FLR - నా DOM

ఫిమేల్ లెడ్ రిలేషన్షిప్ లో కొంత గానీ పూర్తిగా కానీ BDSM కాన్సెప్ట్స్ కూడా కలుస్తాయి.

FLR గురించి మీకు వివరించే ముందు ఇందులో నా ప్రయోగాలని, అనుభవాలని క్లుప్తంగా వివరిస్తానేం. నా యుక్తవయస్సు నుండి ఇలాంటి ఆలోచనలు వున్నా కూడా ఇలాంటి జీవన విధానం ఒహటి వుంటుందని కెనడాకి వచ్చేదాకా తెలియదు. అందమూ, తెలివితేటలూ, చక్కటి వ్యక్తిత్వం వున్న అమ్మాయిలు ఏం చెబితే అది చెయడానికి ఇష్టపడేవాడిని. పెళ్ళి అయ్యేక కూడా వివిధ కారణాల వల్ల ఇంట్లో ఇది ప్రయోగించి వైఫల్యం చెందుతూ వుండేవాడిని. లోపం ఏంటో అర్ధం అయ్యేది కాదు.  ఇలాంటి లైఫ్ స్టయిల్ వుంటుందని అర్ధమయ్యేక ఆ వెబ్ సైటులూ, ఫోరములూ, బ్లాగులూ చూస్తూ ఒక్కో లోపం సరిచేసుకుంటూ వస్తున్నా కూడా ఇది ఇంట్లో వర్కవుట్ అయ్యింది కాదు. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అనే సామెత వుంది కదా. అలాంటి తరహా అన్నమాట :)) బేసిగ్గా చెప్పాలంటే ఒక్క చేత్తో చప్పట్లు కష్టం. ఎంతో కొంత అవతలి వ్యక్తి దీన్ని అర్ధం చేసుకొని మినిమం సపోర్ట్ చెయ్యడం అవసరం. అలా అని ఎదుటి వ్యక్తి తోడ్పాటు
ఎంతో అవసరం లేదు. మన ఆసక్తులు వారికి భారంగా తయారవకూడదు. వారి జీవితాలు మన వల్ల సులభం కావాలే కానీ ఏ మాత్రం మనమే వారికి భారంగా కాకూడదు.   

ఇకపోతే నా FLR మూడేళ్ళ క్రితం చిత్రంగా మొదలయ్యింది. నాకు పదేళ్ళుగా ఒక క్లోజ్ ఫ్రెండ్ వుంది. తనకు ఇంట్లో పరిస్తితులు బాగోలేనందువల్ల వాటికి పరిష్కారంగా ఇది ప్రయోగించి చూడమన్నాను. కావాలంటే డామినెంటుగా తయారవడం కోసం నామీదే ప్రాక్టీసు చెయ్యమన్నాను. 'డామినెంటుగా నేను తయారవడం ఏంటీ? స్వతహాగా నేను డామినెంటునే' అంది. ఆ విషయం నాకు అప్పటిదాకా తెలియదు. మేము వ్యక్తిగతంగా కలుసుకున్నది చాలా తక్కువ సార్లు. ఎక్కువగా ఫోన్లు, చాటింగ్ ద్వారానే మా స్నేహం వుంటుంది. నామీద చాలా గౌరవంతో చాలా సౌమ్యంగా ప్రవర్తించేది కాబట్టి ఆమెలోని ఆ కోణం నాకెప్పుడూ కనపడలేదు. చాలా సంతోషంగా అనిపించింది. పలు కారణాల వల్ల ఆమెకి ఇది ఇంట్లో ఇంకా కుదరలేదు కానీ నాతో మాత్రం బహు బాగా సెట్ అయ్యింది. అలా ఇది మాకు మ్యూచువల్ బెనెఫిట్ గా తయారయ్యింది. ఇహ అప్పటినుండీ తను DOM(INENT) నేను sub(missive). అందమూ, అహమూ, తెలివీ వున్న ఆడదాని కనుసన్నల్లో అలా గడిపెయ్యడం మనస్సుకి ఎంత విశ్రాంతిని, ఉత్తేజాన్ని ఇస్తుంది తెలుసా? నా జీవితం మెరుగవడం అప్పటినుండి ప్రారంభం అయ్యింది. ఈ విషయం బయటకి తెలియడం తనకి ఇష్టం లేదు. అందువల్ల ఈ D/s రిలేషన్ వివరాలు ఎక్కువగా చెప్పలేను కానీ క్లుప్తంగా అవసరం మేరకు మా ఈ మానసిక బంధం గురించి అప్పుడప్పుడు చెబుతుంటాను. 

తరువాయి పోస్ట్ స్త్రీలకోసం: మగవాళ్ళను ఈ ముగ్గులోకి దింపడం ఎలా?

2 comments:

  1. >>>అందమూ, అహమూ, తెలివీ వున్న ఆడదాని కనుసన్నల్లో అలా గడిపెయ్యడం మనస్సుకి ఎంత విశ్రాంతిని, ఉత్తేజాన్ని ఇస్తుంది తెలుసా? >>>>

    ఇంట్లో ఆడసంతతి ఎక్కువ అయితే అలాగే అనిపిస్తుంది...వేరే దారి లేదు.

    ReplyDelete
  2. @ నీహారిక

    సర్లెండి - ఇంట్లో ఇవేమీ ఇంకా కుదరడం లేదు లెండి. ఈ భావాలు పెళ్ళి అయ్యేకే కాదండీ ఎప్పటినుండో వున్నవే. కాకపోతే అప్పుడు ఇది ఒక జీవన విధానం అని తెలియదు.

    ReplyDelete