అవీ - ఇవీ

       ఇలాంటి పోస్టులు ఎందుకు వేస్తున్నానో అర్ధమయ్యింది. నాలో నేను మాట్లాడుకుంటూ క్లారిటీ తెచ్చుకుంటున్నా.

       నవలలు మళ్ళీ వ్రాయడం మొదలెట్టిన మొదట్లోనే పెద్ద పెద్ద నవలలు వ్రాయాలంటే విసుగ్గా వుంది. అందువల్ల ప్రస్థుతానికి 100 పేజీల నవలికలే. అలా నెలకు ఓ నవలిక అయినా వ్రాసెయ్యాలి. ఆ లెక్కన ఇప్పుడు వ్రాస్తున్నది సగం పూర్తయ్యింది. మిగతా సగాన్ని ఈ నెలలోగా పూర్తి  చెయ్యాలి. ఇప్పుడు నేను వ్రాస్తున్న కథాంశం కూడా 200 లేదా 300 పేజీలకు లాగాలాంటే ఇబ్బందిగా వుంది. అదే వంద పేజీల నవలికు అయితే బాగా సరిపోతుంది.
   
       కొన్నేళ్ళ క్రితం ఒక అజ్ఞాత ఎవరో నన్ను బాగా నవలలు వ్రాయమని ప్రోత్సహిస్తుండేవారు. అంతకుముందు ఈ బ్లాగులో ఒక ధారావాహిక వ్రాసినప్పుడు చైతన్య అనే నా బ్లాగాభిమాని వ్యాఖ్యల ద్వారా ప్రతి ఎపిసోడులోనూ బాగా ప్రోత్సహిస్తుండేది.      అందువల్ల నాకు భలే ఉత్సాహంగా అనిపించేది. తను ఈమధ్య బ్లాగులు చూస్తున్నట్టు లేదు. నా నవలలు విజయవంతం అవుతున్నప్పుడు ఒక నవలను తనకి అంకితం ఇచ్చేస్తాను. రకరకాల కారణాల వల్ల ఆ సీరియల్ అంత బాగా రాలేదనుకోండి.

       బ్రెత్ కంట్రోల్ ప్లే మీద వ్రాసిన రొమాంటిక్ థ్రిల్లర్ సాఫ్ట్ కాపీ గానీ  హార్డ్ కాపీ గానీ దొరకడం లేదు. చాలా బాగా వచ్చింది ఆ నవల. దొరికితే బావుండును. తప్పిపోయిందనుకున్న 'నేస్తమా, ఇంక సెలవు ' హార్డ్ కాపీ ఇండియాలో వున్న ఒక క్లోజ్ ఫ్రెండ్ దగ్గర వుందని నిన్ననే చెప్పాడు. సంతోషం. అది నా తొలి నవల. టెర్రిఫిక్ గా వుంటుంది - టెర్రిఫిక్ గా వచ్చింది.  టెర్రిఫిక్ అని ఎందుకు అంటున్నా అంటే ఆ నవల కథాంశం అలాంటిది లెండి. అప్పట్లో అది చదివిన వాళ్ళు ఒక వైపు సూపర్ అంటూనే మరో  వైపు తిట్టేవాళ్ళు :)) ఆరడుగుల మనుష్యుల గురించి వ్రాయకుండా ఆరడుగుల లోతున వున్న మనుష్యుల గురించి ఎందుకు వ్రాసినట్టు అని జుట్టు పీక్కుంటూ ప్రశ్నించేవాళ్ళు.      ఏం చేయను మరి? మామూలుగా వ్రాస్తే గుర్తింపు రాదని చాలా అసాధారణమయిన కథాంశం తీసుకొని వ్రాసాలెండి. అదేమిటని అడక్కండి. వద్దులెండి ఇక్కడ :))

No comments:

Post a Comment

అవీ - ఇవీ

       ఇలాంటి పోస్టులు ఎందుకు వేస్తున్నానో అర్ధమయ్యింది. నాలో నేను మాట్లాడుకుంటూ క్లారిటీ తెచ్చుకుంటున్నా.        నవలలు మళ్ళీ వ్రాయడం మొదల...