అప్పటినుండీ సమృద్ధిగా వుంటున్నాం

కొత్త పద్ధతులు పాటించడం మొదలెట్టిన దగ్గరి నుండీ మేము అనుకున్న విషయాల్లో సమృద్ధిగా వుంటున్నాం. అలా అని మేము ఏది అంటే కొనగలుగుతున్నామని కాదు గానీ అవసరాల మేరకు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన అవసరం లేకుండా జీవితం గొప్పగా నడుస్తోంది.

మా ప్రాజెక్టు వచ్చే ఏడాది చివరకంటా నడిచేసే పరిస్థితి వుంది కాబట్టి అర్జెంటుగా మరో ఉద్యోగం చూసుకోవాల్సిన పరిస్థితి తప్పింది. అందువల్ల ఇక మళ్ళీ ఇంగ్లీషులో నా నవలా రచనను (ముందుగా తెలుగులోనే వ్రాస్తాను - పత్రికలకీ పంపిస్తాను) మొదలెడుతున్నాను. అదీ నేను ఇప్పుడు బాగా ఆలోచిస్తున్న, ఆచరణలోకి పెడుతున్న లా ఆఫ్ ఎట్రాక్షను గురించిన థ్రిల్లర్. ఆ నవల ఇలా మొదలవుతుందీ - కీర్తి అనే అమ్మాయికి స్వీట్ సిక్స్టీన్ పార్టీలో తన అభిమాన అంకుల్ 'The Book' అనే పుస్తకాన్ని బహుమతిగా ఇస్తాడు. అప్పటినుండీ తన జీవితం చిత్ర విచిత్రమయిన మలుపులు తిరుగుతుంది.  

నా జీవితానికి నేను గీసుకున్న స్కెచ్ ప్రకారం 2017 వేసవి నుండీ హాయిగా expedition cruiese లలో గడిపేస్తూ, నవళ్ళు వ్రాస్తూ గడిపేస్తుండాలి. య్యా. గడిపేస్తాను. అందుకోసం ఇంగ్లీసులో రచయితగా విజయం చెందాలి. వాస్తవానికి నేను గొప్ప రచయితనే - కాకపోతే ప్రపంచమే గుర్తించాల్సివుంది. శరత్ ఏంటిలా స్టయిల్ కొడుతున్నాడూ అనుకోకండి. విజయవంతంగా ఆలోచిస్తున్నా - అలాగే ఆలోచించాలీ - అలా నా ఆలోచనలను మీమీద రుద్దేస్తున్నా. నా విజువలైజేషను కోసం ఈ బ్లాగునీ మరియు మిమ్మల్నీ ఉపయోగించుకుంటున్నా అంతే. నా లగ్జరీ క్రూయిజ్ ల కోసం ఒక క్రూయిజ్ లైన్ నిర్ణయించాను. www.silversea.com 

2016 మార్చి లో అనగా ఇంకో నాలుగు నెలల్లో లగ్జరీ SUV తీసుకోవాలని నిర్ణయించాను - అది ఇప్పటికే నా మనస్సులో సిద్ధించింది - ఇక భౌతికంగా నా ముందు సాక్షాత్కరించాల్సి వుంది అంతే. అందుకు సరిగ్గా పరిస్థితులు సమకూడుతున్నాయి. మా ఫ్రిజ్ మీద నాక్కావాల్సిన కారు బొమ్మని అతికించేసుకున్నా. మా Ford Escape SUV నడుపుతూ  Lexus GX నడిపేస్తున్నట్లుగా ఫీల్ అవుతుంటా. నేననుకునేవి నాకు కావాలంటే అవి ఆల్రెడీ నాకు అందేసినట్లుగా ఫీల్ అయిపోవాలంతే. వెనకాల వాటంతట అవే వచ్చేస్తాయి లెద్దురూ. 

No comments:

Post a Comment