మొదటగా లఘు చిత్రాల వైపు నా పయనం

 చిత్ర దర్శకుడిగా అయ్యే క్రమంలో షార్ట్ ఫిల్మ్ లు తియ్యబోతున్నాను. చాలా చాలా ఆలోచనలు వున్నయ్. ఒకదాని తరువాత మరొకటి చూద్దామేం. ఈమధ్య ఒక గొప్ప కథ కోసం ఆలోచించాను. నిన్న స్ఫురించింది. ఇన్నాళ్ల వరకూ నవల్స్ కోసం పెద్ద ప్లాట్స్ ఆలోచించడమే కానీ షార్ట్ ఫిల్మ్ కోసం ఆలోచనలు చెయ్యలేదు. అందువల్ల ఇది కాస్త కొత్తగా వుంది. నా నవల్స్, బ్లాగులు చదివిన వారికి నా రచనలు ఎంత ప్రత్యేకంగా, వైవిధ్యంగా వుంటాయో తెలిసిందే. అదే ముద్రని లఘు చిత్రాల్లో కూడా చూపిస్తాను. కనీసం వారానికి ఒక లఘు చిత్రం అయినా తీస్తూపోవాలని నా ప్రస్తుత సంకల్పం.

మీలో ఎవరికయినా లఘు చిత్రాల్లో ఆసక్తి కానీ అనుభవం కానీ వుంటే చెప్పండి. ఆలోచనలు పంచుకుందాం - వీలయితే కలిసి పనిచేద్దాం. పెద్ద పెద్ద చిత్రాలు అంటే ఇప్పట్లో నావల్ల కాదు కానీ కథని అందించి ఇండియాలో కూడా లఘు చిత్రాలని నిర్మింపజేసే ఆలోచన వుంది. అందువల్ల మీరు గనుక ఇండియాలో వుండి మీకు వీటిల్లో ఆసక్తి వుంటే చెప్పండి. వీలయితే కలిసి పనిచేద్దాం.

వచ్చేవారం ఒక పది రోజుల వెకేషన్ కోసం వెళుతున్నాం. ఓహ్, ఎన్నో ప్రదేశాలు, మానస సరోవరం లాంటి ప్రదేశాలు చూడబోతున్నాం. పనిలో పనిగా నా తదుపరి చిత్రాల కోసం లోకేషన్లూ చూసుకున్నట్టు అవుతుంది. తిరిగి వచ్చాక లఘు చిత్రాల సంగతి చూస్తా. ఔత్సాహిక నటులు, టెక్నీషియన్లూ ఇక్కడ వున్నారు. వాళ్ళ సహకారంతో పని కానిస్తాను.

7 comments:

  1. Good ... All the BEST to you.

    ReplyDelete
  2. నాకో పాత్ర, మరిచిపోవద్దూ

    ReplyDelete
  3. @కిశోర్
    ధన్యవాదాలు. ఇలాంటి ప్రోత్సాహాలే ఉత్తేజాన్ని ఇస్తాయి.

    @ అజ్ఞాత
    తప్పకుండా, మరచిపోను :) నీ మీది మీ నమ్మకం - బావుంది - నిజంగా!

    ReplyDelete
  4. @ చందు
    మీ వ్యాఖ్య ప్రచురించలేదు - మీ వ్యక్తిగత సమాచారం వుంది కాబట్టి. మీ కాంటాక్ట్ వివరాలు నోట్ చేసుకున్నాను. వచ్చేవారం నేను వెకేషన్ కి వెళ్ళి వచ్చాకా మాట్లాడుదాం.

    @ శ్రీ
    ధన్యవాదాలు. మీరు ఇచ్చిన సమాచారం నోట్ చేసుకున్నాను. థేంక్స్. వెకేషన్ కి వెళ్ళి వచ్చాకా వారితో మాట్లాడుతాను. ఆస్తిక పదాల్లో చెప్పాలంటే గ్రహాలు అన్నీ అనుకూలంగా అమరుతున్నట్టే వుంది - మీరు అన్నట్లుగా. రచనల నుండి, వీడియో బ్లాగ్ (వ్లోగ్) నుండీ ఇప్పుడు ఇటుగా నా పయనం. ఎక్కడ ఆగుతానో తెలియదు కానీ ప్రయాణం మాత్రం బావుంది మిత్రమా.

    ReplyDelete
  5. @ శ్రీ
    చెప్పడం మరిచాను. ఇంతకుముందే కొంతమంది కుర్ర మిత్రులని కలిసి వస్తున్నా. వారిలో ఒకరు మిమిక్రీ ఆర్టిస్ట్ అని ఇప్పుడే తెలిసింది. వావ్! మాకో డబ్బింగ్ ఆర్టిస్ట్ దొరికాడోచ్! అలా అలా అలా అన్నీ కలిసివస్తుంటాయంతే! నేను చెయ్యాల్సిందల్లా ఎలా ఎలా అని జుట్టు పీక్కోకుండా వుండగలగడమే. అలా అని బొత్తిగా తడిగుడ్డ వేసుకొని కూర్చోవొద్దు సుమీ. ఇన్స్పైర్డ్ ఏక్షన్ (Inspired Action) అంటారు. మనం అది చేస్తూ వుండాలి. సాధారణ ఏక్షనుకీ దీనికీ తేడా వుంది. గూగుల్ చేసి తెలుసుకోండి.

    ReplyDelete
  6. అంటే ముందుగా లఘుశంక తీర్చుకుందామనుకుంటున్నారన్న మాట!

    ReplyDelete