హోమ్ ఆటోమేషన్ గురించి చాణిక్య గారి షో & టెల్

మా చాణిక్య గారికి కెనడాలో పెద్ద ఇల్లు వుంది. నాకు ఈ బ్లాగులు గట్రా ఎలాగ వ్యాపకమో వారికి హోమ్ ఆటోమేషన్ వగైరా ఇంటికి సంబంధించిన పనులు అంటే వ్యాపకం. వాళ్ళింటికి మొదటి సారి వెళ్ళినప్పుడు 'వావ్, ఇల్లుని ఇంతగా ఆటోమేట్ చెయ్యొచ్చా...' అనుకున్నాను.

వారు ఇంటిని అంతా చూపిస్తూ లావెటరీ లోని కమోడ్ కూడా చూపించి దాని యొక్క గొప్పదనం వివరించారు.  వార్నీ అనుకున్నా. ఎంతయ్యిందేమిటి అని అడిగా. సింపుల్గా $2500 అని చెప్పారు. దాన్ని ఉపయోగించాకా అర్ధమయ్యింది - దాని గొప్పదనం ఇంకా బాగా. మనం జస్ట్ కూర్చుంటే చాలు - మిగతా పని అంతా అదే చేసుకుంటుంది. కడగడం, ఆరబెట్టడం వగైరా, వగైరా! తస్సాదియ్యా, ఏం టెక్నాలజీ, ఏం టెక్నాలజీ :))

హోమ్ ఆటోమేషన్ గురించి వారు లైవ్ లోచూపిస్తారు, వివరిస్తారు ఈ ఆదివారం 3 PM - 4 PM CST. (ఇండియా సోమవారం 1:30 AM - 2:30 AM IST). మీకు ఎవరికయినా ఈ విషయం మీద ఆసక్తి వుంటే లైవ్ లో చూడండి, ప్రశ్నలు వుంటే అప్పుడే వ్యాఖ్యల ద్వారా అడగవచ్చును. లైవ్ చూడటం కుదరకపోతే ఇదే లింక్ ను ఉపయోగిస్తే రికార్డ్ అయిన లైవ్ మీరు చూడొచ్చు.   3 comments:

 1. కొన్ని కారణాల వల్ల (బహుశా లైవ్ చేస్తున్నప్పుడు వైఫై అప్‌లోడ్ స్పీడ్ తక్కువగా వుండటం మూలాన కావొచ్చు) వీడియో క్వాలిటీ బాగా లేదు. మన్నించండి.

  ReplyDelete
 2. Post chesi delete cheyadam enti sir meeru.? Unbelievable, only daring Nd dashing blogger .

  ReplyDelete
 3. కొన్ని పోస్టులను డిలిట్ చేసిన కారణం వేరండి. అంతకంటే మంచి విషయం మీద ఫోకస్ పెడుతున్నా కాబట్టి చిల్లరగా అవి ఎందుకులే అని తీసివేసాను. వివరాల కోసం తదుపరి పోస్ట్ చూడండి - మీకే అర్ధం అవుతుంది.

  మీ అభిమానానికి కృతజ్ఞతలు. మీ నమ్మకం వమ్ము చేయననే విశ్వసిస్తున్నా.

  ReplyDelete