ప్రాణం (Working Title) - Short Story Draft Part - 1

(ఈ ఆదివారం చిత్రీకరణ కోసం కాస్త హడావిడిగా వ్రాసిన, వ్రాస్తున్న కథ కాబట్టి అంత బాగా రాకపోతుండవచ్చు. దీనిని ఇంకా బాగా ఫైన్ ట్యూన్ చెయ్యాల్సివుంది.)

"రండి." అని సుదీప్ ని ఆహ్వానించాడు
"మీరు చాలా ప్రొఫెషనల్ గా అగుపిస్తున్నారే" లొపలికి వస్తూ అన్నాడు సుదీప్.
"నేను ప్రొఫెషనల్ నే కదా" సన్నగా నవ్వాడు
"మీ గొంతు ఫోనులో బొంగురుగా వుంది కాని ఇప్పుడు నార్మల్ గానే వుందే!"
"అవును. ఫోన్ మీద కర్చీఫ్ పెట్టుకొని పెట్టుకొని మాట్లాడా అప్పుడు నన్ను మీరు గుర్తుపట్టకుండా"
"నిజమా!"
"కాదు. జోకు"
"జోకా?"
"కాదు నిజం"
సుదీప్ కి ఫక్కున నవ్వొచ్చింది. "వెరీ ఫన్నీ" అని గలగలా నవ్వాడు
"కదా"
  ----
"చెప్పండి. ఎందుకు చావాలనుకుంటున్నారు?" అని అడిగాడు రతన్.
సుదీప్ ఇబ్బందిగా కుర్చీలో నుసిలాడు. "ఆ వివరాలన్నీ మీకు ఇప్పుడు అవసరమా? నేను అడిగిన పని చేసిపెట్టండి చాలు"
"అవసరమే. నేను పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఏ కేసూ తీసుకోను"
సుదీప్ దీర్ఘంగా నిట్టూర్చాడు. "హ్మ్. ఏమో, అలా చావాలని అనిపిస్తుంది అంతే. పూర్తిగా నిరాశా నిస్పృహానూ."
"ఏం సమస్యలున్నాయి?"
"నిజానికి సమస్యలేమీ లేవు. ఏ సమస్యా లేకపోవడమే నా సమస్యేమో. చావాలనుకోనే ఆలోచనను ఆపుకోలేకపోవడమే నా సమస్య"
"నిజమే. జీవితం మరీ చక్కగా నడుస్తోంటే బుర్రకి పనిలేక చెత్తగా అవుతుంది. ఇదివరలో డాక్టర్లని కలిసారా?"
"లేదు. నాకు సాధారణంగా డాక్టర్లని కలవడం నచ్చదు. ఏమీ ఇంతవరకు కలవలేదు. బ్రతకాలని అనుకుంటే కలిసేవాడినేమో కానీ కాదు కదా. అందుకే మిమల్ని కలుస్తున్నా.
"మానసిక వైద్యంలో మందులు వుంటాయి. వాడి చూడండి. బ్రతకాలని అనిపించవచ్చు"
"నాకు బ్రతకాలాలని లేదు"
"అయితే మీకు మరణమే శరణ్యం"
"ఖచ్చితంగా"
"మరి మీ భార్యా పిల్లలు...?"
"ఏమో...తెలియదు. దూరం అవుతాను...తప్పదు"
"వాళ్ళంటే మీకు ప్రేమ లేదా?"
"వుంది" అని నిట్టూర్చి "బోలెడంత వుంది" అని పొడిగించాడు. అతని గొంతు గాద్గదికం అయ్యింది. "...కానీ ఏం చెయ్యను, నా మనస్సు నా ఆధీనంలో లేదు" అన్నాడు సుదీప్ బేలంగా
"అర్ధం అవుతోంది" తల పంకిస్తూ అన్నాడు రతన్. "అయితే మీ దుఖ్ఖానికి కారణం మీ భార్యా పిల్లలు కాదన్నమాట"
"అవును. ఎవరూ కాదు. కేవలం నేనే కారణం. నిజానికి నా భార్యాపిల్లలు నన్ను ఎంతగానో ప్రేమిస్తారు, నేనూ వాళ్ళని ఎంతగానో ప్రేమిస్తాను. కానీ...నా పరిస్థితేంటో మీకు అర్ధమయ్యింది కదా"
తల పంకించాడు రతన్. "మీరు డిప్రెషనులో వున్నారు. దానికి ఏవో సమస్యలే కారణం కానక్కర లేదు. ఏ కారణం లేకుండా కూడా అది రావొచ్చును. మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్స్ యొక్క అసమతుల్యత వల్ల అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది"
"అవునా. ఏ సమస్యలు లేకుండా కూడా మానసిక బాధలు రావొచ్చా! కొత్తగా వింటున్నా ఇది నేను"
"అది నిజం. అందుకే మీరు శుబ్బరంగా మీ మనోవ్యాకులత దూరం కావడానికి మందులు వాడండి, సరిపోతుంది"
"లేదు. నాకు అంత ఓపిక లేదు. నేను హాయిగా మరణించాలని నిర్ణయించుకున్నాను. నా నిర్ణయానికి తిరుగులేదు. నా ఆస్థి చాలా వరకు నా భర్యా పిల్లల మీద, కొంత నాధ శరణాలయాలకూ విల్లు వ్రాసేసాను. నేను పోయినా సరే వాళ్లకు ఏ కష్టమూ కలగకుండా అన్ని ఎర్పాట్లూ చేసేసాను"
"ఎన్ని ఏర్పాట్లు చేసినా మీరు లేనిలోటు ఎవరూ తీర్చలేరు కదా" అనునయంగా అన్నాడు రతన్.
సుదీప్ విసుగ్గా "మీరు అనవసరంగా నా మనస్సు మార్చడానికి ప్రయత్నించకండి. నేను అడిగిన పని చేసిపెట్టండి చాలు. మీరు కాదంటే నేను మరో వ్యక్తిని చూసుకుంటాను" అన్నాడు.
"మీరు అడిగిన పని చేసిపెట్టేముందు నా వంతు ప్రయత్నం నేను చేసా కానీ లాభం లేదు. మీరు గట్టి నిర్ణయంతో వున్నారు"
"అవును" అన్నాడు పరాకుగా ఏదో ఆలోచొస్తూ.
"అలాగే, మీరు చెప్పినట్లే చేద్దాం. కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు? ఎలాగూ చావబోతున్నారు కదా. మీ భార్యా పిల్లల్లూ, ఆస్థిపాస్థులూ ఏమయిపోతే మీకేం? మీరేమయినా మళ్ళీ చూడొస్తారా ఏంటీ? ఆ ఆస్థిపాస్థులు ఏవో నా పేరిట రాసివ్వ కూడదూ?"
"కుదరదు" అన్నాడు కరుకుగా. "అసలు నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? నువ్వూ ఆ వ్యవహారాల్లో ఘటికుడివే అయినా మనిషిగా మంచివాడివి అని మధ్యవర్తి చెబితేనే ఇటు వచ్చా. ఇలా నా కుటుంబానికి చెందాల్సిన ఆస్థి మీదనే కన్నువేస్తావని అనుకోలేదు. నీకో నమస్కారం. నువ్వే పనీ నాకు చేసిపెట్టక్కర్లేదు".
"కంగారు పడకండి. మీ భార్యాపిల్లల మీద మీకు ఎంత ప్రేమ వుందో తెలుసుకుందామని అలా అన్నా అంతే. నిజానికి మీ భార్యాపిల్లలు అదృష్టవంతులు... ఇప్పటిదాకా. ఇకపై దురదృష్టవంతులు అవుతారు. ప్చ్!"
"హ్మ్" నిట్టూరుస్తూ తల పక్కకు తిప్పుకున్నాడు సుదీప్. అతని కళ్ళళ్ళొ నీళ్ళు.
కాస్సేపు మౌనం  రాజ్యం ఏలింది వాళ్ళ మధ్య.

"సరే. నేను చెప్పిన చోట డబ్బు జారవిడిచి వచ్చారు కదా"
"అవును. మనం అనుకున్న మొత్తం ఖచ్చితంగా జారవిడిచి వచ్చాను"
"సంతోషం. ఒక్క నిమిషం. మా వాళ్ళు ఆ డబ్బు తీసుకొని సరిగా వుందో చూసివుంటారు, కనుక్కుంటాను"
"నా మీద నమ్మకం లేదా? చావబోయేవాడిని అలా మోసం చేస్తానా?"
"మోసం చెయ్యాలనుకునేవారు ఎప్పుడయినా చేస్తారు. వాళ్ళకి చావుబ్రతుకులతో సంబంధం వుండదు. వారికి అది రక్తంలోనే వుంటుంది" అని సన్నగా నవ్వాడు రతన్. "మీ మీద నమ్మకం లేక కాదు కానీ ఒకసారి చూసుకోవాలి. ట్రస్ట్ బట్ వెరిఫై అని రోనాల్డ్ రీగన్ అన్నాడు"
"సరే మీ ఇష్టం"

"మా వాళ్ళు ధృవీకరించారు. సంతోషం. ఇక మనం ఒప్పందంలోకి వచ్చాం. నాకు కావాల్సింది మీరు ఇచ్చారు - ఇక మీకు కావాల్సింది నేను ఇస్తాను. ఈ సందర్భంగా డ్రింక్స్ తీసుకుందాము. మీకోసం ఐస్ వైన్ సిద్ధంగా వుంచాను" రతన్ లేచి నిలబడుతూ అన్నాడు.
"హర్రే. నాకు ఐస్ వైన్ మాత్రమే ఇష్టం అని మీకు అలా తెలుసు??"
రతన్ మళ్ళీ సన్నగా నవ్వాడు. " నా క్లయింట్ గురించి వీలయినంతా తెలుసుకోవడం నా విద్యుక్త ధర్మం కదా. కాదా? ఇంకా మీ గురించి చాలా తెలుసు"
"నిజమా?!"
"మీరు ఇక్కడికి వచ్చేముందు మీ ఆవిడకి ఎన్ని ముద్దులు ఇచ్చారో కూడా తెలుసు"
"నిజమా?!"
"చూస్తారా?"
"ఆ!?"
"హహ. ఖంగారు పడకండి రికార్డ్ చెయ్యలేదు లెండి. మూడు. అవునా. ఇలా అన్నీ తెలుసుకుంటుంటామని మా క్లయింట్లకి సాధారణంగా చెప్పను కానీ మీరు ఎలాగూ త్వరలో చావబోతున్నారు కదా. సమస్య ఏమీ లేదు మీతో" అంటూ ఓపెన్ టాప్ టేబుల్ దగ్గరికి నడిచాడు. 
"ఇన్ని జాగ్రత్తలు తీసుకునే మీరు ఇంతధైర్యంగా ఈ హోటెల్ లో ఇలా?"
అతను అటువైపుగా వుండి ఒక పౌడర్ వైనులో కలుపుతూ "మా జాగ్రత్తలు మేము తీసుకుంటాము లెండి. ఇప్పుడు మీరు చూస్తున్న నా రూపం నిజం అనుకుంటున్నారా? మారు వేషం. మారు పేరుతో తీసుకున్నా ఇది. ఇలాగే ఇంకెన్నో జాగ్రత్తలు"
"మారువేషమా? గొప్పవారే?"
రతన్ గలగలా నవ్వుతూ వైన్ గ్లాస్ అందిస్తాడు. "నయాగరా ఆన్ ద లేక్ గ్రామ ద్రాక్షతోటల్లో మంచుతో ఘనీభవించిన ద్రాక్షతో చేసిన స్వఛ్ఛమయిన ఐస్ వైన్ ఇది. కానివ్వండి. ఛీర్స్ టు యువర్ డెత్"
'ఛీర్స్" గలగలా నవ్వుతూ అన్నాడతను. "రుచి అద్భుతంగా వుంది"
"ఇంకో రెండు గంటల్లో మీ జీవితం ఇంకా అద్భుతంగా వుంటుంది"
"అవును. ఈ మందుతో బాధలన్నీ మటుమాయం" గలగలా నవ్వుతూ
"నిజంగానే"
"నిజ్జంగానే?" సరదాగా నవ్వాడు సుదీప్.

15 comments:

 1. anubhavam lekundaane inta chakkagaa vrastunnaruu, chaala chaala baguni. rachana shaililo malladi kanipistunnadu( aa prabhavam tappadu lendi).
  mee pattudala, LOA , baavunnai,
  please continue, proceed further,next em jarugutundi anna utkhanta rekettincharu i.e., successful in your attempt.
  waiting for the next writing
  srinivasa rao v

  ReplyDelete
  Replies
  1. అనుభవం లేదా ? శరత్ గారి పాత పోస్ట్లు చూడాలి మీరు. ఆ రోజుల్లో బ్లాగ్లోకపు చిలిపి రాజు . అసలు ఆ కథలే వేరు , ఇలాంటి కథలు రాసే శరత్ ని మేము ఊహించుకోలేం:
   Sarath fans

   Delete
  2. ఆ చిలిపి తనం నాలో ఎక్కడికి పోలేదండీ. తెర వెనుక వ్యవహారాలు ఎన్నో నడుస్తుంటాయి - కాకపోతే నా బంధుమిత్రులు నా బ్లాగు చదవడం మొదలెట్టాకా నాకు బ్లాగుల్లో ప్రైవసీ తక్కువయ్యి అవి 'తెరకు' ఎక్కించడం మానుకున్నాను :)

   Delete
 2. శ్రీ గారు,

  శరత్ గారు మంచి రచయత, కొన్ని నవలలు వ్రాసారు. బ్లాగులు వ్రాసేవారిలో స్పాంటేనియస్ గా, హాస్యంగా , తెలివిగా వ్రాసే వారిలో ఈయనే ముందుంటారు. ఉద్యోగ బాధ్యతలు, ఇతరత్రా కారణలయితేనేమి తెలియదు గానీ ఆయన వ్రాయాల్సినంతగా వ్రాయడం లేదు. ఆయనకు అనుభవం లేదని ఊరికే హాస్యానికి అలా చెపుతారు. ఒకటి మాత్రం చెప్పాలి ...బ్లాగులను సీరియస్ తీసుకోకుండా మెదడులో ఏదనిపిస్తే అది అక్షరాల్లో పెట్టేస్తారు. అసలు బ్లాగుల ఉద్దేశ్యం కూడా అదే !

  ReplyDelete
  Replies
  1. అబ్బే నాకు ఇందులో అనుభవం లేదని ఎప్పుడూ చెప్పనండి, తను అలా అనుకున్నారు అంతే :)

   Delete
 3. మీ ప్రాణం కధ బాగుంది.

  <<<"మోసం చెయ్యాలనుకునేవారు ఎప్పుడయినా చేస్తారు. వాళ్ళకి చావుబ్రతుకులతో సంబంధం వుండదు. వారికి అది రక్తంలోనే వుంటుంది" <<<
  మోసపోయేవాడిది కూడా B పాజిటివ్ అయితే ఏంచేస్తాడు ?

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు. మీరు నా ఎవరు నవలని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రశ్న అడిగారా ఏంటీ?

   Delete
 4. Sarath gaaru oka field lo krishi chesthe no 1 ipoyevaaru.*

  ReplyDelete
 5. Replies
  1. any one.like novels .

   Delete
  2. కదా. ఒక రెండేళ్ళ క్రితం వరకూ అలా కృషి చెయ్యలేకపోవడానికి కొన్ని బలీయమయిన కారణాలు వున్నయ్. ఇప్పుడు లఘు చిత్రాల మీద ఫోకస్ పెట్టా కదా. ఎన్నో ఆలోచనలు వున్నయ్ దాని మీద. చూద్దాం మరి.

   Delete
 6. @ @*
  ఏంటో అదీ!? :) ...

  😊😊😊😷😷😷

  ReplyDelete
 7. మోసపోయేవాడిది కూడా B పాజిటివ్ అయితే ఏంచేస్తాడు ?
  ....confidence penchukuntaadu...

  ReplyDelete