Law Of Attraction (LOA) - ఇలా చేసి చూద్దాం

నేనో నాస్తికుడిని, హేతువాదిని కానీ లా ఆఫ్ ఎట్రాక్షన్ నమ్మేస్తుంటా. ఏంటో! నేను అనుకున్నవి నిజంగా జరిగినా జరగకపోయినా జరిగినట్టు అనిపిస్తుంటాయి. అందువల్ల జీవితం బాగానే నడుస్తోంది కాబట్టి అలా కానిచ్చేద్దాం.

కొన్నినెలల క్రితం పుస్తకాలు వ్రాద్దామనుకున్నా కానీ దానివల్ల లాభం లేదని త్వరలోనే అర్దం అయ్యింది. మరింకేదో వుంది. అదేంటి. కొన్నాళ్ళు అలా వదిలేసాక నా నవల్స్, స్టోరీ అయిడియాలూ తెలుగు సినీ పరిశ్రమకి అంటగడితే ఎలా వుంటుందా అన్న అలోచన వచ్చింది. ఇక అటువైపు అడుగులు వేయడం మొదలెట్టాను. సాధారణంగా అయితే ఇలాంటివి సాధ్యం కాకపోవొచ్చు కానీ LOAలో చిత్రంగా అన్నీ కలిసివస్తుంటాయి. మనం కొద్దిగా అటువైపు అడుగులు వేస్తుండాలి అంతే. మార్గం దానంతట అదే పరుచుకుపోతుంది. అలా అని చెప్పి తెగ హైరానా పడిపోకూడదు. లా ఆఫ్ డిటాచ్మెంట్ (LOD) కూడా ముఖ్యం. అట్రాక్షన్, డిటాచ్మెంట్ బ్యాలన్స్ చేసుకోవాలి - లేకపోతే ఫలితాలు రావు.

Ask, Beleive & Receive. ఇదీ LOA లో ముఖ్యమయిన థియరీ. నేనో గొప్ప సినీ రచయితగా/దర్శకుడిగా కావాలని ఆశిస్తున్నా, అలా అయ్యానని విశ్వసిస్తున్నా. ఇక తగిన సమయంలో అవకాశాలు వచ్చేస్తాయి లెండి. బాబ్బాబూ, నన్ను మీరు కూడా అలా భావించండీ.  ఇదేమన్నా జరిగేపనా కాదా అన్నది కొద్దిరోజుల్లో అర్ధం అవుతుంది లెండి. ఒకవేళ కాకపోతే మరో మంచి ప్రయత్నానికి ఇది దారితీస్తుంది. ఏదీ అనవసరం కాదు. తరచుగా ఏం జరుగుతోందీ, ఎంతవరకూ వచ్చిందీ తెలియజేస్తుంటాలెండి.

మీ సలహాలూ, సూచనలూ అందజేయండి. LOA మీద ఆసక్తి వుంటే గూగుల్ చెయ్యండి. The Secret పుస్తకం, వీడియో చూడండి. లాజిక్ పక్కన పెట్టి ప్రయత్నించి చూడండి. బావుంది అనిపిస్తే కొనసాగించండి. బాగోలేదు అనిపిస్తే పక్కకు పెట్టెయ్యండి. ప్రయత్నించి చూస్తే పోయేదేమి వుంది. నాకు అయితే హాయిగా వుంది, సరదాగా వుంది. ఎన్నెన్ని నా జీవితంలో అవిష్కరించుకున్నానూ...!  

సమయం లేదు మిత్రమా, అర్ధరాత్రి కావొస్తోంది  - ఇక పడుకోవాలి, మళ్ళీ కలుద్దామేం.

4 comments:

 1. your writings are very intersting, I too purchased long back,The Secret by R Byrne, tried but in vain,your words are motivating. What about positive thinking, sub conscious mind,Master key, in your words.
  Thanq for directing towards The Secret--- Srinivasa Rao V

  ReplyDelete
 2. @ శ్రీ
  ధన్యవాదాలు. సంతోషం.

  మీరు అడిగిన వాటి గురించి ప్రత్యేకంగా వ్రాసేంత సాధికారత నాకు లేదు కానీ మీరు ఇదివరకటి పోస్టుల్లో నేను సూచించిన ఈ క్రింది పుస్తకం కనుక మీరు చదవకపోయినట్లయితే కనుక వెంటనే తెప్పించుకొని చదివెయ్యండి. ఈ పుస్తకం విశ్వాసానికి సంబంధించింది కాదు, సైకాలజీ సైన్స్ కాబట్టి అది అందరికీ ఉపయోగకరం.

  నా ఒక దగ్గరి స్నేహితురాలికి కూడా LOA అంటే చాలా ఇష్టం కానీ ఏం లాభం. దీన్ని ఒక మాజిక్ లాగా ఇలా అనుకుంటే అలా జరిగిపోతాయని అనుకుంటూ ఆశాభంగం చెందుతూవుంటుంది. ఏదో ఒకసారి పుస్తకం చదివేసి ఇక అన్నీ వళ్ళో పడాలి అనుకుంటుంది. అలా కాదు, దీని గురించి విస్తృత జ్ఞానం పెంచుకోవాలి, పద్ధతులు మెరుగుపరచుకోవాలి అని చెబుతూవుంటా.

  అలాగే ఈమధ్యే పరిచయం అయిన ఇంకో మిత్రుడూ ఇది ఇష్టపడుతున్నాడు, కొన్నేళ్ళ నుండి పాటిస్తున్నాడని తెలిసి సంతోషం వేసింది. అయితే పెద్దగా ఫలితాలు సాధించినట్లు లేరు. తనకు లా ఆఫ్ డిటాచ్మెంట్ గురించి తెలియకపోవడం చిత్రంగా అనిపించింది. దానిగురించి వివరించాను. మీలో కూడా అలాంటి లోపాలు వున్నాయ్యేమో చూసుకోండి. నేను మాత్రం ఎలా అని ఆలోచించడం క్రమంగా తగ్గించగలుగుతున్నాను. ఎలా అన్న బెంగ నాకేలా? ఆ పని విశ్వానిది (యూనివర్స్ ది) కదా :)

  ReplyDelete
 3. What to say when you talk to yourself by Shad Helmstetter.

  ReplyDelete
 4. Thanq sir, telugu lo 'meeku meeru em cheppukovali' ani vachindi ade translation, I will try to introspect.
  Meeru tarachugaa vrastuu vundandi,
  V.srinivasa Rao

  ReplyDelete