హు! ఇన్నేళ్ళ తరువాతా...!

(కొన్ని నెలలుగా నేను ఏమయిపోయానూ - ఎందుకు వ్రాయట్లేదూ అనే ధర్మసందేహం కొద్దిమందికి అయినా వుండి వుంటుంది. సంతోషకరమయిన సంగతులతో త్వరలో వివరిస్తా. ఈ పోస్టులో ఒక సంగతి నేను వివరించినట్లుగా నాకు అన్నీ మంచిగా అనుకున్నట్లుగా జరుగుతూ వుంటే తబ్బిబ్బు అయిపోతూ తీరిక లేక వ్రాయలేదండీ. క్లుప్తంగా అదీ :)  ఇంకా కొన్ని ముఖ్యమయిన మార్పులు కూడా సంభవించాలి. అవీ జరిగిపోతాయి లెద్దురూ. కంగారు ఏమీ లేదు. ) 

ఇవాళ సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఎవరూ లేరు.  మా ఆవిడ ఏం వండిపెట్టిందో చూసాను. ఎగ్ బిర్యానీ. ఒక వైపు సంతోషం - మరో వైపు విచారం. కోడి గుడ్డు నాకు మాహా ఇష్టం కానీ నా వంటికి సరిపడ్టం లేదేమో అని ఈమధ్య పక్కకు పెట్టి ఆరోగ్యాన్ని పరిశీలిస్తున్నా. ఎలెర్జీ, ఇంటొలెరాన్స్ లక్షణాలు లేకుండా కొద్దిరోజులుగా లక్షణంగా వుంటున్నా. అయితే ఏ కారణం వల్ల అలా వుండగలుగుతున్నానో నాకు ఇంకా స్పష్టత లేదు. ఎందుకంటే పాలు, గ్లుటెన్ (గోధుమ వగైరా) మరియు కోడి గుడ్డు తో చేసిన పదార్ధాలు పక్కకు పెట్టేకా వంటికి కాస్త హాయిగా వుంది. అయితే నా ఇబ్బందులకు ఆ మూడూ కారణమా లేక ఒకటా రెండా అన్నది ఇంకా స్పష్టత లేదు. దాందేముంది, ఓ స్పష్టత తెచ్చుకుందాం అని ఎగ్ బిర్యానీ లాగించాను.   

కాస్సేపయ్యాకా ఓ మిత్రునికి ఫోన్ చేసా. మాట్లాడుతుంటే అస్సలు నాకు ఊపిరి తీసుకోవడమే కష్టంగా అనిపించసాగింది. నోట్లోంచి మాట రావడమే గగనం అవసాగింది. పరిస్థితి అర్ధం అయ్యింది - కొంత క్లారిటీ వచ్చింది. నాది ఎగ్ ఎలెర్జీ కాదు కానీ ఎగ్ ఇంటోలరాన్స్. అయితే తెల్లతో వస్తోందా లేక పసుపుతో వస్తోందా అన్నది తెలియదు. చాలావరకు తెల్ల తోనే సమస్య అంటుంటారు. అదే అవాలని ఆశిస్తాను. ఎందుకంటే నాకు పసుపు పచ్చ ఇష్టం మరీ. అందుకోసం మళ్ళీ తిని చూడాలి.  

ఎన్నో ఏళ్ళ నుండి ఇలా అవస్థ పడుతుంటే డాక్టర్లు ఏవేవో మందులు ఇస్తారు కానీ ఒక్కరన్నా ఏదయినా ఆహారం పడట్లేదేమో చూడకూడదా అని చెప్పలేదు. పదిహేనేళ్ళ క్రితం నేనే పట్టుబట్టి ఎలెర్జీ స్కిన్ టెస్ట్ చేయించుకున్నా. నెగటివ్. ఇహ నాది నాన్ ఎలెర్జిక్ రినిటిస్ అని తీర్మానించేసారు. అప్పటినుండీ ఇప్పటిదాకా ఎవేవో నాజల్ స్ప్రేలు వాడుతూ బండి నడిపిస్తున్నా. వాటితో విసిగిపోయి ఇహ ఈ డాక్టర్లతో కాదు అనుకొని నేనే పరిశోధించడం మొదలుపెట్టా. అనుమానం అనిపించిన కొన్నింటికి దూరం పెట్టాక హాయిగా వుంది. మళ్ళీ ఈ రోజు ఆ చిరాకులు మొదలయ్యాయి. ఎందుకో మీకు తెలుసు. ఆగండి - అజలస్టైన్ నాసల్ స్ప్రే కొట్టుకొని వస్తా. అది అంటీ హిస్టమిన్ స్ప్రే. 

ఏం డాక్టర్లో ఏమో - ఇలాంటి కొన్ని విషయాల్లో వారి మీద నమ్మకం సన్నగిల్లుతోంది.   

మొత్తమ్మీద చిన్నప్పటి నుండీ నేను పడుతున్న ఒక అవస్థకి సులభ పరిష్కారం దొరికేసింది. ఇలాంటివే ఎన్నో మంచి విషయాలు వరుసగా నా జీవితంలో జరిగిపోతున్నాయి మరి. అవన్నీ మీతో నేను పంచుకోవద్దూ? అన్నీ కాకపోయినా కొన్ని అయినా ;) 

6 comments:


 1. మీకు జబ్బుకి అవినాభావ సంబంధం ఏదో ఉందండి :) ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వచ్చి తగలడుతోంది :)


  జిలేబి

  ReplyDelete
 2. ohh, complete gaa maaneyyandi egg.alternate boledanni.enduku trouble.*

  ReplyDelete
 3. @ జిలేబి
  నేను సగటు మనిషిని అండీ. మీరంతా ఏమో బ్లాగర్లూ. మీకందిరికీ అన్నీ సలక్షణంగా వుంటయ్ :))

  నాకు వున్నవన్నీ చిన్నవేనండీ. పెద్దపెద్దవేమీ లేవు. నాకు వున్న ఆ వాటిని కూడా ఎలా ఒక్కొక్కటీ పరిశోధించి పరిష్కరించుకుంటూ వస్తున్నానో చూడండి. ఇతరులకు ఏమయినా ఆ మార్గాలు ఉపయోగపడ్తాయేమో అని అందరిముందూ అవిష్కరించుకుంటూ వస్తున్నాను.

  @ అజ్ఞాత*

  నాకు గుడ్డు అంటే ఇష్టం కదా. అనవసరంగా పూర్తిగా ఎందుకూ మానెయ్యడం. తప్పనిసరి అయితే ఎలాగూ తప్పదు. ఈ వారాంతం మళ్ళీ ప్రయోగాలు చేసి అసలు సమస్య తెల్లతోనా లేక పచ్చతోనా అనేది కనిపెడతాను. చాలావరకు తెల్లనే అయివుండవచ్చు. అదే అయితే సగం సంతోషమే.

  ఈ వారం అంతా గ్లుటెన్ వున్న పదార్ధాలు కొద్దికొద్దిగా తీసుకుంటూ ప్రయోగాలు చేసాను. దానితో కూడా ఇబ్బంది వుంది. హ్మ్. దాన్ని దూరం పెట్టడం కష్టమే కానీ తక్కువ మోతాదులో తీసుకుంటే తక్కువగానే ఇబ్బంది పెడుతోంది. చూడాలి మరి. ఇక పాల పదార్ధాలూ మళ్ళీ వాడుతూ ఏమవుతదో చూడాలి.

  ReplyDelete
  Replies


  1. పోదురు లెండి బడాయి సాదా సీదా సగటు మనిషి :)

   జిలేబి

   Delete
 4. @ రవి కుమార్
  ఎలా బ్యాక్ రావాలో చిరంజీవి కి వున్నంత డైలమా నాకూ వుంది :)) అంటే ఏం వ్రాయాలో అనీ. అప్పటికీ ఇప్పటికీ బ్లాగావరణం మారింది. వృద్ద నారీ పతివ్రత లాగా తయారయ్యింది :))

  అదీ కాకుండా అప్పట్లో తీరికను ఉపయోగించుకోవడానికి వ్రాసేవాడిని - ఇప్పుడు తీరిక చేసుకొని వ్రాయాల్సొస్తోంది. అందుకే ఇలా వ్రాస్తూ దేశాన్ని ఉద్ధరించేంత ఉద్దేశ్యం లేదు కానీ చాలావరకు నాకు ఉపయోగపడేవే వ్రాస్తూంటా. అవి ఎదుటివారికి కూడా ఉపయోగపడితే సంతోషమే. Win - Win సూత్రం లాగా.

  ReplyDelete