (Win - Win) సిచువేషన్ గా తయారయితే మంచిది. అంటే ఏదో ఒక విధంగా ఈ విధానం వారికీ, మీకూ ఉపయుక్తంగా వుండాలి. తనను ఒక దేవతలా అరాధిస్తూ చెప్పినట్లూ వింటూ వుంటే వారు మీ అభివృద్ధికి దోహదపడేలా మిమ్మల్ని ఆజమాయిషీ చేస్తూ       వుంటే భలేగా వుంటుంది కాదూ. మిమ్మల్ని గైడ్ చెయ్యమని లేదా ఫలానా విషయంలో ప్రోత్సహించాల్సిందిగా లేదా ఆజమాయిషీ చెయ్యాల్సిందిగా మీరు కోరవచ్చు కానీ డిమాండ్ చెయ్యకూడదు. ఈ విధానంలో అవతలి వారికి ఇష్టం అయినట్లుగా మనం వుండాలే కానీ మనకు ఇష్టమయినట్లుగా అవతలి వారు వుండాలని ఆశించకూడదు.

మీరు మొట్టమొదట చెయ్యాల్సిందేమిటి?
ముందు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడం మొదలెట్టండి. ఎందులో? అదేనండీ, నిన్న చెప్పా కదా. మీరు ఏ పని చేసినా ఫర్వాలేదు కానీ అవుట్ కాకుండా నిగ్రహించుకోండి. ఇది చాలా ముఖ్యం. ఇందులో మొదట్లో మీరు వైఫల్యం చెందవచ్చు కానీ నెమ్మదిగా నెమ్మదిగా గ్యాప్ పెంచుతూ కనీసం వారానికి ఒక్కసారి వరకు అయినా తీసుకురండి. మీరు సింగిల్ కాకపోయినట్లయితే రతికి బదులుగా వివిధ ఉపరతుల ద్వారా పని జరిపించేసి కక్కేసుకోకుండా కాపాడుకోండి. ఈ ఒక్క విషయంలో జాగ్రత్తపడితే మిగతా విషయాలు ఇక తేలిగ్గా సాధ్యం అవుతాయి.

ఇకపోతే ఈ విషయంలో మీకు విరివిగా సహకరించేందుకై నాకు కూడా మీరు సహకరించండి. ఈ విషయాన్ని విస్తృతంగా అందరిలోకి తీసుకెల్లడానికి తోడ్పడండి. అది కాకుండా ఈ విధానం మీ జీవితాల్లో వెలుగులు నింపుతున్నట్లయితే  ఈ రకమయిన సర్వీసెస్ నేను మరిన్ని చేసేలా, మరింత వ్రాసేలా నన్ను మోటివేట్ చేసేందుకై మీకు ఇష్టం అయినప్పుడల్లా నాకు ఒక 'టీ' కొట్టించండి :) అలా వర్చువల్గా నాకు టీనో, కాఫీనో, బీరో కొట్టిస్తే ఆ డబ్బులు నా చిల్లర ఖర్చుల కన్నా, పాకెట్ మనీగా అన్నా పనికివస్తాయి. నా రచనలు, ఏక్టివిటీస్ మీకు ఉపయోగపడుతున్నట్లయితేనే సుమా. అలాంటిదేం లేకపోతే పూర్తిగా దీన్ని లైట్ తీస్కోండి. వివరాలకు కింద ఒక బటన్ వుంటుంది. నొక్కి చూడండి. 

మనం ఇందులో ఏమాత్రం విజయం సాధించినా ఈ విషయం మీద వర్క్ షాప్స్, ఆన్లైన్ కోర్సులు గట్రా నిర్వహించేద్దాం. ఆన్లైన్ ఫొరమ్స్, చర్చా వేదికలూ వగైరా కూడా మొదలెడతాను. ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఆలోచనలు వున్నయ్. ఒకదాని తరువాత మరొకటి చూద్దాం.

ఈ జీవిత విధానం ఎంత తియ్యగా, సంతృప్తికరంగా, సంతోషకరంగా, ప్రశాంతంగా వుంటుందో మాటల్లో వర్ణించలేను. సాధారణ శృంగారంలో ఆనందం సాధారణంగా అనుభవించినంతసేపే వుంటుంది. ఇందులో మరి? ప్రతి క్షణం. అదీ ఇందులోని గొప్పదనం. అన్నీ వివరంగా చర్చిద్దాం. నా తదుపరి పోస్ట్ కోసం వేచిచూడండి మరి.No comments:

Post a Comment