స్టాండింగ్ డెస్క్

రోజులో ఎక్కువసేపు కూర్చొని వుండటం కన్నా నిలబడి వుండటం ప్రయోజనకరమని గత కొన్నేళ్ళ నుండీ చదువుతూనే వున్నా. నేను అటార్నీ ఆఫీసులో పనిచేస్తాను. వందలమంది అటార్నీలు వుంటార్లెండి. ఓ సందర్భంలో వాళ్ల ఆఫీసులు డెస్కులు పరిశీలించాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు కొంతమంది లాయర్లు ఎంచక్కా పెద్ద పెద్ద స్టాండింగ్ డెస్కులు ఉపయోగిస్తుండటం గమనించాను.  


నాకూ ఇంట్లో అలాంటిదేమయినా వుంటే బావుండు అనిపించింది. ఎలాగూ ఈమధ్య ఇంట్లో కూడా నవళ్లూ గట్రా వ్రాస్తున్నా కనుక అదొకటి వుంటే బావుంటుంది కదా. సో, పైన చిత్రంలో కనిపిస్తున్నది Techni Mobili Deluxe Rolling Laptop Cart with Storage, Chocolate అమెజానులో ఆర్డర్ చేసాను. ధర $63. నిన్ననే వచ్చింది.  మా అమ్మాయీ, నేనూ కలిసి గంటకు పైగా శ్రమించి అది బిగించాము. ఇకనుండీ ఏదయినా వ్రాయడం, చూడటంతో పాటుగా అప్పుడప్పుడు మా ఇంట్లో వారిని ఉద్దేశ్యించి ఉపన్యసించడానికి అది ఒక పోడియం లాగానూ ఉపయోగపడుతుంది. ఎవరయినా వింటారా లేదా అనేది వేరే లెక్క లెద్దురూ. 

4 comments:

  1. ఇంట్లో వారిని ఉద్దేశ్యించి ఉపన్యసించడానికి అది ఒక పోడియం లాగానూ ఉపయోగపడుతుంది. ఎవరయినా వింటారా లేదా అనేది వేరే లెక్క లెద్దురూ.

    ReplyDelete