సెక్స్ - సెన్స్ (తెలుగులో సెక్స్ క్విజ్) లైవ్ షో చేస్తే ఎలా వుంటుందా అని ఆలోచిస్తున్నా...

డాక్టర్ సమరం గారు ఎలాగయితే సెక్స్ - సైన్స్ గురించి రచనలు చేస్తారో, మాట్లాడతారో అలాంటి హుందాకరమయిన భాషతో, అసభ్యానికి చోటు ఇవ్వకుండా తెలుగులో శృంగారం గురించి లైవ్ క్విజ్ షో చేస్తే ఎలా వుంటుందని ఆలోచిస్తున్నా. పలు విధాలయిన ఆంశాలను స్పృశించవచ్చును. అటు ప్రేక్షకులకు పలు విషయాల గురించి అవగాహన కలిగించవచ్చును, ఇటు నేను తెలుసుకోవొచ్చును. సాహిత్యం, సినిమా, హ్యూమన్ అనాటమీ, అంతరిక్షం అలా అలా పలు రంగాల్లోని శృంగారానికి సంబంధించిన విషయాలని స్పృశిస్తూ ఆయా ఆంశాలను ప్రశ్నిస్తూ సరదాగా వివరించవచ్చును. 

అయితే పార్టిసిపేంట్స్ దొరకడం కష్టంగా వుంది ఇక్కడ. మా షార్ట్ ఫిల్స్మ్ గ్రూప్ (ఇప్పుడు లైవ్ గ్రూప్) సభ్యులు సిగ్గుతో కూడిన బిడియంతో కూడిన బెరుకుతో ముందుకు రాలేకపోతున్నారు. వేరే ఒకళ్ళు దొరికారు కానీ తనకి జులై మొదలు వరకు తీరికలేదుట. అందాకా ఇహ నేను ఒక్కడినే ప్రేక్షకులకు ప్రశ్నలు సంధించాల్సి వుంటుందేమో. వారు లైవ్ చాట్ లో సమాధానాలు చెప్పవచ్చును. అలా కాకుండా ఒక ఫోన్ నంబర్ ఇస్తే దానికి ఎవరయినా కాల్ చేసి సమాధానాలు చెప్పవచ్చును. మీలో ఎవరయినా ఇందుకు సిద్ధంగా వుంటే చెప్పండి - మొదలుపెడదాం. ఈ లైవ్ క్విజ్ షోని ఇటు సరదాగానూ, అటు సమాచారయుక్తంగానూ మనం నిర్వహించుకోవొచ్చు. ప్రయత్నిద్దాం - పొయ్యేదేముంది చెప్పండీ?

పార్టిసిపేంట్స్ వుంటే 'మీలో ఎవరు కోటీశ్వరుడు' తరహాలో కూడా క్విజ్ షో కూడా చెయ్యవచ్చును.