మనం ఏదయితే ఆలోచిస్తామో అదే అవుతాం!

మన గురించి మనం ఏమి అనుకుంటామో అలానే చేస్తాం. ఒక్కసారి మన గురించి మనం ప్రశ్నించుకుందాం. ఇతరులలో మన ఇమేజ్ ఎలా వుందో పక్కన పెడదాం. అస్సలు మనలో మనకు ఎలాంటి ఇమేజ్ వుందేంటి? అది ముఖ్యం. ఇతరులు మన గురించి వంద రకాలుగా అనుకోనీయండి - ఫర్వాలేదు - నాలో నా గురించి మంచి గౌరవం వుందా లేదా అనేది నాకు ముఖ్యం. మన గురించి మనకే విశ్వాసం లేకపోతే ఇతరులకు మాత్రం విశ్వాసం ఎలా కుదురుతుందీ? సో మనం ఏం చెయ్యాలి మరి. బలవంతంగా అయినా మన మీద మనం గౌరవం, నమ్మకం పెంచుకోవాలి. మన అమాయకపు అంతః చేతనకి మనం అనుకునేది నిజమా కాదా అన్నది తెలియదు. ఏది మనం పదే పదే చెబితే అది నమ్మేస్తుంది. అదీ ట్రిక్. మన కాన్షియస్ మైండ్ ద్వారా మన సబ్ కాన్షియస్ మైండ్ ని ట్రిక్ చేస్తూ వుండాలి అంతే. ఇహ అద్భుతాలు జరుగుతూ వుంటాయంతే.

Shed Helmstetter ఇలా అంటారు "You will become what you think about most". ఇంకా ఇలా అంటారు "Your success or failure in everything, large or small, will depend on your programming - what you accept from others, and what you say when you talk to yourself". వారి యొక్క పుస్తకంలో ఇంకా ఇలా వుందీ "It makes no difference whether we believe it or not. The brain simply believes what you tell it most. And what you tell it about you, it will create, It has no choice"

పై వాక్యాలు నేను ఆ పుస్తకంలో ఉండర్‌లైన్ చేసుకున్నా. మనం అర్ధం చేసుకోగలగాలే కానీ ఎంత గొప్ప వాక్యాలు అవీ! జీవితాలని మార్చేస్తాయి.

నేను ముప్పయ్యేళ్ళ క్రితమే హిప్నటిజం చేసేవాడిని. ఇతరులను కుక్కపిల్లల్లాగా కోతిపిల్లల్లాగానూ ఆడించేవాడిని. ఆ స్థితిలో వాళ్ళు తాము ఆ జంతువులమే అని నమ్మేవారు. అలా ఎలా జరుగుతుంది. అందులో మహత్యం ఏమీ లేదు. హిప్నటిస్ట్ ఇతరుల సబ్ కాన్షియస్ మైండ్ ను వశపరచుకుంటాడు. (గమనిక. అది ఇతరులు ఇష్టపడితేనే సాధ్యం అవుతుంది. ఇతరులు మనస్సులో తిరస్కరిస్తే హిప్నటైజ్ చెయ్యలేము). అప్పుడు కాన్షియస్ మైండ్ పని చెయ్యదు. అందువల్ల హిప్నటిస్ట్ ఏది ఆదేశిస్తే అది ఎదుటివారు చెసేస్తారు, ఏది భావించమంటే అది భావిస్తారు (అలా అని వారి విశ్వాస వ్యవస్థకి పూర్తిగా వ్యతిరేకంగా వున్నా ఆ పనులు చెయ్యలేరు. ఉదాహరణకు హిప్నటిస్ట్ ఎవరినయినా చంపమని ఆదేశిస్తే అలా చంపడం జరగదు). ఎలా అయితే హిప్నటిస్ట్ మన అంతః చేతనని లోబరుచుకుంటారో అలా మన అంతః చేతనని మనం లోబరచుకోవాలి. అది ఎలా? మనతో మనం మంచిగా మాట్లాడుకోవడం ద్వారా. పాజిటివ్ సజెషన్స్ ఇచ్చుకోవడం ద్వారా. 

మీరు ఎన్ని వ్యక్తిత్వ వికాసపు పుస్తకాలు అయినా చదవండి - అవన్నీ పెద్దగా పని చెయ్యకపోవొచ్చు అంటారు షెడ్. ఎందుకంటే అవన్నీ తాత్కాలిక పద్ధతులు. కొంతకాలం పనిచేస్తే చేసి మిన్నకుంటాయి. అవి ప్రాక్టికల్ కావు. ఎందుకంటే మన మనస్సులు వాస్తవానికి ఎలా పనిచేస్తాయో తెలుసుకోకుండానే చెప్పిన పద్ధతులు పెద్దగా పని చెయ్యవు. మనం పాత పద్ధతిలోనే ఆలోచిస్తూ ఎన్ని కొత్త ప్రయోగాలు చేసినా ప్రయోజనం లేదు అంటారాయన. వాటన్నింటికీ మందు సెల్ఫ్ టాక్.  ఆ సెల్ఫ్ టాక్ ఎలా చెయ్యాలనేది తదుపరి టపాలల్లో చర్చిద్దాం.

ఒక ఏడాది క్రితం వరకూ పొద్దున లేచిన దగ్గరి నుండి నీ జీవితాన్ని తిట్టుకునేవాడిని. నిరాశా నిస్పృహల్లో వుండేవాడిని. ఈ పుస్తకమూ, ఇంకో పుస్తకమూ చదివాక నాలోనూ, నా జీవితంలోనూ మంచి ఎన్ని మార్పులు వచ్చాయో. ఎన్ని అద్భుతాలు జరిగాయో. ఇంకా కొన్ని మార్పులు జరగాల్సి వుంది, రావాల్సి వుంది. ఆయా ప్రయత్నాలల్లో వున్నాను. వాటిల్లో భాగంగానే ఇలా ఈ పోస్టులు వ్రాయడమూనూ. మీకు కొద్దిగా చెబుతూ నేను ఎక్కువగా నేర్చుకుంటున్నానండోయ్. అయితే ఒక్క ముఖ్యమయిన విషయంలో మాత్రం ఈ టెక్కునిక్కులు ఉపయోగించడానికి నాకు మనస్కరించడం లేదు. అదేంటో, ఎందుకో అడక్కండి. అబ్బా... అన్నీ మీకు చెబుతానా ఏంటీ?! 

4 comments:

  1. గత ఇరవై ఏళ్ళుగా ఒక పవర్ బాల్ మరో మెగ మిలియన్సూ టికట్లు కోంటూ నేను తప్పకుండా గెలుస్తాను అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాను. కలలు కాదు, నిజంగానే నెగ్గుతాను అని. కానీ ఇప్పటి వరకూ ఒక్క సారి కూడా ఒక్క డాలర్ కి మించి సెంటు నెగ్గలేదు. అలాగే మిగతావీను.

    కబుర్లు చెప్పడం వేరూ, జీవితం వేరూను. పుస్తకాలు రాసి ఇలా నిజంగా అవుతుంది అని చెప్పేవాళ్ళు పుస్తకాలు అమ్ముకుని డబ్బులు సంపాదించుకోవచ్చు కానీ పవర్ బాల్ నెగ్గుతారా? కొని నెగ్గి అప్పుడు మాట్లాడమనండి.

    ReplyDelete
  2. Replies
    1. అజ్ఞాత గారూ, కనీసం పాజిటివ్ గా ఉండడం అలవాటు అవుతుంది కదా

      Delete
  3. శ్రీ
    లిటిల్ మిస్ సన్ షైన్ అని ఒక సినిమా వచ్చింది. అది ఎవరో చెప్తే బాగుంటుందని చూసా చివరి వరకూ. అంత దరిద్రపుగొట్టు సినిమా ఎప్పుడూ చూడలేదు ఇన్నేళ్ళ జీవితంలో.

    మీకు చూడాలనిపిస్తే - పాజిటివ్ అన్నారు కనక - ఓ సారి దేఖండి. అందులో ఆ పాప తండ్రి ఇలాగే పాజిటివ్ పాజిటివ్ అని అందర్నీ హడలు కొడ్తూ ఉంటాడు (మన శరత్తు గారి లాగానె... సర్దాగా అంటున్నాను లెండి). చివరికి మాత్రం నా పవర్ బాల్ అదృష్టమే వాడిదీను.

    షరా: మీకు ఆ సినిమా నచ్చితే/నచ్చకపోతే నా బాధ్యత సున్నా అని గమనించగలరు

    ReplyDelete