సెక్స్ - సెన్స్ (తెలుగులో సెక్స్ క్విజ్) లైవ్ షో చేస్తే ఎలా వుంటుందా అని ఆలోచిస్తున్నా...

డాక్టర్ సమరం గారు ఎలాగయితే సెక్స్ - సైన్స్ గురించి రచనలు చేస్తారో, మాట్లాడతారో అలాంటి హుందాకరమయిన భాషతో, అసభ్యానికి చోటు ఇవ్వకుండా తెలుగులో శృంగారం గురించి లైవ్ క్విజ్ షో చేస్తే ఎలా వుంటుందని ఆలోచిస్తున్నా. పలు విధాలయిన ఆంశాలను స్పృశించవచ్చును. అటు ప్రేక్షకులకు పలు విషయాల గురించి అవగాహన కలిగించవచ్చును, ఇటు నేను తెలుసుకోవొచ్చును. సాహిత్యం, సినిమా, హ్యూమన్ అనాటమీ, అంతరిక్షం అలా అలా పలు రంగాల్లోని శృంగారానికి సంబంధించిన విషయాలని స్పృశిస్తూ ఆయా ఆంశాలను ప్రశ్నిస్తూ సరదాగా వివరించవచ్చును. 

అయితే పార్టిసిపేంట్స్ దొరకడం కష్టంగా వుంది ఇక్కడ. మా షార్ట్ ఫిల్స్మ్ గ్రూప్ (ఇప్పుడు లైవ్ గ్రూప్) సభ్యులు సిగ్గుతో కూడిన బిడియంతో కూడిన బెరుకుతో ముందుకు రాలేకపోతున్నారు. వేరే ఒకళ్ళు దొరికారు కానీ తనకి జులై మొదలు వరకు తీరికలేదుట. అందాకా ఇహ నేను ఒక్కడినే ప్రేక్షకులకు ప్రశ్నలు సంధించాల్సి వుంటుందేమో. వారు లైవ్ చాట్ లో సమాధానాలు చెప్పవచ్చును. అలా కాకుండా ఒక ఫోన్ నంబర్ ఇస్తే దానికి ఎవరయినా కాల్ చేసి సమాధానాలు చెప్పవచ్చును. మీలో ఎవరయినా ఇందుకు సిద్ధంగా వుంటే చెప్పండి - మొదలుపెడదాం. ఈ లైవ్ క్విజ్ షోని ఇటు సరదాగానూ, అటు సమాచారయుక్తంగానూ మనం నిర్వహించుకోవొచ్చు. ప్రయత్నిద్దాం - పొయ్యేదేముంది చెప్పండీ?

పార్టిసిపేంట్స్ వుంటే 'మీలో ఎవరు కోటీశ్వరుడు' తరహాలో కూడా క్విజ్ షో కూడా చెయ్యవచ్చును.  

25 comments: 1. ఇదేదో కొంపలు మునిగే / ముంచే కార్యక్రమంలా వుంది :)


  ఆల్ ది బెష్టు !


  జిలేబి

  ReplyDelete
 2. Ekkada enduku elaaa.. Direct ga cheppenta experience peddaga ledu.. edo prakruti siddamgaa jarigindi anthe..

  ReplyDelete
 3. మీరే ప్రశ్నించి మీరే సమాధానాలు చెప్పుకుంటారా ?
  మీలో ఎవరు కోటీశ్వరుడు నిర్వహించడానికి కోటీశ్వరుడై ఉండాలి. మీరే సమరం గారైతే మీ అర్హతలేమిటీ ? వృత్తిగత అనుభవం ఏవిటీ ?

  ReplyDelete
 4. @జిలేబీ
  కొంపలను కలిపే కార్యక్రమం లెండి ;) - కొన్ని సైడ్ ఎఫెక్టులు తప్పవు దేనికయినా :))

  ధన్యవాదాలు.

  @ కాయ
  హ్మ్. అంతేనా...ఇంకేమన్నా వుందా? :)

  @ అజ్ఞాత

  య్యా. పార్టిసిపేంట్స్ ఎవరూ దొరక్కపోతే హస్త ప్రయోగం తప్పదు కదా సర్?

  నా అర్హతల గురించి అడుగుతున్నారంటే నా గురించి మీకు తెలియదులా వుంది. ఎన్నాళ్ళనుండి తెలుగు బ్లాగావరణంలో వుంటున్నారేంటీ? కొత్తవాళ్ళకి నా గురించి పెద్దగా తెలీదేమో కానీ పాత కాపులకు నా గురించి బాహ్గానే తెలిసి వుంటుంది.

  ఇక నా వ్యక్తిగత అనుభవాలు చెప్పుకోవాలంటే నాకు సిగ్గుతో కూడిన బిడియంతో కూడిన బెరుకు. నన్నలా వదిలేద్దురూ. అలా చిలిపిగా కెలికేస్తే మళ్ళీ పాత శరత్తును బయటకి తియ్యాల్సిన అవసరం వస్తుంది. అవసరమా అదంతా ఇప్పుడు :))

  ReplyDelete
  Replies
  1. అంతే అనుకోండి.. ప్రేమ పెళ్ళి చేస్కున్నా.. మీలా అడ్వెంచర్లు లేవు.. సో... మీరు హానందించండి..

   Delete
 5. @ శ్రీ

  మన జీవితాలే మన సిలబస్ అండీ. వేరే ఇంకేం కావాలీ :))

  ప్రత్యేకమయిన సిలబస్ అంటూ ఏమీ లేదండీ. ఏ మూల నుండి, ఏ కోణం నుండి నా ప్రశ్నలు వస్తాయో నాకే తెలియదు. వీలయినంత సరదా, సమాచారం కలిపి రంగరించి ప్రయత్నిద్దామేం. వీలయినంత ముందుగా లైవ్ లింక్ ఇస్తాను. చాట్ వుంటుంది. అందులో సమాధానాలు పంపించొచ్చు. లైవ్ మిస్ అయితే ఆ లింక్ ద్వారానే రికార్డింగ్ చూడొచ్చు.

  కేవలం ప్రశ్నలూ, సమాధానాలే కాదు - ఆ ఆంశాల పై వివరణలూ వుంటయ్. మీ అందరి సహాయ సహకారాలు కావాలి. ఈ క్విజ్ షో ని ఇంకా మెరుగు పరచడం కొసం ఏం చేస్తే బావుంటుందో అందరూ సూచించగలరు. ఒక ట్రెండ్ సృష్టిద్దాం రండి. నచ్చితే ఈ షోని నలుగురికీ తెలియపరచండి - నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో నాకు చెప్పండి. ఎప్పటికప్పుడూ ఫైన్ ట్యూన్ చేసుకుంటూ ముందుకు వెళదాం. కాస్తంత సరదాగా మాట్లాడతనేమో కానీ అసభ్యంగా మాత్రం వుండబోవు. అయినా జబర్దస్త్ లాంటి ఫుల్ డబుల్ మీనింగ్ షోలు చూసి విరగబడి నవ్వి ఆనందించే మనవాళ్ళకి ఇలాంటివన్నీ లైట్ అనుకుంటా లెండి.

  ReplyDelete
 6. ఉన్నారున్నారున్నారు ఈ లోకంలో!
  తరతరాలుగా రకరకాలుగా తమదారీ తీరే వేరుగా
  ఉన్నారున్నారున్నారు ఈలోకంలో

  సిగ్గుపడుతున్నార్లెండి, మీరు మొదలెట్టేద్దురూ హస్తప్రయోగంతోనైనా! వచ్చేస్తారు మీ వెనకే!!!

  ReplyDelete
 7. @ అజ్ఞాత
  ఆనందమానందమండీ. మంచిదేగా... నలుగురితో పాటు నారాయణా, పదిమందితో పాటూ గోవిందా అని కాకుండా కొంతమందయినా వైవిధ్యంగా వుంటే మంచిదేగా.

  ఈ వారాంతంలోగా ఒక 20 నిమిషాల నుండి అరగంట లైవ్ కానీ రికార్డింగ్ కానీ ఇవ్వాలని అనుకుంటున్నా. ప్రశ్నలు సిద్ధం చేసుకుంటున్నా. మీరంతా జవాబులతో సిద్ధం అవుదురూ. శృంగారం గురించి మనకేం తెలియదో తెలుసుకోవడానికే ఈ కార్యక్రమం. ప్రారంభమే కాబట్టి తేలికపాటి ప్రశ్నలతో, విషయాలతో మొదలెట్టేద్దాం.

  ReplyDelete
 8. Mee karyakramaaniki naa abhinandanalu..inkaa nenu saitam ane Peru baaguntundi..

  ReplyDelete
 9. @ శర్మ
  ధన్యవాదాలండీ. నేను సైతం అనే పేరు దీనికి కుదరదనుకుంటాను. మీ సూచన వివరంగా చెబుదురూ.

  ప్రశ్నావళి పూర్తి అయ్యింది. రేపు ట్రైలర్ లాంటిది అయినా మొదలెట్టాలి. పది ప్రశ్నలు - పది నిమిషాల వీడియోతో మొదలుపెడతాను.

  ReplyDelete
 10. కార్యక్రమానికి సరిపోయే పేర్లు

  కౌన్ బనేగా కండోంపతీ...
  ఎవరు మీలో కోతీశ్వరులు?..
  సవాల్ దస్ కండోంకా ..

  అవునూ, హాట్ సీట్ వ్యవహారం ఏమైనా వుందా?

  ReplyDelete
  Replies
  1. కాస్త ఇవి కూడా పరిశీలించండి -

   గుడుగుడు గుంచం పందిరి మంచం (నా ఓటు దీనికే)
   దెబ్బర్దస్త్
   మీలో ఎవరు రతీశ్వరుడు
   కిందా మీదా
   అయిందా లేదా
   రాజా చెయ్యి వేస్తే
   అబ్బ నీ తియ్యని దెబ్బ

   (కేవలం సరదాకేనండి)

   Delete
  2. హహ. సరదాగా వున్నయ్యండీ మీ సూచనలూ.

   Delete
 11. ఎపుడూ రాజకీయ చర్చలేనా నేనూ ఈ క్విజ్ లో పాల్గొంటా...కే బీ సీ లో లాగా ఒకటి రెండూ మూడూ నాలుగూ ఆప్షన్స్ ఇస్తారా ?

  పాఠకులు కూడా ప్రశ్నలు పంపవచ్చా ? నాకసలే బోలెడన్ని డౌట్లు ... మచ్చుకి ఒకటి అడిగేస్తున్నా..పురుషులకి కొబ్బరి చిప్ప తింటే మూడ్ వస్తుందా ? చికెన్ ముక్క తింటే మూడ్ వస్తుందా ?

  చర్చలో మీరు మాత్రమే సమాధానం చెప్పాలి.పాఠకుల చేత గానీ బ్లాగర్ల చేతగానీ వెకిలి కామెంట్లు ప్రచురించారంటే నేను నా ప్రశ్నావళిని ఆపేస్తా !

  ReplyDelete
 12. ఎవరు మీలో కోతీశ్వరులు?
  కొబ్బరి చిప్పలకి భలే సూటయ్యింది.

  ReplyDelete
 13. @ప్రసాదం
  'మీలో ఎవరు సెక్సీశ్వరుడు ' అయితే ఎలా వుంటుందని ఆలోచిస్తున్నా.

  హాట్ సీట్ గురించి నాకు తెలియదు. 'మీలో ఎవరు కోటీశ్వరుడు ' అప్పుడెప్పుడో రెండు మూడు చూసా అంతే. మళ్ళీ కొన్ని చూసి అవగాహన తెచ్చుకోవాలి.

  ReplyDelete
  Replies
  1. పురాణాల కాలం నుండీ మేల్ డామినేషన్ భరించలేకపోతున్నాం.సెక్సీశ్వరుడు ఒప్పుకోం.

   Delete
  2. @ నీహారిక
   ఓహ్, మీరిలా వచ్చారా. సరే - 'మీలో ఎవరు సెక్సీ?' అంటే గొడవేమీ లేదు కదా.

   Delete
 14. @ నీహారిక

  మీరు అడిగిన ప్రశ్నకి నాకు సమాధానం తెలియదండీ :)) నా గెస్ మాత్రం చికెన్ కే. ప్రొటీన్ గట్రా వుంటాయి కదా అనీ.

  ఇంట్ర్నెట్టు, పుస్తకాలలోనుండి, స్వంత అనుభవాలనుండి కొన్ని ప్రశ్నలు తయారు చేసుకొనే ఉద్దేశ్యమే కానీ నేనేమీ లవ్ గురు నో సెక్స్ గురు నో కాదండీ. కాకపోతే ఇలాంటి విషయాల మీద చాలా మంది కంటే ఎక్కువ అవగాహన వుంది.

  వీక్షకులు, ఇతరులు ప్రశ్నలూ, సమాధానాలూ నాకు పంపిస్తే, అవి సరి అయినవి అయితే నేను క్విజ్ లో పొందుపరుస్తాను. ఆ ప్రశ్నకి క్రెడిట్ కూడా పంపించిన వారికే ఇస్తాను. అలా ఏవయినా కొన్ని మీరు కానీ ఇతరులు కానీ ప్రయత్నించకూడదూ - నాకు సహకారంగా వుంటుంది.

  ఇతర పనుల వత్తిడి వలన ఈ క్విజ్ రికార్డ్ చెయ్యడం ఆలస్యం అవుతోంది. వీలయితే ఈ వారాంతంలోగా ఒకటి అయినా వదలాలని చూస్తున్నా.

  ReplyDelete
  Replies
  1. కొబ్బరి చిప్పే సరి అయిన జవాబు. వాస్తవాలు చెప్పాలి కానీ మనకిష్టమైనది చెప్పి ప్రజలను తప్పుదారి పట్టించకూడదు కదండీ !కేరళలో కొబ్బరి చిప్పలు వాడడం వల్ల తెలివితేటలు ఎక్కువ మసాలా సినిమాలు కూడా ఎక్కువే పైగా అక్కడ ఆడసంతతి కూడా ఎక్కువ ! స్త్రీలు ఎక్కువగా పుడుతున్నారంటే పురుషుల్లో ఉండే క్రోమోజోం పాత్ర ఎక్కువ కాబట్టి కొబ్బరి చిప్ప తినడం వల్ల లాభాలు ఎక్కువ అని తేలిపోతుంది కదా ? కేరళలో అత్యాచారాల సగటు నాకు తెలియదు. అది కూడా తెలిస్తే కొబ్బరి చిప్ప ఉపయోగాలు మరిన్ని తెలుసుకోవచ్చు.అంతమంది ఆడవాళ్ళు ఉండి కూడా అక్కడ అత్యాచారాలు జరుగుతున్నాయంటే కొబ్బరి చిప్ప కూడా ఆడవాళ్ళ మీద పనిచేయదు అని నిర్ధారణకు వచ్చేయవచ్చు.

   Delete
  2. @ నీహారిక
   గెస్ చేస్తున్నా అని మాత్రమే చెప్పానండీ. కేరళ మసాలా సినిమాలు ప్రస్థావించారు కనుక చిన్నప్పుడు (అదేలెండి - యుక్తవయస్సులో) చూసిన మళయాలం సినిమాలు గుర్తుకువస్తున్నాయి. బ్లూ ఫిల్మ్స్ వచ్చాకా ఆ సినిమాల మసాలా ఘాటు తగ్గిపోయింది కానీ ఆ ఘాటు రుచే వేరూ. చూపించీ చూపించనట్లు చూపిస్తే వచ్చే కిక్కే వేరూ.

   Delete
 15. Devudaa ee sarath ki manchi budhdhi prasaadinchu.*

  ReplyDelete
 16. we are waiting bro..

  ReplyDelete
 17. @ అజ్ఞాత*
  ఆ! సర్లెండి.

  @ అజ్ఞాత
  సోదరా. కొన్ని కారణాల వల్ల ఇంకా కొన్ని నెలలు ఆలస్యం కావొచ్చు.

  ReplyDelete